మౌనం.. అంగీకారమేనా! హరీష్ రావు ఏడ్చింది నిజమేనా?

గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పెద్ద బాంబే పేల్చారు. కేసీఆర్ తీరును ఎండగట్టిన రాజేందర్..  ప్రగతి భవన్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బానిసగా ఉండలేకే బయటికి వచ్చానన్నారు. కేసీఆర్ పై ఈటల చేసిన ఆరోపణల కంటే.. మంత్రి హరీష్ రావును ఈ వివాదంలోకి లాగడమే హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా హరీష్ రావును ఈటల రాజేందర్ ఇరికించారనే చర్చ జరుగుతోంది. గత ఐదేండ్లుగా తాను అవమానాలకు గురవుతున్నానని చెప్పిన ఈటల.. తానే కాదు హరీష్ రావు కూడా అవమానించబడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హరీష్ రావును కేసీఆర్ కుటుంబం వేధించిందని.. ఎన్నోసార్లు హరీష్ రావు తన ముందు ఏడ్చారని చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు సైలెంటుగా ఉన్నా.. అతని కుటుంబ సభ్యులకు జరిగిందంతా తెలుసన్నారు ఈటల రాజేందర్.  హరీష్ రావుపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రాజేస్తున్నాయి. జూన్ 4న హరీష్ రావు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజునే భలేగా ఇరికించారు రాజేందర్. ఇప్పుడు తనను ఉద్దేశించి రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈటలకు కౌంటర్ గా తెలంగాణ భవన్ లో మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు కూడా హరీష్ విషయంపై మాట్లాడలేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా... హరీష్ రావే స్పందిస్తారంటూ దాట వేశారు. ఈటల చేసిన అన్ని ఆరోపణలకు బదులిచ్చిన గులాబీ లీడర్లు.. హరీష్ రావు విషయంలో మాట్లాడేందుకు నిరాకరించడం మరింత అసక్తి రేపుతోంది.  ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం లేదు. తన పుట్టిన రోజు సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటారు హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడినా.. ఈటల విషయం మాత్రం ఎత్తలేదు. దీంతో రాజేందర్ వ్యాఖ్యలపై హరీష్ రావు మౌనంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సహజంగా తమపై ఎవరైనా ఆరోపణలు చేస్తే రాజకీయ నేతలు వెంటనే రియాక్ట్ అవుతారు. చిన్నచిన్న విషయాలకు కూడా వెంటనే కౌంటరిస్తారు. కాని ఈటల రాజేందర్ తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా హరీష్ రావు మాట్లాడకపోవడం చర్చగా మారింది. మౌనంగా ఉన్నారంటే అర్ధాంగీకారమేనని కొందరు చెబుతున్నారు. ఈటల వ్యాఖ్యలను ఖండించలేదంటే.. వాటిని అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు. కేసీఆర్ కుటుంబం తనను అవమానించిందని హరీష్ రావు చెప్పకనే చెబుతున్నారని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా  ఉన్న హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. హరీష్ రావు కొన్ని నెలల వరకు ప్రగతి భవన్ రాకపోవడం, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనపోవడం ఇందుకు బలాన్నిచ్చింది.  2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లోకి ఈటలతో హరీష్ రావును తీసుకోలేదు. దీంతో హరీష్ ను కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి. పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరిని హరీష్ తయారు చేశారనే అనుమానాలు గులాబీ బాస్ కు ఉన్నాయట.  తనకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడంతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారని సదరు నేతకు సంబంధించిన నివేదికలు కేసీఆర్ దగ్గర ఉన్నాయంటున్నారు. అందుకే ఆ నేతను కేసీఆర్ దూరం పెడుతున్నారని కథనాలు వచ్చాయి.  తర్వాత ఉద్యమ నేతలను దూరం పెట్టారని విమర్శలు పెరగడంతో అయిష్టంగానే మంత్రివర్గంలో చోటు కల్పించారని అంటున్నారు. మంత్రులుగా ఉన్నా... ఈ ఇద్దరు నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావును కేసీఆర్ కుటుంబం అవమానించిందంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించకపోతే.. రాజేందర్ చెప్పిందే నిజమని భావించక తప్పదు.  మరోవైపు ఈటలతో పాటు హరీష్ రావుపై  రెండేండ్లుగా కేసీఆర్ నజర్ పెట్టారని అంటున్నారు. వాళ్లిద్దరిపై వేటు కోసం చూస్తున్న కేసీఆర్.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియడం, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే యాక్షన్ మొదలు పెట్టారని అంటున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో ఏ ఎన్నికలు లేకపోవడంతో .. ఏం జరిగినా ఎన్నికల సమయానికి అంతా సర్ధుకుంటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నారని భావిస్తున్నారు. ఈటల కథ ముగియడంతో తర్వాత టార్గెట్ హరీష్ రావే అనే చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. 

స్టూడెంట్ తో పారిపోయిన టీచర్.. 

టీచర్స్ విలువలు మర్చిపోతున్నారు. చదువులు చెప్పడం మానేసి ప్రేమ పాఠాలు మొదలు పెడుతున్నారు.  టీచర్‌ అంటే ఒకప్పుడు స్టూడెంట్ గౌరవం ఉండేది.  ఇప్పుడు  ఆ గౌరవం గంగలో కలుస్తుంది. అలాగే ఒక టీచర్ , స్టూడెంట్ మధ్య  ఉన్న సంబంధాన్ని పవిత్రమైనదని అంటారు. రోజురోజుకు ఆ పవిత్రతను దెబ్బతీసింది. తన వద్ద చదువు నేర్చుకుంటున్న విద్యార్థికి పాఠాలు చెపుతూ... ఆ స్టూడెంట్ తో కాలు జారింది. అతడితో యవ్వారం నడిపింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అనే పాట వేసుకుంది. చివరికి  ఆ విద్యార్ధితో  కలిసి ఆ టీచర్ జంప్ అయింది.  పారిపోయింది. వివరాలు.. అతడు ఓ 17 ఏళ్ల విద్యార్థి ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాడు. మహిళ టీచర్ ఆ విద్యార్థికి  క్లాస్ టీచర్‌గా ఉంది. అలాగే అతడికి ట్యూషన్స్ కూడా చెప్పేది. అయితే అనుమానస్పద రీతిలో టీచర్, స్టూడెంట్ ఇద్దరు కనిపించకుండా పోయారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా ఆ టీచర్.. తమ కొడుక్కి ట్యూషన్స్ చెబుతుందని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఆమె ఓ టీచర్. పెళ్లి అయింది. ఆ తర్వాత  భర్తతో విడాకులు అయింది. విడాకుల తర్వాత తల్లిదండ్రుల వద్ద నివసం ఉంటుంది. లాక్‌‌డౌన్ సమయంలో బోర్ గా ఫీల్ అయిన ఆ పంతులమ్మ, ట్యూషన్ పాఠాలు స్టార్ట్ చేసింది. రోజుకు నాలుగు గంటలు ఒక స్టూడెంట్ కి  పాఠాలు చెప్పేది. మే 29వ తేదీన ఆ స్టూడెంట్  డేస్రాజ్ కాలనీలో ఉన్న టీచర్ ఇంటికి వెళ్లాడు. ట్యూషన్ టైం అయిపోయింది.. గంటలు గడుస్తున్నాయి.  ఆ రోజు సాయంత్రం గడిచిన ఆ స్టూడెంట్  ఇంటికి తిరిగిరాలేదు. దీంతో స్టూడెంట్ పేరెంట్స్ ఆ టీచర్  కుటుంబ  సభ్యులను సంప్రదించారు. అయితే వారు తొలుత ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆ తర్వాత టీచర్ కనిపించకుండా పోయిన విషయాన్ని ఆమె తండ్రి , ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ కి  చెప్పాడు’అని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఇక, బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళా టీచర్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు రంగం లోకి దిగారు. టీచర్, బాలుడు వారి వారి ఇళ్ల నుంచి ఎలాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లలేదని పోలీసులు తెలిపారు. టీచర్ వద్ద కేవలం ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరం మాత్రమే ఉందని అన్నారు. వారిద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు. వారు కనిపించకుండా పోయినప్పటి నుంచి వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేయబడ్డాయని తెలిపారు. ఈ ఘటన హర్యానాలో జరిగింది.  

భర్త తప్పు.. పరువు కోసం.. మొత్తం ఫ్యామిలి ప్రాణం తీశాడు.. 

అతని పేరు బిక్షపతి. పెళ్లి అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. బిక్షపతి బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. ఆటో వాళ్ళు అంటే ఇక చెప్పనక్కర్లేదు. దాదాపు అని అలవాట్లు ఉంటాయి. ఇక రాత్రి అయిందంటే కిక్కు కోసం సుక్క పక్క కావాలే, మందు పడితేగాని ముద్దా దిగాడు కొందరికి. ఈ బిక్షపతి చేసిన నిర్వాహకానికి కుటుంబం మొత్తం చెనిపోయారు. ఇంతకీ ఎంజారిందో తెలుసుకుందాం..?  వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌కు చెందిన భిక్షపతి, ఉష దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కీసర పరిధిలోని నాగారం-వెస్ట్‌ గాంధీనగర్‌ వచ్చారు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె హర్షిణి, కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. రోజు ఆటో నడిపే బిక్షపతి ఎందుకు తనలో ఉన్న నీచ బుడ్డి బయటికి తీశాడు. అతని వంకర బుద్దితో పక్కనే ఓ ఇంట్లో ఉన్న ఓ బాలిక పట్ల భిక్షపతి అసభ్యకరంగా వ్యవహరించేవాడు. ఆ బాలిక ఓపిక నశించిందో లేక ఎవరైనా బిక్షపతి అలా వ్యవహరిస్తుంటే చూశారో తెలియదు. ఈక్రమంలో గురువారం రాత్రి బిక్షపతిపై దాడి చేశారు. అనంతరం శుక్రవారం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి వెళ్లిపోయారు.    కట్ చేస్తే.. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. అందరి ముందు పరువుపోయిందనుకున్నాడు. ఆ అవమానం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఇంటికి వచ్చాడు. తొలుత తన భార్య, పిల్లలకు ఉరి వేశాడు. అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

అత్తా కోడలి గొడవ.. కోడలు మృతి.. ఇంకా ఏకాలంలో ఉన్నాం.. 

ఆమెకు పెళ్లి అయింది. మొగుడు, పెళ్ళాం  బాగానే  ఉన్నారు. ఇంట్లో మొగుడు తో బాధలేదు. ఉన్న తిప్పాలంతా ముసలి అత్తతోనే.. చివరికి ఆ అత్తే కోడలి ప్రాణానికి కారణం అయింది. ఆ యువతీ బంధువైన బావను ప్రేమించి పెళ్లి  పెళ్లి చేసుకుంది. భర్త తో ఊహించుకున్న జీవితం కట్టేకాలే వరకు ఉండలేకపోయింది. చివరికి అత్తా కోడళ్ల మధ్య వివాదంతో కలత చెందిన కోడలు తనను క్షమించమంటూ ప్రాణాలు విడిచింది..తన కడుపులో శిశువు ఉందనే కనీస ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళు ఇద్దరు బంధువులు. అయినా..ప్రేమించుకున్నారు..ఆ తర్వాత వారి ఇద్దరి  కుటుంబాలు గ్రీన్ సింగల్ ఇచ్చారు. ముందుకు వచ్చి ఆ  ఇద్దరికి పెళ్లి చేశారు..పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాలేదు..ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్యభర్తల మధ్య కొంచం ప్రేమ, ఇంకొంత మమకారం తో  అన్యోన్య జీవనం కొనసాగుతోంది..అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. తాఫీగా సాగుతున్న వారి సంసారంలో. చిన్నగా దగవలు స్టార్ట్ అయ్యాయి. అంటే అత్త మాత్రం కోడలిని సూటిపోటి మాటలు అంటోంది..మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తన కొడుకును సైతం అవమానాలకు గురిచేస్తోంది...దీంతో అటు భర్తను ఎదిరించలేక  ఇటు అత్తతో గొడవపడలేక తనువూ చాలించాలనుకుంది. అప్పుడు ఆమె  నాలుగు నెలల గర్భిని, అయిన ఆత్మహత్య చేసుకుంది. అంటే ఆమె ఎంత నరకవేదన అనుభవించిందో మరి. చివరికి చనిపోతూ బావ నీ బాధ చూడలేకే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. అది నిజామాబాద్ జిల్లా. దుబ్బక చెందిన యువతి మరియు సమీపంలోని ఖానాపూర్‌కు చెందిన సోంత మేనత్త కొడుకును ప్రేమించింది. గత సంవత్సరం జూన్ 16న పెళ్లి జరిపించారు....ఇటివల యువతికి,ఆమె అత్తకు మధ్య మనస్పర్థలు, గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో కోడలిని సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేసింది.అయితే అత్త మాటలు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది..దీంతో ఆమె అత్యక్రియలు సైతం నిర్వహించారు..ఇరు కుటుంబాలకు రక్త సంబంధం కావడంతో జారి పడిందని చెబుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు..దీంతో యువతి ఆత్మహత్యపై తల్లిదండ్రులు కూడ ఎలాంటీ వ్యక్తం చేయకపోవడంతోపాటు...పోలీసులకు కూడ ఎలాంటీ ఫిర్యాదులు కూడా చేయలేదు.. అయితే చివరికి ఆ యువతి ఆత్మహత్య చేసుకునే ముందు ఓ లేఖ రాసింది..ఆ లేఖలో నా చావుకు మా అత్తమ్మ కారణం అంటూ రాసింది. బావ నువ్వు బాధపడకు అంటూ భర్తకు ధైర్యం చెప్పింది..బావ నువ్వు బాధపడితే నేను చూడలేని చెప్పింది..అత్తకు ,తనకు మధ్య భర్త నలిగిపోవడం తాను చూడలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె ఆ లేఖలో పేర్కోంది..చనిపోతున్నందుకు భర్తతో పాటు అమ్మా,నాన్నలకు సారీ చెబుతు తనువు చాలించింది. కాని లేఖ బయటపడినా...పోలీసులకు చేరకపోవడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

హుజురాబాద్‌లో దుబ్బాక రిపీట్? కేసీఆర్ పై ఈటల డైరెక్ట్ వార్..

