అమరావతి అందరిది.. ఏపీలో మత మార్పిడీలు.. కేంద్రంపై కేసీఆర్ యుద్ధం.. టాప్ న్యూస్@7PM
posted on Nov 16, 2021 @ 6:34PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల పాదయాత్రకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారంటే అమరావతి రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు----700 రోజులకు రాజధాని రైతుల మహోద్యమం చేరిందని ట్విటర్ ద్వారా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రైతు ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహా పాదయాత్ర కూడా 16వ రోజుకు చేరుకుందన్నారు. ఉద్యమంలో అమరులైన 189 మంది రైతులకు నివాళులర్పించారు. ఏపీ ప్రజలందరూ అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారని మహా పాదయాత్రకు లభిస్తోన్న మద్దతు చూస్తే తెలుస్తోందని చంద్రబాబు చెప్పారు.---
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దకేంద్ర హోంమంత్రి అమిత్‌షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రకటన చేసింది. అవసరమైన సందర్భాలలో యాత్రలో పాల్గొంటామని బీజేపీ కీలక నేతలు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ నేతల వ్యవహార శైలిపై నిన్న తిరుపతిలో అమిత్ షా క్లాస్ తీసుకున్నారు.
-----
ఏపీ ఇంధన శాఖ కార్యదర్శికి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లు, సెకీతో ఒప్పందాలపై ప్రస్తావిస్తూ ఆయన లేఖ రాశారు. సెకీతో ఒప్పందంపై అభ్యంతరాలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల ప్రధాన లక్ష్యం దెబ్బతినేలా పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్న మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. గ్రిడ్‌లో 100 శాతం కంటే అదనపు సామర్థ్యాన్ని ఎందుకు జోడిస్తున్నారని అన్నారు.
----
మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో భారీగా మత మార్పిడులు జరుగుతున్నాయని కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని గత జూన్‌లో ఏపీ సీఎస్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. మరోసారి ఏపీ సీఎస్‌కు ఎస్సీ కమిషన్ లేఖ రాసింది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
----
టీడీపీ నేత నారా లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నుంచి తాము పారిపోమని అన్నారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు..కుప్పంకు ఎందుకు మంచినీరు కూడా ఇవ్వాలేదని ప్రశ్నించారు. గెలవలేక చంద్రబాబు దొంగ ఓట్లని ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
-----
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మోడీ ప్రభుత్వంపై ఆయన యుద్ధం ప్రకటించారు. తెలంగాణ ధాన్యం కొంటారో లేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ లో కొన్నట్లుగా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనదే కేంద్రం చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులపై దాడి చేసేందుకు బండి సంజయ్ జిల్లాలు తిరుగుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
--------
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఈ ఇద్దరికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
----
సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
----
రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల కోసం దాడులు సహిస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని విమర్శించారు.
------
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వారాంతపు లాక్‌డౌన్ విధించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా లాక్‌డౌన్ విధింపు ఆధారపడి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో తీవ్ర స్థాయికి పెరిగిపోయిన కాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. భవననిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేసేందుకు మంగళవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.