బెయిల్ రద్దుకు నో చెప్పని సీబీఐ.. జగన్ కు జైలు తప్పదా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో సీబీఐ, జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.  జగన్‌ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అన్నది కొన్ని రోజులుగా ఆసక్తి రేపింది. వైసీపీలో టెన్షన్ పుట్టించింది.  జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతుందా లేక రద్దు చేయవద్దు..  బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు అని చెబుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో  తీవ్ర ఉత్కంఠ రేపింది. కేంద్ర సర్కార్ తో జగన్ కొనసాగిస్తున్న సత్ససంబంధాలతో జగన్ కు అనుకూలంగానే సీబీఐ నిర్ణయం ఉంటుందనే చర్చ కూడా జరిగింది. అయితే వైసీపీ ఆశలను వమ్ము చేస్తూ  న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది సీబీఐ. జగన్ బెయిల్ రద్దు చేయవద్దని కోరలేదు. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది.ఇరు పక్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.  జగన్ బెయిల్ కేసులో సీబీఐ వేసిన కౌంటర్ పై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్‌ బెయిలు రద్దుకు ఎస్‌ లేదా నో అని చెప్పకుండా బంతిని కోర్టు పరిధిలోకి నెట్టింది సీబీఐ. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం.. మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. దీంతో జగన్ బెయిల్ కేసులో ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు ఉండటంతో జగన్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. జగన్ బెయిల్ కేసులో  జరగబోయే పరిణామాలపై ఏపీ జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివ‌రించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్ప‌ష్టం చేశారు. రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయ‌న‌ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాసిన‌ట్లు వెల్ల‌డించారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. విన్న‌వించారు.  

 థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దు! బెయిల్ కేసులో జగన్ కౌంటర్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివ‌రించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్ప‌ష్టం చేశారు.  రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయ‌న‌ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాసిన‌ట్లు వెల్ల‌డించారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. విన్న‌వించారు.ఆచంట, నర్సాపురం, పెనుగొండ, పెనుమంట్ర, భీమవరం పోలీస్ స్టేషన్‌లలో కేసులున్నాయని తెలిపారు. ఆయన బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడంతో సీబీఐ కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాలను పిటిషనర్‌ కోర్టు ముందు దాచారన్నారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అన్నారు.  ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ  గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.  

ఒక్క చేప అతని జీవితాన్ని మార్చేసింది..

తంతే గారెల బుట్టలో పడ్డాడు. నక్క తోకను తొక్కాడు. ఈ మాటలు అప్పుడప్పుడు విన్న ఈ మాట చెప్పారంటే. ఏదైనా అద్భుతం జరిగితే మాట్లాడుకుంటాం.. సరిగ్గా  ఓ మత్స్యకారుడికి కూడా అదృష్టం వరించింది. తంతే అతను ఒకే సారి లక్షాధికారు అయ్యాడు. అదెలా అనుకుంటున్నారా.. మీరే చూడండి.. ఎలాగో..  అతని పేరు సాజిద్‌ హాజీ అబూబాకర్‌. అతని వృత్తి చేపలు పట్టడం.  అతని వాళ్లకి  అరుదైన చేప చిక్కింది. ఇంకేముంది అతని కష్టాలు తీరాయి. అతను రాత్రికి  రాత్రే లక్షాధికారి అయ్యాడు. ఒక చేప పడడం ఏమిటి .. ఆ చేపతో లక్షాధికారి అవ్వడం ఏంటని అనుకుంటున్నారా.. మరి అదే మ్యాజిక్. కొంత మంది ఓవర్ నైట్ స్టార్ అయినట్లు. ఆ చేపలు పట్టే సాజిద్‌ హాజీ అబూబాకర్‌ ఒకే నైట్ లక్షాది కారి అయ్యాడు. అంత ఆ చేప మహిమ. మరి అతని వలకు చిక్కిన చెప్పా అలాంటిలాంటి చేప కాదు అరుదైన క్రోకర్ జాతి చేప. దాని ధర ఎంత పలికిందో తెలిస్తే ఆశ్చర్యమే కాదు హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది. అది ఏకంగా 72 లక్షలు ధర పలికింది. అదృష్టం ఎవర్ని, ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుండి  వరిస్తుందో చెప్పలేం. ఆ చేపలు పట్టే అతనికి ఈ చేప ద్వారా అదృష్టం వరించింది. ఈ చేప అరుదైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతికి చెందిన 48 కిలోల చేప అబాబాకర్ వలకు చిక్కింది. ఐరోపా, చైనాలో ఈ క్రోకర్‌ జాతి చేపలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. వాస్తవానికి చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ, క్రోకర్‌ జాతి భిన్నమైంది. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. అందుకే దీనికి అంతటి డిమాండ్. నిజానికి వేలంలో ఇంకా ఎక్కువ ధరకు ఈ చేప అమ్ముడుపోయింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లినా.. పెద్ద మొత్తంలో వేలంలో దక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. దీంతో అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు. గతవారం కూడా గ్వాదర్‌ తీరంలోనే ఒక మత్స్యకారుడి వలకు క్రోకర్‌ జాతి చేప చిక్కగా.. వేలంలో అది రూ.7.8 లక్షలకు అమ్ముడైంది. ఈ చేపలు జెవానీ సహా చుట్టుపక్కల తీరానికి వేసవికాలంలో సంతానోత్పత్తి కోసం చేరుకుంటాయని జలచర నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడయిన చేపను తాను ఎప్పుడూ చూడలేదని గ్వాదర్ మత్స్యకారుల సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ నదీమ్ అన్నారు. ఈ చేప 8.6 మిలియన్లకు అమ్ముడయినా.. కొంత రాయితీ ఇవ్వడంతో 7.2 మిలియన్లు దక్కిందన్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ లో చోటుచేసుకుంది.  చేపలు పట్టడం అంత ఈజీ ఏం కాదు.. పడవలు వేసుకుని వేటకు వెళ్ళినపుడు.. కొంత మంది ప్రాణాలు కూడా పోతాయి. ఫుడ్ ఉండదు. నీళ్లు ఉండవు.. ఒక్కోసారి వారం రోజుల పాటు చేపలకు తిరుగుతారు. ఫలితం ఉండదు. ఈ ప్రపంచంలో ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది.. ఆ సుఖం రావాలంటే ముందు పని చెయ్యాలి.. ఆ తర్వాత ఆ సమయం కోసం ఎదురు చూడాలి..ఫలితం అదే వస్తుంది. 

కంటే కూతుర్నే క‌నాలి.. ‘సైకిల్‌ గర్ల్‌’ జీవితంలో విషాదం..

కంటే కూతుర్నే క‌నాలి అనిపించింది ఆమె క‌ష్టం. తండ్రి కోసం ఆ కూతురు.. చేయ‌లేని సాహ‌సం చేసింది.   అనిత‌ర సాధ్య‌మైన ప‌నిని.. చేసి చూపించింది. గ‌తేడాది లాక్‌డౌన్ సిత్రాల‌లో ఆమె ఘ‌ట‌నే హైలైట్‌. ఆమె.. సైకిల్ జ్యోతిగా అప్ప‌ట్లో ఫుల్ పాపుల‌ర్‌. గాయ‌ప‌డిన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని.. అనేక రాష్ట్రాలు దాటి.. ఏకంగా 1200 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కి.. తండ్రిని సొంతూరికి తీసుకొచ్చిన బాలిక‌. అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూతురు ఇవాంక సైతం ఆమె సైకిల్ యాత్ర‌ను మెచ్చుకున్నారు. ఇండియ‌న్ సైక్లింగ్ ఫెడ‌రేష‌న్ సైతం శ‌భాష్ అంటూ ప్ర‌శంసించింది. ఆ సైకిల్ జ్యోతి కుటుంబంలో ఇప్పుడు తీవ్ర విషాధం. ఏ తండ్రి కోస‌మైతే తాను అంత‌గా క‌ష్ట‌ప‌డి.. అంతదూరం సైకిల్ తొక్కి.. సుర‌క్షితంగా ఇంటికి తీసుకొచ్చిందో.. ఇప్పుడా తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణించాడు. ఆమె తండ్రి చ‌నిపోవ‌డం.. జ్యోతితో పాటు యావ‌త్ దేశాన్ని కంట‌త‌డి పెట్టిస్తోంది. అంతా అయ్యో పాపం అంటూ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. దేశాన్నే క‌దిలించిన ఆమె క‌థ అలాంటిది మ‌రి... ఆ జ్ఞాప‌కాల్లోకి మ‌రోసారి..... బిహార్‌లోని దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్‌ పాస్వాన్‌ బ‌తుకుతెరువు కోసం ఢిల్లీ స‌మీపంలోని గురుగ్రామ్ వ‌ల‌స వెళ్లాడు. మోహ‌న్‌కు ముగ్గురు పిల్ల‌లు. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు మోహన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రిని చూసుకునేందుకు పెద్ద కుమార్తె జ్యోతి కుమారి గురుగ్రామ్‌కు వచ్చింది. ఆమె వ‌చ్చిన కొంత‌కాలానికే మోదీ స‌ర్కారు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. ఈ తండ్రీకూతుళ్లు అక్కడే చిక్కుకుపోయారు.  గురుగ్రామ్‌లో ఉండ‌లేక‌.. ఎలాగైన‌ సొంతూరుకు వెళ్లాల‌నుకున్నారు. ఓ పాత సైకిల్‌ కొని.. దానిపై తండ్రిని కూర్చోబెట్టుకొని.. సుమారు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ.. ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ.. ఏడు రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది. ‘సైకిల్‌ గర్ల్’ పేరుతో జ్యోతి ఉదంతం అప్ప‌ట్లో మారుమోగిపోయింది.  జ్యోతి సాహసాన్నిభారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ గుర్తించింది. ఆమెకు సైక్లింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని అందుకుంది జ్యోతి కుమారి. ఆత్మనిర్భర్‌ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను తెరకెక్కిస్తుండగా.. అందులో తన పాత్రను తానే పోషిస్తోంది. అలాంటి జ్యోతికుమారి.. ఏ తండ్రి కోస‌మైతే అంత‌దూరం సైకిల్ తొక్కిందో.. ఇప్పుడు అదే తండ్రి అర్థాంత‌రంగా చ‌నిపోవ‌డంతో సైకిల్ జ్యోతి ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని జిల్లా యంత్రాంగం తెలిపింది. సైకిల్ జ్యోతి ఉదంతం మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

కేసీఆర్ గడ్డ నుంచే పోరాటం.. జూన్ 2 నుంచే శ్రీకారం..

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన సీఎం కేసీఆర్ రూట్ మార్చారు. కొన్ని రోజులుగా పాలనలో దూకుడు పెంచారు. అదే సమయంలో విపక్షాలు యాక్టివ్ అయ్యాయి. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈటల కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేసినా... రాజేందర్ కమలం గూటికి చేరడం ఖాయమైంది. అటు తెలంగాణ పీసీసీ చీఫ్ ను ఫైనల్ చేయబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇతర విపక్షాలకు ధీటుగా ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు.  తాజాగా మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు షర్మిల. కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు షర్మిల. కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై ఆమె ప్రత్యక పోరాటంలోకి దిగబోతున్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే ఆమె యాక్షన్ మొదలు పెడుతున్నారు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే. జూన్ 2న గజ్వేల్ వెళుతున్నారు షర్మిల. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసానివ్వనున్నారు.  గన్‌పార్క్ వద్ద నివాళులర్పించి  షర్మిల గజ్వేల్‌కు బయలుదేరనున్నారు. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.  తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.  ఏప్రిల్ లో ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించారు. జూలై8న కొత్త పార్టీ పేరు , ఎజెండా ప్రకటిస్తానని చెప్పారు. అప్పటి నుంచి పార్టీ కార్యాచరణలోనే ఉన్నారు షర్మిల. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తన యాక్షన్ ప్లాన్‌ను సీఎం కేసీఆర్ ఇలాకా నుంచి షురూ చేయబోతున్నారు. వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గజ్వేల్ వెళుతున్న షర్మిల.. అక్కడ ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారన్నది చర్చగా మారింది.   

దీదీ సారధ్యంలో  జాతీయ కూటమి ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో  బీజేపీ ఎఅతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులకు ఒక లేఖ రాశారు. కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి పిలుపు నిచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్’లో ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ యేతర పార్టీలు అన్నీ ఏకం కావాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న సమయంలో ఆమె సమయం చేసుకుని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను ఎండకడుతూ మూడు పీజీల లేకః రాయడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది.   అంతే కాదు, ఆమె ఎవరినీ వదల కుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్,ఢిల్లీ సీఎం కేజ్రివాల్, ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నాయకుడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్, మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా,సిపిఐ (ఎం ఎల్) నాయకుడు దీపాంకర్ భట్టాచార్య ఇలా తరమ బేధాలు , సిద్ధాంత విబేధాలు లేకుండా అందరికీ లేఖ రాశారు. అలాగే, ఆలేఖలో ఆమె ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఉమ్మడి పోరుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించవలసిన అవసరం ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఇంచుమించుగా నెలరోజుల పైనే అయింది. మే 5 తేదీన ఆమె ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ఈ నెల రోజుల్లో ఆమె అయినదానికీ కానిదానికి కేంద్రం మీద కత్తులు దూస్తూనే ఉన్నారు. ఇందులో కొన్ని సహేతుకంగా ఉంటే , మరి కొన్ని కేవలం కయ్యానికి కాలు దువ్వడమే లక్ష్యంగా ఉన్నాయనిపిస్తోంది.  అదలా ఉంటే, ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అల్ఫన్ బందోపాద్యాయ విషయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగుతున్న వివాదంలో భాగంగా ఆమె మరోమారు కేంద్ర్రం  పై పోరాటానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులకుపిలుపు నిచ్చారు.భయం వద్దు, ‘భయపడితే మరణం తధ్యం’ అంటూ 1970 లనాటి ‘షోలే’ చిత్రం లోని డైలాగ్ (జో డరేగా, ఓ మరతే హై) ను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటానికి కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, ప్రయత్నిస్తోందని, అయితే, తమ తప్పులకు కేంద్రం పశ్చాతాపపడే రోజు ఎంతో దూరంలో  లేదని అన్నారు.  ఈ పరిణామాల నేపధ్యంలో మమతా బెనర్జీ, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యాన్మాయంగా ఫ్రంట్’ను ఏర్పాటు చేసే ప్రయత్నాలలో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ బలహీన పడిన నేపధ్యంలో, కాంగ్రెస్’తో సహా ఇతర ప్రాతీయ పార్టీలను కలుపుకుని ప్రత్యాన్మాయ ఫ్రంట్’ ను ఏర్పాటుకు పావులు కడుపుతున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడం వలన కూటమికి జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో పాటుగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అదనపు బలం చేకురుస్తుందనీ, దీదీ బావిస్తున్నారు.అందుకే ఆమె, థర్డ్ ఫ్రంట్, తృతీయ కూటమి కాకుండా ప్రత్యాన్మాయ కూటమి అంటున్నారు.  అలాగే, కాంగ్రెస్ ను కలుపుకుపోయే ఉద్దేశంతోనేనే  రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్’కు  ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న తెరాస వంటి పార్టీలను ఈ పథకంలో చేర్చలేదు. కాంగ్రెస్’ను కులుకుపోకుండా చేసే ప్రయత్నాలు ఫలించడం కష్టమని ఆమె గుర్తించారని,   మమతా బెనర్జీ అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్న విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇది ఒక్క మమతా దీదీ ఆలోచన కాదని, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇంకొదరు జాతీయ, అంతర్జాతీయ మేధావులు, కూడాఈ వ్యూహ రచనలో  ఉన్నారని తెలుస్తోంది. అయితే, 2024 ఎన్నికలలో మోడీకి  సవాలు విసిరేది మాత్రం దీదీనే అనే విషయంలో మాత్రం అందరిలో ఏకాభిప్రాయం ఏర్పడింది.  బీజేపీ ముఖ్యంగా మోడీ వ్యతిరేక శక్తులు అన్నీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఇదలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య ప్రస్తుతం సాగుతున్న వివాదంలో  కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ  అధ్యక్షురాలు సోనియా గాంధీ మమతకు పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే, అరవింద్ కేజ్రివాల్ వంటి కొందరు నాయకులు, మమతకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సో.. ఇక ఢిల్లీ రాజకీయం మోడీ వెర్సెస్ దీదీ గానే సాగుతుందని అనుకోవచ్చును.

