ఈటల.. ఆత్మగౌరవం ఏమైందయ్యా ? బీసీ నేత ఆక్రోశం..

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఢిల్లీలో కమలం పార్టీ పెద్దలను కలిశారు రాజేందర్. రేపోమాపో అధికారికంగా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత.. ఆయనపై జనాల నుంచి సానుభూతి లభించింది. బీసీ సంఘాలకు ఈటలకు మద్దతుగా రోడ్డెక్కాయి. ఈటల కూడా బీసీ వాయిస్ వినిపించడం, ఆత్మగౌరవం అంటూ కేసీఆర్ కు కౌంటరిచ్చారు. దీంతో ఈటల రాజేందర్.. బీసీ ఎజెండాగా కొత్త పార్టీ పెడతారని భావించారు. అయితే ఈటల మాత్రం కొత్త పార్టీ ఆలోచన పక్కన పెట్టి బీజేపీకి జై కొట్టారు. ఈటల తీరుతో బీసీ సంఘాలు అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. తమను టార్గెట్ చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చిన ఈటల రాజేందర్ భార్య జమున.. బీసీ నేతగా గుర్తింపు పొందిన వకులాభరణం కృష్ణ మోహన్ పై విరుచుకుపడ్డారు.ఎంగిలిమెతుకుల జీవితం కృష్ణమోహన్ ది అని… ఆయనను చూస్తే ఒక్క ఓటు కూడా పడవని అన్నారు. జమున వ్యాఖ్యలకు మాజీ బిసి కమిషన్ సభ్యుడు  కృష్ణ మోహన్ ఘాటుగానే కౌంటరిచ్చారు. బీసీలను అవమానించారని మండిపడ్డారు. తాను బీసీల కోసం స్కీములు తెస్తే.. ఈటల స్కాములు చేశారని ఆరోపించారు. ఈటల రాజేందర్ భార్య జమునకు కౌంటర్ గా వకుళాభారం కృష్ణ మోహన్ విడుదల చేసిన లేఖను ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాం... చదువుకోండి..  నాపై ఈటల జమున వ్యాఖ్యలు దురహాంకారానికి పరాకాష్ట ఉద్యమ నేతగా నేను బడుగులకు స్కీమ్‌లు పెట్టించాను మంత్రిగా ఈటల బడుగుల భూములు లాక్కొని స్మామ్‌లు చేశారు ఈటల జమున ఆరోపణలు బట్ట కాల్చి మీద వేయడం లాంటిదే నా జీవితం స్పటికంలా పారదర్భ్శకమైంది ఈటల జీవితం అక్రమాస్తులకు నెలవైంది ఎంగిలి మెతుకులు తినే జీవితం నాది కాదు నోటి కాడి బుక్కను లాక్సునే జీవితం మీది నాపై నిందలు మీ కుట్రపూరిత మనస్తత్వానికి నిదర్శనం - డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ దరిమిలా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా తొలిసారిగా ఈటల సతీమణి జమునా రెడ్డి ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చి నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు ఈటల దంపతులు ఇన్నాళ్ళుగా వల్లిస్తున్న ఆదర్శ్భభావాలు, ఆదర్శ జీవితం, కులరహిత సమాజం, ప్రజలందరూ సమానమే అనేవి ఉత్త కహానీలే అని తేలిపోయింది. దశాబ్దాలుగా తెలుగు సమాజంలో బిసి ఉద్యమ నేతగా మంచి గుర్తింపును తెచ్చుకున్న నాలాంటి వాడిపై జమున వ్యాఖ్యలు ఆమెలోని దురహంకారాన్ని ధన అహంకారాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈటల నిజరూపం బయటపడ్డాక సాధికారికంగా నేను రాసే వ్యాసాలు, ఆయనపై నా వ్యాఖ్యలు సహించలేక, బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం వారి అపరిచిత మనస్తత్వానికి నిదర్శనం. దుర్మార్గమైన ఆరోపణ ఏమిటంటే నా కుటుంబాన్ని దీరేదో నెల నెల ఖర్చులు ఇచ్చి ఆదుకుంటున్నట్లు చెప్పడం ఇంతకన్నా అమానవీయం, నిర్లజ్ఞాతనం మరొకటి లేదు. నిజంగా అలాంటి ఉదార స్వభావం మీలో వుంటే, మీ ద్వారా ఎంతమంది బాగుపడ్డారో, ఎన్నికుటుంబాలను నిలబెట్టగలిగారో చెప్పడం సాధ్యమా? మీరే అంతటి ఉన్నత భావాలు కలిగినవారైతే ఈరోజు మీ వెంబడి నియోజకవర్గంలోని ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడానికి కారణమేమై ఉంటుంది.ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఈటల వెంబడి ఒక్కరంటే ఒక్కరు లేకపోవడం ఇంతకన్నాఅవమానం మరేముంటుంది. పైగా మేము ఆదర్శవంతులమని చెప్పుకోవడం ఆత్మహత్యా సద్భశ్యం.ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. నేను విద్యార్థి దశ నుండి ఉద్యమ జీవితం గడుపుతూ రాజకీయాల్లోకి వచ్చాను. నిరంతరం ప్రజల గొంతుకగానే నా జీవితం కొనసాగుతున్నది. మీరు వ్యాపారాల నుండి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలను కూడా వ్యాపారమయం చేశారు. నాడు బిసి నేత ఆర్‌. కృష్ణయ్య నేతృత్వంలో పోరాటాల ద్వారా ఆ వర్గాలకు అనేక “స్మమాలు పెట్టించగలిగాం. అలానా జీవితం పారదర్శకమైంది, త్యాగమయమైంది. మీరేమో వ్యాపారాల నుండి వచ్చారు. రాజకీయాలను,అధికారాన్ని అడ్డం పెట్టుకొని “స్మామొలు చేశారు, ఇది మీ జీవితం. మీరేదో సచ్చీలురు అయినట్లు మాట్లాడితే వాస్తవాలు-అవాస్తవాలు కావు. ఈ నిజం తెలుసుకోండి. ఎంగిలి మెతుకులు తినాల్సిన అగత్యం నాకు లేదు. నా జీవితమే ఆత్మ గౌరవంతో,ఆత్మాభిమానంతో ముడిపడి వుంది. కాగా నేడు మీరు వల్లిస్తున్న ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం, సామాజిక కోణం, కేవలం మీ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే. ఈ విషయం ప్రజలందరి గమనంలో వుంది. “మా ఇంటిలో పొయ్యి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని రాజేందర్‌ గారు చెబుతున్నప్పుడు ఎంత గొప్పవారో అనుకున్నాం”. నేడు మా ఇంటికి వచ్చి తిని పోయిందని వచ్చి పోయిన వారిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. మీ దృష్టిలో బలహీన వర్ణాలు అంటే ఇంత చులకననా? తిండి తిని పోయేవారిలా చూస్తున్నారా? బలహీన వర్గాలంటే తిండి పారేస్తే తిని పోయే వారనే అభిప్రాయమా? మీ మనస్సులో ఇంత సంకుచితత్త్రం ఉందని తెలిస్తే ఎవరూ మీ ఇంటికి రాకపోయేవారు కదా! ఎందుకంటే బలహీనవర్గాలకు ఆత్మాభిమానమే ప్రధానం. తింది లేకున్నా పస్తులు పంటాం. మాకు ఉంటే నలుగురికి పెట్టి తింటాం. ఇటువంటి కొంచెపు బుద్ధులు మాకుందవు. కోట్లు వున్నామీది కొంచపు బుద్ధి. మా ఆత్మాభిమానం సహజంగా ఉంటుంది. “మీ డబ్బు, అధికారం మా ఆత్మాభిమానం ముందు ఎందుకూ పనికిరాదు. పైగా ఎవరిని కోసి చూసినా రక్తం ఎరుపుగానే ఉంటుంది అంటున్నారు. మాకు ఏ వర్గాలపై వివక్షత లేదంటున్నారు. మరోవైపు బహిరంగంగానే అవమానిస్తున్నారు. నాలాంటి వారిపై మీ కువిమర్శలు మీ మనస్తత్వాన్ని మీ ఫ్యూడల్‌ వ్యవహార శైలిని స్పష్టం చేస్తున్నాయి. నిగూఢంగా ఉన్నమీ అసలు రూపాన్ని ప్రజలు ఏనాడో గమనించారు. అందుకే నేడు మీ వెంట ఎవరూ రావడం లేదు. 2004 సంవత్సరంలో ఈటల రాజేందర్‌, నేను ఒకేసారి రాజకీయ జీవితం ప్రారంభించాం. ఆయన వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. నేను బిసిల హక్కుల నేతగా ఉద్యమ జీవితం నుండి కొనసాగింపుగా రాజకీయాల్లోకి వచ్చాను. 2004 లోనే దేశంలోనే అతి చిన్న వయస్సులో బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకమయ్యాను. ఈటల అందివచ్చిన అవకాశంతో ఎమ్మెల్యే కాగలిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఈటల వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నారు. నేను ప్రజాసేవ కొనసాగిస్తూనే ఉన్నాను. 2009 సాధారణ, 2010 ఉప ఎన్నికలలో ఈటలపై రెందుసార్లు కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటీ చేశాను, పరాజయం పాలయ్యాను. 2009 ఎన్నికలలో కేవలం 15 వేల స్వల్ప తేడాతో ఓటమిని చవి చూశాను. ఆ ఎన్నికలలో నా మెజారిటీని చూసి ఈటల ఖంగుతిన్నారు. అప్పుడు ఈ వకుళాభరణం ముఖానికే అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈటలపై అంతగా గట్టి పోటీని ఎవరూ ఇవ్వలేకపోయారు. 2009 ఎన్నికలు నాకు చీకటి రోజులని సంవత్సరాల తరబడి చెప్పుకొని బాధపడుతుందేవాడు. ఈ విషయం తెలిసి కూడా ఈటల జమున ఈ వకుళాభరణం ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా అని మాట్లాడడం హాస్యాస్పదం. ప్రస్తుతం నేను టిఆర్‌ఎస్‌ అభ్యర్థిని నేనే అని ఎక్కడా చెప్పుకోలేదు. వం నుండి ఎలాంటి సంకేతాలు లేవు. అయినప్పటికీ నాపై ఇంతగా తక్కువ చేసి విమర్శించడం ధన గర్వం కాక మరేమవుతుంది. జమున చేసిన వ్యాఖ్యలు ఆమెలోని అవివేకాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి 2018 ఎన్నికలలో నా పూర్తి సహకారాన్ని రాజేందర్‌ ఎందుకోసం తీసుకున్నారు. నెలన్నర రోజులపాటుగా హుజూరాబాద్‌లోనే పూర్తిన్ధాయి మకాం వేసి ఈటల గెలుపు కోసం నాదైన పద్ధతిలో చేసిన కృషిని ఎన్నోసార్లు ఆయన ఎలా అభినందించగలిగారు. ఇది వాస్తవం. కాగా పనీ పాటా లేకుండా నేను తిరుగుతా ఉంటే… ఈటల నాపై అభిమానాన్నిప్రదర్శించి తెలంగాణ ప్రభుత్వంలో బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించడం ద్వారా గుర్తింపు వచ్చిందని చెప్పడం అజ్ఞానం కాక మరేమవుతుంది. నా జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పుకుంటాను. అది 2004 సంవత్సరంలో కేప్టెన్‌ వి.లక్ష్మికాంతరావు (ప్రస్తుత రాజ్యసభ సభ్యులు) నాడు బిసి మంత్రిగా సిఫారసు చేసి నన్ను బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించారు. క్రమంగా నిబద్ధతతో పని చేస్తూ, నాటి ముఖ్యమంత్రి మన్ననలతో ఎమ్మెల్యే బి-ఫారం పొంది పోటీ చేయగలిగాను. పూజయంతో క్రుంగిపోకుండా నాదైన పద్ధతిలో బిసి హక్కుల కోసం నిరంతరం పని చేస్తుందడం జీవితంలో ఒక భాగం చేసుకున్నాను. నాడు కాంగ్రెస్‌ పార్టీలో కూదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాను. పార్టీ అధికార ప్రతినిధిగా టి.వి. చర్చలలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాను. కానీ నేను ఏనాడూ వ్యక్తిగతంగా ఆస్తులు ‘పెంచుకోలేదు సరికదా, ఆస్తులు కోల్పోయాను, అప్పుల పాలయ్యాను.ఇది ముమ్మాటికి వాస్తవం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈటల బడుగుల భూములు గుంజుకున్నారు.నేను అధికారంలో ఉన్నా లేకున్నప్పటికి బిసి వర్ణాల సమగ్ర వికాసానికి కృషి చేస్తూనే వున్నాను.2016 లో నా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ తొలి బిసి కమిషన్‌లో సభ్యుడిగా నియామకం చేశారు. ఆ పదవిలో కూడా నా వర్ణాల అభ్యున్నతికి చిత్తశుద్ధిగా కృషి చేయడం జరిగింది. ఈటల రాజేందర్‌కు నిజంగానే పదవులు ఇప్పించగలిగే శక్తే వుంటే ఇప్పటి వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి రాష్ట్రస్థాయిలో ఎంతమందికి పదవులు ఇప్పించారు. నియోజకవర్గంలోని నాయకులకు ఇదిగో-అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చారు తప్ప ఒక్కరికైనా పదవి ఇప్పించగలిగారా సమాధానం చెప్పాలి. మీ అక్రమ ఆస్తులపై దర్యాస్త జరుపుతుంటే, మీరు జరుపకూడదంటూ గగ్గోలు పెడుతున్నారు.నేను ఏమైనా అక్రమాస్తులు సంపాదించి వుంటే, ఆస్తులు పెంచుకొని వుంటే దర్యాస్త జరుపవలసిందిగా డిమాండ్‌ చేస్తున్నాను. ఇది వాస్తవం.మీరు ప్రతిసారి కెసిఆర్‌ బొమ్మ పెట్టుకొని గెలిచారు.ఇప్పుడు పదిహేదేండ్లు ఎమ్మెల్యేగా, ఏదేండ్లు మంత్రిగా ఉన్న తరువాత కూడా మీ బొమ్మ చూసి ఓట్లేసే దిక్కులేదు. అందుకే కాంగ్రెస్‌, బిజెపి నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.టిఆర్‌ఎస్‌ నుండి ఎవరికి టికెట్‌ ఇచ్చినా కెసిఆర్‌ బొమ్మ పెట్టుకొని గెలుస్తాం. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుమని సవాల్‌ చేస్తున్నాం బలహీన వర్గాల సమున్నతికి మీరు చేసింది ఏమిటో మీ మనస్సాక్షికి తెలుసు. రేపటి ఎన్నికలలో బలహీన వర్గాలే మీ అహంకారాన్ని వదలదీసి బుద్ధి చెబుతారు. ఇది రేపటి వాస్తవం.. - డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

కరోనా పుట్టుకపై సంచలన నిజాలు! 

ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కరోనా మహమ్మారి వైరస్ పుట్టుకపై  నివ్వరపోయే అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, దాని విస్తరణ గురించి భయంకరమైన వాస్తవాలను బ్రిటన్‌ పత్రిక‘డైలీ మెయిల్‌’ బహిర్గతం చేసింది. కరోనా వైరస్‌ దానికదే ప్రకృతిలో సహజంగా పుట్టలేదని, ఆ వైరస్‌ను చైనానే ల్యాబ్‌లో సృష్టించిందని సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకుబ్రిటిష్‌ ప్రొఫెసర్‌ ఆంగస్‌ డాల్‌గ్లిశ్‌, నార్వే శాస్త్రవేత్త డాక్టర్‌ బిర్గర్‌ సోరెన్సెన్‌ సంయుక్తంగా జరిపిన పరిశోధన అంశాలను వెల్లడించింది.  చైనాలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ల్యాబ్‌లో నిర్వహిస్తున్న ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులో భాగంగా కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు కృత్రిమంగా ఈ వైరస్‌ను సృష్టించారు.. దీనికోసం తమ దేశంలోనే గుహల్లో ఉండే గబ్బిలాల్లోని కరోనా వైరస్‌ ప్రాథమిక స్పైక్‌ ప్రొటీన్‌ను ఆధారంగా తీసుకున్నారని తమ ప్రచురణలో తెలిపింది. ఈ అధ్యయనం సైన్స్‌ పత్రిక ‘క్వార్టర్లీ రివ్యూ ఆఫ్‌ బయోఫిజిక్స్‌ డిస్కవరీ’లో త్వరలో ప్రచురితం కానుంది.  అంకాలజీ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిశ్‌ హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ రూపకల్పనలో విశేష కృషి చేసిన వారిలో ఒకరు. వైరాలజిస్ట్‌గా ఉన్న సోరెన్సెన్‌ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ‘బయోవాక్‌-19’ వ్యాక్సిన్‌ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రస్తుతం కరోనా వైరస్ పుట్టుకపై డాల్‌గ్లిశ్‌ ప్రత్యేక పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమం చైనా దుర్భుద్ధి మరోసారి బహిర్గతమైంది. సహజంగా ఏర్పడిన వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లలో ఒకటి లేదా రెండు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఉంటాయి. అత్యంత అరుదుగా మూడు ఉండొచ్చు. అయితే, కరోనా స్పైక్‌ ప్రొటీన్‌లో నాలుగు అమైనో యాసిడ్‌లు ఉన్నాయి. సాధారణ వైరస్‌ను ల్యాబ్‌లో కృత్రిమంగా తీవ్రతరం చేస్తేనే నాలుగు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఏర్పడుతాయి. ఇవి మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మామూలు వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుంది. కృత్రిమ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని ఆధారంగా కరోనా వైరస్‌ను కృత్రిమంగా సృష్టించారని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ మూలలపై చర్చ కొనసాగుతున్న సమయంలో  ‘డైలీ మెయిల్‌’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. నోబెల్ బహుమతి గ్రహిత, జపాన్ వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. జంతువులు, వైరస్‌లపై గత నలభై సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నానని, కరోనా వైరస్ ఖచ్చితంగా సహజమైనది కాదని, ఇది ముమ్మాటికి తయారు చేయబడిందని హోంజో చెబుతున్నారు. అంతేకాదు డాక్టర్ తసుకు హోంజో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవాన్ని కూడా వివరించారు. ఆ ప్రయోగశాలలో పనిచేసే సిబ్బంది అందరితో పరిచయం ఉందని, కరోనావైరస్ కనిపించిన తరువాత వారందరినీ తాను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా వారి ఫోన్‌లన్నీ స్పందించడం మానేసాయని చెప్పుకొచ్చారు. అంటే ఈ ల్యాబ్ లో పనిచేసిన టెక్నీషియన్లందరూ కరోనా వైరస్ బారిన పడి చనిపోయారని అర్థమవుతోందంటూ ఆయన సంచలన విషయాలను మీడియాతో పంచుకున్నారు. కరోనా వైరస్ సహజంగా పుట్టుకొచ్చింది కాదని, ఈ ప్రాణాంతక మహమ్మారిని చైనా దేశమే సృష్టించి ప్రపంచ దేశాల మీదకు వదిలిందని ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు. ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ను మానవ పరిణామక్రమాన్ని రక్షించడానికి ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టులుగా చెబుతారు. కొత్తగా వెలుగుచూసే వైరస్‌లు భవిష్యత్‌లో ఎలా పరిణామక్రమం చెందొచ్చు? ప్రమాదాలు, నివారణ మార్గాలపై ఈ ప్రాజెక్టుల్లో భాగంగా పరిశోధిస్తారు. దీని కోసం సహజంగా పుట్టిన వైరస్‌ శక్తిని కృత్రిమంగా పెంచుతారు. అయితే, ఈ ప్రాజెక్టులతో ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వీటిపై నిషేధం విధించారు. చైనా మాత్రం వీటిని కొనసాగించింది. ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులను అత్యంత కట్టుదిట్టమైన ల్యాబ్‌లలో నిర్వహించాలి. వ్యాక్సిన్ల తయారీకి వాడే బయోసేఫ్టీ లెవల్‌ 2, 3 ల్యాబ్స్‌ వీటికి సరిపోవు. అయినప్పటికీ వూహాన్‌ ల్యాబ్‌లోని బయోసేఫ్టీ లెవల్‌ 3 విభాగంలో చైనా పరిశోధకులు కరోనాను కృత్రిమంగా సృష్టించడంతో వైరస్‌ లీక్‌ అయింది. అయితే, దీన్ని చైనా అధికారులు కావాలనే లీక్‌ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రయోగాలను వ్యతిరేకించిన ల్యాబ్‌లోని కొందరు శాస్త్రవేత్తలను చైనా అధికారులు బెదిరించారు. మాట వినని మరికొందరు కనిపించకుండాపోయారు. లీకైన కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం అంచనాలకు మించడంతో చైనా ఆత్మరక్షణలో పడింది. దీంతోపాటు వైరస్‌ పుట్టుకపై ప్రపంచ దేశాలు ప్రశ్నలు లేవనెత్తడం, దర్యాప్తునకు ఒత్తిడి చేయడంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ‘రివర్స్‌-ఇంజినీరింగ్‌ (రెట్రో ఇంజినీరింగ్‌)’ సాంకేతికతతో కరోనా వైరస్‌ సహజంగానే ఏర్పడినట్టు నకిలీ ఆధారాలను సృష్టిద్దామని చైనా అధికారులు ప్రయత్నించారు. అందుకే తమదేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు బాధితుడిలో కనిపించిన వైరస్‌ నమూనాల సమాచారాన్ని కొంతకాలం విడుదల చేయలేదు. కొన్ని నెలల తర్వాత ఆ డేటాను విడుదల చేశారు. అయితే అది కూడా అంత నమ్మశక్యంగా లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

13 ఏళ్ళ మైనర్ బాలిక పై.. పెద్దనాన్న..

ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్అ. తని పేరు రాములు. అతని వయసు 50 సంవత్సరాలు. అతను ఒక కసాయి వాడు. మానవ మృగం. మానవత్వం మరిచిన మూర్ఖుడు, రక్త సంబంధం విస్మరించిన విషనాగు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాందుడు.   ఓ  మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నగరంలో నివాసం ఉండే ఓ మహిళ పొట్ట కూటి కోసం ఇండ్లలో పనిచేస్తోంది. ఆమె భర్త లేబర్‌గా వర్క్ చేస్తున్నాడు. వారి 13 ఏళ్ల అందమైన కూతురు ఉంది. ఆ అమ్మాయి ఆరో తరగతి చదువుతోంది. వాళ్ళ ఇంట్లో టీవీ లేదని బాలిక టీవీ చూసేందుకు అప్పుడప్పుడు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రాములు అనే నీచుడు, మృగం ల ప్రవర్తించాడు. కూతురు వరస అయితది అని కూడా ఆలోచించకుండా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్దుడు. అంతటితో ఆగక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని చంపేస్తానని ఆ బాలికను బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది. బాధను కనిపించకుండా దాచగలం.. మాట వదిలేయగలం.. దెబ్బను మాన్పగలం.. కానీ గర్భం కదా.. ఆ బాలిక దాచలేక పోయింది. ఈ ఘటన జరిగిన  కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం తల్లిదండ్రులు గమనించారు. ఏంటని అడిగారు అయినా ఆ బాలిక జరిగింది చెప్పలేదు. మరోవైపు ఈ నెల 24న బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు పరీక్షలు చేసిన తర్వాత ఆమె గర్భవతి అని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చాక.. తల్లిదండ్రులు ఆ బాలికను గట్టిగా నిలదీశారు. ఆ బాలిక అమ్మను పట్టుకుని బోరున ఏడుస్తూ... బాలిక భయపడుతూ అసలు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. పెద్దనాన్న రాములు తనపై అత్యాచారం చేసినట్టు పేర్కొంది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో ఎస్ఐ సెటిల్ మెంట్​కు ప్రయత్నించడం వల్లే ఘటన ఆలస్యంగా బయటకు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

జగన్ తో సాయి రెడ్డి కటీఫ్! బీజేపీ డైరెక్షన్ లో వెన్నుపోటు? 

విజయసాయి రెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్ తర్వాత నెంబర్ టు స్థానం విజయసాయి రెడ్డిదేనని ప్రచారం ఉంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సీఎంవోలోనూ సాయి రెడ్డిదే హవా అని చెబుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఏ1గా జగన్ ఉండగా.. ఏ2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కేసుల్లో జగన్ తో పాటు సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపారు సాయిరెడ్డి. అందుకే ఆయనకంత ప్రాధాన్యం అంటారు. అయితే  ప్రస్తుతం మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, సీఎంవో నుంచి వస్తున్న లీకుల ఆధారంగా విజయసాయి రెడ్డిని సీఎం జగన్ దూరం పెట్టారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎంపీ విజయసాయి రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాకపోవడం, ముఖ్యమంత్రిని కలవకపోవడం ఇందుకు బలాన్నిస్తున్నాయి. సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఎక్కడా సాయి రెడ్డి  కనిపించ లేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే విజయసాయి రెడ్డి... ముఖ్యమైన ప్రోగ్రామ్ లో సైలెంట్ గా ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయి రెడ్డిని తన దగ్గరకు రానివ్వడం లేదని తెలుస్తోంది. అందుకే అతను విశాఖకే పరిమితం అయ్యారని అంటున్నారు. విశాఖకు సంబధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీ ప్రోటోకాల్ ప్రకారమే తప్ప ఇతరత్రా గతంలోగా విజయసాయికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు. గతంలో విశాఖలో ఏం జరిగినా అంతా సాయిరెడ్డి చెప్పినట్లే ఉండేది. కాని ఇప్పుడా సీన్ కనిపించడం లేదు. ఇటీవలే తూర్పు తీరంలో యాస్ తుఫాన్ వచ్చింది. ఏపీపైనా ప్రభావం పడింది. అయితే తుపానుపై జరిగిన సమీక్షల్లో విజయసాయి ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు సీఎస్ ఆధిత్యనాథ్ ను విశాఖ పంపించారు సీఎం జగన్. సీఎస్సే రెండు రోజుల పాటు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విజయసాయి రెడ్డి విశాఖలోనే ఉన్నా..  తుపాను సమయంలో ముఖ్యమంత్రి అతన్ని పట్టించుకోకపోవడం చర్చగా మారింది.   గత సంవత్సరం ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైన సమయంలోనూ ఎంపీ విజయసాయిని పక్కన పెట్టారు సీఎం జగన్. విజయవాడ నుంచి జగన్ తో పాటు ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ వచ్చేందుకు విజయసాయి ప్రయత్నించారు. అయితే విజయసాయిని కిందకు దించి వైద్య శాఖ మంత్రి అళ్లనానిని తనతో పాటు తీసుకెళ్లారు జగన్. ఈ ఘటన అప్పడు సంచలనంగా మారింది. విజయసాయిని ఆగమని జగన్ చెబుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అప్పటి నుంచే సాయి రెడ్డిని జగన్ క్రమంగా దూరం పెడుతున్నారని, ఇప్పుడా గ్యాప్ మరింతగా పెరిగిపోయిందని తెలుస్తోంది. జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి తాడేపల్లి రావడం లేదని అంటున్నారు. సాయి రెడ్డికి షాకిచ్చిన జగన్.. అతనికి గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  జగన్ రెడ్డి , విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్న సమయంలోనే మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. జగన్​మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సీబీఐ, 6 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్​షీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసుల సంఖ్య 18కి చేరాయి. తాజా కేసుకు సంబంధించి ఈడీ  గత ఏడాదిలోనే ఛార్జ్​షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం దానిని రిజెక్ట్ చేసింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నమోదైన 18వ కేసులో జగన్‌ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అనూహ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చేసిన లాబీయింగ్ వల్ల ఇలా జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ తో విజయసాయి రెడ్డి సంబంధాలు పెంచుకోవడం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికి కారణమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.  తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగన్ అక్రమాస్తుల కేసులో ఏదైనా జరగవచ్చని, జగన్ పై కోపంతో విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారినా ఆశ్చర్యం లేదనే టాక్ కూడా నడుస్తోంది. బీజేపీ పెద్దలతో కలిసి విజయసాయి రెడ్డి.. జగన్ పై  కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన కూడా  కొందరు వైసీపీ నేతల్లో ఉందంటున్నారు. అందులో భాగంగానే  గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన కేసులో సాయి రెడ్డి పేరు తొలగించారనే వాదనలు వస్తున్నాయి. ఇక బెయిల్ రద్దై జగన్ జెైలుకు పోతే ముఖ్యమంత్రి కావాలని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. ఈ సమయంలో  మంత్రి పెద్దిరెడ్డికి  విజయసాయి రెడ్డి తోడైతే ఏపీలో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా వైసీపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని, సీఎం జగన్ కేసుల్లో ఏదైనా జరగవచ్చనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  

జగన్ రెండేళ్ళ  పాలన ఏమి చేపుతోంది ?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్ళు పూర్తయ్యాయి ... ఈ రెండేళ్లలో పభుత్వం ఏదైనా కొత్తగా, గొప్పగా సాధించిందా అంటే అలాంటిదీ ఏదీ లేదు.ప్రజలను మానసికంగా బిచ్చగాళ్ళను చేయడంలో మాత్రం ముఖ్యమంత్రి ముందుడుగు వేశారు. రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు ఎదో ఒక సంక్షేమ పథకం ప్రయోజనం పొందుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి సగౌరవంగా ప్రకటించుకున్నారు. కానీ, సక్షేమ పథకాల పరిధి విస్తరణ అభివృద్ధికో, సుపరిపాలనకో సంకేతం కాదు,అది అభివృద్ధి రాహిత్యానికి నిదర్శనం. నిజమే, సంక్షేమ రాజ్యంలో, పేద ప్రజలకు సంక్షేంమ ఫలాలు అందివ్వడం, పేద ప్రజల ఆకలి తీర్చడం, వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు తీసుకుపోవడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం.అందులో మరో మాటకు,మరో అభిప్రాయానికి తావు లేదు.  అయితే, సంక్షేమమే సర్వసం కాదు, కారాదు. సంక్షేమం, గీత దాటితే సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే, సంక్షేమం,  అభివృద్ధి రంగాలకు సమాన ప్రధాన్యత ఇస్తూ , రెండూ రెండు కళ్ళుగా పరిపాలన సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి. అలాకాదని, సంక్షేమమే సర్వస్వం  అన్న రీతిలో పాలన జరిగితే  అది దీర్ఘ కాలంలో అనర్ధాలకు దారి తీస్తుంది.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ‘నవరత్న’ పాలనలో జరుగుతున్నది అదే... రాష్ట్రంలో ఇప్పటికే తలకో లక్షన్నర  రూపాయల అప్పు ఉందని లెక్కలు  చెపుతున్నాయి. అయినా, అప్పులే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి పరిపలాన్ సాగుతోంది. కొత్తగా బడ్జెట్’లో భారీ మొత్తని అప్పుల పద్దులో చూపారు. మరోవంక దేవుని ఆస్తులు సహా ప్రభుత్వ అస్తులను అయినకాడికి అమ్ముకునేందుకు వెనకాడడం లేదు. అందితే అప్పు లేదంటే  అమ్మకం అన్న రీతిగా జాన్మోహన్ రెడ్డి పళన సాగుతోంది.  అందుకే ఆర్థిక వేత్తలు, ఆర్థికరంగ నిపుణులు , రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా అంచులకు చేరిందని హెచ్చరిస్తున్నారు.  ఒకప్పుడు., ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత సంక్షేమానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న వైఎస్సార్, అనర్హులకు సంక్షేమ ఫలాలు అందడం అనర్ధాలకు దారి తీస్తుందని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన ‘ఎట్లో పారేసినా ఎంచి పారేయాలనే’ సామెతను గుర్తు చేశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి,మాత్రం ఓట్ల వేటకు సంక్షేమమనే ముద్దు పేరు తగిలించి, ప్రజల సొమ్ముతో ప్రజల ఓట్లు కొనే, కొత్త రకం క్విట్ ప్రో సాగిస్తున్నారు. అదలా ఉంటే రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి కొత్త నిర్వచనం ఒకటి చెప్పారు. నాలుగు బిల్డింగులు కట్టడం, నాలుగు ప్రాజెక్టులు నిర్మాణం చేయడం అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే, నిన్నటి కంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపు ప్రజలు మెరుగైన జీవనం సాగిస్తున్నారా లేదా ,అనేదే అభివృద్ధికి అసలైన నిర్వచనం అని చెప్పారు.  నిజమే కావచ్చును, ప్రజలజీవన ప్రమాణాలు మెరుగు పడడమే, అభివృద్ధికి అసలైన నిర్వచనం. అయితే, జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా ... తలసరి ఆదాయం పెరిగిందా.. దారిద్ర్య రేఖకు దిగువున్న ఉన్నపేదలు గీత దాటి, పేదరికం నుంచి బయట పడ్డారా ? ఈ రెండేళ్లలో పేదరికం ఎంత మేర, ఎంత శాతం తగ్గింది?  ప్రభుత్వం ఇలాంటి అంశాలకు సంబంధించిన గణాంకాలను ప్రజల ముందుంచి, ఇదీ రెండేళ్లలో సాధించిన ప్రగతి అని చెప్పుంటే, అది విన సొంపుగా ఉండేది.  కానీ, ఆయన తమ రెడేళ్ళ పాలనపై విడుదల చేసిన పుస్తకంలో కానీ, ఆ పుస్తకం విడుదల  సందర్భంగా చేసిన  ప్రసంగంలో కానీ, అలాంటి వివరాల జోలికి పోలేదు, , రెండేళ్ళ పాలనలో  ఇచ్చిన హామీలలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామ‌ని, రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉందన్నారు. 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు.ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించ గలిగామని తెలిపారు.  అదే సమయంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోంది. చివరకు, సంక్షేమ పథకాల అమలుకు కూడా ప్రభుత్వం అప్పుల మీదనే ఆధారపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో   వైఎసార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి చాలా ముఖ్యమైన పథకాలు . ఈమూడు పధకాల అమలుకు అవసరమయ్యే, రూ.16,890 కోట్లను ప్రభుత్వం  రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వివిధ సంస్థల నుంచి రుణాలను సేకరిస్తోంది. ఆర్థిక పరిస్థితి ఇంత అస్తవ్యస్తంగా ఉంటే, ఇతరత్రా పరపాలన ప్రమాణాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి  ఎంత అద్వానంగా ఉందో వేరే చెప్పనక్కర లేదు. ప్రతిపక్ష నాయకులపైనే కాదు, సొంత పార్టీ ఎంపీ పై కూడా దేశ ద్రోహం కేసు పెట్టి,చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతోంది. కరోనా నియంత్ర, చికిత్సల విషయంలో ప్రభుత్వం చేతులేత్తేసింది. దేశంలో తగ్గుముఖమ పట్టినా,రాష్ట్రంలో పరిస్థితి మాత్రం  అందుకు భిన్నంగా ఉంది.  అవినీతి విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఇందుగలదు అందు లేదు అనే సందేహం లేకుండా అన్నిటా అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుక నుంచి , మద్యం వరకు అన్నిటా దోపిడీ దేదీప్యమానంగా వెలిగి పోతోంది.. అయినా ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకుని పలు తాగీ పిల్లల .. అణా బాగుంది అనే భ్రమల్లో వుంది ..

బీజేపీ గూటికి ఈట‌ల‌! కేసీఆర్ కోరుకున్నది ఇదేనా ?

బ‌ల‌మైన బీసీ వాయిస్‌.. ఇక‌పై కాషాయ వాయిస్‌గా మారిపోనుంది. ఈట‌ల రాజేంద‌ర్ భుజాల‌పై నుంచి గులాబీ కండువ తొల‌గిపోయి.. కాషాయ కండువ వ‌చ్చి చేరుతోంది. ఈట‌ల క‌మ‌లం తోట‌లో విక‌సించ‌బోతున్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్ ప‌క్క సీట్లో కూర్చొనే ఈట‌ల రాజేంద‌ర్.. ఇక‌పై బండి సంజ‌య్ ప‌క్క సీట్లో ఆసీనులు కానున్నారు. అధికార పార్టీ ద‌ర్పం.. భారీగా మందీమార్బ‌లం ఉండ‌క‌పోయినా.. క‌మ‌లం దండే ఆయ‌నకు అండాదండా.  కొత్త పార్టీతో సింహం.. సింగిల్‌గా వ‌స్తుంద‌నుకున్నారు. బీసీల‌ను ఏకం చేసి.. గ‌డీల పాల‌న‌కు వ్య‌తిరేకంగా దొర‌పై దండ‌యాత్ర చేస్తారని భావించారు. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, కోదండ‌రాం సారు, తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. ఇలా భావ‌సారుప్యులంద‌రినీ క‌లుపుకొని.. క‌లిసిక‌ట్టుగా తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త జెండా ఎగ‌రేస్తారంటూ లీకులొచ్చాయి. క‌నీసం.. కాంగ్రెస్‌లోనైనా క‌లిసిపోతార‌ని.. రేవంత్‌రెడ్డితో క‌లిసి.. కేసీఆర్ దుమ్ము దులిపేస్తార‌ని ఆశించారు. ఇలా ఎన్నెన్నో అనుకున్నారు.. అనుకున్న‌వ‌న్నీ అవుతాయాయేం.  చివ‌రాఖ‌రికి ఈట‌ల ఇలా బీజేపీ తీర్థం కోసం ఢిల్లీ వెళ్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లే. కొద్ది రోజుల ముందు వ‌ర‌కూ.. స్వ‌యంగా ఈట‌ల సైతం తాను బీజేపీలో చేరాల్సి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలే. ఇదంతా.. కేసీఆర్ స్కెచ్ అని.. గులాబీ బాస్ ప‌న్నిన త్రిశూల వ్యూహంతోనే.. ఇలా జ‌రిగింద‌ని అంటున్నారు. ఈట‌లను చ‌క్ర‌బంధనంలో ఇరుకించి.. అందులో నుంచి బ‌య‌ట ప‌డేందుకు కేసీఆర్ వ‌దిలిన ఏకైక మార్గ‌మైన బీజేపీలో చేర‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఈట‌లకు తీసుకొచ్చార‌నేది విశ్లేష‌కుల మాట‌.  కొత్త పార్టీ పెట్ట‌డ‌మంటే పాన్‌డ‌బ్బా పెట్టినంత ఈజీ కాదంటూ గ‌తంలోనే ఈట‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్‌. అయినా, ఈట‌ల వెన‌క్కి త‌గ్గ‌లే. కొత్త పార్టీ స‌న్నాహాలు మాన‌లే. చూసి చూసి.. ఈట‌ల‌పై వేటు వేసేశారు. కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసేశారు. కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. పార్టీ నుంచి వెళ్ల‌గొట్ట‌క‌పోయినా.. ఆయ‌నే త‌నంత‌ట తాను వెళ్లిపోయేలా చేస్తున్నారు. రేపేమాపో ఈట‌ల టీఆర్ఎస్‌ను వీడ‌టం ఖాయం. సరే ఈటల బయటకైతే వస్తారు. మ‌రి, వాట్ నెక్ట్స్? ఈట‌ల ముందు మూడు ఆప్ష‌న్స్ ఉన్నాయి..  1. సొంత పార్టీ పెట్టడం. 2. కాంగ్రెస్‌లో చేర‌డం. 3.బీజేపీలో చేరడం.  ఈ మూడు ఆప్ష‌న్స్‌లో కేసీఆర్‌కు ఇష్ట‌మైన‌ది.. మూదో ఆప్ష‌న్ అయిన ఈట‌ల బీజేపీలో చేర‌డం. ఇప్పుడు స‌రిగ్గా అలానే జ‌రుగుతుండ‌టం కేసీఆర్ వ్యూహ ఫ‌లిత‌మే అంటున్నారు. కేసీఆర్ కేబినెట్ నుంచి గెంటేశాక‌.. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు ఈట‌ల స‌న్నాహాలు ముమ్మ‌రం చేశారు. ఆ విష‌యం తెలిసి.. కేసీఆర్ మ‌రింత‌ దూకుడు పెంచారు. ఈటల మీదనే కాకుండా.. ఆయ‌న కొడుకు నితిన్‌రెడ్డి మీద వ‌చ్చిన‌ భూకబ్జా ఆరోప‌ణ‌ల‌పై విచారణకు ఆదేశించారు. ఏ క్షణంలోనైనా ఈటలను, ఆయ‌న కొడుకును అరెస్టు చేస్తారని ప్రచారం చేయించారు. త‌ద్వారా కొత్త పార్టీ పెడితే.. ఉనికే లేకుండా చేస్తామ‌నేలా ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేసుల ఉక్కిరిబిక్కిరితో అవాక్కైన ఈట‌ల‌.. కొత్త పార్టీతో పోరాడితే.. కొండ‌లాంటి కేసీఆర్‌ను ఢీకొట్ట లేమ‌ని భావించారు. అందుకే, కొత్త పార్టీ ఆలోచ‌న‌ను ఇక్క‌డితో వ‌దిలేశారు. ఇక.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌నూ న‌మ్ముకోలేని దుస్థితి. హ‌స్తం పార్టీలో ఎవ‌రు ఎవ‌రినీ ప‌ట్టించుకోరు. తాను కాంగ్రెస్‌లో చేరితో గుంపులో గోవింద‌లా.. దిక్కూదివాణం లేకుండా పోతాన‌ని భావించారు. ఇప్ప‌టికే కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు సైతం ఈట‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం వెనుక ఆ పెద్దాయ‌నే ఉన్నార‌ని టాక్‌. అందుకే, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినా ఈటల అటువైపు ఆస‌క్తి చూప‌లేదు. రేవంత్‌రెడ్డికే టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి రాకుండా అడ్డుకుంటున్న పార్టీ అది. అందులోనూ రేవంత్‌పైనా కేసులున్నాయి. ఇక త‌న‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌ని కాంగ్రెస్‌ను జాబితా నుంచి తీసేశారు ఈట‌ల‌. కేసీఆర్‌కూ కావాల్సింది ఇదే.  ఇక ఈట‌ల ముందు ఉన్న ఏకైక ఆప్ష‌న్‌.. బీజేపీనే. అది ఈట‌ల కోరుకుంది కాదు. కేసీఆరే త్రిశూల వ్యూహంలో భాగంగా ఈట‌ల‌కు వ‌దిలిన ఆప్ష‌న్‌. సొంత పార్టీ, కాంగ్రెస్ అనే రెండు ఆప్ష‌న్స్ లేకుండా కేసీఆర్ ఈట‌ల‌ను క‌ట్ట‌డి చేసి.. అంతిమంగా ఆయ‌న బీజేపీలో చేరక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆరే అంటున్నారు. ఇక్క‌డో డౌట్ రావొచ్చు. ఈటల బీజేపీలో చేరితే కేసీఆర్‌కు ఏం లాభం అనుకోవచ్చ. ఇక్క‌డే ఉంది కేసీఆర్ చాణ‌క్యం. కేసీఆర్ స్కెచ్ సామాన్యుల‌కు అంత ఈజీగా అర్థం కాదు మ‌రి. తెలంగాణలో ఈటల సొంత పార్టీ పెడితే.. బడుగు బలహీనవర్గాల మద్దతుతో.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తో.. ఏదో ఒకరోజు సక్సెస్ అయ్యే చాన్స్ త‌ప్ప‌కుండా ఉంటుంది. అందుకే సొంత‌పార్టీ పెట్ట‌నీయ‌కుండా.. కేసుల‌తో అదిరించి.. బెదిరిపోయేలా చేశాడు. ఇక‌, ఈట‌ల కాంగ్రెస్‌లోకి వెళ్లినా కేసీఆర్‌కు క‌ష్ట‌మే. తెలంగాణ గ్రామాల్లో ఇప్ప‌టికీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ప‌టిష్టంగానే ఉంది. ఆ పార్టీకి బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇటు రేవంత్‌రెడ్డి, అటు ఈట‌ల రాజేంద‌ర్ క‌లిస్తే.. ఫీనిక్స్ ప‌క్షిలా కాంగ్రెస్ మ‌ళ్లీ పుంచుకోవ‌డం ఖాయం. గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే అధికారంలోకి వచ్చే అవకాశమూ లేక‌పోలేదు. అందుకే, ఈటల బీజేపీలోకి వెళ్తేనే కేసీఆర్‌కు లాభం. అదెలా అంటే... తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డాలంటే ఇంకా చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. ఆ పార్టీకి అర్బ‌న్ పార్టీ అనే ముద్ర ఎలానూ ఉండ‌నే ఉంది. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కాషాయ జెండాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఎదురైన వ‌రుస ఓట‌ములు తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌మెంతో చెప్ప‌క‌నే చెప్పాయి. అలాంటి బీజేపీలో ఈట‌ల రాజేంద‌ర్ చేరినా.. పెద్ద‌గా ఇప్ప‌టికిప్పుడు ఆ పార్టీకి క‌లిగే అడ్వాంటేజ్ పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎలానూ బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌రు. ఈట‌ల బీజేపీలో చేరితే.. టీఆర్ఎస్ నుంచే కాకుండా.. కాంగ్రెస్ నుంచీ ఎదురుదాడి త‌ప్ప‌దు. ఈట‌ల చేరిక వ‌ల్ల‌.. బీజేపీ ప‌ర‌ప‌తి కాస్త పెరుగుతుందే కానీ.. ఇప్ప‌టికిప్పుడు పాద‌ర‌సంలా స‌ర్రున పైకి ఎదిగే పార్టీ అయితే కాదు. ఈట‌ల‌తో బీజేపీ కాస్త బ‌ల‌ప‌డితే.. ఆ మేర‌కు కాంగ్రెస్ ప‌ర‌ప‌తి దిగ‌జార‌డం ఖాయం. అప్పుడు.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీజేపీలు రెండు స‌మాన స్థాయి పార్టీలుగా మారుతాయే కానీ.. అవి టీఆర్ఎస్ స్థాయికి ఎదిగే అవ‌కాశం లేద‌నేది కేసీఆర్ ప‌న్నిన త్రిశూల వ్యూహం చ‌తుర‌త‌. ప్ర‌తిప‌క్షంలో ఆధిప‌త్యం కోసం.. ఇటు ఈట‌ల‌, అటు రేవంత్ మ‌ధ్య పోరు సాగుతుంద‌ని.. ఆ రెండు పార్టీల‌కు అంద‌నంత ఎత్తున టీఆర్ఎస్ నిల‌బ‌డి.. సుల‌భంగా మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది కేసీఆర్ చాణ‌క్యం. అలా, గులాబీ బాస్ ఆడుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఈట‌ల కేవ‌లం పావు మాత్ర‌మే. ఆటంతా కేసీఆర్‌దే అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు బీజేపీనే బెస్ట్ ఆప్ష‌న్‌గా మార‌డానికి కార‌ణం కేసీఆర్ ప‌న్నిన త్రిశూల వ్యూహ‌మే కార‌ణ‌మంటూ రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కంట్లో డ్రాప్స్ వద్దన్న సర్కార్ 