అనుమానాలు, ఊహాగానాలకు మాజీ మంత్రి ఈట‌ల రాజేందర్ తెర దించారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు రాజేందర్. ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో త్వరలో హుజురాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక‌తో హుజురాబాద్‌ను పోల్చి చూస్తున్నారు అంతా. ఆ రెండింటి మ‌ధ్య చాలా పోలిక‌లే క‌నిపిస్తున్నాయి. దుబ్బాక అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో ఉప ఎన్నిక జ‌రిగింది. ఆయ‌న భార్య కారు గుర్తుపై బ‌రిలో దిగింది. సానుభూతి ఓట్ల‌తో గెలుపు చాలా ఈజీ అనుకున్నారు కేసీఆర్‌. కానీ, ర‌ఘునంద‌న్‌రావు రూపంలో బీజేపీ దుమ్ము రేపుతుంద‌ని గులాబీ బాస్ అస్స‌లు ఊహించ‌లేక‌పోయారు. హుజురాబాద్‌లోనూ దుబ్బాక త‌ర‌హా ప‌రిస్థితులే ఉన్నాయంటున్నారు.  దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్ లానే.. హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ అన‌బ‌డే బ‌ల‌మైన ఉద్య‌మ నేత పోటీలో ఉన్నారు. అత‌ని వెనుక.. ఉద్య‌మ‌కారులు, క‌మ‌ల‌ద‌ళం తోడుగా ఉంది. దుబ్బాక ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ఘునంద‌న్‌రావుకు స‌హాయంగా ఆర్ఎస్ఎస్‌, బీజేపీ శ్రేణులు బూత్ స్థాయిలో గ్రౌండ్ వ‌ర్క్ బాగా చేశాయి. అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌ను, పోలీసుల ఆగ‌డాల‌ను బీజేపీ కేడ‌ర్ బ‌లంగా ఎదుర్కొంది. ఓ ఘ‌ట‌న‌లో ర‌ఘునంద‌న్ కోసం.. కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌లు రాత్రికి రాత్రే దుబ్బాక త‌ర‌లివ‌చ్చారు. బీజేపీ శ్రేణులంతా కలిసి ర‌ఘునంద‌న్‌ను గెలిపించుకుని కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చాయి. సేమ్ టూ సేమ్‌.. హుజురాబాద్‌లోనూ అలానే జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు కొంద‌రు.  ఈట‌ల రాజేంద‌ర్ కేసీఆర్‌కే స‌మ ఉజ్జీలాంటి నాయ‌కుడు. హుజురాబాద్ ఈట‌ల సొంత ఇలాకా. గ్రామ‌గ్రామాన కేడ‌ర్ ఉన్న ద‌మ్మున్న లీడ‌ర్. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా ఈట‌ల అనుచ‌రులే. కావ‌ల‌సినంత ఆర్థిక బ‌ల‌మూ ఆయ‌న సొంతం. పైగా టీఆర్ఎస్‌ నుంచి అన్యాయంగా, దారుణంగా, అవ‌మాన‌క‌రంగా వెళ్ల‌గొట్టార‌నే సానుభూతి కూడా ఉంది. ఇన్ని పాజిటివ్ అంశాలున్న ఈట‌ల‌ను హుజురాబాద్‌లో ఓడించాలంటే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా స్వ‌యంగా కేసీఆరే పోటీ చేసినా గెలిచే అవ‌కాశాలు త‌క్కువేన‌నేది ఈట‌ల వ‌ర్గీయుల ధీమా.  అంత ఈజీగా ఓడిపోతే ఆయ‌న కేసీఆర్ ఎలా అవుతారు? అనేవారూ ఉన్నారు. ఈట‌ల‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్పుడే కేసీఆర్‌కు తెలుసు ఉప ఎన్నిక త‌ప్ప‌ద‌ని. అందుకే, డే వ‌న్ నుంచే హుజురాబాద్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు గులాబీ బాస్‌. మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్‌, హ‌రీష్‌రావుకు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈట‌ల అనుచ‌రుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి.. వారికి ప్ర‌భుత్వ ప‌రంగా ఆశ‌లు చూపించి.. న‌యానో, భ‌యానో.. టీఆర్ఎస్‌లోనే ఉంటామని వారితో ప్ర‌క‌ట‌న‌లు చేయించి.. ఈట‌ల‌ను డిఫెన్స్‌లో ప‌డేసే ప్ర‌య‌త్నం చేశారు. స్థానికంగా ఉన్న ఈట‌ల వ్య‌తిరేక వ‌ర్గీయుల‌నూ త‌మ‌వైపున‌కు తిప్పుకునేలా పావులు క‌దుపుతున్నారు. ఆ దెబ్బ‌కే ఆయ‌న సొంత‌పార్టీ అనే ఆలోచ‌న వ‌దిలేసి.. కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు బీజేపీకి జై కొట్టారు. తాను సింగిల్‌గా పోరాడటంకంటే.. క‌మ‌ల‌ద‌ళంలో క‌లిసిపోతే.. దుబ్బాక మాదిరే.. హుజురాబాద్‌లోనూ బీజేపీ బ‌లం, బ‌ల‌గంతో గులాబీ బాస్ వ్యూహాల‌కు చెక్ పెట్టొచ్చ‌నేది ఈట‌ల స్కెచ్‌లా క‌నిపిస్తోంది

ఆత్మగౌరవం ఉంటే అప్పుడెందుకు రాజీనామా చేయలే!

టీఆర్ఎస్ పార్టీకి , హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కుటుంబ పాలన, దొర పాలనంటూ నిప్పులు చెరిగారు. బానిసలుగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. అయితే కేసీఆర్ పై రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు స్ట్రౌంగ్ కౌంటరిచ్చారు. ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ అని మండిపడ్డారు. అక్రమంగా సంపాందించిన తన ఆస్తులను కాపాడుకునేందుకు ఆత్మగౌరవమంటూ నాటకాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.  గతంలో ఈటల రాజేందర్ దేవుడని కీర్తించిన కేసీఆర్.. ఇప్పుడు దెయ్యం అయ్యారా అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గానూ ఈట‌ల‌కు అవ‌కాశం ద‌క్కింద‌న్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెండు సార్లు మంత్రిగా అవ‌కాశం ఇచ్చార‌ని  చెప్పారు. తెలంగాణ‌లో ఏ ప‌థ‌కం తీసుకురావాల‌ని చూసినా ఈట‌ల రాజేంద‌ర్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పేవారని, అందులో ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే చెప్పాల‌ని కోరేవారని అన్నారు. ఈట‌ల‌ను పార్టీ ఎంత‌గానో గౌర‌వించిందని పల్లా చెప్పారు.  ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి రానివ్వ‌లేద‌ని ఈట‌ల చెబుతున్నారని, అందులోకి రానివ్వ‌క‌పోతే మ‌రి అప్పుడే ఎందుకు రాజీనామా చేయ‌లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. కేసీఆర్‌పై ఎన్నో అస‌త్య ప్ర‌చారాలకు తెర‌దీశార‌ని ఆయ‌న చెప్పారు. గ‌తంలోనూ చాలా మంది నేత‌లు టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్తూ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని ఇప్పుడు ఈట‌ల కూడా వారినే అనుస‌రిస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  తెలంగాణ‌లో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని ఆయ‌న అన్నారు. ధాన్య సేక‌ర‌ణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్దంటే తాను కావాల‌న్నాన‌ని ఈట‌ల అస‌త్యాలు చెబుతున్నారని ఆయ‌న  విమర్శించారు.

కేసీఆర్ బాగోతం బయటపెట్టిన ఈటల 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సిఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు. శుక్రవారం తన నివాసంలో మీడియా మాట్లాడిన ఈటల.. కేసిఆర్ బాగోతం మొత్తం బయటపెట్టేశారు. తనకు కేసిఆర్ మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో చెప్పారు.  తనకు కేసిఆర్ కే కాకుండా హరీష్ రావుకు కూడా గ్యాప్ ఉందని, ఆయనను అనేకసార్లు అవమానించారని అన్నారు. కేసీఆర్ తో తన గ్యాప్ ఎలా వచ్చిందో వివరించారు రాజేందర్.  నేను, కరీంనగర్ నేతలంతా ఒక సమస్య మీద ప్రగతి భవన్ కు వచ్చినము.. టిఆర్ఎస్ లో 19 ఏండ్ల నుంచి ఉన్న. అన్నా అని కేసిఆర్ ను ప్రేమగా పిలిచే చనవు ఉంది నాకు. పెద్ద సమస్య కావడం, జిల్లా ప్రజా ప్రతినిధులందరం వెళ్తున్నం కాబట్టి అపాయింట్ మెంట్ తీసుకోకుండానే పోయినం. ఇంతమందిని కాదంటరా అనుకున్నం. కానీ అపాయింట్ మెంట్ లేదు కాబట్టి ప్రగతి భనవ్ కు రానీయలేదు. ఎంత అడిగనా కాదన్నారు.మరోసారి అపాయింట్ మెంట్ తీసుకుని వచ్చినం. కానీ అప్పుడు కూడా కలవనీయలేదు. అపాయింట్ మెంట్ ఉన్నా ఎందుకు రానీయలేదో నాకు అర్థం కాలేదు. ఆ సమస్య గురించి కేసిఆర్ కు చెప్పుకునేందుకు మూడోసారి వచ్చినం. అప్పుడు అనిపించింది.. ఇంత ఉద్యమ సహచరుడిగా చనువున్నా.. ఇప్పుడు ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నారో అనుకున్నాను. అప్పటినుంచే ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవు. ఒక మంత్రి పదవి అంటే బానిస కంటే హీనంగా ఉంటదా అని నాకు అప్పుడు అనిపించింది. కుక్కిన పేనులా పడి ఉంటే ఉండాలి. ఆత్మగౌరవం చంపుకుని అక్కడ ఉండలేను అనుకున్నా.. అని ఈటల రాజేందర్ చెప్పారు.  మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్‌ను అడిగాను. అది ప్రగతి భవన్‌ కాదు.. బానిస భవన్ అని పేరు పెట్టుకోవాలని చెప్పా. సీఎంవోలో ఒక్క బీసీ కానీ.. ఎస్సీ అధికారి ఉన్నారా? బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు? రాష్ట్రం కోసమే ఇన్నాళ్లు అవమానాలు భరించా. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు కావాలి.. ఇప్పుడు సంఘాలు వద్దా? బొగ్గు గనులతో సంబంధం లేని వ్యక్తులు ఆ సంఘాన్ని నడుపుతున్నారు అని ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం చాలా సార్లు నేను రాజీనామా చేశాను. గ‌తంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే గెలిచింది కేవ‌లం ఏడుగురే. అప్ప‌టి సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అసెంబ్లీలో న‌న్ను అవ‌హేళ‌న చేశారు. క‌నీసం 10 సీట్లు కూడా గెల‌వ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా స‌రే తెలంగాణ ఆత్మ‌గౌర‌వం మీద దెబ్బ‌కొడితే రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాం. ఉద్య‌మ‌కారుల‌ను క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు గెలిపించారు' అని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.