లవర్ కి  పెళ్లి.. తుపాకీ తో ఆమెను కాల్చి.. తను కాల్చుకుని.. 

ప్రేమించడమే పాపం అనేలా తయారు అయింది. ప్రేమ అంటే వాళ్ళు మనతో ఉన్న, లేకున్నా వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు బాగుండాలి అనేది ఒకప్పటి మాట. ప్రేమ నాతోనే పెళ్లి నాతోనే లేదంటే చంపేస్తా ఇది ఇప్పటి మాట.  వాళ్ళ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు, ఎంజాయ్ చేశారు. చివరికి అమ్మాయి తన దారి తాను చూసుకుంది. ఆ విషయం అతడు సహించలేదు. ఆమె వేరే పెళ్లి చేసుకోవడం అతనికి నచ్చలేదు. ఇంకా అంతే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత నిజం చేశాడు. నాకు నాకు సొంతం కానిది ఇంకొకరికి దక్కనివ్వను అనుకున్నాడు ఆ తరువాత ఏం చేశాడో చూద్దాం..  ఆమె పేరు  షబ్నం, అతని పేరు రాజ్‌పాల్ పాశ్వాన్ అలియాస్ రేహాన్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిచింది. ఇద్దరు మసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా వాళ్ళు ప్రేమలో ఉండగా.. వారి జీవితంలో షబ్నమ్ కు అతడి ప్రవర్తన నచ్చలేదు. ఇక అంతే  షబ్నం అతని ప్రేమకు బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత పెళ్ళికి రెడీ అయ్యింది. పెద్దల ఒక సంబంధం కుదిర్చారు. భగాన్‌ బిఘా పోలీసు స్టేషన్ పరిధిలోని కెవైది ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ కూతురు షబ్నం కుమారికి షాపూర్‌కు చెందిన వికాస్ కుమార్‌తో మే 26వ తేదీన వివాహం జరిగింది. ఆ పెళ్లితో ఆ అమ్మాయి మరో కొత్త జీవితం కొనసాగించాలనుకుంది. అంత హ్యాపీ అనుకునే సమయం.  కట్ చేస్తే.. పెళ్లయిన నాలుగో రోజు ఆదివారం షబ్నం భర్తతో కలిసి బైక్‌పై తన పుట్టింటికి బయలుదేరింది. ఇదంతా గమనించిన ఆమె మాజీ ప్రియుడు వారిని ఫాలో అయ్యాడు. వాళ్ళని రాజ్‌పాల్ మార్గమధ్యలో అడ్డుకుని తన ప్రియురాలిని  తనతో రావాలని షబ్నంను ఒత్తిడి చేశాడు. ఆమె తిరస్కరించడంతో రాజ్‌పాల్ ఆగ్రహానికి గురయ్యాడు. కోపం తో ఊగిపోయాడు. దీంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో షబ్నంను తుపాకీతో విచక్షణా రహితంగా కాల్చేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. అనంతరం తాను కూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు వీరిద్దరిని పాట్నాలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జగన్ కు జైలా.. బెయిలా ? వైసీపీలో లబ్ డబ్.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళతారా? సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు కానుందా? ఇదే ఇప్పుడు ఏపీలో ఉత్కంఠగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ పెట్టిస్తోంది. ఒక రకంగా జగన్ శిబిరంలో తీవ్ర ఆందోళన నెలకొంది.  జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు  వేసిన పిటిషన్ పై మంగళవారం  విచారణ జరగనుంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ పేరుతో జగన్‌ లాయర్, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్‌ కౌంటర్‌ వేయకుండా గతంలో వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... జూన్‌ 1లోపు కౌంటర్‌ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో ఈసారి కౌంటర్ ఖచ్చితంగా దాఖలు చేయాల్సిందే. దీంతో జగన్‌ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? ‘ఔను... రద్దు చేయాలి!’ అంటుందా? లేక... ‘రద్దు చేయవద్దు..  బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు’ అని చెబుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో  తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.  దర్యాప్తు సంస్థలు ఎక్కువగా నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటాయి.  బెయిలు పిటిషన్లను వ్యతిరేకించడం, గరిష్ఠ శిక్ష విధించాలని కోరుతాయి. ఈ విధంగా చూస్తే... జగన్‌ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరాలి. అదే జరిగితే... పెద్ద సంచలనమే. సీబీఐ ముందున్న మరో ‘ఆప్షన్‌’.. బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం. ఇది ఒక దర్యాప్తు సంస్థగా సీబీఐ చేయకూడని పని. ఎందుకంటే... రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు ఉండటంతో జగన్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయం? ఆయన బెయిల్ రద్దు కాబోతోంది? అని  కొంత కాలంగా ఏపీ బీజేపీ నేతలు  ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్‌ దియోధర్‌.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో, అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. దీంతో ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కమలనాధులు చెబుతున్నట్లే సీఎం జగన్ బెయిల్ రద్దు కాబోతోందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోంది, సీబీఐ కౌంటర్ ఎలా వేయబోతుంది అన్న టెన్షన్  వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.జగన్ అనుచరులకు నిద్ర లేకుండా చేస్తోంది. జగన్ బెయిల్ కేసులో  జరగబోయే పరిణామాలపై ఏపీ జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. 

కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ ! బీజేపీ పెద్దలకు ఈటల కండీషన్...

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్... తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఆయన చేరబోతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు, ఉద్యమ నేతలతో ఉమ్మడి వేదిక, కాంగ్రెస్ లో చేరిక వంటి ఆప్షన్లను పరిశీలించిన ఈటల రాజేందర్.. చివరికి కమలం గూటికి చేరబోతున్నారు. ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దలతో మంతనాలు సాగించారు.  కాషాయ పెద్దల నుంచి స్పష్టమైన హామీ తీసుకున్న ఈటల.. హైదరాబాద్ వచ్చాక అధికారికంగా చేరిక విషయాన్ని ప్రకటించబోతున్నారు. తనతో పాటు తనతో వస్తున్న నేతల భవిష్యత్ కు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ భరోసా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కేంద్రానికి కొన్ని షరతులు కూడా రాజేందర్ పెట్టారని. వాటిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారని అంటున్నారు.  తనను మంత్రివర్గం నుంచి అవమానకరంగా తొలగించారనే కసిగా ఉన్న ఈటల రాజేందర్... కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ ముందు ఈటల రాజేందర్ పెట్టిన కండీషన్లు కూడా కేసీఆర్ లక్ష్యంగానే ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని రాజేందర్ చెప్పారట. దానికి బదులిచ్చిన జేపీ నడ్డా.. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబ కుంభకోణాలపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారని అంటున్నారు. రాజకీయంగా కొన్ని సందేహాలను బీజేపీ చీఫ్ ముందు ఈటల ఉంచారంటున్నారు.  తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని.. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే పార్టీనే నమ్ముకుని వచ్చిన తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఈటల ప్రశ్నించినట్టు సమాచారం. ఈటల సందేహాలపై స్పందించిన జేపీ నడ్డా.. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా  చెప్పారట. అక్కడ మూడు స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదిగామని, తెలంగాణలోనూ అంతకుమించిన దూకుడు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారట.  కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని నడ్డా సూచించారట. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నడ్డా ధీమా వ్యక్తం చేశారని చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని బీజేపీ పెద్దలు రాజేందర్ కు  తేల్చి చెప్పారని అంటున్నారు. 

అమ్మానాన్నలతో గొడవ.. ఆరేళ్ళు కష్టం.. తన సొరంగం రహస్యం..

ఇంట్లో పిల్లలకు, పెద్దవాళ్ల మధ్య గొడవలు సహజం. ఈ పెద్దోళ్లు ఉన్నారే.. పిల్లల మనసు ఎప్పడు అర్థం చేసుకోరు అని చెప్పినట్లు. పెద్దలకు కోపం వస్తే గట్టిగా తిడతారు. అరుస్తారు. అప్పుడప్పుడు చేయి కూడా వేసుకుంటారు. మరి. అదే  పిల్లలకు కోపం వస్తే అలుగుతారు. గదిలోకి వెళ్లి ఏడుస్తారు. ఇంట్లో గడవ పడితే అమ్మాయి అయిన, అబ్బాయి అయిన ఏంచేస్తారు.. ఆ కాసేపు కోపంతో ఇంట్లో నుండి వెళ్లి పోయి ఏ అన్నం తినే టైం కో లేదంటే రాత్రికో తిరిగివస్తారు. ఇంకొంత మంది అయితే ఏ ఫ్రెండ్ ఇంటికో, బంధువుల ఇంటికో వెళ్లి అక్కడ కొన్ని రోజులు తిరిగి ఇంటికి ఉంది వస్తారు. ఇంకొంత మంది అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఒకటి సాధించుకుని, వాళ్ళు ఏంటో నిరూపించుకుని వస్తారు. ఈ మధ్య కాలం లో అయితే పిల్లలు తిట్టినా సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే, ఆ యువకుడు మాత్రం ఇవేవీ చేయలేదు. పలుగు, పార పట్టుకుని తన గార్డెన్‌లోనే గొయ్యి తీయడం మొదలుపెట్టాడు. అలా తవ్వుతూ తవ్వూతూ ఆరేళ్లు గడిపేశాడు. ఆ గొయ్యి ఇప్పుడు సొరంగమైంది. అంతేకాదు.. దాన్ని అతడు గెస్ట్ హౌస్‌గా మార్చేసుకున్నారు. అంతే కాదు అందులో ఒక సిట్టింగ్ రూమ్, టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని పేరు ఆండ్రెస్ క్యాంటో.   2015లో 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అంటే తనను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు దుస్తులు మార్చుకోమని తెలిపారు.  అయితే, క్యాంటో మాత్రం ట్రాక్ సూట్‌లోనే వస్తానని తెలిపాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో  తల్లి దండ్రులకు కోపం వచ్చింది. క్యాంటో ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో వారు మాత్రమే గ్రామానికి వెళ్లారు.  క్యాంటో  కూడా కోపం వచ్చింది.. ఆ కోపంలో అందరి లాగ తాను చెయ్యలేదు. చివరికి సూసైడ్ కూడా చేసుకోలేదు. తనకు వచ్చిన కోపంతో  తమ గార్డెన్‌లో గొయ్యి తవ్వాడు. ఆ పని అతడికి ఎందుకు నచ్చిందో ఏమో తెలీదు. రోజూ స్కూల్ నుంచి రాగానే యుద్ధం చేసినట్లు అదే ప్రాతిపాదికన ఆ పని చేసేవాడు. ఏ రోజు విశ్రాంతి కూడా తీసుకోలేదు. అలిసిపోలేదు. వెనక్కి తిరగలేదు. విసుగురాలేదు. తన సంకల్పంతో  చివరికి అతడు ఆ గొయ్యిని పెద్ద సొరంగంలా మార్చాడు. రాముడికి ఉడతా సహాయం చేసినట్లు అతనికి అతడికి స్నేహితుడు కూడా తోడయ్యాడు. గోతులను తవ్వేందుకు ఉపయోగించే యంత్రాన్ని తీసుకొచ్చాడు. దీంతో క్యాంటో పని మరింత సులభమైపోయింది. ఇప్పుడు క్యాంటోకు 20 ఏళ్లు. ఇప్పుడు ఆ సొరంగం భలే అందంగా ఉంది. అందులో ఒక సిట్టింగ్ రూమ్, బాత్రూమ్ కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా క్యాంటో మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు ఊరు వెళ్దాం దుస్తులు మార్చుకో అన్నారు. కానీ, నాకు ట్రాక్‌సూట్‌లో వెళ్లడమే ఇష్టమని చెప్పాను. వాళ్ళు వినలేదు ,అలాగైతే మాతో ఊరు రావద్దని చెప్పేశారు. నేను  పర్వాలేదు, నన్ను నేను ఎంటర్‌టైన్ చేసుకోగలను అంటూ ఇంటి వెనుక గార్డెన్‌లోకి వెళ్లి తవ్వడం మొదలుపెట్టాను. నా పనికి ఫ్రెండ్ అండ్రూ కూడా తోడయ్యాడు. ఓ రోజు 14 గంటల్లోనే 3 మీటర్ల గొయ్యి తవ్వేశాం. ఇప్పుడు నా సొరంగంలో వైఫై, హీటింగ్ సిస్టమ్ కూడా ఉంది. కానీ, ఆ గొయ్యిని అంతలా తవ్వడానికి కారణం ఏమిటో తలుచుకుంటే నవ్వొస్తోంది’’ అని తెలిపాడు. ఇప్పుడు క్యాంటో తవ్విన సొరంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్పెయిన్‌లోని లా రొమానా లో జరిగింది. 

సీఎస్‌తో చెడుగుడు.. మోదీకి మ‌మ‌త చెక్‌.. కేంద్రం కౌంట‌ర్ యాక్ష‌న్‌..

బెంగాల్ దంగ‌ల్ మ‌రింత కాక రేపుతోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తే స్థాయికి ప‌రిస్థితులు దిగ‌జారాయి. మోదీ వ‌ర్సెస్ మ‌మ‌త‌.. కోల్డ్‌వార్‌లో మాజీ సీఎస్ ఆలాప‌న్ బంధోపాధ్యాయ్ బ‌లవుతున్నారు. కేంద్ర ఆదేశాల‌కు బెద‌ర‌కుండా.. సీఎస్‌తో రాజీనామా చేయించి.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించి.. మోదీ ఇగోను మ‌రింత రెచ్చ‌గొట్టారు మ‌మ‌త. అందుకు కౌంట‌ర్‌గా తాజాగా మాజీ అయిన ఐఏఎస్‌పై ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతుండ‌టంతో వివాదం మ‌రింత ముదురుతోంది. తౌక్తే తుఫాను.. బెంగాల్‌లో రాజకీయ క‌ల్లోలానికి కార‌ణ‌మైంది. తుఫాను న‌ష్టంపై ప్ర‌ధాని చేప‌ట్టిన స‌మీక్షా స‌మావేశానికి సీఎం మ‌మ‌త అర‌గంట ఆల‌స్యంగా రావ‌డం.. వెంట‌నే వెళ్లిపోవ‌డంపై.. కేంద్రం సీరియ‌స్‌గా స్పందించింది. ఆ రాష్ట్ర సీఎస్ ఆలాప‌న్ బందోపాధ్యాయ‌ని వెంట‌నే రిలీవ్ చేసి కేంద్ర ప‌రిపాల‌నా విభాగంలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది. అయితే, సీఎస్‌ను రిలీవ్ చేసేది లేదంటూ మ‌మ‌త తిరుగుబాటు చేయ‌డంతో వివాదం ముదిరింది. ఆ మేరకు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.   క‌ట్ చేస్తే.. సోమ‌వారంతో సీఎస్ ప‌ద‌వీ కాలం ముగిసింది. ఆ వెంట‌నే ఆయ‌న విధుల నుంచి వైదొలిగారు. ఆ వెనువెంట‌నే ఆలాప‌న్ బందోపాధ్యాయ‌ను బెంగాల్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. పశ్చిమ బెంగాల్ నూత‌న‌ ప్రధాన కార్యదర్శిగా హెచ్‌కే ద్వివేది నియ‌మితుల‌య్యారు.  తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు సీఎం మ‌మ‌త‌. బందోపాధ్యాయ విషయంలో కేంద్రం ఉత్తర్వులు తనకు షాక్ కలిగించాయని, ఈ కొవిద్ పాండమిక్ సమయంలోను, యాస్ తుఫాను వల్ల తలెత్తిన నష్టాల తరుణంలోనూ ఆయన సేవలు ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, పేదలకు ఎంతో అవసరమని మమత అన్నారు.  ‘‘కేంద్రానిది పూర్తిగా ప్రతీకారం. ఇలాంటి వైఖరిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. అధికారులు ఏమైనా కట్టుబానిసలు అనుకుంటున్నారా? దేశం కోసం జీవితాంతం కష్టపడిన ఓ ఉద్యోగిని ఇలా వేధించడం ద్వారా కేంద్రం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఎంతోమంది బెంగాల్‌ కేడర్‌కు చెందిన వ్యక్తులు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వారందర్నీ వెనక్కి రప్పించమంటారా?’’ అని మమత ప్రశ్నించారు.  అంతటితో ఆగలేదు దీదీ..’మిస్టర్ ప్రైమ్ మినిష్టర్.. బిజీ ప్రైమ్ మినిష్టర్.. మిస్టర్ మన్ కీ బాత్ ప్రైమ్ మినిష్టర్’ అంటూ వెట‌కారంగా వ్యాఖ్యానించారు. మ‌రోవైపు.. మ‌మ‌త‌పై కౌంట‌ర్ అటాక్ చేసేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలను పాటించని ఆలాపన్‌ బందోపాధ్యాయపై చర్యలు తీసుకోబోతోంది. సీఎస్‌గా ఆలాపన్ బందోపాధ్యాయ్ పదవీ విరమణ చేసినా, ఆయనపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆయనకు త్వరలోనే కేంద్రం ఛార్జ్‌షీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నాటికి ఆలాపన్ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఆలాపన్‌ను సీఎం మమత రిలీవ్ చేయలేదు. దీంతో సిబ్బంది మరియు శిక్షణా విభాగానికి నివేదించడంలో ఆలాపన్ బందోపాధ్యాయ్‌ విఫలం చెందారని, ఈ కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిబ్బంది మరియు శిక్షణా విభాగం రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. మోదీ వ‌ర్సెస్ మ‌మ‌త.. ఆధిప‌త్య పోరు ఎక్క‌డి వ‌ర‌కూ దారితీస్తుందోన‌నే ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. 

జ‌డ్జి రామ‌కృష్ణ హ‌త్య‌కు కుట్ర‌? జైల్లో క‌త్తి క‌ల‌క‌లం..

అత్యంత ప‌టిష్ట‌మైన ర‌క్ష‌ణ ఉండే ప్రాంతం జైలు. సిబ్బందికి తెలీకుండా చీమ కూడా జైల్లోకి జొర‌బ‌డ‌లేదు. అంతా నేర‌స్తులే ఉంటారు కాబ‌ట్టి.. సెక్యూరిటీ ఫుల్ టైట్‌గా ఉంటుంది. అలాంటిది.. జైల్ బ్యారెక్‌లో క‌త్తి క‌నిపించ‌డం చిన్న విష‌య‌మేమీ కాదు. అదికూడా.. ప్ర‌భుత్వం క‌క్ష‌క‌ట్టి జైల్లో పెట్టిన వ్య‌క్తి ఉండే గ‌దిలోకి క‌త్తి రావ‌డం అనుమానాస్ప‌దం అంటున్నారు కొంద‌రు.  జిల్లా సబ్ జైల్‌లోని.. జడ్జి రామకృష్ణ ఉన్న బ్యారెక్‌లో కత్తి కలకలం రేపింది. బ్యారెక్‌లో తోటి ఖైదీ బెడ్ కింద కత్తి క‌నిపించింది. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతానని రామకృష్ణను ఆ ఖైదీ బెదిరించాడని.. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఖైదీని మరో బ్యారెక్‌కు తరలించారు.  తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని జ‌డ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే ఆ జైలు నుంచి మార్చాలని ప‌ట్టుబ‌డుతున్నాడు. జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. భోజనం చేయడానికి కూడా భయపడుతున్నానని తన తండ్రి త‌న‌తో చెప్పారని అన్నారు.  జైల్లో ఉన్న‌ ఆ వ్యక్తి దగ్గర కత్తి ఎందుకు ఉందంటూ  టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. జడ్జి రామకృష్ణను హత్య చేసే ఉద్దేశంతోనే అతని బ్యారక్‌లోకి మరో వ్యక్తిని పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అపరిచిత వ్యక్తి వద్ద కత్తి ఎందుకు ఉందో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టి జడ్జి రామకృష్ణను జైలులో పెట్టించారని చంద్ర‌బాబు ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?’ అని చంద్ర‌బాబు నిల‌దీశారు.  రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా.. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌జైలుకు తరలించారు. అయితే, జ‌డ్జి రామ‌కృష్ణ ఉన్న బ్యారెక్‌లోని మ‌రో ఖైదీ బెడ్ కింద క‌త్తి ఉండ‌టం ప్ర‌స్తుత వివాదానికి కార‌ణం.

సెంచ‌రీ బాదేసిన‌ జ‌గ‌న్‌.. క్రిస్‌గేల్ రికార్డు బ‌ద్ద‌లు..

