స్టూడెంట్ ప్రేమలో.. టీచరమ్మ..
posted on May 31, 2021 @ 5:12PM
ఆమె ఓ టీచర్. ఆమె వయసు 35 సంవత్సరాలు. ఆమె వృత్తి పరంగా పాఠాలు చెప్పాలి, పిల్లలకు గుణపాఠాలు చెప్పాలి.. కానీ ఈ టీచర్ కథ వేరు. రూటే వేరు. విద్యార్థికి పాఠాలు చెప్పాల్సిన టీచర్.. అతనికి కామా పాఠాలు నేర్పించింది. అంతే కాదు ఆ విద్యార్ధి తోనే టీచరమ్మ ప్రేమలో పడింది. ఆ స్టూడెంట్ ను కూడా పడగొట్టింది.. ఆ విద్యార్ధి కూడా టీచరమ్మ ప్రేమ బావిలో పడిపోయాడు. ఇంకేముంది చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు, డ్యూయెట్ వేసుకున్నారు. బాండింగ్ పెంచుకున్నారు.
కట్ చేస్తే.. ఇద్దరు కలిసి టీచర్ ఇంట్లో రెండు సార్లు పనికానిచ్చారు. ఈ విషయాన్ని ఇద్దరు కూడా వేర్వేరుగా అంగీకరించారు. వివరాలు.. 35 ఏళ్ల అబ్బి డిబ్స్ గతంలో తాను పనిచేసిన పాఠశాలకు చెందిన 17 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నారు. ఇక, 17 ఏళ్ల స్టూడెంట్ ఓ డిటెక్టివ్‌తో మాట్లాడుతూ.. టీచర్‌తో రిలేషన్ పెట్టుకున్న సంగతి నిజమేనని చెప్పాడు. తనకు టీచర్ అంటే ఇష్క్, కాదల్, అని ఆమె అంటే చాలా ప్రేమ అని చెప్పుకొచ్చాడు. అయితే తమ బంధాన్ని బయటపెట్టిన వ్యక్తిపై కోపంగా ఉన్నట్టు చెప్పాడు. మే 21, మే 22 తేదీల్లో స్టూడెంట్ తన ఇంటికి వచ్చాడని.. ఆ రెండు రోజులు అతనితో లైగికంగా సంబంధం కొనసాగించినట్టుగా డిబ్స్ కూడా అంగీకరించింది. అలాగే వారి మధ్య జరిగిన దాని గురించి ఇద్దరు ఎలా భావించారో కూడా తెలిపింది.
చివరికి టీచరమ్మ పై కేసు పైల్ అయింది. ఈ కేసులో డిబ్స్‌కు న్యాయస్థానం 3,500 డాలర్ల పూచికత్తతో పాటు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్న స్టూడెంట్‌తో పాటుగా, ఇతర పిల్లలతో కూడా కాంటాక్ట్ పెట్టుకోవద్దని నిబంధన విధించింది. ఈ కేసులో దోషిగా తేలితే.. డిబ్స్ 12 ఏళ్లు జైలు శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది.ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్‌లో చోటుచేసుకుంది.