అత్తా కోడలి గొడవ.. కోడలు మృతి.. ఇంకా ఏకాలంలో ఉన్నాం..
posted on Jun 4, 2021 @ 1:59PM
ఆమెకు పెళ్లి అయింది. మొగుడు, పెళ్ళాం బాగానే ఉన్నారు. ఇంట్లో మొగుడు తో బాధలేదు. ఉన్న తిప్పాలంతా ముసలి అత్తతోనే.. చివరికి ఆ అత్తే కోడలి ప్రాణానికి కారణం అయింది. ఆ యువతీ బంధువైన బావను ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుంది. భర్త తో ఊహించుకున్న జీవితం కట్టేకాలే వరకు ఉండలేకపోయింది. చివరికి అత్తా కోడళ్ల మధ్య వివాదంతో కలత చెందిన కోడలు తనను క్షమించమంటూ ప్రాణాలు విడిచింది..తన కడుపులో శిశువు ఉందనే కనీస ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకుంది.
వాళ్ళు ఇద్దరు బంధువులు. అయినా..ప్రేమించుకున్నారు..ఆ తర్వాత వారి ఇద్దరి కుటుంబాలు గ్రీన్ సింగల్ ఇచ్చారు. ముందుకు వచ్చి ఆ ఇద్దరికి పెళ్లి చేశారు..పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాలేదు..ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్యభర్తల మధ్య కొంచం ప్రేమ, ఇంకొంత మమకారం తో అన్యోన్య జీవనం కొనసాగుతోంది..అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. తాఫీగా సాగుతున్న వారి సంసారంలో. చిన్నగా దగవలు స్టార్ట్ అయ్యాయి. అంటే అత్త మాత్రం కోడలిని సూటిపోటి మాటలు అంటోంది..మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తన కొడుకును సైతం అవమానాలకు గురిచేస్తోంది...దీంతో అటు భర్తను ఎదిరించలేక ఇటు అత్తతో గొడవపడలేక తనువూ చాలించాలనుకుంది. అప్పుడు ఆమె నాలుగు నెలల గర్భిని, అయిన ఆత్మహత్య చేసుకుంది. అంటే ఆమె ఎంత నరకవేదన అనుభవించిందో మరి. చివరికి చనిపోతూ బావ నీ బాధ చూడలేకే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. వివరాల్లోకి వెళితే..
అది నిజామాబాద్ జిల్లా. దుబ్బక చెందిన యువతి మరియు సమీపంలోని ఖానాపూర్‌కు చెందిన సోంత మేనత్త కొడుకును ప్రేమించింది. గత సంవత్సరం జూన్ 16న పెళ్లి జరిపించారు....ఇటివల యువతికి,ఆమె అత్తకు మధ్య మనస్పర్థలు, గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో కోడలిని సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేసింది.అయితే అత్త మాటలు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది..దీంతో ఆమె అత్యక్రియలు సైతం నిర్వహించారు..ఇరు కుటుంబాలకు రక్త సంబంధం కావడంతో జారి పడిందని చెబుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు..దీంతో యువతి ఆత్మహత్యపై తల్లిదండ్రులు కూడ ఎలాంటీ వ్యక్తం చేయకపోవడంతోపాటు...పోలీసులకు కూడ ఎలాంటీ ఫిర్యాదులు కూడా చేయలేదు..
అయితే చివరికి ఆ యువతి ఆత్మహత్య చేసుకునే ముందు ఓ లేఖ రాసింది..ఆ లేఖలో నా చావుకు మా అత్తమ్మ కారణం అంటూ రాసింది. బావ నువ్వు బాధపడకు అంటూ భర్తకు ధైర్యం చెప్పింది..బావ నువ్వు బాధపడితే నేను చూడలేని చెప్పింది..అత్తకు ,తనకు మధ్య భర్త నలిగిపోవడం తాను చూడలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె ఆ లేఖలో పేర్కోంది..చనిపోతున్నందుకు భర్తతో పాటు అమ్మా,నాన్నలకు సారీ చెబుతు తనువు చాలించింది. కాని లేఖ బయటపడినా...పోలీసులకు చేరకపోవడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.