అవును. మీరు చ‌దివింది క‌రెక్టే. సీఎం జ‌గ‌న్ సెంచ‌రీ కొట్టారు. సెంచ‌రీలు కొట్ట‌డంలో మాస్ట‌ర్ అయిన క్రిస్‌గేల్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టారు. బ్యాట్ ప‌ట్టుకొని బాదుతూ.. ఒక్కో ప‌రుగు జ‌త చేస్తూ.. సైలెంట్‌గా సెంచ‌రీ చేసేశారు. స్కోర్ బోర్డ్ గిర్రున తిరిగి.. మీట‌ర్ 100 చూపిస్తే కానీ తెలీలేదు జ‌నాల‌కు.. జ‌గ‌న్ సెంచ‌రీ బాదేసిన విష‌యం. ఇలా.. జ‌గ‌న్‌పై క్రికెట్ బాష‌లో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది మ‌రెవ‌రో కాదు నారా లోకేశ్‌. ఇంత‌కీ, సెంచ‌రీ ఎందులోనో తెలుసా... ఏపీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద దాటేసింది. విజ‌య‌వాడ‌లో స‌క్సెస్‌ఫుల్‌గా సెంచ‌రీ కొట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అధిక ప‌న్నులు బాద‌డం వ‌ల్లే పెట్రోల్ రేట్ ఏపీలో వంద రూపాయ‌ల‌కు చేరిందంటూ టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ విమ‌ర్శించారు. ఆ సంద‌ర్భంగా క్రికెట‌ర్ క్రిస్‌గేల్‌తో సీఎం జ‌గ‌న్‌రెడ్డిని కంపేర్ చేస్తూ లోకేశ్ వేసిన పంచ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.  పెట్రోల్ ధర రూ.100 దాట‌డంపై నారా లోకేశ్ సీఎం జగన్‌పై బౌన్స‌ర్లు విసిరారు. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ సుడిగాలి సెంచరీతో రికార్డు స్థాపించాడని.. ఇప్పుడా రికార్డును ఇండియన్ పెట్రోల్ లీగ్ (ఐపీఎల్)లో.. 3 క్యాపిటల్స్ జట్టు కెప్టెన్.. బాదుడురెడ్డి  బద్దలు కొట్టారంటూ.. జ‌గ‌న్‌రెడ్డిపై సెటైర్లు వేశారు నారా లోకేశ్‌. దేశంలో లీటరు పెట్రోల్  రేటు సెంచరీ దాటించిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలపడం ద్వారా, అవినీతిలోనూ, ధరలు పెంచడంలోనూ తానే ఏ1 అని జగన్ నిరూపించుకున్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ట్యాక్సులు తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ తక్కువ ధరలకే ఇవ్వొచ్చని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ బాదుడు రెడ్డి ఫేక్ కబుర్లు చెప్పారని ఆరోపించారు. కానీ, అధికారం చేపట్టాక మామూలు ట్యాక్స్ లను రెండింతలు చేసి, దానికి జే ట్యాక్స్ కూడా కలిపి మరీ పెట్రోల్ ధరను సెంచరీ దాటించారని లోకేశ్ మండిప‌డ్డారు. కామెంట్ల‌తో పాటు గతంలో విపక్షనేతగా జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను.. బాదుడే బాదుడు అనే టైటిల్‌తో ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు నారా లోకేశ్‌.  ఏపీలో పెట్రోల్ ధ‌ర వంద మార్క్‌ను ట‌చ్ చేయ‌డంపై సామాన్యులు మండిప‌డుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయినప్పుటి నుంచీ ఏపీలో అన్నిర‌కాల ధ‌ర‌లు పెరిగాయ‌ని గుర్తు చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరిగితే.. అవి ప‌రోక్షంగా నిత్య‌వ‌సరాల ధ‌ర‌లూ పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అప్పుడు ప్ర‌జ‌లంద‌రి మీద భారం ప‌డ‌క త‌ప్ప‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఖ‌జానా ఖాళీ చేసి.. అప్పుల‌తో పాల‌న‌ను నెట్టుకొస్తున్న జ‌గ‌న్‌.. ఇంధ‌నంపై ఎడాపెడా ప‌న్నులు బాదేయ‌డం వ‌ల్లే చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో పెట్రోల్ రేట్ సెంచ‌రీ కొట్టిందంటూ సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై  వాహ‌న‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

జగన్ సర్కార్ కు మరో షాక్..  రాజద్రోహం కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో ఏపీ సర్కార్ కు మరోసారి చుక్కెదురైంది. ఎంపీ రఘురామ కేసులో మీడియా సంస్థలపై ఎటువంటి తీవ్రమైన చర్యలు చేపట్టరాదని.. ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీవీ5, ఏబీఎన్‌ ఛానెళ్లపై రాజద్రోహం కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. రాజద్రోహం కేసు నమోదు చేసేంత తప్పు ఏం చేశారని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీ రఘురామ వ్యాఖ్యలను ప్రసారం చేయడం.. రాజద్రోహం ఎలా అవుతుందని కామెంట్ చేసింది. ఏ సందర్భంలో రాజద్రోహం కేసు పెట్టాలో.. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని ధర్మాసనం తెలిపింది. సెక్షన్‌ 124ఏ, 153 పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ప్రతి చిన్నవిషయానికి రాజద్రోహం కేసు పెడితే.. అసలు ఏ వార్తలు కూడా మీడియా ప్రసారం చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గంగానదిలో మృతదేహాన్ని పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ చానల్‌ చూపించిందని, మరి ఆ చానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా..? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.  ఎంపీ రఘురామతో కలిసి ఏబీఎన్‌, టీవీజ్ఞ కుట్రచేసినట్టు.. ఎఫ్‌ఐఆర్‌లో దర్యాప్తు సంస్థ ధృవీకరించలేదని న్యాయమూర్తి అన్నారు. మీడియాను గుప్పిట్లో ఉంచుకునేందుకు, భయపెట్టేందుకు.. రాజద్రోహం కేసు నమోదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శ రాజద్రోహం కాదని, ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వానికి, సీబీసీఐడీ, తెలంగాణ ప్రభుత్వానికి.. కేంద్ర హోంశాఖకు, కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది.  మరోవైపు ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ పి.సి.పంత్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. విచారణ సందర్భంగా ఏపీ సీఐడీ పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీకి రఘురామ తనయుడు భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ ఫిర్యాదుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీచేస్తూ అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ పంత్‌ను కలిసి సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును స్వయంగా రఘురామకృష్ణరాజు వివరించారు. 

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి! ఏఐసీసీలోకి కోమటిరెడ్డి, పొన్నం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి కాషాయ పార్టీ పెద్దలతో చర్చలు కూడా సాగించారు. ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు.. కొందరు హస్తం పార్టీ నేతలు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. ఈటల బీజేపీలో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మరింత అప్రమత్తమైంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న తెలంగాణ పీసీసీ పదవిని వీలైనంత త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ రేసులో కోమటికరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముందున్నా.. ఎంపీ రేవంత్ రెడ్డినే రాహుల్ గాంధీ ఫైనల్ చేశారని సమాచారం. సీఎం కేసీఆర్ ను, బీజేపీ దూకుడును ఎదుర్కొవాలంటే రేవంత్ రెడ్డే సరైన నేత అని హస్తం హైకమాండ్ నిర్ణయించిందని తెలుస్తోంది. పీసీసీ పీఠం కోసం చివరి వరకు పోరాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇవ్వనున్నారట. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఏఐసీసీలోకి వెళ్లనున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, మధు యాష్కి గౌడ్ ను నియమించనున్నారట. అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా సామాజిక న్యాయం చేసేలా రాహుల్ టీమ్ కసరత్తు చేసిందని సమాచారం.  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి రాజీనామా చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి నుంచే ఏఐసీసీ పీసీసీ చీఫ్ కోసం కసరత్తు చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ డిసెంబర్ లోనే పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సోనియా జన్మదినమైన డిసెంబర్ 9నే పీసీసీ ప్రకటన వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అది వాయిదా పడింది. తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావడంతో.. అది ముగిసేవరకు పీసీసీ ఎంపిక అపాలని జానారెడ్డి కోరడంతో మళ్లీ వాయిదా పడింది. నాగార్జున సాగర్ ఎన్నిక ముగిసి నెల రోజులు దాటినా పీసీసీ ఎంపికపై కదలిక రాలేదు. ఇంతలోనే తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తప్పించడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.  ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరేలా కొందరు నేతలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈటల బీజేపీలో చేరుతుండటంతో ఆయనతో పాటు మరికొందరు నేతలు కమలం గూటికి చేరే అవకాశం ఉంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను కూడా బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తోంది. అయితే పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇస్తే కొండా .. కాంగ్రెస్ లోనే కొనసాగుతారని చెబుతున్నారు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకంగా ఉన్న యువత అంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని రాహుల్ టీమ్ సర్వేలో తేలిందట. అందుకే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారని పక్కాగా తెలుస్తోంది. 

స్టూడెంట్ ప్రేమలో.. టీచరమ్మ.. 