బానిస భవన్ బద్దలు కొడతాం.. కాస్కో కేసీఆర్!  

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నుంచి ఎన్ని సార్లు బీ-ఫారం ఇచ్చినా గెలిచానని చెప్పారు. కేసీఆర్ కుమార్తెకు బీ-ఫారం ఇచ్చినా ఓడిపోయిందన్నారు. ఎన్నిసార్లు రాజీనామా చేయాల‌ని ఆదేశించినా.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం చాలా సార్లు నేను రాజీనామా చేశాను. గ‌తంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే గెలిచింది కేవ‌లం ఏడుగురే. అప్ప‌టి సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అసెంబ్లీలో న‌న్ను అవ‌హేళ‌న చేశారు. క‌నీసం 10 సీట్లు కూడా గెల‌వ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా స‌రే తెలంగాణ ఆత్మ‌గౌర‌వం మీద దెబ్బ‌కొడితే రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాం. ఉద్య‌మ‌కారుల‌ను క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు గెలిపించారు' అని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టంచేశారు.తనకు పదవులు త్రుణప్రాయమన్నారు. ఎన్నికల బరిలో దిగిన ప్రతిసారి.. తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచివచ్చానని చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఏమొచ్చిందని ఈటల ప్రశ్నించారు. మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని... 19 ఏళ్లుగా టీఆర్ఎస్ లో ఉన్న తనను కూడా అగౌరవపరిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల మండిపడ్డారు. కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్తే... గేటు వద్దే తనను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం నుంచే అవమానించడం ప్రారంభించారని... మంత్రినైన తనకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో  ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్‌... ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చని... అంతిమవిజయం ధర్మానిదేనన్నారు. తనను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న హరీశ్‌రావుకు కూడా అవమానం జరిగిందని ఈటల వివరించారు. ప్రగతి భవన్‌ బానిసల నిలయంగా మారిందని ఆరోపించారు. ఉద్యమంలో ఉన్నవారిని అణిచివేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఈటల విమర్శించారు.  మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ ల పార్టీల్లాంటిది టీఆర్ఎస్ కాదని... ఎంతో మంది ఉద్యమకారుల త్యాగఫలంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సీఎం ఎస్సీ అని చెప్పారు. సీఎంవో కార్యాలయంలో ఒక్క ఎస్సీనైనా, ఎస్టీనైనా ఉన్నారా? సీఎంవో కార్యాలయంలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి ఉన్నారా? అని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీవోలు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రయోజనం కలిగించేలా అనేక సంఘాలు పెట్టించాం. బొగ్గు కార్మికులతో ఎలాంటి సంబంధం లేనివారు సంఘం నాయకులుగా ఉన్నారు. తెలంగాణ గడ్డమీద సంఘాలు, సమ్మెలు ఉండొద్దని కోరుకున్నారని ఈటల రాజేందర్​ అన్నారు.సమ్మెలు చేసినా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆరోపించారు.  ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటల చెప్పారు. ఆర్థిక మంత్రిగా తాను ఉన్నప్పుడు తాను చేసిన సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ప్రజలు అహింసాయుతంగా నిరసన తెలిపే ధర్నాచౌక్ ను కూడా ఎత్తేసిన ఘనత కేసీఆర్ దని మండిపడ్డారు.  సంక్షేమ పథకాలను తాను ఏనాడూ వ్యతిరేకించలేదని... అయితే, బెంజ్ కార్లలో తిరిగే వారికి కూడా రైతుబంధు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించానని చెప్పారు. రైతుబంధును ఆదాయ పన్ను చెల్లించేవారికి ఇవ్వొద్దని చెప్పానని, వ్యవసాయం చేయనివారికి రైతుబంధు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు. పొలం సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు ఇస్తే బాగుంటుందని సలహా ఇస్తే పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనే స్థాయి రైస్ మిల్లర్లకు లేదని, రాదని అన్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం తన తప్పా? అని ప్రశ్నించారు. మంత్రుల మీదే నమ్మకం లేని కేసీఆర్ కు... నాలుగు కోట్ల ప్రజలను పాలించే హక్కు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. సమ్మెలు చేయకుండా ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అడ్డుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. తనది నక్సలైట్ అజెండా అని కేసీఆర్ చెప్పుకున్నారని... కానీ, వరవరరావును జైల్లో పెడితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఈటల విమర్శించారు

పెళ్లికి ముందు రోజు.. వరుడు ఉరి..

ఈ ప్రపంచంలో అన్నింటికంటే మానవ జన్మ పవిత్రమైనది. దేవుడు ఇచ్చిన ఆ జీవితాన్ని అనుభవించకుండా చాలా మంది చనిపోతున్నారు. చనిపోవడం అనే మాట పక్కన పెడితే ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పెళ్లి ఏర్పాట్లు ఒక వైపు, వరుడి చాడు మరో వైపు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏందో చూద్దాం. బంధువులు కుటుంబ సభ్యులు  పెళ్లి ఏర్పాట్లు సందడిగా జరుగుతున్నాయి. బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. అదే సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తెల్లవారితే పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అది రంగారెడ్డి జిల్లా. తలకొండపల్లి మండలం. మెదక్‌పల్లి. ఈ గ్రామానికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కుమారుడు శ్రీకాంత్‌ గౌడ్‌. అతని వయసు 25 ఏళ్ళు. శ్రీకాంత్  కు కందుకూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితో 4వ తేదీన వివాహం చేయడానికి ముహూర్తం నిశ్చయించారు. కుటుంబ సభ్యులు అంత పెళ్లి పనుల్లో మునిగారు. పెళ్లి బజంత్రీలు వినిపించాల్సిన ఆ ఇంట్లో సావు సప్పుడు వినిపించాయి. నవ్వులు పుయ్యాల్సిన ఆ ఇంట్లో ఏడుపులు వినిపించాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.. కొత్తగా నిర్మించిన ఇంటి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు గురువారం తెల్లవారుజామున పందిరి వేసే పనుల్లో ఉన్నారు. పాత నివాసంలో నిద్రిస్తున్న శ్రీకాంత్‌గౌడ్‌ దగ్గరికి అతని అన్న రాజు వెళ్లి పందిరి కొమ్మలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పాడు. రాజు తిరిగి వచ్చే సరికి ఇంట్లో శ్రీకాంత్‌ ఉరేసుకుని ఉండటంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే శ్రీకాంత్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.   

హరీష్ రావును వేధించారు.. ఏడ్పించారు!  ఈటల సంచలనం.. 

