యూపీ బీజేపీకి శస్త్ర చికిత్స ...
కేంద్రంలో అధికారం నిలుపుకోవాలన్నా, అధికారంలోకి రావాలన్నా, యూపీనే కీలకం. అందుకే మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్’లో పాగా వేస్తే, ఢిల్లీ పీఠం దగ్గరవుతుందని అంటారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజీపే దేశం మొత్తంలో గెలుచుకున్న (303) స్థానాల్లో ఇంచుమించుగా ఐదింట ఒక వంతు స్థానాలు (62) ఒక్క యూపీ నుంచే గెలుచుకుంది. అలాగే, అంతకు ముందు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 403 సీట్లకు గానూ, 312 స్థానాలను సొంతంగా కైవసం చేసుకుంది. మిత్ర పక్షాలను కలుపుకుంటే లెక్క 325 చేరింది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు వచ్చియన్ సీట్లు మొత్తం కలిపినా మూడంకెలకు చేరలేదు. అయితే, ఇది ఐదేళ్ళ నాటి కథ. ఇప్పుడు పరిస్థ్తితి వేరు.
ఇప్పుడు కమల దళం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. కొవిడ్ కొంత, ఇతరత్రా కారణాల వలన చేత ఇంకొంత మొత్తానికి, పార్టీ ఇమేజ్ గట్టిగానే దెబ్బతింది. అయినా, ఇప్పటికీ, బీజేపీ పతనమైన స్థాయిలో ప్రతిపక్షాలు పుంజుకోలేదు. బీజేపీ ఖాళీ చేసిన పోలితిఅల్ స్పేస్’ ను భర్తీ చేసే పార్టీ ఏదీ కనిపించడం లేదు. మరోవంక అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో ఆరేడు నెలల్లో, వచ్చే ఫిబ్రవరిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నేపద్యంలో, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఉత్తర ప్రదేశ్’లో పార్టీ పరిస్థితిని, ఎన్నికల సంసిద్దతను సమీక్షించుకునే పనికి శ్రీకారం చుట్టారు. బీజేపీ నేతలతో ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో సమావేశమయ్యారు. బెంగాల్లో తగిలిన ఎదురుదెబ్బ నేపధ్యంగా జరిగిన ఈ సమవేశంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా,ఇతర నాయకులు పాల్గొన్నారు. అయితే, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్’ మాత్రం సమావేశంలో పాల్గొనలేదు.ఈ సమావేశంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంతో పాటు మరికొన్ని అంశాలు చర్చకు వచ్చాయని వార్తలొచ్చాయి. అయితే ఈ సమావేశం తర్వాత యూపీ బీజేపీ, అటు ప్రభుత్వంలో సమూల మార్పులు మాత్రం రానున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యూపీ బీజేపీని, అటు ప్రభుత్వాన్ని సమూలంగా మార్పులు చేయాలని ఆర్ఎస్ఎస్ సహకార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతలకు సూచించారు.
ఈ నేపధ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రి వర్గ విస్తరణకు సిద్దమయ్యారు. ఈ సారి ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన అరవింద శర్మను కేబినెట్‌లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం యోగి కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఆరింటినీ అత్యంత శక్తిమంతమైన నేతలతో నింపాలని యోగికి బీజేపీ అధిష్ఠానం సూచించింది. ఈ నేపథ్యంలోనే యోగి మంత్రివర్గ విస్తరణకు రెడీ అయ్యారు.ఎప్పుడైన ముహూర్తం ఖరారు అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.
కరోనా పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బల నేపథ్యంలో యూపీ బీజేపీని కొంచెం ముందుగానే మేల్కొంది. క్రింది స్థాయి నుంచి, కార్యకర్తలలో నీటిక స్థైర్యాన్ని నిపండంతో పాటుగా, ప్రతిపక్షాలను ఎదుర్కునే ఊ హరచనకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా ఇక ఇక్కడి నుంచి, పార్టీ ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు, చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబందించిన రోడ్ మ్యాప్‌ను కూడా సిద్దం చేశారు.ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్యకు తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ, సంఘ్ నాయకులు నిర్ణయానికి వచ్చారు. గత ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షునిగా పార్టీని విజయపథంలో నడిపించిన ఆయనకే మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. ఇదిలా ఉంటే, కమల దళం పరిస్థితి కొంత క్రిటికల్’గా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల పరిస్థితి మరింత అద్వాన్నంగా ఉందని, రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు.