ప్రియుడి మోజు.. కూతురు కేసు.. ఈ తల్లి మహా ముదురు...
posted on Jun 4, 2021 @ 10:06AM
ప్రియుడి మోజులో మునిగి ఇటు ఆడవాళ్లు, ప్రియురాలి ముసుగులో పడి మగవాళ్లు, ఈ మధ్య కాలంలో చాలా దారుణాలు చేస్తున్న విషం తెలిసిందే.. ఆ వార్తలు లేకుండా న్యూస్ ఉండదు న్యూస్ పేపర్ ఉండదు. ఇక వెలుగులోకి రాని సంఘటనలు అయితే చెప్పనక్కర్లేదు. ఆమెకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేసింది. ఆ ప్రాసెస్ లో రెండురోజుల నుంచి కూతురు కనిపించడం లేదు. ఆ విషయమై కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు., స్థానికులు నిలదీశారు. ఆ తర్వాత ఆ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం వార్త చదవండి..
ఓపెన్ చేస్తే.. అది విశాఖ నగరం. బొద్దాన రమేష్, వరలక్ష్మి భార్యాభర్తలు. ఐదేళ్ల కిందట పెళ్లి అయింది. ఆ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది ఆ అమ్మాయి పేరు సింధు. రమేష్ తాపీమేస్త్రీగా చేసుకుంటే కుటుంబాని పోషిస్తున్నాడు. తన భార్య వరలక్ష్మి కోస్టల్ ఫుడ్స్ కంపెనీలో పనిచేసేది. వాళ్ళ జీవితం ఏ ఆటంకాలు లేకుండా సాగుతున్న సమయంలో.. ఆమె ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అంటని పేరే బోర జగదీష్ రెడ్డి. పరిచయం ముందు దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ పరిచయంతో దగ్గరైనట్లు వరలక్ష్మి , జగదీశ్ రెడ్డి దగ్గరయ్యారు. వరలక్ష్మి భర్తకు తెలియకుండా జగదీశ్ రెడ్డి తో మసక మసక చీకటిలో మల్లెతోనా వెనకాల అంటూ ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. జగదీష్‌కి అప్పటికే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక అక్కడైతే ఆగక కోవెక్కిన వరలక్ష్మి గత మార్చి 14న ప్రియుడు జగదీష్‌తో వెళ్లిపోయింది. కొద్దిరోజులకి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 14న మళ్లీ వచ్చిన జగదీష్.. ప్రియురాలిని, ఆమె కూతురు సింధుని తీసుకుని వెళ్లాడు. రెండు రోజుల కిందట భర్త రమేష్‌కి ఫోన్ చేసింది.
కట్ చేస్తే.. తమ కూతురు చనిపోయిందని వరలక్ష్మి చెప్పింది. భార్య మాటలపై భర్తకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాప ఏమైందని ప్రశ్నించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల కిందట పాపను అతి కిరాతకంగా హత్య చేసి.. అర్ధరాత్రి వేళ శ్మశానంలో పూడ్చిపెట్టినట్లు తేలింది. పాప మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. చిన్నారి మెడ, శరీరంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ప్రియుడి మోజులో కన్నకూతురిని కిరాతకంగా చంపేసిందని తెలియడంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితులు వరలక్ష్మి, ఆమె ప్రియుడు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.