ఆమె ఓ టీచర్. ఆమె వయసు 35 సంవత్సరాలు. ఆమె వృత్తి పరంగా పాఠాలు చెప్పాలి, పిల్లలకు గుణపాఠాలు చెప్పాలి.. కానీ ఈ టీచర్ కథ వేరు. రూటే వేరు. విద్యార్థికి పాఠాలు చెప్పాల్సిన టీచర్.. అతనికి కామా పాఠాలు నేర్పించింది. అంతే కాదు ఆ విద్యార్ధి తోనే టీచరమ్మ  ప్రేమలో పడింది. ఆ స్టూడెంట్ ను కూడా పడగొట్టింది.. ఆ విద్యార్ధి కూడా టీచరమ్మ ప్రేమ బావిలో పడిపోయాడు. ఇంకేముంది చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు, డ్యూయెట్ వేసుకున్నారు. బాండింగ్ పెంచుకున్నారు.  కట్ చేస్తే.. ఇద్దరు కలిసి టీచర్ ఇంట్లో రెండు సార్లు పనికానిచ్చారు. ఈ విషయాన్ని ఇద్దరు కూడా వేర్వేరుగా అంగీకరించారు. వివరాలు.. 35 ఏళ్ల అబ్బి డిబ్స్ గతంలో తాను పనిచేసిన పాఠశాలకు చెందిన 17 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నారు. ఇక, 17 ఏళ్ల స్టూడెంట్ ఓ డిటెక్టివ్‌తో మాట్లాడుతూ.. టీచర్‌తో రిలేషన్‌ పెట్టుకున్న సంగతి నిజమేనని చెప్పాడు. తనకు టీచర్‌ అంటే ఇష్క్, కాదల్, అని ఆమె అంటే చాలా ప్రేమ అని చెప్పుకొచ్చాడు. అయితే తమ బంధాన్ని బయటపెట్టిన వ్యక్తిపై కోపంగా ఉన్నట్టు చెప్పాడు. మే 21, మే 22 తేదీల్లో స్టూడెంట్ తన ఇంటికి వచ్చాడని.. ఆ రెండు రోజులు అతనితో లైగికంగా సంబంధం కొనసాగించినట్టుగా డిబ్స్ కూడా అంగీకరించింది. అలాగే వారి మధ్య జరిగిన దాని గురించి ఇద్దరు ఎలా భావించారో కూడా తెలిపింది.  చివరికి టీచరమ్మ పై కేసు పైల్ అయింది. ఈ కేసులో డిబ్స్‌కు న్యాయస్థానం 3,500 డాలర్ల పూచికత్తతో పాటు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్న స్టూడెంట్‌తో పాటుగా, ఇతర పిల్లలతో కూడా కాంటాక్ట్ పెట్టుకోవద్దని నిబంధన విధించింది. ఈ కేసులో దోషిగా తేలితే.. డిబ్స్ 12 ఏళ్లు జైలు శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది.ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్‌లో చోటుచేసుకుంది. 

మడమ తిప్పిన జగన్.. మద్య నిషేధానికి మంగళం! 

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పే నినాదం.. వైసీపీ నేతల నోటి నుంచి వచ్చే పదం. మాట తప్పం.. మడమ తిప్పనంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. రెండేండ్లుగా మాట తప్పుతూనే ఉన్నారు. మడమ తిప్పితూనే ఉన్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. రాష్ట్ర  మద్యం  పాలసీలో  గొప్ప మార్పును ప్రకటించారు జగన్ రెడ్డి. చడీ చప్పుడు లేకుండా,  అంచల వారీ మద్య నిషేధం వాగ్దానానికి మంగళంపాడేశారు. రెండేళ్ళ పాలనపై విడుదల చేసిన 16పేజీల పత్రంలో, మధ్య ‘నిషేధం’ (ప్రొహిబిషన్) పదాన్ని తుడిచేసి, దాని స్థానంలో  మధ్య ‘నియంత్రణ’ ( రిస్ట్రిక్షన్స్) అనే పదాన్ని చేర్చారు. “తాగుడు దురలవాటు కారణంగా చితికిపోతున్న కుటుంబాలను కాపాడేందుకు,ప్రభుత్వం అంచల వారీగా మధ్య ‘నియంత్రణ’ అమలు చేస్తుంది” అని ముఖ్యమత్రి ప్రకటించారు.  రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అంచెల వారీగా సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని వాగ్దానం చేశారు. సంపూర్ణ మధ్య నిషేధం లక్ష్యంగా   నూతన మద్య పాలసీ ప్రకటించారు. అందులో భాగంగా మద్యం అమ్మకాలను తగ్గించడం కోసమంటూ, వ్యాపారాన్ని, ప్రభుత్వ పరం చేశారు. అలాగే, మద్యం షాపుల  సంఖ్యను, గడచిన రెండు సంవత్సరాలలో 4,380 నుంచి 2,934 కు తగ్గించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, మద్యం షాపుల సంఖ్య తగ్గినా,మద్యంపై వచ్చే ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో ఇంకెక్కడా లేని చిత్ర విచిత్ర బ్రాండ్స్ తెచ్చి, ధరలు పెంచి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటోంది అన్న విమర్శ చాలా బలంగా వినిపిస్తోంది. అలాగే మదయం తయారీ వ్యాపారం పూర్తిగా వైసీపీ నాయకులు, సానుభూతి పరుల చేతుల్లో ఉందని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి.  అయితే సంపూర్ణ మద్య నిషేధం విషయంలో నిబద్ధతో ఉన్నామంటున్న ప్రభుత్వం, మద్య నిషేధం పదాన్ని  తొలిగించి మద్య నియంత్రణ అనే పదం ఎందుకు చేర్చింది? ఈమార్పు ఉద్దేసపూర్వకంగా జరిగిందా లేక పొరపాటు దొర్లిందా, అంటే  అధికారులు ఉద్దేసపూర్వకంగానే మార్పు జరిగిందని అంటున్నారు.   మద్యం ఆదాయాన్ని ఏస్కో రెవిన్యూగా చూపింఛి ప్రభుత్వం వివిధ  బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు ఋణం తీసుకుంది. ఈ కారణంగానే మద్యం పాలసీలో నిషేధం తొలిగి నియంత్రణ వచ్చిందని అధికార వర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ, వివిధ పథకాల అమలుకు సుమారు రూ.16000 కోట్లు ఋణం సేకరించాలని నిర్ణయించింది, ఈ విషయాన్ని బడ్జెట్ లో కూడా  చూపించారు. ఇందుకు కూడా  మద్యం ఆదాయమే (ఏస్కో రెవిన్యూ) ఆధారం. ఓ వంక సంపూర్ణ మద్య నిషేధం అంటూనే ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని పెంచుకోచూస్తోంది అనేందుకు ఇంతకంటే వేరే సాక్ష్యం  ఆక్కరలేదని అంటున్నారు. మద్యం అమ్మకాల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,600 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ముందు సంవత్సరంలో కూడా అంతే ఆదాయం వచ్చింది. రెండు సంవత్సరాలలో ప్రభుత్వం మద్యం ధరలను 125 శాతం పెంచింది. ఈ పరిణామాలను గమనిస్తే సంపూర్ణ మద్య నిషేధం ... సంపూర్ణ అసత్యం.. జగన్ మాట తప్పింది.. మడమ తిప్పింది వాస్తవం..

నో వ్యాక్సిన్- నో లిక్క‌ర్‌.. మందుబాబులకు షాకింగ్ న్యూస్..

