స్టూడెంట్ తో పారిపోయిన టీచర్..
posted on Jun 4, 2021 @ 3:36PM
టీచర్స్ విలువలు మర్చిపోతున్నారు. చదువులు చెప్పడం మానేసి ప్రేమ పాఠాలు మొదలు పెడుతున్నారు. టీచర్ అంటే ఒకప్పుడు స్టూడెంట్ గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవం గంగలో కలుస్తుంది. అలాగే ఒక టీచర్ , స్టూడెంట్ మధ్య ఉన్న సంబంధాన్ని పవిత్రమైనదని అంటారు. రోజురోజుకు ఆ పవిత్రతను దెబ్బతీసింది. తన వద్ద చదువు నేర్చుకుంటున్న విద్యార్థికి పాఠాలు చెపుతూ... ఆ స్టూడెంట్ తో కాలు జారింది. అతడితో యవ్వారం నడిపింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అనే పాట వేసుకుంది. చివరికి ఆ విద్యార్ధితో కలిసి ఆ టీచర్ జంప్ అయింది. పారిపోయింది. వివరాలు.. అతడు ఓ 17 ఏళ్ల విద్యార్థి ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాడు. మహిళ టీచర్ ఆ విద్యార్థికి క్లాస్ టీచర్‌గా ఉంది. అలాగే అతడికి ట్యూషన్స్ కూడా చెప్పేది. అయితే అనుమానస్పద రీతిలో టీచర్, స్టూడెంట్ ఇద్దరు కనిపించకుండా పోయారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా ఆ టీచర్.. తమ కొడుక్కి ట్యూషన్స్ చెబుతుందని అతడి తల్లిదండ్రులు తెలిపారు.
ఆమె ఓ టీచర్. పెళ్లి అయింది. ఆ తర్వాత భర్తతో విడాకులు అయింది. విడాకుల తర్వాత తల్లిదండ్రుల వద్ద నివసం ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో బోర్ గా ఫీల్ అయిన ఆ పంతులమ్మ, ట్యూషన్ పాఠాలు స్టార్ట్ చేసింది. రోజుకు నాలుగు గంటలు ఒక స్టూడెంట్ కి పాఠాలు చెప్పేది. మే 29వ తేదీన ఆ స్టూడెంట్ డేస్రాజ్ కాలనీలో ఉన్న టీచర్ ఇంటికి వెళ్లాడు. ట్యూషన్ టైం అయిపోయింది.. గంటలు గడుస్తున్నాయి. ఆ రోజు సాయంత్రం గడిచిన ఆ స్టూడెంట్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో స్టూడెంట్ పేరెంట్స్ ఆ టీచర్ కుటుంబ సభ్యులను సంప్రదించారు. అయితే వారు తొలుత ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆ తర్వాత టీచర్ కనిపించకుండా పోయిన విషయాన్ని ఆమె తండ్రి , ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ కి చెప్పాడు’అని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని తెలిపారు.
ఇక, బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళా టీచర్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు రంగం లోకి దిగారు. టీచర్, బాలుడు వారి వారి ఇళ్ల నుంచి ఎలాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లలేదని పోలీసులు తెలిపారు. టీచర్ వద్ద కేవలం ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరం మాత్రమే ఉందని అన్నారు. వారిద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు. వారు కనిపించకుండా పోయినప్పటి నుంచి వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేయబడ్డాయని తెలిపారు. ఈ ఘటన హర్యానాలో జరిగింది.