ఒక్క చేప అతని జీవితాన్ని మార్చేసింది..
posted on Jun 1, 2021 @ 11:42AM
తంతే గారెల బుట్టలో పడ్డాడు. నక్క తోకను తొక్కాడు. ఈ మాటలు అప్పుడప్పుడు విన్న ఈ మాట చెప్పారంటే. ఏదైనా అద్భుతం జరిగితే మాట్లాడుకుంటాం.. సరిగ్గా ఓ మత్స్యకారుడికి కూడా అదృష్టం వరించింది. తంతే అతను ఒకే సారి లక్షాధికారు అయ్యాడు. అదెలా అనుకుంటున్నారా.. మీరే చూడండి.. ఎలాగో..
అతని పేరు సాజిద్ హాజీ అబూబాకర్. అతని వృత్తి చేపలు పట్టడం. అతని వాళ్లకి అరుదైన చేప చిక్కింది. ఇంకేముంది అతని కష్టాలు తీరాయి. అతను రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. ఒక చేప పడడం ఏమిటి .. ఆ చేపతో లక్షాధికారి అవ్వడం ఏంటని అనుకుంటున్నారా.. మరి అదే మ్యాజిక్. కొంత మంది ఓవర్ నైట్ స్టార్ అయినట్లు. ఆ చేపలు పట్టే సాజిద్ హాజీ అబూబాకర్ ఒకే నైట్ లక్షాది కారి అయ్యాడు. అంత ఆ చేప మహిమ. మరి అతని వలకు చిక్కిన చెప్పా అలాంటిలాంటి చేప కాదు అరుదైన క్రోకర్ జాతి చేప. దాని ధర ఎంత పలికిందో తెలిస్తే ఆశ్చర్యమే కాదు హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది. అది ఏకంగా 72 లక్షలు ధర పలికింది. అదృష్టం ఎవర్ని, ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుండి వరిస్తుందో చెప్పలేం. ఆ చేపలు పట్టే అతనికి ఈ చేప ద్వారా అదృష్టం వరించింది. ఈ చేప అరుదైన అట్లాంటిక్ క్రోకర్ జాతికి చెందిన 48 కిలోల చేప అబాబాకర్ వలకు చిక్కింది. ఐరోపా, చైనాలో ఈ క్రోకర్ జాతి చేపలకు అత్యధిక డిమాండ్ ఉంది.
వాస్తవానికి చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ, క్రోకర్ జాతి భిన్నమైంది. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. అందుకే దీనికి అంతటి డిమాండ్. నిజానికి వేలంలో ఇంకా ఎక్కువ ధరకు ఈ చేప అమ్ముడుపోయింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లినా.. పెద్ద మొత్తంలో వేలంలో దక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. దీంతో అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు.
గతవారం కూడా గ్వాదర్ తీరంలోనే ఒక మత్స్యకారుడి వలకు క్రోకర్ జాతి చేప చిక్కగా.. వేలంలో అది రూ.7.8 లక్షలకు అమ్ముడైంది. ఈ చేపలు జెవానీ సహా చుట్టుపక్కల తీరానికి వేసవికాలంలో సంతానోత్పత్తి కోసం చేరుకుంటాయని జలచర నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడయిన చేపను తాను ఎప్పుడూ చూడలేదని గ్వాదర్ మత్స్యకారుల సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ నదీమ్ అన్నారు. ఈ చేప 8.6 మిలియన్లకు అమ్ముడయినా.. కొంత రాయితీ ఇవ్వడంతో 7.2 మిలియన్లు దక్కిందన్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ లో చోటుచేసుకుంది.
చేపలు పట్టడం అంత ఈజీ ఏం కాదు.. పడవలు వేసుకుని వేటకు వెళ్ళినపుడు.. కొంత మంది ప్రాణాలు కూడా పోతాయి. ఫుడ్ ఉండదు. నీళ్లు ఉండవు.. ఒక్కోసారి వారం రోజుల పాటు చేపలకు తిరుగుతారు. ఫలితం ఉండదు. ఈ ప్రపంచంలో ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది.. ఆ సుఖం రావాలంటే ముందు పని చెయ్యాలి.. ఆ తర్వాత ఆ సమయం కోసం ఎదురు చూడాలి..ఫలితం అదే వస్తుంది.