నో మాస్క్- నో ఎంట్రీ. ఏ షాపులోకి వెళ్లినా కామ‌న్‌గా క‌నిపిస్తున్న పోస్ట‌ర్‌. మాస్క్ లేనిదే లోనికి రానివ్వ‌డం లేదు. మాస్క్ లేనిదే స‌రుకులు ఇవ్వ‌డం లేదు. మాస్క్ లేకుండా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే అస‌లేమీ కొన‌లేం. మాస్క్‌తో పాటు సామాజిక దూర‌మూ త‌ప్ప‌నిస‌రి. కానీ, కొంద‌రు ప‌ట్టించుకుంటేగా. మాస్క్ పెట్టుకున్నాం క‌దా.. అని సామాజిక దూరాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే.. మార్కెట్లు, మ‌ద్యం షాపులు జ‌నాల‌తో కిక్కిరిసిపోతున్నాయి. మార్కెట్ల‌ను ఏమీ చేయ‌లేరు కాబ‌ట్టి.. మ‌ద్యం షాపుల‌పై ప‌డ్డారు అధికారులు. స‌రికొత్త రూల్స్‌తో మందుబాబుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక‌పై వ్యాక్సిన్ వేసుకున్న వారికే లిక్క‌ర్ అమ్మ‌కం. ఇదే ఇప్పుడు సంచ‌ల‌నం.  కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది ముందుకు రావడంలేదు. దీంతో ఆయా ప్ర‌భుత్వాలు బ‌ల‌వంతంగా వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. మ‌రికొన్నిచోట్ల ఉచిత ఆఫ‌ర్లూ ప్ర‌క‌టిస్తున్నారు. వ్యాక్సిన్‌పై జ‌నాలకు ఉన్న సందేహాలే వారు టీకా వేసుకోక‌పోవ‌డానికి కార‌ణం. ఇక‌, క‌రోనా వ్యాప్తికి సూప‌ర్ స్పెడ‌ర్లుగా మారిన మందుబాబుల విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అధికారులు. ఎంతైనా మందుబాబులు క‌దా.. ధ‌ర‌లు పెంచినా.. ఏం చేసినా నోరెత్త‌ర‌నే ధైర్యంతో వారికే కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే రెండు మూడు రోజుల పాటు మందు తాగ‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. అన్ని రోజులు మ‌ద్యానికి దూరం ఉండ‌లేక‌.. చాలామంది వ్యాక్సిన్‌కే  దూరంగా ఉంటున్నారు. మ‌ద్యం షాపుల ముందు ర‌ద్దీ కూడా క‌రోనా వ్యాప్తికి మ‌రో కార‌ణం. దీంతో.. వ్యాక్సిన్ వేసుకుంటేనే మ‌ద్యం అమ్మాలంటూ ఆర్డ‌ర్ వేశారు యూపీలోని ఓ జిల్లా అధికారులు.  తాజాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిబంధనలను జారీ చేసింది. టీకా తీసుకోకుంటే అక్కడ లిక్కర్ అమ్మ‌రు. యూపీలోని ఎటావా జిల్లా యంత్రాంగం మొదటగా ఈ రూల్ తెచ్చింది. ఆ మేర‌కు లిక్కర్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మందు అమ్మాలని మ‌ద్యం షాపు యజమానులకు స్ట్రిక్ట్‌గా ఆదేశాలు ఇచ్చారు. నో వ్యాక్సిన్‌- నో లిక్క‌ర్‌.. అంటూ వైన్స్ ముందు పోస్టర్లు అతికించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లిక్కర్ అమ్ముతామని బోర్డులు పెట్టారు. అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇలాంటి ఎన్ని రూల్స్ పెట్టినా.. మందుబాబుల‌ను క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌భుత్వాల‌కు సాధ్య‌మా?  మందు కోసం వారి దారులు వారికి ఉంటాయ‌నే విష‌యం అధికారుల‌కు తెలియ‌నిదా?

అత్త శాడిజం.. కోడలికి కరోనా.. 

అత్త, కోడలు ఈ పేర్లు ఎప్పుడు ఎవెర్ గ్రీన్.. ఈ ఇద్దరి పేరు చెప్పుకుని, ఈ అత్తాకోడళ్ల మీద చాలా సినిమాలు వచ్చాయి. కొన్నే వందల కొద్దీ సీరియల్స్ నడుస్తున్నాయి. అత్తాకోడళ్లు లేని ఇల్లు ఉండదు.. గొడవలు లేని ఇల్లుకూడా ఉండదు. ఒక్క మాటలో చెప్పంటే అత్త పాము అయితే కోడలు ముంగీస అని చెప్పొచ్చు.. అత్తాకోడలు ఎదురుపడరు ఎదురుపడితే ఊరుకోరు.. ఎప్పడు ఒకటే గొడవ.. అది ఒకప్పుడు, ఇప్పుడు అయితే అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా.. కోడలులేని అత్త గుణవంతురాలు అని పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు.. ఎందుకంటే  అత్తాకోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడదు కాబట్టి.. ఇప్పుడు కూడా అత్తకోడలు గొడవ జరిగింది. గొడవ అంటే అలాంటిలాంటి గొడవకాదు. తన కొడుకును కోడలు  కొంగుకు కట్టేసుకుని తిరుగుతుందని అత్త బాధ.. ఒక్కసారిగా అట్టకడుపు మండింది. ఎలాగైనా కోడల్ని అత్తగారు చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కోడలి ఆవేదన. అయితే ఇలాంటి సమస్య ప్రతి ఇంట్లోనూ ఉండేదే.. కానీ ఓ అత్త మాత్రం ఈ కరోనా కాలంలో తన కోడలిపై పగ పెంచుకోంది. కరోనా వచ్చిన తనను దూరం పెడుతున్నారని కక్ష కట్టిన అత్తగారు తన కరోనా రోగాన్ని కోడలికి అంటించింది. ఆ తర్వాత కోడలికి కరోనా వచ్చిందని చెప్పి ఇంట్లోనుండి బయటికి గెంటేసింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్లలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. అది రాజన్న సిరిసిల్ల జిల్లా.  ఎల్లారెడ్డిపేట మండలం. తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు.. ఆమె భర్త ఏడు నెలల క్రితం పనికోసం పొట్టచేత పట్టుకొని ఒడిశా కి వెళ్లాడు. దీంతో అత్తామామలతోనే మహిళా నివాసముంటుంది. ఈ నేపథ్యంలోనే గతకొన్నిరోజుల క్రితం ఆమె అత్తకు కరోనా సోకింది. ఇంకా అంటే దీంతో ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కోడలు పిల్లలను అత్తగారి వద్దకు పంపించకుండా అడ్డుకుంది. అది అవమానంగా భావించిన అత్త ఎలాగైనా రివెంజ్ తీసుకోవాల్సింది.అందుకే అత్తలో ఉన్న దెయ్యం నిద్దురలేచింది.  తానూ చనిపోతే తన కోడలు సుఖంగా ఉంటుందని, అత్త పధకం పన్నింది తనను సరిగ్గా పట్టించుకోకుండా అందరికి దూరం చేస్తుందని కక్ష పెంచుకుంది. అత్త ప్రతాపం ఎలాగైనా చూపించాలనుకుంది.  అత్తో కొడాలో తాడో పేడో తేల్చుకోవాలనుకుంది. తన కోడల్ని ఎలాగైన బయటకు గెంటేయాలని ప్లాన్ వేసింది. అత్త కొత్త నాటకానికి తెరలేపింది. తనకు అన్నం పెట్టడానికి వచ్చిన కోడల్ని కౌగిలించుకొని ఎప్పుడు లేని ప్రేమను కురిపించడం మొదలుపెట్టింది. ఆమెతో పాటు పిల్లల్ని కూడా బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, దగ్గరకు తీయడం లాంటివి చేస్తూ అతిప్రేమ ఒలకబోసింది. అతి ప్రేమ అనర్ధాలకు దారి తీస్తుందని చెప్పినట్లు. అత్త  కొన్నిరోజులు అత్తకు నెగెటివ్ రాగా, కోడలికి పాజిటివ్ అని తేలింది. కోడల్ని కౌగిలించుకోవడం వలన అత్తగారి కరోనా కోడలికి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇక ఇదే అదునుగా భావించిన అత్తా కోడలికి కరోనా వచ్చిందని ఇంట్లో నుండి బయటికి గెంటేసింది. ఆమె చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా బయటకు నెట్టేశారు. దీంతో కోడలు తన సోదరి ఇంటికి చేరుకొంది. ఈ అమానుష ఘటనపై మహిళా బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అత్తామామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అత్తాకోడలు అంటే తల్లి కూతుర్లు లాగ ఉండాలి గాని, పక్కింటి పాల్లోళ్ళలా ఉంది గొడవ పడితే ఏం వస్తుంది చెప్పండి.. అత్త కోడలితో తన అనుభవాలు చెప్పాలి గాని.. పగ పెంచుకోవడం ఏంటి..? అలాంటి వయసులో కోడలు అత్తకి ఆసరాగా ఉండాలి గాని కయ్యానికి కాలు దువ్వడం ఏంటి.. ?