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై  సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. టీఆర్ఎస్ నేతలంతా అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తాను ఐదేండ్లుగా అవమానాలు భరిస్తూ వచ్చానన్నారు.  మంత్రిగా కూడా తమకు ప్రగతి భవన్ వెళ్లే అవకాశం లేదన్నారు. ఎన్నోసార్లు సీఎంను కలవడానికి వెళ్లి... అపాయింట్ మెంట్ రాకపోవడంతో తిరిగొచ్చామని తెలిపారు. బానిసగా ఉన్న మంత్రి పదవి ఎందుకని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆగం కావద్దనే అవమానాలను భరిస్తూ వచ్చానని చెప్పారు ఈటల రాజేందర్.  తననే కాదు హరీష్ రావును కేసీఆర్ కుటుంబం వేధించిందన్నారు ఈటల రాజేందర్. ఎన్నోసార్లు హరీష్ రావు తన ముందు ఏడ్చారని చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు సైలెంటుగా ఉన్న.. అతని కుటుంబ సభ్యులకు జరిగిందంతా తెలుసన్నారు. ప్రగతి భవన్ కాదు అది బానిస్ భవన్ అన్నారు రాజేందర్. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి కూడా లేరన్నారు. వైద్యశాఖ మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తారా అని రాజేందర్ ప్రశ్నించారు.  తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కారు సింబల్ పై గెలిచిన హుజూరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు ఈటల రాజేందర్.  అనామకుడు లేఖ రాస్తే మంత్రిపై విచారణ జరిపిస్తారా అని ఈటల ప్రశ్నించారు. ఉరి శిక్ష పడిన ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతురాని.. కాని తనను మాత్రం కనీసం వివరణ కూడా అడగకుండానే మంత్రివర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజల మద్దతు తనకు ఉందన్నారు. 

ప్రియుడి మోజు.. కూతురు కేసు.. ఈ తల్లి మహా ముదురు...

ప్రియుడి మోజులో మునిగి ఇటు ఆడవాళ్లు, ప్రియురాలి ముసుగులో పడి మగవాళ్లు, ఈ మధ్య కాలంలో చాలా దారుణాలు చేస్తున్న విషం తెలిసిందే.. ఆ వార్తలు లేకుండా న్యూస్ ఉండదు న్యూస్ పేపర్ ఉండదు. ఇక వెలుగులోకి రాని సంఘటనలు అయితే చెప్పనక్కర్లేదు. ఆమెకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేసింది. ఆ ప్రాసెస్ లో రెండురోజుల నుంచి కూతురు కనిపించడం లేదు. ఆ విషయమై కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు., స్థానికులు నిలదీశారు. ఆ తర్వాత ఆ  దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం వార్త చదవండి..   ఓపెన్ చేస్తే.. అది విశాఖ నగరం. బొద్దాన రమేష్, వరలక్ష్మి భార్యాభర్తలు. ఐదేళ్ల కిందట పెళ్లి అయింది. ఆ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది ఆ అమ్మాయి పేరు సింధు. రమేష్ తాపీమేస్త్రీగా చేసుకుంటే కుటుంబాని పోషిస్తున్నాడు. తన భార్య వరలక్ష్మి కోస్టల్ ఫుడ్స్ కంపెనీలో పనిచేసేది. వాళ్ళ జీవితం ఏ ఆటంకాలు లేకుండా సాగుతున్న సమయంలో.. ఆమె ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అంటని పేరే బోర జగదీష్ రెడ్డి. పరిచయం ముందు దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ పరిచయంతో దగ్గరైనట్లు వరలక్ష్మి , జగదీశ్ రెడ్డి దగ్గరయ్యారు. వరలక్ష్మి భర్తకు తెలియకుండా  జగదీశ్ రెడ్డి తో మసక మసక చీకటిలో మల్లెతోనా వెనకాల అంటూ  ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. జగదీష్‌కి అప్పటికే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక అక్కడైతే ఆగక  కోవెక్కిన వరలక్ష్మి గత మార్చి 14న ప్రియుడు జగదీష్‌తో వెళ్లిపోయింది. కొద్దిరోజులకి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 14న మళ్లీ వచ్చిన జగదీష్.. ప్రియురాలిని, ఆమె కూతురు సింధుని తీసుకుని వెళ్లాడు. రెండు రోజుల కిందట భర్త రమేష్‌కి ఫోన్ చేసింది.  కట్ చేస్తే.. తమ కూతురు చనిపోయిందని వరలక్ష్మి చెప్పింది. భార్య మాటలపై భర్తకు  అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాప ఏమైందని ప్రశ్నించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల కిందట పాపను అతి కిరాతకంగా హత్య చేసి.. అర్ధరాత్రి వేళ శ్మశానంలో పూడ్చిపెట్టినట్లు తేలింది. పాప మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. చిన్నారి మెడ, శరీరంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ప్రియుడి మోజులో కన్నకూతురిని కిరాతకంగా చంపేసిందని తెలియడంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితులు వరలక్ష్మి, ఆమె ప్రియుడు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పార్లమెంటుపైనే ఏపీ సర్కార్ దాడి! ఎంపీలకు రఘురామ రాజు లేఖలు.. 

రాజద్రోహం కేసులో అరెస్ట్ అయి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీ వేదికగా తన పోరాటం కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి ఆయన ఫిర్యాదుల మీదు ఫిర్యాదులు చేస్తున్నారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రఘురామ కష్ణరాజు ఏపీ బార్‌కౌన్సిల్‌కు కంప్లైంట్  చేశారు.తాజాగా వివిధ పార్టీల ఎంపీలు, పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తోపాటు సభ్యులకు లేఖలు రాశారు ఎంపీ రఘురామ రాజు. తన అరెస్ట్, తదనంతర పరిణామాల గురించి ఆ లేఖల్లో వివరించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ఎత్తిచూపినందుకే తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఏపీ సీఎం జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులు ఉన్నాయని, వాటిలో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారని రఘురామ గుర్తు చేశారు. ఆయనతోపాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని లేఖలో పేర్కొన్నారు.వ్యక్తిగత కక్షతోనే తనపై రాజద్రోహం కేసు నమోదు చేశారని రఘురామరాజు ఆరోపించారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న తనపై ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని చెప్పారు. కాళ్లపై లాఠీలు, రబ్బరు బెల్టులతో కొట్టారన్నారు. ఈ సందర్భంగా కాళ్లు గాయాలయ్యాయంటూ వాటి ఫొటోలను లేఖలకు జత చేశారు. ఒక ఎంపీపై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు. ఎంపీ రఘురామ రాజు నుంచి తనకు అందిన లేఖను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్ ట్విట్టర్‌లో పెట్టడంతో లేఖల విషయం వెలుగుచూసింది. ఈ లేఖను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని మాణికం ఠాగూర్ అన్నారు. ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమన్నారు. ఎంపీకే ఇలా జరిగితే సామాన్య రాజకీయ కార్యకర్తల పరిస్థితి ఏంటని మాణికం ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీలోకి మరో కీలక నేత? 

తెలంగాణ బీజేపీలోకి వలసల జోరు కనిపిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపోమాపో కమలం గూటికి చేరనుండగా.. ఆయనతో పాటు టీఆర్ఎస్ లోని పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ , జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ ఈటలతో కలిసి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. రాజేందర్ దారిలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరనున్నారని సమాచారం.  2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చేవెళ్ల ఎంపీగా గెలిచారు కొండాయ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న కొండా.. గురువారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో ఆమె ఫాంహౌస్‌లో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డిని అరుణ బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కొండా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ వంటి నేతలతో చర్చలు జరిపారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత రాజేందర్ తోనూ పలు సార్లు సమావేశమయ్యారు. దీంతో ఈటల, కొండా కలిసి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. అయితే రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఈటల దారిలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని డిసైడయ్యారు. తాజా చేరితలతో తెలంగాణలో బీజేపీకి మరింత బూస్ట్ వచ్చినట్లే. 

ఈటల రాజేందర్ హ్యాండ్సప్! హుజురాబాద్ లో పోటీ లేనట్టే?  

