రాందేవ్ వర్సెస్ ఐఎంఏ.. ఎవరూ తగ్గట్లే!
ఆధునిక వైద్యంగా పిలవబడే అలోపతి వైధ్యం గురించి యోగా గురు రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రేపిన దుమారం ఇంకా సర్దు మణగలేదు. రాందేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం , ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఐఎంఏ ఫిర్యాదు మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్, రాందేవ్ బాబాకు ఘాటైన లేఖ రాసిన విషయం కూడా, అంతే, అందరికీ తెలిసిందే. అదే విధంగా ఆ లేఖలో కేంద్ర మంత్రి సూచించిన విధంగా రాందేవ్ బాబా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఐఎంఏతో పాటుగా అలోపతి వైద్యులకు క్షమాపణలు కూడా చెప్పారు. అక్కడితో ఆ వివాదానికి చుక్క పెట్టారు.
అయితే రాందేవ్ బాబా, తగ్గినట్టే తగ్గి మళ్ళీ అలోపతికి కొత్త సవాళ్ళు విసిరారు. వివాదాన్ని మరో మలుపు తిప్పారు. అలోపతి వైద్యంలో ఉన్న లొసుగులను ఎత్తి చూపుతూ, బీపీ, మధుమేహం సహా కొన్ని రోగాలకు అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ రాశారు.బాబా ప్రశ్నలకు ఐఎంఎ ఎదుకనో సమాధానం అయితే ఇవ్వలేదుగానీ, రాందేవ్’ బాబా క్షమాపణలతో ముగిసింది అనుకున్న పాత సంగతులను పైకితీసి అయన మీద కేసులు పెట్టింది. అంతే కాదు ఓ వెయ్యి కోట్ల రూపాయలకు పరవు నష్టం దావా కూడా వేసింది. సోషల్ మీడియాలో రాందేవ్ బాబాకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెటిజన్లు ఆయపై దుమ్మెత్తి పోశారు. ఆయన పై దేశద్రోహం కేసు పెట్టాలని , ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని సోషల్ మీడియా హోరెత్తి పోయింది. అయితే రాందేవ్ బాబా, ఆ విషయాన్ని లైట్’ గా తీసుకున్నారు. ఎవరూ తనను అరెస్ట్ చేయలేరని, పరోక్షంగా, ఆయన్ని అరెస్ట్ హేయాలని కోరుతూ కొందరు ప్రధాని మోదీకో లేఖరాయడాన్ని ఎద్దేవా చేశారు.
అదలా ఉంటే’ ఇప్పుడు తాజాగా, ఐఎంఏ కేసులు , పరవు నష్టం దావా విషయంలో ఒకడుగు వెనకు వేసింది. రాందేవ్ బాబా కొవిడ్ 19 వాక్సిన్, ఆధునిక వైద్యం పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే కేసులు, పరవు నష్టం దావా వెనక్కి తీసుకుంటామని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జే ఏ జయలాల్. పేర్కొన్నారు. అయితే, కొవిడ్ వాక్సిన్, ఆధునిక వైద్యంపై చేసిన వ్యాఖ్యలను, రాందేవ్ బాబా ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు. క్షమాపణలు కూడాచెప్పారు. అయినా ఇప్పుడు మళ్ళీ మరోమారు అవే డిమాండ్స్ చేయడం ఏమిటన్న ప్రశ్నకు, ఐఎంఏ అధ్యక్షుడు, ‘అలాకాదు, ఆయన తమ వ్యాఖ్యలను సంపూర్ణంగా ఉపసంహరించుకోవాలని, క్షమ్పణలు చెప్పాల’ని అంటున్నారు. అయితే, రాందేవ్ బాబా, ఫ్రెష్’గా సంధించిన 25 ప్రశ్నలకు సమాధానాలు లేకనో లేక చేపప్డం ఇష్టం లేక పోవడం వల్లనో, ఐఎంఏ, అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తోందని రాందేవ్ బాబా ఫాలోయర్స్ అంటున్నారు. అయితే, ఏది ఏమైనా అలోపతి, ఆయుర్వేదం, అలోపతి మరో వైద్య విధానం మధ్య వివాదాలు, వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు జాతీయ వైద్య విధానంపై లోతైన చర్చ జరగవలసిన అవసరం అయితే వుంది. అప్పుడు, భారతీయ వైద్య విధానంపై లోతైన చర్చ అవసరం అవుతుందని, అంటున్నారు భారతీయ వైద్య విధానం పట్ల విశ్వాసం ఉన్న వైద్యులు.