పది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, ఆనందయ్య ఇస్తున్న మందులకు ఓకే చెప్పింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌ మందుల పంపిణికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కంట్లో వేసు మందుపై ఇంకా  నివేదికలు రావాల్సి ఉందని, ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేలిందని వెల్లడించింది. ఆనందయ్య మందు వాడితే హాని లేదనిసీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఇచ్చిందని ఏపీ సర్కార్ తెలిపింది.   కాన  ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నివేదికలు. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు  రావడానికి మరో 2–3 వారాల సమయం  పట్టనుంది.అందుకే ఆ మందును పక్కన పెట్టింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని సూచించింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌పాజిటివ్‌ రోగులు కృష్ణపట్నం రావొద్దన్న ప్రభుత్వం.. వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్లాలని సూచించింది.దీంతో  కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందని వెల్లడించింది. మందు పంపిణీ సందర్భంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశించింది.  అంతకుముందు ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆనంద‌య్య ఔష‌ధం తీసుకున్న త‌ర్వాత  130 మంది ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకున్నార‌ని ప్రభుత్వ లాయర్ చెప్పారు.  మందుపై ఆయుష్ నివేదిక ఇంకా రాలేద‌ని చెప్పారు. దీనిపై స్పందించిన ఆనంద‌య్య త‌ర‌ఫు న్యాయ‌వాది 130 మంది ఆసుప‌త్రిలో చేరితే దానిపై కేసు ఎందుకు పెట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు. అస‌లు ఔష‌ధం పంపిణీకి ప్ర‌భుత్వ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఔష‌ధాన్ని పంపిణీ చేసే హ‌క్కు ఆనంద‌య్య‌కు ఉంద‌ని ఆయ‌న వివ‌రించారు. ప‌లు ఫార్మా సంస్థలు ఒత్తిడి తీసుకువ‌స్తున్నందునే ఆనందయ్య ఔష‌ధాన్ని పంపిణీ చేయ‌కుండా అడ్డుకుంటున్నార‌ని అన్నారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు విచార‌ణ‌ను  మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది. 

చెత్తగా కొవిడ్ వ్యాక్సిన్ పాలసీ! కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం 

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కరోనా వ్యాక్సిన్ విధానాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. టీకాల కొరత, సమీకరణ, ధరలు, విధానాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించింది. 45 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం డోసులు ఇచ్చి.. 18–44 ఏళ్ల వారికి మాత్రం 50 శాతమే ఎందుకు ఇస్తున్నారని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్.ఎన్. రావు, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ ల త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. ‘‘45 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రమే టీకాలను సమీకరిస్తోంది. కానీ, 18 నుంచి 44 ఏళ్ల వారికి మాత్రం సగం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. వాటి ధరలనూ కేంద్రమే నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పోను మిగతా డోసులను ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వవచ్చని ఆదేశాలూ ఇచ్చింది. ఏ ప్రాతిపదికన ఈ విధానాలను రూపొందించారు?’’ అని ప్రశ్నించింది. 45 ఏళ్లు దాటిన వారిలోనే కరోనా మరణాల ముప్పు ఎక్కువుందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్ లో 45 ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది చనిపోతున్నారని కోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు కేవలం 45 ఏళ్ల పైన వారి కోసమే కేంద్రం టీకాలను ఎందుకు సమీకరిస్తోంది? అని ప్రశ్నించింది. టీకాల కోసం కొవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధననూ ప్రశ్నించింది. ఈ నిబంధన వల్ల ఇంటర్నెట్ అంతంతమాత్రంగానే ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సరిగ్గా సాగదని అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కొవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సవాలుతో కూడుకున్నదేనని ధర్మాసనం కామెంట్ చేసింది.గ్రామస్థులు సమీపంలోని కంప్యూటర్ కేంద్రానికి వెళ్లి కొవిన్ లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ సమాధానంపై సుప్రీం కోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అది నిజంగా సాధ్యమయ్యేదేనా? అని ప్రశ్నించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వలస కూలీలకు అది సాధ్యం కాని పని అని అసహనం వ్యక్తం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వ్యాక్సిన్ల సమీకరణ కోసం ఫైజర్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, అవి సఫలీకృతమైతే ఇంకా ముందుగానే వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని వెల్లడించింది. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం కూడా పెరిగిందని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. 

లాక్ డౌన్ లో బోరు.. ఉరి సీన్ ప్లాన్.. 

కరోనా, లాక్ డౌన్. బయటికి వెళ్తే పోలీసులు బ్యాండ్ వేస్తారు. టీవీ చూస్తే కరోనా వార్తలతో లేనిపోని తలనొప్పి,  సినిమాలు చూడలేం, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. ఎప్పటి లాగే అమ్మానాన్నలు అడిగే ప్రశ్నలు, నెక్స్ట్ ఏంటి? టైం ఎందుకు వెస్ట్ చేస్తావ్.. ఏదైనా చదువొచ్చుకదా అని. చాలా మంది సినిమాలో హీరో, హీరోయిన్  అవ్వాలని టిక్ టాక్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలో ఫైట్ సీన్స్ కూడా తెగచేస్తున్నారు యువకులు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం అప్పారెడ్డ గూడెం గ్రామంలో జగన్, శ్రీను ఇద్దరు స్నేహితులు. ఇద్దరిదీ ఒక్కటే ఊరు. లాక్ డౌన్‌తో పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వీరు.. ఉరి సీన్ తీయాలనుకున్నారు. ఇంటి దగ్గరే చెట్టుకు ఉరి తీసుకుంటూ.. వీడియో తీశారు. అది వైరల్ కావడంతో జగన్ తల్లిదండ్రులకు విషయం తెలిసి కొడుకు నిర్వాకాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు యువకులను పిలిచి చీవాట్లు పెట్టారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నాలుగు వాయిస్తామన్నారు. సరదాకు కూడా ఇలాంటి వీడియోలు చేయొద్దని చెప్పి హెచ్చరించి వదిలేశారు. మరి అంత బోరు కొడితే పాఠ్య పుస్తకాలు కాకుండా.. కొంచం సమాజాన్ని స్టడీ చేసే పుస్తకాలు చదవాలిగాని, అమెజాన్ నెట్ఫ్లిక్ ఆహ లాంటి ప్లాట్ ఫామ్ లో సినిమాలు చూడాలి. అదికూడా చేత కాదంటే అమ్మానాన్నలకు ఇంట్లో పని చేసిపెట్టాలిగాని.. మరి సినిమాలు చూసి.. అందులో వీడియోలు చేస్తే ఇలాగే ఉంటది.. ఇంకా నాయ్యం ప్రాణాలు పోలేదు. ఒక వేళ ప్రాణాలు పోతే.. సినిమాలో ఐతే నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు.. అందులో చేసినట్లు మనం చేస్తే అప్పుడప్పుడు ఇసుర్రాయి బొడ్డుకు వస్తుంది.   

జైలు బ‌య‌ట క‌రోనా.. విడుద‌ల‌ వ‌ద్దంటూ ఖైదీల ఆందోళ‌న‌..

జైలుకు వెళ్ల‌డ‌మంటే ఎవ‌రికీ ఇష్టం ఉండ‌దు. ఏదైనా కేసులో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చినా ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌కు వెళ్దామా అని ఎదురుచూస్తుంటారు ఖైదీలు. జైలు న‌ర‌కం లాంటిది. స‌మాజం నుంచి దోషుల‌ను వేరు చేసి.. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌ బంధించే కార్ఖానాలాంటింది జైలు. చుట్టూ ఖైదీలు మిన‌హా మ‌రో ప్ర‌పంచం లేకుండా పోతుంది. అందుకే, జైలులో ఉండ‌టం టార్చ‌ర్‌గా ఫీల‌వుతారు. మ‌రోసారి జైలుకు రావొద్ద‌ని నేరాలు చేయ‌కుండా కంట్రోల్‌లో ఉంటారు. ఇదంతా జైలు సిద్ధాంతం. కానీ, ప్ర‌స్తుతం సీన్ మారిపోయింది. క‌రోనా కాలంలో ఖైదీలు తెలివి మీరారు. బ‌య‌ట‌కు వెళితే ఎక్క‌డ క‌రోనా కాటేస్తుందోన‌ని భ‌య‌ప‌డిపోతున్నారు. లాక్‌డౌనూ ఉండ‌టంతో తిండికి కూడా క‌ష్ట‌మ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే, తాము జైలు వీడి బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అందుకే, త‌మ‌కు పెరోలో వ‌ద్దంటూ 21మంది ఖైదీలు.. ఏకంగా జైలు ఉన్న‌తాధికారుల‌కే లేఖ‌లు రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది.  యూపీలోని గజియాబాద్, గౌతంబుద్ధ్‌ నగర్, మేరఠ్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పుర్, లఖ్‌నవూ జైళ్లలోని ఖైదీలు త‌మ‌కు పెరోల్ వ‌ద్దంటూ లేఖ‌లు రాసిన‌ట్టు జైళ్ల పరిపాలన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ‘ఈ పరిస్థితుల్లో బయటికి వెళితే తిండి, ఆరోగ్యానికి భరోసా ఉండదు. ఇక్కడైతే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం. గంట కొట్టగానే అన్నం పెడతాం. పైగా వాళ్లకిచ్చే 90 రోజుల పెరోల్‌ కాలాన్ని మళ్లీ శిక్షాకాలంలో కలుపుతాం’ అందుకే ఖైదీలు పెరోల్ మీద బ‌య‌ట‌కు వెళ్లేందుకు నిరాక‌రిస్తున్నారంటూ ఆ అధికారి వివరించారు.   జైళ్ల‌లో సామాజిక దూరం స‌మ‌స్య‌పై ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, కేసులు విచారణలో ఉన్నవారికి పెరోల్ కానీ, మధ్యంతర బెయిలు కానీ, మంజూరు చేసే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీం సూచ‌న‌ల‌తో.. యూపీలో 2,200 మందిని పెరోల్‌పైన.. 9,200 మందిని మధ్యంతర బెయిలుపైన జైలు నుంచి రిలీజ్ చేశారు. అయితే.. ఈ కోటాలో త‌మ‌నెక్క‌డ జైలు నుంచి బ‌య‌ట‌కు పంపిస్తారోన‌ని ఆందోర‌ళ‌న చెందిన వివిధ జైళ్ల‌లోని 21మంది ఖైదీలు.. బ‌య‌ట క‌రోనా ఉంది.. తమ‌ను పెరోల్ మీద‌ రిలీజ్ చేయ‌వ‌ద్దంటూ ఉన్న‌తాధికారుల‌కు లేఖ‌లు రాయ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంది. జైళ్ల శాఖ నిబంధ‌న‌ల మేర‌కు లేఖ రాసిన ఖైదీలను.. విడుద‌ల చేయ‌బోమంటున్నారు. ఎంతైనా జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌మంటూ ఖైదీలే కోరుతుండ‌టం విడ్డూరంగా లేదు. క‌రోనానా.. మ‌జాకా.. ముందుముందు ఇలాంటి విచిత్రాలు ఇంకెన్ని చూడాల్సి వ‌స్తుందో...

కోట‌య్య మృతి.. ఆనంద‌య్య మందుపై ఇవాళే నిర్ణ‌యం..

కోట‌య్య క‌రోనాతో చ‌నిపోయారు. కోట‌య్య ఎవ‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆనంద‌య్య మందుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిన రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్‌. ఆక్సిజ‌న్ లెవెల్స్ 83కి ప‌డిపోయి.. కొనఊపిరితో కృష్ణ‌ప‌ట్నం వ‌చ్చాడు కోట‌య్య‌. ఆనంద‌య్య మందును కంటిలో రెండు చుక్కలు వేశారు. అంతే. ఒక్క‌సారిగా మేజిక్ జ‌రిగింది. 10 నిమిషాల వ్య‌వ‌ధిలోనే కోట‌య్య లేచి కూర్చున్నాడు. ఆయ‌న ఆక్సిజ‌న్ స్థాయిలు ప‌రీక్షిస్తే.. 95కి చేరాయి. స‌రిగ్గా 10 నిమిషాల్లోనే 83 నుంచి 95కి ఆక్సిజ‌న్ లెవెల్స్ పెర‌గ‌డం ఆనంద‌య్య మందు మ‌హ‌త్యం. నాటు మందు ప‌డితే తిరుగుండ‌ద‌నే కోట‌య్య కామెంట్స్ అప్పుడు అక్ష‌ర స‌త్యం. ఇందులో ఎవ‌రికీ, ఎలాంటి డౌట్ అక్క‌ర‌లేదు.  కోట‌య్య కోలుకున్న న్యూస్ తెలిసి.. ఆనంద‌య్య మందు కోసం కృష్ణ‌ప‌ట్నంకి ప్ర‌జలు పోటెత్తారు. అప్ప‌టి వ‌ర‌కూ రోజుకు 5 నుంచి 6వేల మంది వ‌స్తుండ‌గా.. కోట‌య్య ఘ‌ట‌న త‌ర్వాతి రోజు ఏకంగా 30-40వేల మందితో ఆ మారుమూల గ్రామం కిక్కిరిసిపోయింది. జ‌నం ర‌ద్దీతో ఆనంద‌య్య మందు పంపిణీని మ‌ధ్య‌లోనే నిలిపివేయాల్సి వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. ఆనంద‌య్య మందుతో ఏ కోట‌య్య అయితే కోలుకున్నాడో.. అదే కోట‌య్య ఆరోగ్య ప‌రిస్థితి ఆ మ‌రునాడే మ‌ళ్లీ సీరియ‌స్‌గా మారింది. ఆక్సిజ‌న్ లెవెల్స్ మ‌ళ్లీ దారుణంగా ప‌డిపోయాయి. వెంట‌నే జీజీహెచ్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. వెంటిలేట‌ర్‌పై చికిత్స చేశారు. కోట‌య్య కంటికి ఇన్‌ఫెక్ష‌న్ సోకింద‌ని వైద్యులు గుర్తించారు. అప్ప‌టి నుంచీ ఐసీయూలో ప్రాణాల‌తో పోరాడుతున్న కోట‌య్య‌.. ఈ ఉద‌యం క‌రోనాతో చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆనంద‌య్య మందు తీసుకుని కోలుకున్నాక కూడా.. 24 గంట‌లు తిర‌గ‌క ముందే మ‌ళ్లీ అత‌ని ఆరోగ్యం విష‌మించ‌డం.. చికిత్స‌కు స్పందించ‌క‌పోవ‌డం.. మ‌ర‌ణించ‌డాతో.. ఆనంద‌య్య మందుపై అనుమానాలు మొద‌ల‌య్యాయి.  ఆనంద‌య్య మందు కోసం వెళ్ల‌క ముందు.. హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు ఆయ‌న ఆక్సిజ‌న్ లెవెల్స్ 95 ఉండేవ‌ని న‌ర్సులు చెబుతున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. మందు వేసుకున్న కొన్ని గంట‌ల్లోనే ఆయ‌న ఆరోగ్యం మ‌ళ్లీ క్షీణించింది. అంటే.. ఆ మందు క‌రోనా తీవ్రంగా ఉన్న వారికి ప‌ని చేయ‌దా?  లేక‌, ఆనంద‌య్య మందు ప్ర‌భావం తాత్కాలికంగానే ఉంటుందా?  లేదంటే.. కొన్ని డోసులుగా ఆ మందు తీసుకోవాల్సి ఉంటుందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. ఆనంద‌య్య మందు తీసుకున్న మ‌రో 98 మంది సైతం.. ఆ త‌ర్వాత‌ వివిధ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో చేరార‌నే వార్త‌లూ వినిపిస్తున్నాయి.  అయితే.. ఇక్క‌డ మ‌రో చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. క‌రోనా పాలిట సంజీవ‌నిగా భావించిన‌ రెమ్‌డెసివిర్ తీసుకున్న ప్ర‌తీ పేషెంట్ కోలుకోలేదుగా.. ఆ ఇంజెక్ష‌న్ తీసుకున్నా కొంత‌మంది చ‌నిపోయారుగా.. ఆనంద‌య్య మందునూ అలానే చూడాలంటున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా క‌రోనా సోకే అవ‌కాశాలు ఉన్నందున‌.. ఆనంద‌య్య మందు విష‌యంలోనూ అలానే భావించాల‌ని అంటున్నారు. కృష్ణ‌ప‌ట్నం గ్రామంలో ప్ర‌తీ ఒక్క‌రూ ఆనంద‌య్య మందును తీసుకున్నారు. ఇంత వ‌ర‌కూ ఆ గ్రామంలో ఒక్క‌ క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదంటే మామూలు విష‌య‌మేమీ కాదుగా. ఇప్ప‌టికే అన్ని వేల మంది ఆనంద‌య్య మందు తీసుకోగా.. ఒక్క కోట‌య్య విష‌యంలో మాత్ర‌మే ఇలా జ‌రిగింది. ఆ మాత్రం మిన‌హాయింపు ఏ మందుకైనా ఉంటుంది. ఈ ఒక్క కేసును సాకుగా చూపించి.. ఆనంద‌య్య మందుపై కుట్ర చేసే ప్ర‌మాదం ఉంద‌ని కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఇప్ప‌టికే వారాల త‌ర‌బ‌డి ఆనంద‌య్య‌ను ఆజ్ఞాతంలో ఉంచి.. ఆయ‌న‌తో ర‌హ‌స్యంగా మందు త‌యారు చేయించి.. అయిన వారికి బ‌కెట్ల‌కు బ‌కెట్లు మందు త‌ర‌లించేసుకుంటున్న ప్ర‌భుత్వ పెద్ద‌లు.. ఇక‌నైనా ఆనంద‌య్య‌ను ప్ర‌జాక్షేత్రంలోకి తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మందు తయారీకి కావ‌ల‌సిన కొన్ని వ‌నమూలిక‌లు మ‌రో నెల రోజులు మాత్ర‌మే ల‌భ్య‌మ‌వుతాయ‌ని.. ఆ త‌ర్వాత వాటి సీజ‌న్ అయిపోయి అవి అందుబాటులో ఉండ‌వ‌ని అంటున్నారు. అందుకే.. ఇప్ప‌టికే చాలా చాలా ఆల‌స్యం అయింద‌ని.. వెంట‌నే ఆనంద‌య్య మందును ఎప్ప‌టిలానే ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే అన్ని ప‌రీక్ష‌ల్లోనూ ఆనంద‌య్య మందుపై ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోయినా.. మందు పంపిణీని నిలిపివేయ‌డం పాల‌కుల కుట్ర అంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. మ‌రింత ఆల‌స్యం చేస్తే.. జ‌నాలు తిర‌గ‌బ‌డ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

అన్నాచెల్లెళ్ల ప్రేమ.. నో చెప్పిన పెద్దలు.. చివరికి ఉరి.. 

కరోనా కాలమో, కలికాలంలో తెలియదు గాని.. బయటి వాళ్ళతో నడిపే ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళతో సాగిస్తున్నారు. అసలే కరోనా కాలం.. అందులోను లాక్ డౌన్ ఇతరులను కలవడం వీలు కాదు. ఒక వేళ కలిసిన సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని అనుకుంటున్నట్లున్నారు. ప్రస్తుతం యువతీ యువకులు. అందుకే ఇంట్లో వాళ్ళతో ప్రేమాయణం నడుపుతున్నట్లున్నారు.. ఆ రుచి చూశాక ఒకరి ఒకరి ఉండలేమని.. వావివరసలు మరిచి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఒక జంట ఇలాగే చేసింది..  వారిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు. ఆ వరసను మరిచి వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా.. అది కృష్ణ జిల్లా.  మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురానికి చెందిన పేరుబోయిన సాయికుమార్‌(20) గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పేరుబోయిన వెంకటస్వామి కుమార్తె(15)కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తెలుసుకున్న కుటుంబసభ్యులు.. వరుసకు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఏంటని మందలించారు. కట్ చేస్తే..  ఈ నేపథ్యంలోనే ఈ ప్రేమజంట ఇంట్లో ఉంటె వాళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించారని గ్రహించి శనివారం రాత్రి ఇంటి నుంచి పారిపోయింది. ఎప్పటి లాగే ఉదయాన్నే లేచి చూస్తే అమ్మాయి, అబ్బాయి కనిపించడం లేదు. దీంతో కంగారు పడిన రెండు కుటుంబాల వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పంట పొలాల వద్ద చెట్టుకు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏమిటి ఈ దరిద్రం మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం.. వయసు వస్తే చాలు ప్రేమ రుచి చూడాల్సిందేనా.. ఈ తప్పు పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులదా ..? లేదా తల్లి దండ్రుల మాట లెక్క చేయని పిల్లలదా..? అయినా అక్క తమ్ముడు లవ్ చేసుకోవడం ఏంటి.. అని స్థానికులు మాట్లాడుకుంతున్నారు. దయచేసి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించండి. వారి నడవడికను గ్రహించండి. వారి తప్పులను సరిదిద్దండి. తల్లి దండ్రులు చదివిన వాళ్ళు అయినా చదవని వాళ్ళు అయినా సరే వారికి తెలిసిన విషయాలు వాళ్ళతో పంచుకోండి.. ఈ  బిజీ ప్రపంచంలో పిల్లలను అందరు ఉన్న అనాథలా వదిలేయకండి. 

తమిళ రాజకీయాల్లో మరో సంచలనం  చిన్నమ్మవస్తున్నారు ...

శశికళ... తమిళ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. సుదీర్ఘ కాలంపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలిగా సర్వం తానైన సహచరిగా, చిన్నమ్మగా చక్రం తిప్పిన చరిత్ర అమెది. ఆమె స్కెచ్ గీస్తే, అంతే, కసక్ ‘ అంతటి ఘటనా ఘటన సమర్ధురాలు. అయినా ఆమె, కొంతకాలంగా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, జైలు నుంచి బెయిలుపై విడుదలై వచ్చినా, ఆమె కాలానికి తలొగ్గి, రాజకీయాలకు దూరంగా ఉండడమే కాదు, రాజకీయ  సన్యాసం సైతం ప్రకటించారు.  అయితే, ఇప్పుడు కాలం కలిసొచ్చిందని కాదు కానీ, పరిస్థితులలో మార్పు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె, రీఎంట్రీ సంకేతాలు  ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్’సెల్వం వర్గాల మధ్య అతర్గత కుమ్ములాటలతో కుదిలైన ‘ఎఐఎడిఎంకే’ను  రక్షించేందుకు, తాను త్వరలో  క్రియాశీల రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాని ప్రకటించారు. అంతర్గత కుమ్ములాటలో పార్టీ ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్న ‘ఎఐఎడిఎంకే’ కార్యకర్తలకు ఆమె, ‘నేను వస్తున్నా... నేను వచ్చేస్తున్నా’ అని భరోసా ఇస్తున్నారు. గత కొద్దిరోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు టెలిఫోన్’లో అందుబాటులోకి వచ్చిన చిన్నమ్మ, కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత వచ్చి పార్టీని చక్కదిద్ది పట్టాల మీదకు తెస్తానని, ధైర్యం చెపుతున్నారు. ‘భయపడకండి.. కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత నేను వస్తాను’ పార్టీని చక్కదిద్దుతాను’  లారెన్స్ అనే పార్టీ అభిమాని ఫోన్’లో ఆందోళన వ్యక్త పరిచి నప్పుడు, ఆమె చెప్పిన మాటలు ఇవి. ఈ  వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అలాగే, తంజావూర్ నుంచి సురేష్ అనే మరో కార్యకర్తతోనూ ఫోన్’లో మాట్లాడిన ఆమె, “పార్టీ నాశనమై పోతుంటే, మౌనంగా చూస్తూ ఉండలేను” అంటూ  ఆమె పళనిస్వామి, పనీర్ సెల్వం మధ్య సాగుతున్న బహిరంగ పోరు పట్ల కూడా ఆమె విచారం వ్యక్తం చేశారు.అంతేకాదు  “ఇక ఆలస్యం చేయను కొవిడ్ ఉదృతి తగ్గగానే, శుభ వార్త తో వచ్చేస్తాను,ఇది ఖాయం” అని స్వరం పెంచి చెప్పారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. అలాగే, పార్టీని పెంచి పెద్దచేయడంలో ఎన్నో త్యాగాలు చేశామని గుర్తు చేసుకున్నారు.ఆ త్యాగాలు వృధా కానీయనని,అన్నారు.  అదలా ఉంటే, ఈ వీడియోలు, వాటిలో వినవచ్చిన సంభాషణ అంతా నిజమే అని, శశికళ సన్నిహత వర్గాలు, ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) వర్గాలు దృవీకరిస్తున్నాయి. అంతే కాదు, ప్రస్తుతం అన్నాడిఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగ గమనిస్తున్న ఆమె, మరో ఒకటి రెండు నెలల్లో క్రియాశీల  రాజకీయాల్లోకి రావడం  ఖాయమని  సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.  నిజానికి, ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలోనే, ఆమె వ్యూహత్మకంగానే వెనకడుగు వేశారని , సన్యాసం ప్రకటించారని, ఎన్నికల అనంతరం ఆమె రీఎంట్రీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఊహించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాగే, ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేయడం కూడా ఆమె  రాజకీయ ఎత్తుగడలో భాగమనే విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీ, ప్రజల పల్స్ పట్టుకునేందుకు ఆమె వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేశారని, అలాగే, ఆమె రీఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో చర్చ కోరుకుంటున్నారని, ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆమె తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అలాగే, ఆమె త్వరలో కార్యకర్తలు, అభిమానులను నేరుగా కలుసుకోవడం, సమావేశాలు నిర్వహించడం కూడా ఉంటుందని, సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.  మొత్తానికి జయ సమాధి వద్ద, శపధం చేసి జైలుకు వెళ్ళివచ్చిన  చిన్నమ్మ ఇప్పుడు ఆ శపధం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారా... బుల్లి తెరపై త్వరలో చూద్దాం.

తల్లిని చేసి.. పెళ్ళికి నిరాకరించిందని..

అబ్బాయి అయిన అమ్మాయి అయిన ప్రేమ పేరుతో వెంట పడితే ముందు నో చెపుతారు.. ఆ తరువాత పోనీలే చాలా సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం  అనుకుంటారు. ఆ అవకాశం ఇచ్చి చూద్దాం అనుకోవడమే తప్పు.. ఆ ఒక్క మాట ఏంటదికైనా దారి తీస్తుంది. ఆ ఒక్క మాటతో కొంచం చనువు ఇస్తే అక్కడి నుండి సినిమా, షికార్లు, అక్కడితో ఆగకుండా ఫిజికల్ గా కలవడం. ఒకవేళా అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే.. అప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమికుడి నిజస్వరూపం. ఎలాగైనా ఆ ప్రాబ్లమ్ నుండి తను తప్పించుకోవాలనుకుంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి తన ప్రాబ్లెమ్ ఎలా ఫేస్ చెయ్యాలో తెలియక. అటు ఇంట్లో వాళ్లకు చెప్పలేక ఇటు బయట తిరగలేక ప్రాణాల మీదికి వస్తే.. తాజాగా  అలాంటి సంఘటనే జరిగింది.  ప్రేమ పేరును ఎవ్వడు పడితే వాడు. బస్ స్టాండ్ లో సులబ్ కాంప్లెక్స్ లా ఎవడికి ఇష్టమొచ్చినాట్లు వాడు వాడుతున్నాడు. ఓ బాలికను మచ్చిక చేసుకుని పెళ్లి పేరుతో ఆమెను లోబరుచుకుని తల్లిని చేశాడో ప్రబుద్ధుడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో పాటు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడడం చివరికి మోసం చెయ్యడం.. అలవాటైపోయింది ఇప్పటి యువతకి. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ పట్టణ శివారు బాబునాయక్ తండాకు చెందిన ఓ యువకుడు అదే తండాలో ఉంటున్న బాలికను పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు.పెళ్లి చేసుకోవాలని మైనర్ అడిగే సరికి ఆమెను దూరం పెట్టడంతో పాటు వేరే వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక మనస్తాపం చెంది బావిలో దూకింది. అది గమనించిన తండా వాసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బాలికను కాపాడి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు బాధిత కుటుంబంతో పాటు బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

జూన్ 2న ఈటల రాజీనామా! కేంద్ర మంత్రివర్గంలో చోటు?

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని రోజులుగా జరుగుతున్నట్లే ఆయన కమలం గూటికి చేరబోతున్నారు. కేంద్ర సర్కార్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్.. సోమవారం ఉదయం11 గంటలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి బీజేపీ నేత బండి సంజయ్‌ వెళ్లనున్నారు. ఈటలను నడ్డా దగ్గరకు బండి సంజయ్ తీసుకెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కూడా ఈటల కలిసే అవకాశం ఉంది. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకోవాలనే కసిలో ఉన్నారు. బీసీ ఎజెండాతో ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. బీసీ సంఘాలకు కూడా ఆయనకు మద్దతుగా నిలిచాయి. తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించిన ఈటల కూడా అదే సంకేతమిచ్చారు. సోషల్ మీడియాలోనూ కొత్త ప్రోఫైల్ పెట్టి కాక రాజేశారు. అయితే తర్వాత సీన్ మారింది. కొత్త పార్టీని పక్కనపెట్టిన ఈటల.. బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈటల బీజేపీలో చేరేలా డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి ఒప్పించారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ హైదరాబాద్ వచ్చి ఈటలతో మాట్లాడారని కూడా ప్రచారం జరిగింది. బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆఫర్లపై తన మద్దతు దారులతో చర్చించిన రాజేందర్.. కషాయ కండువా కప్పుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.  బీజేపీలో చేరిన అనంతరం.. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీనామా ప్రకటిస్తారని సమాచారం.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీచేయబోడని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలో ఈటల జమున పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆమె కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను రాజ్యసభకు పంపిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రం నుంచి అవకాశం లేనప్పటికి.. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి ఈటలను పెద్దల సభకు పంపిస్తారని సమాచారం. తర్వాత  కేంద్రమంత్రి పదవి ఈటలకు ఇవ్వనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రితో తలపడేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.  రెండు రోజుల క్రితం శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్ ఆయనతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో వీరు ఆయన్ను కలిశారు. బీజేపీలో చేరవద్దని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని సూచించారట. అయితే తనపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో.. వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర సర్కార్ అండగా అవసరం ఉంటుందని ఈటల భావించారని అభిప్రాయపడుతున్నారు.  ఇక భూకబ్జా వివాదంలో ఇంతకాలం ఈటల రాజేందర్కు కు  మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. ఇకపై వైఖరి మార్చుకునే అవకాశం ఉంది. ఈటల బీజేపీలో చేరితే ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయంపై బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. బీసీల ఆత్మగౌరవమని మాట్లాడిన ఈటల.. బీసీ వాయిస్ తో సొంత పార్టీ పెడతారని భావించామని.. కాని ఆయన తమను మోసం చేశారని కొందరు బీసీ నేతలు చెబుతున్నారు. ఆత్మగౌరవం కాదు ఆస్తుల పరిరక్షణ కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని మరికొందరు నేతలు ఆరోపిస్తున్నారు. 

ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి.. బ్రిట‌న్ ప్ర‌ధానిగా స‌రికొత్త‌ రికార్డు..

ఆయ‌న‌కు 56. ఆమెకు 33. ఇద్ద‌రి మ‌ధ్య 23 ఏళ్ల తేడా. అయితేనేం? అత‌గాడు ఏకంగా ఇంగ్లండ్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌. ఆమె కేరీ సైమండ్స్‌. అవును, వాళ్లిద్ద‌రూ ప్రేమించుకున్నారు. క‌రోనా టైమ్‌లో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ బ్రేకింగ్‌ న్యూస్ ఇప్పుడు గ్రేట్ బ్రిట‌న్‌లో వైర‌ల్‌గా మారింది. ప్రైమినిస్ట‌ర్ పెళ్లిపై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది.     వ‌య‌సు శ‌రీరానికి మాత్ర‌మే కానీ మ‌న‌సుకు కాదు అని వాళ్లిద్ద‌రూ బ‌లంగా న‌మ్మారు. కొంత‌కాలంలో వాళ్లు ప్రేమ‌లో ఉన్నారు. శ‌నివారం లండన్‌లోని ఓ చర్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మీడియాలో రావ‌డంతో ఇంగ్లండ్ వాసులంతా ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు.  వాళ్ల పెళ్లికి సంబంధించి ఒకే ఒక్క ఫోటో బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఆ పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈడూ-జోడూ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. వాళ్లిద్ద‌రి మ‌ధ్య 20 ఏళ్ల‌కు పైగా ఏజ్ గ్యాప్ ఉన్నా.. పెళ్లి డ్రెస్‌లో వాళ్లిద్ద‌రూ బ్యూటిఫుల్‌గానే క‌నిపిస్తున్నారు. గుడ్ లుకింగ్ క‌పుల్స్ అంటూ కామెంట్స్‌ వ‌స్తున్నాయి.   ఈ పెళ్లితో యూకే చరిత్రలోనే బోరిస్ జాన్స‌న్ ఓ ఆస‌క్తిక‌ర రికార్డు నెల‌కొల్పడం విశేషం. సుమారు 200 ఏళ్లలో ప్రధాని పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తిగా చ‌రిత్ర సృష్టించడం ఆస‌క్తిక‌రం. బోరిస్ జాన్స‌న్‌కు ఇది ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి. కేరీ సైమండ్స్కి మాత్రం ఇదే తొలి వివాహం. ప్ర‌స్తుతం సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా.. త్వ‌ర‌లోనే ఈ జంట.. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో గ్రాండ్ వెడ్డింగ్‌ పార్టీ చేసుకునేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 56 ఏళ్ల యూకే ప్ర‌ధానికి, 33 ఏళ్ల అమ్మాయితో పెళ్లి కావ‌డం చూసి.. ఎంత‌వారు కానీ కాంత దాసులే.. అనే కొటేష‌న్‌ గుర్తొస్తోంద‌ని అంటున్నారు నెటిజ‌న్స్‌. 

కేసీఆర్ సాయం కోరిన కాంగ్రెస్ నేత! కేటీఆర్ క్విక్ రియాక్షన్..

దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. చాలా రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులున్నాయి. కరోనా రోగులను సరైన చికిత్స అందడం లేదు. అదే సమయంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. లక్షలకు లక్షలు బిల్లులు వేస్తున్నాయి. ఒకవేళ కరోనా రోగి మరణిస్తే..మొత్తం డబ్బులు కట్టే వరకు మృతదేహాన్ని బంధువులకు ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై ఎంతో మంది ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదుచేస్తున్నారు. వాటిపై ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అధిక వసూలు వసూలు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని సర్కార్ హెచ్చరిస్తున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మారడం లేదు.  కరోనా రోగి చికిత్స విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత.  కర్నాటక  పీసీసీ చీఫ్ డి.కే. శివకుమార్ హైదరాబాద్‌లో ఇబ్బందులు పడుతున్న కర్నాటక మహిళను ఆదుకోవాలని ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. కర్నాటకలోని మాండ్యా ప్రాంతానికి చెందిన శశికళ మంజునాథ్ భర్త కరోనాతో హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోవిడ్ చికిత్సకు రూ.7.5 లక్షల బిల్లు వేశారు. ఐతే తాను రూ.2 లక్షలే కట్టగలనని, అంతకు మించి కట్టేందుకు తమకు స్థోమత లేదని చెప్పింది. కానీ ఆస్పత్రి యాజమాన్యం వినలేదు. మొత్తం డబ్బులు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆమె బంధువులు కర్నాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డి.శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు.  తన దృష్టికి వచ్చిన సమస్యను వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు డీకే శివకుమార్. మంజునాథ్ కుటుంబానికి సాయం చేయాలని  విజ్ఞప్తి చేశారు డీకే శివ కుమార్. ఆయన విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వారి వివరాలను అందజేయాలని కోరారు. మెడికవర్ ఆస్పత్రితో తక్షణం మాట్లాడాలని తన సిబ్బందిని ఆదేశించారు కేటీఆర్. 

వ్యాక్సిన్ వేస్ట్‌.. రాందేవ్ బాబా మ‌రో ర‌చ్చ‌...

ఈ రాందేవ్ బాబా ఉన్న‌డే... అస్స‌లు నోరు కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం లేదు. వ‌రుసపెట్టి అల్లోప‌తి వైద్యాన్ని ఆటాడుకుంటున్నారు. విమ‌ర్శ‌ల‌తో ఇంగ్లీష్ మెడిసిన్‌ను పోస్ట్‌మార్టం చేస్తున్నారు. అల్లోప‌తి అస‌లు వైద్య‌మే కాదంటూ.. ర‌చ్చ స్టార్ట్ చేశాడు. అది.. ఎక్క‌డికో దారి తీసి.. దేశంలో అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేద యుద్ధంగా వివాదం ముదురుతోంది. రాందేవ్ వ్యాఖ్య‌ల‌పై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోషియేష‌న్ మండిప‌డ‌టం.. కేంద్రప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేయ‌డం.. అల్లోప‌తి వైఫ‌ల్యాల‌పై బాబా అనేక‌ ప్ర‌శ్న‌లు సంధించ‌డం.. త‌న‌ను అరెస్ట్ చేసే ద‌మ్ము, ధైర్యం.. మీ బాబుల‌కు కూడా లేదంటూ తొడ‌గొట్టి స‌వాల్ చేయ‌డం.. ఇలా కొన్ని వారాలుగా అల్లోప‌తిపై బాబా రాందేవ్ ఒంటికాలిపై రెచ్చిపోతున్నారు. అల్లోప‌తి వైద్య విధానంలోని లోటుపాట్ల‌ను త‌న ప్ర‌శ్న‌లు, మాట‌ల‌తో తూట్లు పొడుస్తున్నారు.  తాజాగా, బాబా రాందేవ్ కొవిడ్‌ వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌త‌పై విమ‌ర్శ‌లు చేశారు. కొవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నా.. కొందరు మరణిస్తున్నారని.. అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయడం లేదనడానికి ఇదే నిదర్శనమంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.  ‘‘కొన్ని దశాబ్దాలుగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను. అలాగే ఆయుర్వేద విధానాన్ని కూడా అనుసరిస్తున్నాను. నాకు వ్యాక్సిన్ అవసరమే లేదు. ఆయుర్వేదమనే పురాతన చికిత్సకు భారత్‌తో పాటు విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు. దాదాపు 100 కోట్ల మందికి పైగా ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నవారు ఉన్నారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానాన్ని అల్లోపతి విధానంతో పోల్చుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపిస్తున్నారు’’ అంటూ రాందేవ్ బాబా తీవ్రంగా మండిపడ్డారు.  కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ హెచ్చ‌రించినా.. బాబా రాందేవ్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప‌తాంజ‌లి సంస్థ తీసుకొచ్చిన కొరోనిల్ మందు ప్ర‌మోష‌న్ కోస‌మో.. మ‌రి దేని కోస‌మో.. తెలీదు కానీ.. క‌రోనా  స‌మ‌యంలో ప్ర‌మాణిక‌మైన అల్లోప‌తి మెడిసిన్‌ను ప‌నికి మాలిన వైద్యంగా తీసిపారేస్తూ.. ఆయుర్వేదం ప్రాముఖ్య‌త‌ను గొంతెత్తి చాటుతున్నారు. అయితే, ఆయుర్వేదం గురించి గొప్ప‌లు చెప్ప‌డంలో త‌ప్పేమీ లేక‌పోయినా.. అల్లోప‌తి వైద్యాన్ని కించ‌ప‌రిచేలా రాందేవ్ బాబా వ్యాఖ్య‌లు ఉంటుండ‌టంపైనే ఐఎంఏ తీవ్ర అభ్యంత‌రం చెబుతోంది. ఆయ‌నే అన్న‌ట్టు త‌న‌నెవ‌రూ అరెస్ట్ చేయ‌లేర‌నే మొండి ధైర్యంతో.. అల్లోప‌తిపై నోటికొచ్చిన‌ట్టు వాగుతున్నార‌నేది ఐఎంఏ ఆగ్ర‌హం. ఇప్ప‌టికే రాందేవ్ బాబాపై ఉత్త‌రాఖండ్ ఐఎంఏ శాఖ ఏకంగా వెయ్యి కోట్ల ప‌రువున‌ష్టం దావా వేసినా.. త‌గ్గేదే లే.. అంటూ రాందేవ్ బాబా రెచ్చిపోతుండ‌టంతో దేశంలో అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం వివాదం ర‌చ్చ రంబోలాగా మారుతోంది.  

ఈటల బీజేపీలో చేరితే లాభమెవరికి? అంతా కేసీఆర్ స్కెచ్ ప్రకారమేనా! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నట్లే జరుగుతోందా? ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో ఏదో జరుగుతుందని ఆశించిన జనాలకు షాక్ తప్పదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ వ్యవహారం గులాబీ బాస్ కు గుబులు రేపడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అంతా ఆయన కోరుకున్నట్లే... ఆయనకు లాభించే విధంగానే  రాజకీయ సమీకరణలు మారిపోయాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటారని భావించిన ఈటల రాజేందర్.. ఎందుకో వెనకంజ వేశారని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. కేసీఆర్ వేసిన ఎత్తుల నుంచి ఆయన బయటపడలేకపోయారని అంటున్నారు.  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో ఒక విధమైన జోష్ కనిపించింది. అధికార టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయం బీజేపీనే అనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. కానీ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. కథ మళ్ళీ మొదటి కొచ్చింది.  టీఆర్ఎస్ ప్రత్యాన్మాయం ఎవరు? కమల దళమా, కాంగ్రెస్ పార్టీనా ? అన్న ప్రశ్న మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్సీ, సాగర్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటే.. గులాబీ పార్టీకి బలమైన శక్తి ప్రస్తుతానికి లేదనే అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే, రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందా అన్న సందేహం కూడా కలుగుతుంది. సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు, అదే నిజం.  ఎంత చెడ్డా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇప్పటికీ పునాదులు ఎంతో కొంత గట్టిగానే ఉన్నాయి. కాంగ్రెస్  నాయకులు తమ మధ్య ఉన్న విబేధాలను విస్మరించి కలిసి పనిచేస్తే, బలమైన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత అయ్యే పనికాదు. ఎండమావిలో  నీళ్ళు తాగవచ్చేమోకానీ, కాంగ్రెస్ పార్టీలో ఐక్యత, కష్టం. అలాగే, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువమంది కారెక్కి తెలంగాణ భవన్’కు చేరడంతో పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ దినదిన ప్రవర్తమానంగా దిగజారి పోతోంది. జాతీయ స్థాయిలోనే, పార్టీకి దిక్కు దివాణం లేదు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. చుక్కాని లేని నావలాగా, పార్టీ ప్రయాణం సాగిస్తోంది. రేవంత్ రెడ్డి కష్ట పడుతున్నారు, కానీ ఫలితం కనిపించడం లేదు. నాగర్జున సాగర్ ఉప ఎన్నికకు ముందు, రేపో మాపో పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగిపోతుందని, కాంగ్రెస్ నాయకులు సందడి చేశారు. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించినట్లే అని పెద్ద పెట్టున సంచలన కథనాలు వినిపించాయి. కానీ, అంతలోనే, అంతరాయం. ఉపఎన్నికలకు ముందు అధ్యక్షుని మారిస్తే, విబేధాలు భగ్గుమంటాయని, నిర్ణయం వాయిదా వేశారు. ఉపఎన్నిక జరగడం, జానారెడ్డి ఓడిపోవడం జరిగి పోయాయి. అయినా  పీసీసీ అధ్యక్షుని నియామకం పై ఉలుకు పలుకు లేదు. కొవిడ్ కారణం చూపి, ఏఐసీసీ  అధ్యక్ష  ఎన్నిక వాయిదా వేసినట్లుగా, పీసీసీ నియామాకం కూడా నిరవధికంగా వాయిదా పడిందో ఏమో .. మొత్తానికి రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించినా, కోమటి రెడ్డి నెత్తినే కిరీటం పెట్టినా లేక ప్రస్తుత పీసీసీ రెడ్డిగారినే కొనసాగించినా కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయంగా ఎదగడం అంత తేలిక వ్యవహాం కాదు.  రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం కనిపిస్తోంది. కానీ  పిల్లి మేడలో గంట కట్టేది ఎవరు? ఈ విషయంలో మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నాయకుడు విశ్వేశ్వర రెడ్డి ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఆయన ప్రయత్నాలకు కూడా పురిట్లోనే సంధి కొట్టినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల కలిసొస్తే, ఆయన నాయకత్వంలో పార్టీ పెట్టాలని, లేదా ఆయన్ని కాంగ్రెస్ లోకి పట్టుకుపోయి, కోదండ రామ్ లాంటి మరికొందరు కేసీఆర్ బాధితులతో కూటమి కట్టి ... ఇలా అనేక ప్రత్యాన్మాయ ఆలోచనలతో  ఎదో విధంగా టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక నిర్మాణం చేయాలని విశ్వేశ్వర రెడ్డి కొంత సిన్సియర్ ప్రయత్నమే చేశారు. అయితే, ఈటల బీజేపీలో చేరేందుకు సిద్డం కావడంతో.. రేవంత్ రెడ్డి ,  విశ్వేశ్వర  రెడ్డి, కోదండరామ్ చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. సో.. తెరాసకు ప్రత్యాన్మాయం అవసరంకానీ, అది ఇప్పట్లో అయ్యేలా లేదు. అందుకే ప్రత్యాన్మాయం ప్రశ్న మళ్ళీ మొదటికొచ్చిందనే చర్చ  రాజకీయ వర్గాల్లో మొదలైంది.