తెలంగాణ రాజకీయాలన్ని ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ తొలగించినప్పటి నుంచి రోజుకో కీలక పరిణామం జరుగుతూనే ఉంది. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కొన్ని రోజులు సాగింది. కాంగ్రెస్ నేతలతో రాజేందర్ టచ్ లోకి వచ్చారనే చర్చ జరిగింది. తర్వాత కమలం గూటికి చేరుతున్నారని చెప్పుకున్నారు. చివరకి రాజేందర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే ఖాయమైంది. ఢిల్లీకి వెళ్లి కమలం పెద్దలతో చర్చలు కూడా జరిపారు. రేపుమాపో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడమే మిగిలి ఉంది.  ఈటల బీజేపీలో చేరనుండటంతో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. రాజేందర్ బీజేపీలో చేరినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావడం లేదు. రాజేందర్ రాజీనామా ఇప్పుడే ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం ఆసక్తిగా మారింది. అయితే తాజాగా ఈటల అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం పక్కా అని తెలుస్తోంది. రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికలో మాత్రం రాజేందర్ పోటీ చేయరని చెబుతున్నారు.  హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన సతీమణి జమునను పోటీలో నిలిపే యోచనలో ఈటల ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  ఈటల బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే దుబ్బాక ఉప ఎన్నిక మాదిరిగా టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈటలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని భావిస్తున్న గులాబీ బాస్ ... ఇప్పటికే హుజురాబాద్ పై ఫోకస్ చేశారు. ఈటల వెంట టీఆర్ఎస్ నేతలు ఎవరూ వెళ్లకుండా ముఖ్యనేతలను రంగంలోకి దింపారు. మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా ఈటల నియోజకవర్గంపైనే దృష్టి సారించగా.. ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తనకు అత్యంత సన్నిహితుడైన హరీష్ రావును మోహరించడంతో.. పోటీపై ఈటల వెనుకాడుతున్నారని తెలుస్తోంది.  తన రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ జీవితం సమాధి అయినట్లేనని రాజేందర్ కుడా భయపడుతున్నారట. ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు అద్బుతంగా ఉంటాయని చెబుతారు. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చిత్తుగా ఓడించింది అధికార పార్టీ. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రాజేందర్ కు తెలుసు కాబట్టే ఆయన వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అందుకే తనకు రాజకీయంగా ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో పాటు జమునను పాలిటిక్స్ లోకి అరంగ్రేటం చేసే యోచనలో రాజేందర్ ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాల ముందు జమున ఓడినా.. పెద్దగా నష్టం ఉండదనే ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.  హుజురాబాద్ లో పోటీపై తన అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలకు కూడా రాజేందర్ చెప్పారని.. వాళ్లు కూడా సానుకులంగా స్పందించారని తెలుస్తోంది. ఈటల సూచనతో నియోజకవర్గంలో ఇప్పటికే జమున తన యాక్షన్ మొదలు పెట్టారని కూడా చెబుతున్నారు. గతంలోనూ హుజురాబాద్ పార్టీ కార్యక్రమాలను జమున చూసేవారని తెలుస్తోంది. మంత్రిగా ఈటల బిజీగా ఉండటంతో.. నియోజకవర్గ పనులను ఆమె చక్కపెట్టేవారని అంటున్నారు. ఈటల అనుచరులతోనూ జమునకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జమునను పోటీ చేయించాలని రాజేందర్ ప్రయత్నించారనే టాక్ కూడా ఉంది.

టీటీడీ చైర్మన్ గిరి వద్దంటున్న వైవీ! జగన్ తో విభేదాలే కారణమా.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు గతంలో సన్నిహితంగా ఉన్న నేతలంతా ఆయనకు దూరమయ్యారని తెలుస్తోంది. వైసీపీ టాప్ లీడర్లలో ఒకరిగా చెప్పుకునే ఎంపీ విజయసాయి రెడ్డితో సీఎం జగన్ కు గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. కొన్ని రోజులుగా సాయి రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం లేదని చెబుతున్నారు. తనపై నిఘా పెట్టారనే మనస్తాపంతో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. జగన్ తో క్లోజ్ గా ఉండటం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తాజాగా మరో సీనియర్ నేత కూడా జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న పదవి రెన్యూవల్ కు కూడా ఆ నేత ఇష్టపడటం లేదని సమాచారం.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కీలక నేతగా ఉన్నారు వైవీ సుబ్బారెడ్డి. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడంతో ఆర్థిక వనరులను వైవీనే సమకూర్చారని చెబుతారు. 2014లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు సుబ్బారెడ్డి. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‍గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మరి కొద్దిరోజులలో ముగియనుంది. అయితే తనకు టీటీడీ ఛైర్మన్‍ పదవి పొడిగింపు అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి... ముఖ్యమంత్రి జగన్ కు చెప్పారని అంటున్నారు. తాను పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని కూడా స్పష్టం చేశారట. టిటిడి ఛైర్మన్‍గా మరో రెండేళ్లు కొనసాగినా చేసేది ఏమీ లేదని.. రాజకీయంగా ఇప్పటికే దెబ్బ తిన్నానని.. వైవి సుబ్బారెడ్డి తన సన్నిహితులతో తెర వెనుక చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీలో సెగలు రేపుతోంది.  వైవీ సుబ్బారెడ్డి బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. 2014 ఎన్నికలలో తాను ఎంపీగా ఒంగోలు నుండి విజయం సాధించినప్పటికీ.. 2019లో మళ్లీ ఆయనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకున్న మాగంటి శ్రీనివాసరెడ్డికి జగన్‍ రెడ్డి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. జగన్ తీరుపై అప్పుడో వైవీ తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. అయితే కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని.. వైవీని కూల్ చేశారని చెబుతున్నారు. తర్వాత టీటీడీ చైర్మెన్ పదవి ఇవ్వడంతో ఆయన శాంతించారు. ఇటీవల కాలంలో పార్టీలో తన ప్రాధాన్యత తగ్గడంతో వైవీ సుబ్బారెడ్డి మళ్లీ అలక బూనారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం సీఎం జగన్ తో వైవీ సుబ్బారెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు.  2022 మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో తనకు రాజ్యసభ సీటు కావాలని సుబ్బారెడ్డి అడుగుతున్నారని, జగన్ కూడా హామీ ఇవ్వడంతో టీటీడీ చైర్మన్ పదవి రెన్యూవల్ కోరుకోవడం లేదని అంటున్నారు.

టీపీసీసీ కథ మళ్ళీ మొదటికి? గాంధీభవన్ లో కోవర్టుల కిరికిరి... 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుని ఎంపిక వ్యవహారం, పార్టీలో కలకలం లేపుతోంది. ముఖ్యంగా, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు  ఖరారైందని,  ఢిల్లీ నుంచి సమాచారం అందుతున్న నేపధ్యంలో, గతంలో ఒక సారి రేవంత్ రెడ్డి ఆశలపై అగ్గినీళ్లు చల్లిన పాత కాపులు, మళ్ళీ మరోసారి ఆయనకు పీసీసీ పీఠందక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంత రావు, రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని నేరుగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీనే ప్రశ్నించారు. ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ రాసిన వీహెచ్, రేవంత్ పై కేసులున్నాయని, రేపు అయన జైలుకు పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అంతే కాదు, 44 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనను, నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అనుచరులు , ఫోన్ చేసి బెదిరిస్తునారని, బూతులు తిడుతున్నారని, రేపు అయన పీసీసీ చీఫ్ అయితే పార్టీ సీనియర్ నాయకులకు గాంధీ భవన్’లో ఎంట్రీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వీహెచ్ పార్టీ మీద కూడా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పిెచాలని పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని, అయినా పీసీసీ నేతలు ఎవరు రేవంత్ అనుచరుల బహిరంగ హెచ్చరికలను ఖండించలేదని అన్నారు.  అసలు పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ మండిపడ్డారు. కోవర్టులు ఉన్నన్ని రోజులు పార్టీ ఎదగదని కుండ బద్దలు కొట్టారు వీహెచ్.  వీహెచ్ వ్యవహారం ఇలా ఉంటే, రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు, ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే, పీసీసీ అధ్యక్షుని ఎంపికకు, ‘అభిప్రాయ సేకరణ’ అనే కొత్త పద్దతిని తీసుకొచ్చారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎంపిక తర్వాత  గతంలోలాగా విబేధాలు  భగ్గుమనకుండా ఉండేందుకే, రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అభిప్రాయ సేకరణ చేసి, పీసీసీ చీఫ్’ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు చెపుతున్నా,ఆ వంకన మళ్ళీ మరోమారు, మొత్తం ప్రక్రియను మొదటికి తెచ్చేందుకే, అభిప్రాయ సేకరణను తెరమీదకు తెచ్చారన్న అనుమానాలు లేకపోలేదు.దీంతో, రేవంత్’కు పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయం మరి  కొంత కాలం వాయిదా పడుతుందని, పాత కాపులకు  కావలసింది కూడా  అదేనని అంటున్నారు.  జూన్ 9వ తేదీన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, మాణిక్య ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ హైదరాబాద్ చేరుకొని, ప్రస్తుత పీసీసీ మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, పోటీచేసి ఓడిపోయినా అభ్యర్ధులు, జిల్లా, మండల,ఆ క్రింది క్షేత్ర స్థాయి నాయకులు ఇలా అందరి అభిప్రాయలు సేకరించి, ఢిల్లీకి నివేదిస్తారు.ఈలోగా, కుర్చీలు గాలిలో ఎగరడం, మినీ, మహా సంగ్రామలు, మాటల యుద్ధం, ఇలా   ఏదైనా జరగవచ్చును.ఆ వంకన పీసీసీ ఎంపిక మళ్ళీ వాయిదా పడినా పడవచ్చును అని , అనుమానించే వారు  అనుమానిస్తున్నారు. సో.. పీసీసీ అధ్యక్ష ఎంపిక ..అంత ఈజీ కాదు.  మరో వైపు గతంలో వివిధ స్థాయిల్లో పరిశీలించి, అధిష్టానానికి షార్ట్ లిస్టు పంపిన తర్వాత, మళ్ళీ రెడ్దొచ్చి మొదలాడు అన్నట్లు, మళ్ళీ మరోమారు అభిప్రాయ  సేకరణ ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి  రేవంత్ రెడ్డి లేదా  తాము కూడా రేసులో ఉన్నామని చెప్పుకుంటున్న కోమటి రెడ్డి, జగ్గా రెడ్డి లేదా మరొకరు, ఎవరైనా, మరి కొంత కాలం నిరీక్షించక తప్పదు.. 

రేవంత్‌రెడ్డిలానే ఈట‌ల! కేసీఆర్ ప‌గ‌ప‌డితే..! హుజురాబాద్‌లో కొడంగ‌ల్ స్ట్రాట‌జీ?

కొడంగ‌ల్‌. ఈ పేరు విన‌బ‌డ‌గానే అంతటా అటెన్ష‌న్. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కొడంగ‌ల్ ఎల‌క్ష‌న్ తెలుగు స్టేట్స్‌లో మారుమోగిపోయింది. ఉప ఎన్నిక కాక‌పోయినా.. కేసీఆర్ ప‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో.. కేసీఆర్‌ను బ‌ల‌మైన నేత ఢీ కొడితే ఎట్టా ఉంటాదో.. చెప్ప‌డానికి కొడంగ‌లే బెస్ట్ ఎగ్జాంపుల్‌.  డైన‌మిక్ లీడ‌ర్ రేవంత్‌రెడ్డిని అసెంబ్లీకి రానీకుండా ఎలాగైనా ఓడ‌గొట్టాల‌ని కేసీఆర్ పంతం ప‌ట్టాడు. రాజ‌కీయ‌, అధికార బ‌లాన్నంతా కొడంగ‌ల్‌లో మోహ‌రించారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు.  రేవంత్‌రెడ్డిని కాలు ముందుకు క‌ద‌పనీయ‌కుండా అడుగ‌డుగునా మోకాల‌డ్డారు. రేవంత్‌రెడ్డిని కేసుల‌తో క‌ట్ట‌డి చేసి.. కొడంగ‌ల్‌ను ఖాకీల‌తో నింపేసి.. నోట్ల క‌ట్ట‌లు వెద‌జ‌ల్లి.. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసి.. కారు పార్టీ విజ‌యం సాధించిందని చెబుతారు. రేవంత్‌రెడ్డిని అసెంబ్లీకి రాకుండా చేయ‌గ‌లిగారు కానీ, ఆ త‌ర్వాత ఆ చిచ్చ‌ర‌పిడుగు రేవంత్‌రెడ్డి ఈసారి ఏకంగా పార్ల‌మెంట్‌కే ఎగ‌బాకి.. కేసీఆర్‌కు చుక్క‌లుచూపించే ప‌నిలో ఉన్నాడు. అది వేరే విష‌యం.  ఈట‌ల రాజేంద‌ర్‌ది సైతం రేవంత్‌రెడ్డితో పోల్చ‌గ‌ల అంశమే. రేవంత్‌రెడ్డిలాగానే ఈట‌ల‌పైనా కేసీఆర్ కసితో ఉన్నారు. రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కాల‌ని ప‌గ‌బ‌ట్టారు. ఉప ఎన్నిక వ‌స్తే.. రేవంత్‌రెడ్డిని చేసిన‌ట్టే.. ఈట‌ల‌ను సైతం అసెంబ్లీకి రాకుండా చేయాల‌ని చూస్తున్నారు. కొడంగ‌ల్‌లో అధికార బ‌లంతో గెలిచిన‌ట్టే.. హుజురాబాద్‌లో బై పోల్ జ‌రిగితే ఏదోవిధంగా విజ‌యం సాధించాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే హుజురాబాద్ ఇంచార్జ్ గా హరీష్ ను రంగంలోకి దింపుతున్నారు గులాబీ బాస్. కేసులు, పోలీసులు, కుట్ర‌లు, పైస‌లు.. ఇలా దాదాపు అన్ని విష‌యాల్లోనూ గ‌త కొడంగ‌ల్ ఎన్నిక‌ల స్ట్రాట‌జీనే.. రాబోవు రోజుల్లో హుజురాబాద్‌లోనూ అధికార పార్టీ అమ‌లు చేస్తుంద‌ని అంటున్నారు. అయితే, జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్‌లోనూ టీఆర్ఎస్.. కొడంగ‌ల్ మోడ‌ల్‌నే ఇంప్లిమెంట్ చేసింది. అధికార పార్టీ త‌ర‌ఫున మామూలు అభ్య‌ర్థుల‌నే నిల‌బెట్టింది. కానీ, వారికి పార్టీ ద‌న్నుగా నిలిచింది. గెలిపించుకుంది. హుజురాబాద్‌లోనూ ఈట‌ల స్థాయికి స‌రితూగే అభ్య‌ర్థి టీఆర్ఎస్‌లో లేకున్నా.. ఎవ‌రినైనా నిల‌బెట్టి గెలింపుంచుకోగ‌ల‌మ‌నే ధైర్యం అధికార పార్టీలో క‌నిపిస్తోంది.  కొడంగ‌ల్‌లో రేవంత్‌రెడ్డి మీద ప్ర‌యోగించిన‌ట్టే.. దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్‌రావుపై కేసుల‌తో కుట్ర చేయ‌డం.. ఖాకీల‌తో క‌ట్ట‌డి చేయ‌డం.. డ‌బ్బులు గుప్పించ‌డం.. అంతా సేమ్ టూ సేమ్‌. ఒక్క‌టే డిఫ‌రెన్స్. కొడంగ‌ల్‌లో మాదిరి భ‌య‌పెడితే బెదిరిపోడానికి.. దుబ్బాక‌లో ఉన్న‌ది కాంగ్రెస్ కాదు.. క‌మ‌ల‌నాథులు. కొడంగ‌ల్‌లో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్‌కు వెన్నుపోటు పొడిస్తే.. దుబ్బాక‌లో బీజేపీ కేడ‌ర్ ర‌ఘునంద‌న్‌రావుకు వెన్నంటే నిలిచింది. రాజ్యం కుట్ర‌ల‌ను, కుతంత్రాల‌ను బ‌లంగా తిప్పికొట్టింది. హుజురాబాద్‌లోనూ ఈట‌ల‌కు బీజేపీనే శ్రీరామ‌ర‌క్ష అంటున్నారు.  అయితే, కొడంగ‌ల్‌కు, దుబ్బాక‌కు మ‌ధ్య మ‌రోతేడా కూడా ఉంది. కొడంగ‌ల్‌పై కేసీఆర్ స్వ‌యంగా ఫోక‌స్ పెట్టారు. రేవంత్‌రెడ్డిని ఓడించే వ‌ర‌కూ ప‌ట్టు వ‌ద‌ల‌లేదు. కానీ, దుబ్బాక ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను మంత్రి హ‌రీష్‌రావుకు అప్ప‌గించి కేసీఆర్ సైడ్ అయిపోయారు. క‌నీసం ప్ర‌చారానికి కూడా వెళ్ల‌లేదు. కేటీఆర్ సైతం అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదు. అందుకే, దుబ్బాక ఓట‌మిని కేసీఆర్ ఖాతాలో కాకుండా హ‌రీష్‌రావు మెడ‌కు త‌గిలిస్తున్నారు గులాబీ శ్రేణులు.  అందుకే, దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్‌, కొడంగ‌ల్ ఎన్నిక‌లు జ‌రిగిన తీరును బ‌ట్టి.. హుజురాబాద్‌ ఉప ఎన్నిక వ‌స్తే ఫ‌లితం ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తాకు, బీజేపీ బ‌ల‌గాలు తోడైతే.. దుబ్బాక ఫ‌లిత‌మే హుజురాబాద్‌లోనూ రిపీట్ అవుతుందా? లేక‌, కొడంగ‌ల్‌, నాగార్జున సాగ‌ర్‌ల మాదిరి.. కేసీఆర్ స్పెష‌ల్ ఫోక‌స్ పెడితే.. కారు జోరు పెరుగుతుందా?

టెట్ స‌ర్టిఫికెట్ ఇక లైఫ్ టైమ్.. టీచర్ అభ్యర్థులకు కేంద్రం వరం

విద్యాశాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేసిన మోడీ సర్కార్ .. తాజాగా టెట్ ( Teacher Eligibility Test) స‌ర్టిఫికెట్ గ‌డువును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు.ఏడేళ్ల కాల‌ప‌రిమితి ముగిసిన వారికి మ‌ళ్లీ స‌ర్టిఫికెటు ఇవ్వాల‌ని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్ర విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసింది.  కేంద్ర సర్కార్ నిర్ణయంతో 2011 నుంచి టెట్ స‌ర్టిఫికెట్ పొందిన అభ్య‌ర్థుల‌కు జీవిత‌కాలం అర్హ‌త వ‌ర్తించ‌నున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) క్వాలిఫై కావడం తప్పనిసరి. దీంతోపాటు వ్యాలిడిటీని కూడా చూస్తారు. టెట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, కేంద్రం (CTET) కూడా వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఈ టెట్ సర్టిఫికెట్ వేలిడిటీ ఏడేళ్లు అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE 2011లో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రస్తుతం దాని మార్కుల విలువ ఏడేళ్ల వరకు ఉంది. ఆలోపు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు ఎంపిక కాకుంటే ఆ పరీక్షను మళ్లీ రాయాల్సిందే. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) తాజాగా టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా నిర్ణయించింది. ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షల మందికి ఊరట కలగనుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీఈ 50వ సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్ణయించారు. కేంద్ర సర్కార్ తాజా నిర్ణయం తెలంగాణ ఉపాధ్యాయ అభ్యర్థులకు వరంగా మారనుంది. రాష్ట్రంలో చాలా కాలంగా టెట్ నిర్వహించడం లేదు. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల టెట్ కాల పరిమితి ముగిసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావించింది. అయితే టెట్ నిర్వహించకపోవడం అడ్డంకిగా మారింది. కోవిడ్ పరిస్థితుల్లో ఇప్పట్లో టెట్ నిర్వహించడం కూడా అసాధ్యమే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలన్నది గందరగోళంగా మారింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో ఇప్పుడా సమస్య తీరినట్లే. 

యూపీ సీఎంపై వేటు? కొవిడ్ కట్టడిలో విఫలమే కారణం? 

దేశంలో కొవిడ్ 19 ఉదృతి కొంత తగ్గుముఖం పట్టినా ... కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి అలాగే కొనసాగుతోంది. కొవిడ్ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల లోనూ ఎక్కడికక్కడ,అధికార, ప్రతిపక్ష పార్టీలు, పరస్పర ఆరోపణలతో కొవిడ్ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి.   ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కొవిడ్ రాజకీయం అధికార పార్టీలో అలజడి సృష్టిస్తోంది. కొవిడ్ నియంత్రణలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విఫలమయ్యారని విపక్షాలు కాదు స్వపక్షం నుంచే విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి.  కొవిడ్ కట్టడిలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినాయకత్వం కూడా ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాయి. ముఖ్యంగా మరో ఆరేడు నెలల్లో రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కొవిడ్ కొంప మున్చుతుందన్న భయం కమలనాదులను వెంటాడుతోంది. ఈ నేపధ్యంలోనే  ఇటీవల బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు సమావేశమై, యూపీలో కొవిడ్ పరిస్టితి,  రాజకీయపరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో తిరిగి అధికారం అందుకునేందుకు, రోడ్ మ్యాప్ ను సిద్దం చేశారు.  ఇందులో భాగంగా సంస్థాగత మార్పులతో పాటుగా, ముఖ్యమంత్రి నాయకత్వ మార్పు విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.   రాష్రంలో కొవిడ్ పరిస్థితితో పాటుగా, రాజకీయ పరిస్థితిని అంచనా వేసేందుకు బీజేపీ, జాతీయ నాయకత్వం,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్రానికి పంపింది.ఈ ఇద్దరు నాయకులు సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులతో పాటుగా, వివిద స్థాయిల నాయకులతో మాట్లాడి  పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ పట్ల ప్రజలు స్పందన ఎలా వుంది? ఏమనుకుంటున్నారు? ఇలా వివిధ కోణాల్లో, వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, కేంద్ర నాయకులు ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్, ఉప ముఖ్యమంతరులు కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మలతోనూ భేటీ అయ్యారు. దీంతో ఎన్నికల ముంగిట సీఎంను మార్చనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమన్నాయి.  గడచిన వారం పది రోజుల్లో  రాష్ట్రంలో కొవిడ్ కేసులు సంఖ్య తగ్గిందని , రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ  రాష్ట్ర ఇన్‌చార్జ్ రాధా మోహన్ సింగ్, కొవిడ్ కంట్రోల్ విషయంలో  ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్,పని తీరును  కితాబు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, మీడియాతో మాట్లాడిన రాధా మోహన్ సింగ్ తమ పర్యటన ఉద్దేశం ముఖ్యమంత్రి మార్చడం కాదని, పార్టీ  చేసిన సామాజిక కార్యక్రమాలను సమీక్షించడం, కరోనా మూడవ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున తగు ప్రణాళిక రూపొందించడం కోసమే అని స్పష్టం చేశారు.అలాగే, “ఐదు వారాల్లో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రోజువారీ కరోనా  కేసుల సంఖ్యను 93% తగ్గించింది… ఇది 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మున్సిపాలిటీ వంటి 1.5 కోట్ల జనాభాలు గల రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిస్థితులను సరిగా నిర్వహించలేని సమయంలో యోగీజీ చాలా సమర్థవంతంగా నిర్వహించగలిగారు” అని బి ఎల్ సంతోష్ తన పర్యటన ముగింపు సందర్భంగా ఒక ట్వీట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. నాయకత్వ మార్పు వార్తలను బీజేపీ ఖండించినా.. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నారు. కొత్తగా  నమోదవ్తున్న కేసుల సంఖ్య తగ్గుతున్నా, పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని,అదే విధంగా  కొవిడ్’తో చనిపోయిన వారి   మృత దేహాలను గంగానదిలో పారవేయడం, భౌతిక కాయాలను లోతులేని గోతుల్లో ఖననం చేయడంపై  పెద్దఎత్తున వార్తలు వచ్చాయు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ, తీవ్ర విమర్శలు  ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ పరిస్థితిలో ఆదిత్య నాథ్ పై వేటు  తప్పక పోవచ్చని కొదంరు పార్టీ నేతలు పేర్కొంటున్నారు? అయితే ..ఎన్నికల ముంగట ముఖ్యమంత్రిని మారుస్తారా? అనేది, ఆలోచించవలసిన విషయమే అంటున్నారు.