మోడీ ప్రభుత్వానికి రెండు రోజుల డెడ్ లైన్.. యుద్ధం ప్రకటించిన కేసీఆర్
posted on Nov 16, 2021 @ 6:34PM
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మోడీ ప్రభుత్వంపై ఆయన యుద్ధం ప్రకటించారు. తెలంగాణ ధాన్యం కొంటారో లేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ లో కొన్నట్లుగా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనదే కేంద్రం చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రైతులపై దాడి చేసేందుకు బండి సంజయ్ జిల్లాలు తిరుగుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరి ధాన్యం కొంటామని కేంద్ర ప్రకటించేంత వరకు బీజేపీ నేతలను టీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీస్తూనే ఉంటారన్నారు కేసీఆర్. రైతులకు బండి క్షమాపణ చెప్పాలన్నారు. నెల రోజుల్లోగా పంట కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు కేసీఆర్. కేంద్రం వైఖరిపై ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేస్తామని కేసీఆర్ తెలిపారు. అప్పటికి కేంద్రం దిగిరాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
యాసంగిలో వరి పండించాలని చెబుతున్న బండి సంజయ్.. ధాన్యం కేంద్రం కొంటదో లేదో కూడా చెప్పాలన్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని సీఎం మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం పరిధిలోనే ఉందని ఆయన తెలిపారు. పంజాబ్‌లో మొత్తం కొనుగోలు చేస్తున్నారని, తెలంగాణలో చేయడం లేదని చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. యాసంగిలో ధాన్యం కొంటామని ఎఫ్‌సీఐ రాతపూర్వకంగా తెలిపితే దానిని కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిం