తిరుప‌తిలో అమ‌రావ‌తి.. జగన్ 100 తప్పులు.. రేవంత్ పాదయాత్ర.. టాప్‌న్యూస్ @ 7pm

1. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రానికి ఏకైక రాజ‌ధానిగా మాత్రం అమ‌రావ‌తినే ఉండాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు. తిరుప‌తి స‌భ సాక్షిగా అన్నిపార్టీలు రాజ‌కీయాల‌కు అతీతంగా ఒకే వేదిక‌పైకి వ‌చ్చి అమ‌రావ‌తికి మ‌ద్దతు ప‌లికార‌ని.. సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తి ఏ ఒక్క‌రి రాజ‌ధానో కాద‌ని.. 5 కోట్ల ఆంధ్రుల‌ద‌ని.. ప్ర‌జా రాజ‌ధాని అంద‌రిదనీ.. తిరుప‌తి స‌భ వేదిక‌గా తేల్చి చెప్పారు. 2. ఏపీ రాజ‌ధాని అమరావ‌తి రూప‌శిల్పి చంద్ర‌బాబు.. ఆయ‌నే అమ‌రావ‌తిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ‌ల్‌గా రూపొందించార‌ని వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. తిరుప‌తి మ‌హాద్య‌మ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ర‌ఘురామ‌.. ఏకైక రాజ‌ధాని కోసం పాద‌యాత్ర చేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ కొనియాడారు. పాద‌యాత్ర‌లో మ‌హిళ‌ల‌ను ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేశార‌ని మండిప‌డ్డారు. పాద‌యాత్ర చేసిన మ‌హిళ‌ల త్యాగానికి ఏదీ సాటిరాద‌ని అన్నారు.  3. దోచుకునేందుకు ఏమీలేదనే అమరావతిని వద్దంటున్నారని సీఎం జగన్ పై బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విశాఖను దోచుకునేందుకే అక్కడ రాజధాని అంటున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. అమరావతిలో అనేక ప్రాజెక్ట్‌లకు కేంద్రం నిధులిచ్చిందని.. అమరావతి రాజధానికి బీజేపీ మద్దతు ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 4. అమరావతి అనే శిశువును జగన్‌రెడ్డి 3 ముక్కలు చేశారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. జగన్‌రెడ్డి లాంటి మూర్ఖుడు మరొకరు ఉండరన్నారు. మహిళల కన్నీరు ఏపీకి మంచిది కాదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదేనని నారాయణ అన్నారు.   5. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు 9 కి.మీ.లు ఈ యాత్ర  సాగనుంది. చేవెళ్ల పట్టణంలో రోడ్‌షో, బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. 6. సీఎం కేసీఆర్‌కి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జోన్లు, మల్టీ జోన్లకు అనుగుణంగా సర్వీసు రూల్స్‌ను రూపొందించలేదని.. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లేఖలో  తప్పుబట్టారు.  7. తెలంగాణలో బీజేపీ ప్రళయం రాబోతోందని.. తట్టుకోవడం సీఎం కేసీఆర్ వల్ల‌ కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నా. కేసీఆర్ వ్యూహాలు తెలిసివాడిని. ఆయన ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అటు సూర్యుడు ఇటు ఉదయించినా కేసీఆర్ మళ్లీ గెలవడు అని ఈటల రాజేందర్ సవాల్ చేశారు.   8. పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌ సమీక్షించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను జగన్‌కు వివరించారు. ఫిటిమెంట్‌ ఎంత శాతం ఇవ్వాలనే అంశంపై సీఎం చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల మరోసారి చర్చించే అవకాశం ఉంది.  9. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి ఉద్యమాన్ని మధ్యలోనే ఆపేసి సీపీఎస్‌ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీపీఎస్ అధ్యక్షుడు ఆర్ అప్పలరాజు అన్నారు. ఉమ్మడి జేఏసీ ఉద్యమం విరమణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ హామీలు రాకుండానే ఉద్యమానికి విరామం ప్రకటించారని తప్పుబట్టారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్న మీరు సీపీఎస్‌ ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఉద్యమాన్ని ఆపేశారని నిలదీశారు.  10. ఏపీ అభివృద్ధి పట్ల వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉందని నటుడు శివాజీ మండిపడ్డారు.  జగన్‌ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విద్యార్థులు ప్రశ్నించాలన్నారు. మీ భవిష్యత్తును తొక్కేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడరా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఎన్నో తప్పులు చేస్తున్నారని.. జగన్‌ చేసిన తప్పులు ఇప్పటికే వంద దాటాయని శివాజీ అన్నారు. 

అమ‌రావ‌తి అంద‌రి రాజ‌ధాని.. ధ‌ర్మ‌పోరాటం ఆగ‌ద‌న్న చంద్ర‌బాబు..

ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రానికి ఏకైక రాజ‌ధానిగా మాత్రం అమ‌రావ‌తినే ఉండాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు. తిరుప‌తి స‌భ సాక్షిగా అన్నిపార్టీలు రాజ‌కీయాల‌కు అతీతంగా ఒకే వేదిక‌పైకి వ‌చ్చి అమ‌రావ‌తికి మ‌ద్దతు ప‌లికార‌ని.. సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని ఉద్య‌మానికి కుల ముద్ర వేయ‌డం దారుణ‌మ‌న్నారు. అమ‌రావ‌తి ఏ ఒక్క‌రి రాజ‌ధానో కాద‌ని.. 5 కోట్ల ఆంధ్రుల‌ద‌ని.. ప్ర‌జా రాజ‌ధాని అంద‌రిదనీ.. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌ధాని అస్స‌లే కాదని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తిరుప‌తి స‌భ వేదిక‌గా తేల్చి చెప్పారు. తిరుప‌తి స‌భ‌కు రాకుండా ప్ర‌జ‌ల‌ను అడ్డుకోవ‌డంపై మండిప‌డ్డారు.  ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన ప‌నికి మాలిన ద‌రిద్ర‌పు ప్ర‌భుత్వం ఇదని మండిప‌డ్డారు చంద్ర‌బాబు. అమ‌రావ‌తి రైతులు చేసిన త‌ప్పేంట‌ని నిల‌దీశారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో.. 40 రోజుల పాటు 450 కి.మీ.లు పాద‌యాత్ర చేయ‌గా.. పాద‌యాత్ర‌లో 2500 మందిపై 100 కేసులు పెట్టారని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నైనా కేసులు పెట్టుకోండి.. తాము మాత్రం ధ‌ర్మ‌పోరాటం ఆపేది లేద‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్పారు.  మడమ తిప్పనన్న జగన్‌.. అమరావతిపై ఎందుకు మాట తప్పారు? అమరావతి మునిగి పోతుందని దుష్ప్రచారం చేశారు..ఎప్పుడైనా నీళ్లొచ్చాయా? అమరావతిలో భూమి గట్టిది కాదన్నారు.. హైదరాబాద్‌ కంటే గట్టి నేల అని చెన్నై ఐఐటీ నిపుణులు తేల్చారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అపోహలు సృష్టించారు.. కాదని తేలిపోయింది. వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా.. ఈ ధర్మ పోరాటంలో విజయం మనదే. త్యాగం, పోరాటం అమరావతి రైతులది. వారి త్యాగం 5 కోట్ల ఆంధ్రుల కోసమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.  

అమ‌రావ‌తి రూప‌శిల్పి చంద్ర‌బాబు.. రాజ‌ధాని మార్చ‌డం అసాధ్య‌మ‌న్న ర‌ఘురామ‌

ఏపీ రాజ‌ధాని అమరావ‌తి రూప‌శిల్పి చంద్ర‌బాబు.. ఆయ‌నే అమ‌రావ‌తిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ‌ల్‌గా రూపొందించార‌ని వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. తిరుప‌తి మ‌హాద్య‌మ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ర‌ఘురామ‌.. ఏకైక రాజ‌ధాని కోసం పాద‌యాత్ర చేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ కొనియాడారు. పాద‌యాత్ర‌లో మ‌హిళ‌ల‌ను ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేశార‌ని మండిప‌డ్డారు. పాద‌యాత్ర చేసిన మ‌హిళ‌ల త్యాగానికి ఏదీ సాటిరాద‌ని అన్నారు.  రాజ‌ధాని అమ‌రావ‌తిని మార్చ‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌ని ర‌ఘురామ తేల్చి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టులో ఓ చిన్న ప‌దం త‌ప్పుగా వ‌స్తేనే.. మ‌ళ్లీ పార్ల‌మెంట్‌లో చ‌ట్టం చేయాల్సి వ‌స్తోంద‌ని గుర్తు చేస్తూ.. అమ‌రావ‌తిని చ‌ట్ట ప్ర‌కారం, న్యాయ ప్ర‌కారం ఏమీ చేయ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తినే ఏపీకి శాశ్వ‌త రాజ‌ధానిగా ఉంటుంద‌ని.. రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలని, అంతిమ విజయం రాజధాని రైతులదే అవుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు.  

బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్‌పై 'సైబర్ అటాక్' జరిగిందా?

యుద్ద విమానాలు .. హెలికాప్టర్లను హ్యాక్ చేయవచ్చునా.. ? హైక్ చేయడం సాద్యమేనా.. ? భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఇటువంటి అనుమానాలు.. వినిపిస్తున్నాయి. అయితే అదేమంత కష్టం కాదని, అమెరికా ప్రయోగాత్మకంగా అట్లాంటికా ఎయిర్ పోర్ట్’లో బోయింగ్ 757 విమానాన్ని, హ్యాక్ చేసి నిరూపించిందని నిపుణులు చెపుతున్నారు.  విషయంలోకి వెళితే...అదే బోయింగ్ 757  విమానంలో ప్రయాణించిన సైబర్ ఎక్స్పర్ట్స్ .., అట్లాంటికా ఎయిర్ పోర్ట్’లో విమానం దిగి ... రెండురోజులలో  మళ్ళీ  విమానం ముట్టుకోకుండానే..  విమానం కంట్రోల్ సిస్టం హ్యాక్ చేశారు. విమానాలాను ... హెలికాప్టర్లను హ్యాక్ చేయడం సాధ్యమే అని ప్రయోగాత్మకంగా నిరుపించారు.  అయితే, అది జరిగిన సంవత్సరం తర్వాత, గానీ ఆ విషయం ప్రపంచానికి తెలియలేదు. చివరకు  2017 నవంబర్ 8  అమెరికా సైబర్ సెక్యూరిటీతో సంబంధమున్న హోమ్- ల్యాండ్ సెక్యూరిటీ అధికారి, తమ బృదం సభ్యులు ప్రయోగాత్మకంగా బోయింగ్ 757 ను ముట్టుకోకుండానే, హ్యాక్ చేశారని అధికారికంగా ప్రకటించారు... దాంతో ఒక్క సారిగా ప్రపంచం ఉలిక్కి పడింది.ఈ నేపధ్యంలోనే ఇప్పుడు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం విషయంలో అనుమానాలు, సందేహాలు వ్యక్త మవుతున్నాయి.. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలీకాఫ్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో కూప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆయ‌నతో పాటు ఆయన సతీమణి మధులికతో సహా మరో 11మంది మృతి చెందారు.ఈ దుర్ఘటన జరిగి, పది రోజులు పైగానే  అవుతోంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సైతం మృతువుతో పోరాడి కన్ను మూశారు. ఇక ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి ఏమి జరిగింది, అనేది  చెప్పే ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు.   అదలా ఉంటే, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే, బీజేపీ ఎంపీ సుభ్రమణ్య స్వామి ఓ చిన్న అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ ఎటాక్ కావచ్చేమో అన్న సందేహన్నివెలిబుచ్చారు.  చైనా ఈ దుర్మార్గానికి వడికట్టిందేమో అన్న అనుమానం వెలిబుచ్చారు. భారత్ కు ప్రధమ శత్రువు చైనా అని తమ చూపుడు వేలును బీజింగ్ వైపు  చూపిన రావత్’ లక్ష్యంగా చైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్త పరిచారు. అయితే, ఏదైనా ప్రభుత్వ దర్యాప్తులోనే తేలాలని సుభ్రమణ్య స్వామి చెప్పారు.  ఇక ఆ తర్వాత,, తైవాన్ ఆర్మీ జనరల్ షెన్-ఇ-మింగ్ ఆయనతో పాటు మరో 12 మంది అతి ముఖ్యమైన తైవాన్ ఆర్మీ అధికారులు ప్రయాణిస్తున్న అత్యంత అధినాతనమైన బ్లాక్ హాక్ హెలికాప్టర్ కుడా 2020 జనవరి 2 ఇదే పరిస్థితులలో తైపీ సమీపంలోని కొండల్లో కూలి, హెలికాప్టర్’లో ప్రయాణిస్తున్న  12 మంది మరణించిన విషయం వెలుగులోకి రావడంతో, బిపిన్ రావత్‌ హెలికాప్టర్ ప్రమాదం చుట్టూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అదలా ఉంటే, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, యుద్దవిమానాలు, హెలికాప్టర్లను ముట్టుకోకుండానే మట్టి కరిపించ వచ్చని అంటున్నారు. సైబర్ వార్ ఫేర్ .. సైబర్ యుద్ద తంత్రంలో శత్రు దేశ వ్యూహాత్మక యంత్రాంగాన్ని టార్గెట్ చేయవచ్చని అంటున్నారు. అలాగే, అమెరికాలో 2012 -2017 మధ్య కాలంలో అభివృద్ధి చేసిన  వెపన్ సిస్టం, ఆయుధ విహంగాలు, సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని, 2018లో అమెరికా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఆఫీస్ నివేదిక స్పష్టం చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.    అమెరికాలోనే కాదు, మన దేశంలోనూ అనేక ప్రభుత్వ సంస్థలకు శిక్షణ ఇచ్చిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ముకేష్ చౌదరి, బిపిన్ రావథ్ ప్రయాణం చేసిన హెలికాప్టర్’లోని చోపర్ ని డిజిటల్’ గాగ హాక్ చేయడం సాధ్యమే అంటున్నారు.. సైబర్ వార్ ఫేర్’లో ఇలాంటి దాడులు చేయడం అసాధ్యం కాదని, రేడియో సిగ్నల్స్’ లేదా కమాండ్స్ ‘ను జామ్  చేయడం, సైబర్ పద్దతుల్లో పైలట్’కు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా.. హెలికాప్టర్’ను  ముట్టుకోకుండానే, దూరం నుంచే పడగొట్ట వచ్చని అన్నారు.   అదే విధంగా నెదర్ల్యాండ్స్’లో పనిచేస్తున్న మరో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వికాస సింగ్, ‘సీడీఎస్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ఫై సైబర్ దాడి జరిగి ఉంటుందనే అనుమనాలు ఉన్నాయని అన్నారు. డిఫెన్సు మిషనరీలో ఆధునిక సాఫ్ట్ వేర్ ఉన్నా, సైబర్ దాడుల నుంచి సంపూర్ణ రక్షణ ఉన్నట్లు కాదని చెప్పారు.  సైబర్ దాడులు భౌతికంగానే కాదు రిమోట్ సాయంతో చేసే అవకాశం ఉందని వికాస్ సింగ్ వివరించారు. ఇరాన్ అణు స్థావరాల పై ఇజ్రాయల్ సైబర్ దాడులు చేసింది. అది మనం చూశాం. ఇలాంటి దాడులు జరిగినా బాధిత దేశాలు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవు .. అయినా చెప్పుకోనంత మాత్రాన సైబర్ దాడులు జగలేదని కాదని అయన వివరించారు.  న్యూ యార్క్ సిటీ కాలేజీ, సైబర్ ఎక్స్పర్ట్  సౌరభ్ సచిదేవ్, 2017 అమెరికా ఏజెన్సీతమ సొంత కమర్షియల్ ప్లేన్ బోయింగ్ 757 ను హ్యాక్  చేసిందని చెప్పారు. ఆ తర్వాతనే అమెరికా యుద్ధ విమానాల నుంచి హెలికాప్టర్ల వరకు ఏదైనా సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందనే హెచ్చరికతో పాటుగా, గైడ్లైన్స్ ను కూడా జాఈ చేసింది. ఈ నేపధ్యంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 14 మంది సైనిక యోధులు ప్రాణాలను బలి తీసుకున్న హెలికాప్టర్ ప్రమాదం .. సైబర్ దాడి వలన జరిగిందా లేదా అనేది అంతలోనే తేలే విషయం కాదు .. ఎప్పటికీ తెలిసే విషయం కూడా కాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్ . సైబర్ దాడులకు, సైబర్ యుద్దాలకు కూడా సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది.

మ‌హా స‌భ‌కు బీజేపీ పెద్ద‌లు డుమ్మా.. అమిత్‌షా చెప్పినా మార‌రా?

అమిత్‌షా మొన్న‌నే మొట్టికాయ‌లు వేశారు. త‌ల‌బొప్పి క‌ట్టినా తీరు మాత్రం మార‌ట్లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తినే అని స్వ‌యాగా షా నే సెల‌విచ్చారు. రైతుల ప‌క్షాన పోరాడాల‌ని.. పాద‌యాత్ర‌లో పాల్గొనాల‌ని ఆదేశించి వెళ్లారు. ప‌నిలో ప‌నిగా బీజేపీ త‌ర‌ఫున అమ‌రావ‌తి కోసం గ‌ట్టిగా ఉద్య‌మించాల‌ని కూడా దిశానిర్దేశం చేశారు. అంత‌గా చెబితే.. ఇంత క్లియ‌ర్‌గా స్ప‌ష్టం చేస్తే.. ఏపీ బీజేపీ పెద్ద‌ల్లో మాత్రం ఎలాంటి మార్పూ క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా అధ్య‌క్షులు సోము వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలాంటి వారు మ‌రీ మొండికేస్తున్నారు. మొక్క‌బ‌డిగా ఓసారి పాద‌యాత్ర‌లో పాల్గొని మ‌మ అనిపించారు. మ‌ళ్లీ ముఖం చాటేశారు. తాజాగా, తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతుల మ‌హా స‌భ‌కూ డుమ్మా కొట్టారు. పార్టీ త‌ర‌ఫున మాజీ అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను పంపించి చేతులు దులుపేసుకున్నారు.  సోము వీర్రాజు తీరుపై మొద‌టి నుంచీ విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆయ‌న బీజేపీని వైసీపీ-2 గా మార్చేశార‌ని అంటారు. స్టేట్ ఇంఛార్జ్ సునీల్ దియోధ‌ర్‌, ఎంపీ జీవీఎల్‌తో పాటు వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలు క‌లిసి.. పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించేశార‌ని బీజేపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ న‌లుగురు అధికార పార్టీపై బాణం గురిపెట్ట‌కుండా.. ప‌దే ప‌దే ప్ర‌తిప‌క్ష టీడీపీని, చంద్ర‌బాబుపైనే విరుచుకుప‌డుతుంటారు. జ‌గ‌న్‌రెడ్డికి సేఫ్ గార్డ్‌గా ఉంటార‌ని అంటారు.  ఓ వైపు అమ‌రావ‌తి ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగుస్తుంటే.. రాజ‌ధానికి శంకుస్థాప‌న చేసింది మోదీనే అయితే.. ఆ అమ‌రావ‌తిని ఆగ‌మాగం చేస్తూ.. మూడు రాజ‌ధానుల పేరుతో రాజ‌కీయ కుట్ర చేస్తుంటే.. ప్ర‌భుత్వంపై బీజేపీ పోరాడిందే లేదు. అమ‌రావ‌తికి రైతుల‌కు మ‌న‌సారా సంఘీభావం తెలిపిందే అరుదు. ఇన్నాళ్లేదో జ‌రిగిపోయింది.. ఇటీవ‌ల తిరుప‌తి వ‌చ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంత క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పారుగా? అమ‌రావ‌తిపై పోరాడాల‌ని పార్టీ శ్రేణుల‌ను ఆదేశించారుగా? అయినా, వారిలో మార్పు రాలేదెందుకంటే అదంతా జ‌గ‌న్‌పై ప్రేమేనంటున్నారు. తిరుప‌తిలో రాజ‌ధాని రైతుల మ‌హా స‌భ‌కూ పార్టీ అధ్య‌క్షులు సోము వీర్రాజు హాజ‌రుకాక‌పోవ‌డం ఉద్దేశపూర్వ‌క‌మే అని త‌ప్పుబ‌డుతున్నారు. బీజేపీ రాష్ట్ర నేత‌ల తీరు ఇలానే ఉంటే.. ఇక ఏపీలో బీజేపీ భూస్థాపితం కావ‌డం ఖాయ‌మంటున్నారు. సునీల్ దియోద‌ర్‌, వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలు వైసీపీ-జ‌గ‌న్‌తో అంట‌కాగుతూ.. పార్టీకి తీవ్ర న‌ష్టం చేస్తున్నార‌ని అంతా మండిప‌డుతున్నారు. 

స్టీల్ ప్లాంట్‌పై తగ్గేదే లే.. డిజిటల్ క్యాంపెయిన్‌కు పీకే పిలుపు..

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలని శ్రేణులను జనసేనాని ఆదేశించారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ సభ్యులు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యతనే రీతిలో తప్పించుకునే ధోరణిలో ఉందని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు వారి బాధ్యతను గుర్తు చేసే లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ సాగిద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చట్టసభల్లో ప్లకార్డులు ప్రదర్శించాలనే బాధ్యత వారికి తెలిసేలా ఆంధ్రప్రదేశ్ లోక్సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేయాలని జనసేన శ్రేణులకు ఆయన ఆదేశాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటు ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే విషయాన్ని పార్లమెంట్కు తెలియచేయాలని ఎంపీలను సోషల్ మీడియా ద్వారా కోరదామని అన్నారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయా లోక్సభ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకు, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయాలని జనసేన శ్రేణులకు పవన్ సూచించారు. ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడమే ఈ డిజిటల్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని పవన్ కళ్యాణ్ వివరించారు. ‘వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గళం విప్పకుండా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి బాధ్యత గుర్తు చేద్దాం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’నినాదం ప్రతి ఆంధ్రుడినీ కదిలించింది. జై తెలంగాణ అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం కూడా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసిరావాల్సిన సమయం ఇది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రోజు వరకు అలా ఏ రాజకీయ పార్టీ కలసి రాలేదు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విభేదాలు ఉన్నా ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం’ అని పవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.  ‘పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీకి అనిపించింది. వైసీపీ, టీడీపీ ఎంపీలకు జనసేన నుంచి ఇదే మా విన్నపం. మీరు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యత స్వీకరించి వైసీపీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు కూడా కోరాం. వారు స్పందించలేదు. వైసీపీ నాయకత్వానికి మరోసారి మా విన్నపం. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మీతో కలిసి నడవడానికి మేం సిద్ధం. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. మన రాష్ట్ర సమస్యలు, కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం’ అని పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు. జనసేన పక్షాన మా వంతు బాధ్యతగా మేం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించవద్దు అనే నినాదం ఇస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తాం. కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. స్టీల్ ప్లాంట్ కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు మేం మర్చిపోం. తెలంగాణ జిల్లాలకు చెందిన వారూ విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. అదే బాధ్యతను గుర్తు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరుతున్నాం. వైసీపీ ఎంపీలు ముందుండి పార్లమెంటులో స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ఎన్నో త్యాగాలతో వచ్చిన ఉక్కు పరిశ్రమ కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో పునరాలోచన చేయాలనే విషయం కేంద్రానికి తెలియచెప్పాలి. ఆ కార్యక్రమాన్ని వైసీపీ ఎంపీలు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ర‌ఘురామ ఎంట్రీ అదుర్స్‌.. ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..

వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు సుదీర్ఘ విరామం త‌ర్వాత తెలుగు నేల‌పై అడుగుపెట్టారు. అప్ప‌ట్లో సీఐడీ క‌స్ట‌డీ ఎపిసోడ్ త‌ర్వాత ఢిల్లీకే ప‌రిమితం అయ్యారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీలో అడుగుపెట్టిందే లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల మ‌హా స‌భ‌కు మ‌ద్ద‌తుగా ర‌ఘురామ తిరుప‌తికి చేరుకున్నారు. ప్ర‌త్యేక విమానంలో రేణుగుంట విమానాశ్ర‌యంలో దిగారు. ర‌ఘురామ వ‌స్తున్నార‌నే విష‌యం తెలిసి.. ఆయ‌న్ను చూసేందుకు, కలుసుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. జై ర‌ఘురామ.. జ‌గ‌న్‌కు క‌రెక్ట్ మొగుడు.. అంటూ నినాదాలు చేశారు.  అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో పాల్గొనేందుకు తిరుప‌తి వచ్చాన‌ని ర‌ఘురామ చెప్పారు. అడ్డం పడే మేఘాలు అశాశ్వతం, అమరావతే శాశ్వతం.. అంటూ వ్యాఖ్యానించారు. న్యాయపరంగా 100 శాతం అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు.  తిరుప‌తిలో జ‌రిగేది దగాపడ్డ రైతుల సభ.. ఇది రాజకీయ సభ కాదన్నారు. ఈ సభ తరువాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరని చెప్పారు. పడ్డవాడు చెడ్డవాడు కాదని.. చంద్రబాబు చెడ్డవాడు కానే కాద‌ని ర‌ఘురామ అన్నారు.  మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు అరువు మాటలని చెప్పారు. సత్తిబాబు చెడ్డవాడు కాదు.. మంచి వాడని తాను అనడంలేదన్నారు. మనం జాలి పడాలి తప్ప బొత్స మాటలు విని బాధపడకూడదని రఘురామ అన్నారు.

బీజేపీ అధ్య‌క్షుడిగా ఈట‌ల‌!.. బండి పోస్టు ఊస్టేనా?

ఈట‌ల రాజేంద‌ర్‌. తెలంగాణ‌లో సంచ‌ల‌నం. హుజురాబాద్ గెలుపుతో కేసీఆర్‌కు స‌రైన మొన‌గాడ‌ని నిరూపించుకున్న నేత‌. అరంగేట్రంతోనే బీజేపీలో టాప్ లీడ‌ర్‌గా ఎదిగిన నాయ‌కుడు. అందుకే, ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా.. బీజేపీలో అధిక ప్రాధాన్యం ల‌భిస్తోంది. ఒక్క గెలుపుతో అధిష్టానం దృష్టిలో ప‌డ్డారు. ఎమ్మెల్సీ పోటీలో ర‌వీంద‌ర్‌సింగ్‌ను బ‌రిలో నిలిపి ఢిల్లీ దృష్టిని ఆకర్షించారు. కావ‌ల‌సినంత ఆర్థిక బ‌లం. అంతులేని అనుచ‌ర గ‌ణం. ఉద్య‌మ నేత‌గా అభిమాన ద‌ళం. ప్ర‌భుత్వంలో, పాల‌న‌లో సుదీర్ఘ అనుభవం. ఇవి చాల‌వా ఈట‌ల రాజేంద‌ర్‌ను మ‌రింత ఎత్తుకు తీసుకెళ్ల‌డానికి. ఇప్పుడ‌దే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈట‌ల రాజేంద‌ర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మిస్తారంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  మ‌రి, స్టేట్ ప్రెసిడెంట్‌గా బండి సంజ‌య్ ఉన్నారుగా అనే అనుమానం రావొచ్చు. ఆ.. ఉన్నారు.. అంత‌కుముందు కె.ల‌క్ష్మ‌ణ్ కూడా ఉన్నారుగా. అలానే, ఇప్పుడు బండి సంజ‌య్ ఉన్నారు. బీజేపీ వ్య‌క్తుల పార్టీ కాదు. సిద్ధాంత పార్టీ. ద‌మ్మున్న పార్టీకి ద‌మ్మున్న లీడ‌రే కావాలి. ఆ ద‌మ్ము ఇప్పుడు ఈట‌ల‌లో చూస్తున్నారు. బండి సంజ‌య్ దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నా.. కేసీఆర్ కొమ్ములు వంచాలంటే ఆయ‌న బ‌లం స‌రిపోవ‌ట్లేద‌ని అంటున్నారు. బీజేపీ అధ్య‌క్షుడు కాక‌ముందు బండికి అంత‌గా బ్యాక్‌గ్రౌండ్ లేదు. వాక్‌చాతుర్యంలో కేసీఆర్ ముందు నిల‌వ‌లేక‌పోతున్నారు. హైద‌రాబాద్‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అవుతున్నార‌నే ఆరోప‌ణ ఉంది. స‌బ్జెక్ట్ మీద అంత‌లా ప‌ట్టు ఉండ‌దు. మ‌రీ, ముఖ్యంగా అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని.. బండి సంజ‌య్ వ‌చ్చాక పార్టీలో గ్రూపులు బాగా పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు. అందుకే, బండికి అల్ట‌ర్నేట్‌గా ఈట‌ల‌ను అధ్య‌క్ష పీఠంపై కూర్చోబెట్ట‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.  అదే, బండి సంజ‌య్ వ‌ల్ల బీజేపీలో గ్రూపులు కుమ్ములాట‌లు పెరిగాయ‌ని అంటున్నారు. కిష‌న్‌రెడ్డి వ‌ర్సెస్ బండి సంజ‌య్ ఎపిసోడ్ పార్టీలో అంద‌రికీ తెలిసిందే. వివేక్‌కు సైతం బండితో పొస‌గ‌డం లేద‌ని.. విభేదాలు మ‌రింత ముదిరితే వివేక్ మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతార‌ని టాక్‌. ఇలా బీజేపీలో బ‌ల‌మైన నాయ‌కులకు బండితో తేడాలొచ్చాయ‌ని.. వారంతా క‌లిసి ఈట‌ల రాజేంద‌ర్ పేరును అధిష్టానం ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తున్నార‌ని తెలుస్తోంది. ధ‌ర్మ‌పురి అర్వింద్ సైతం అధ్య‌క్ష రేసులో ఉన్నా.. ఆయ‌న‌కు ఏ కేంద్ర మంత్రి ప‌ద‌వో ఇస్తారు కానీ.. ఈట‌ల‌నే స్టేట్ ప్రెసిడెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం.  ఉద్య‌మ నాయ‌కుడిగా కేసీఆర్‌తో స‌మాన స్థాయి ఉండ‌టం.. ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్‌.. మంచి వాగ్ధాటి..  ఈట‌ల‌కు బాగా అనుకూలించే అంశాలు. హుజురాబాద్ ఎన్నిక‌ల్లో యావ‌త్ అధికార ఘ‌నానికీ ఎదురు నిలిచి పోరాడి గెలిచిన యోధుడు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ రెబెల్‌తో కారు పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టించిన రాజ‌కీయ చాణ‌క్యం. కేసీఆర్ గుట్టు మ‌ట్లు అన్నీ తెలిసిన నాయకుడు. గులాబీ ద‌ళాన్ని చీల్చ‌గ‌ల స‌త్తా ఆయ‌న సొంతం. అందుకే కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే ఈట‌ల‌నే క‌రెక్ట్ ప‌ర్స‌న్ అని అంచ‌నా వేస్తున్నారు.  ఇక‌, ఇటు కిష‌న్‌రెడ్డితోనూ స‌త్సంబంధం.. అటు వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ర‌ఘునంద‌ర్‌రావు లాంటి వాళ్ల‌తో సాన్నిహిత్యం.. ఈట‌ల‌కు క‌లిసొచ్చే విష‌యాలు. పార్టీలో గ్రూపులు ప్రోత్స‌హించ‌డం.. హుజురాబాద్‌లో ఈట‌ల గెలుపున‌కు బండి సంజ‌య్ అంత‌గా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. ఇటీవ‌లి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కావాల‌నే ఓటు వేయ‌క‌పోవ‌డం.. లాంటి ప‌రిణామాల‌పై బండికి వ్య‌తిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేరాయ‌ని తెలుస్తోంది. ఇలా, బండి సంజ‌య్ బ‌ల‌హీన‌త‌లు.. ఈట‌ల రాజేంద‌ర్ బ‌లాలుగా మారి.. త్వ‌ర‌లోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఈట‌ల నియామ‌కం జ‌ర‌గ‌నుంద‌ని బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  అయితే, ఆర్ఎస్ఎస్ వాది కాని వారికి ఆ ప‌ద‌వి ద‌క్కుతుందా అనే అనుమానం అక్క‌ర‌లేదంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా చేయ‌లేదా? ఇక్క‌డా అంతే. అంగ‌, అర్థ బ‌లాల‌తో పాటు కేసీఆర్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే క‌సి, ప‌ట్టుద‌లే.. ఈట‌ల‌ను అధ్య‌క్ష పీఠానికి ద‌గ్గ‌ర చేస్తోంద‌ని చెబుతున్నారు.  త్వ‌ర‌లోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులుగా ఈట‌ల రాజేంద‌ర్ నియామ‌కం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

8 కేసుల‌తో తెలంగాణలో ఒమిక్రాన్ హ‌డ‌ల్‌.. హ‌న్మ‌కొండ‌ మ‌హిళ‌కు పాజిటివ్‌..

తెలంగాణ‌లో ఒమిక్రాన్ కేసులు చాప‌కింద నీరులా వ్యాపిస్తున్నాయి. అధికారుల దృష్టికే 8 కేసులు వ‌చ్చాయి. శంషాబాద్‌ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9 మందికి ఒమిక్రాన్‌ నిర్ధరణ అయింది. వారిలో 8 మంది రాష్ట్రంలో ప్రవేశించారని డీహెచ్ శ్రీనివాస‌రావు తెలిపారు. మరొక వ్యక్తి పశ్చిమ్‌ బెంగాల్‌కు వెళ్లిపోయార‌ని చెప్పారు.  నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఏడుగురితో పాటు హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్‌ సోకినట్టు వెల్ల‌డించారు. ఆ మహిళకు మొద‌ట్లో నెగ‌టివ్ వ‌చ్చింద‌ని.. అయితే, 8 రోజుల తర్వాత మ‌ళ్లీ టెస్ట్ చేస్తే.. కొవిడ్‌ పాజిటివ్‌.. ఆపై ఒమిక్రాన్‌ నిర్ధరణ అయిందని డీహెచ్ తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ‌లో సామాజిక వ్యాప్తి జరగలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  ఒమిక్రాన్‌ పట్ల అనవసర భయాందోళనలు అవసరం లేదు. 95% కంటే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. ఈ వేరియంట్‌తో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మూడో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశముంది.. అని డీహెచ్ అన్నారు.    వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్‌ వ్యాప్తికి కారణం. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి. ఇంటా బయటా మాస్కులు ధరించాలి. కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలి.. అని డీహెచ్ శ్రీనివాస‌రావు సూచించారు.  

ఏపీకి షాక్‌.. స‌భ టెన్ష‌న్‌.. ఒమిక్రాన్ వ‌ర్రీ.. త‌గ్గింది లే.. టాప్‌న్యూస్ @1pm

1. ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. 2. పీఆర్సీపై సీఎం జ‌గ‌న్‌తో మంత్రి బుగ్గ‌న, స‌ల‌హ‌దారు స‌జ్జ‌ల స‌మావేశ‌మ‌య్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగులు ఇచ్చిన డిమాండ్లపై గురువారం ఆయా సంఘాల‌తో చ‌ర్చ‌లు జరిపారు. ఆ  చ‌ర్చ‌ల సారాంశాన్ని ఇవాళ‌ సీఎంకు  స‌జ్జ‌ల, బుగ్గ‌న వివరిస్తున్నారు. సీఎంతో స‌మావేశం అనంత‌రం ఉద్యోగ‌ సంఘాల‌తో స‌జ్జ‌ల‌, బుగ్గ‌న‌ మ‌రోసారి భేటీ కానున్నారు.  3. తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గజ్జెల నగేశ్‌, స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఛైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ జూలూరి గౌరీశంకర్‌, షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను కేసీఆర్‌ నియమించారు.  4. తిరుపతిలోని అమరావతి మహాసభలకు వెళుతున్న టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. చిత్తూరులో మాజీ మేయర్ కటారి హేమలత ప్రయాణిస్తున్న వాహనానికి ఇన్సూరెన్స్ లేదన్న సాకుతో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. సభకు  హాజరవుతున్న టీడీపీ శ్రేణులను  నేంద్ర గుంట టోల్ ప్లాజా వద్ద తనిఖీల పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారు.  5. టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తాను పోలవరం వెళ్ల‌డం లేదని.. పెళ్ళికి వెళ్తున్నానని చింత‌మ‌నేని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.  6. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బ్రిటీష్ నియంత పాలన 2.0లా జగన్ రెడ్డి పాలన ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమరావతి రైతుల మహాసభకు కోర్టు అనుమతిచ్చినా.. ప్రజలు సభకు వెళ్లకుండా వైసీపీ ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.  7. ఎనిమిది కేసుల‌తో తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తెలంగాణలో థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ శ్రీనివాస‌రావు అన్నారు. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. కొత్తగా వ‌రంగ‌ల్ మహిళకు ఒమిక్రాన్ సోకిన‌ట్టు నిర్థారించామని చెప్పారు. బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవని.. సామూహిక వ్యాప్తి కూడా లేదన్నారు.  8. బెజ‌వాడ‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన చడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లో ముగ్గురు చడ్డీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసి విజ‌య‌వాడ తీసుకొచ్చారు. చడ్డీ గ్యాంగ్‌ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. శనివారం మీడియా ముందు చడ్డీ గ్యాంగ్‌ను హాజరుపరిచే అవకాశం ఉందంటున్నారు.  9. హిందూపురంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పుష్ప సినిమా బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్  పడిగాపులు కాశారు. బెనిఫిట్ షో రద్దైనట్టు థియేటర్ యాజమాన్యం చెప్ప‌డంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల అద్ధాలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అల్లు అర్జున్ అభిమానులపై లాఠీ చార్జ్ చేసి..పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మ‌రోవైపు.. సినిమా రివ్యూస్‌లో పుష్ప‌కి యావ‌రేజ్ టాక్ వినిపిస్తోంది.  10. మిస్ వ‌ర‌ల్డ్‌కు పోటీ ప‌డుతున్న మిస్ ఇండియా 2020 'మాన‌స వార‌ణాసి'కి కొవిడ్‌-19 పాజిటివ్ అని తేలడం క‌ల‌క‌లం రేపింది. ఇండియాకి చెందిన మానస వారణాసితో సహా పలువురు పోటీదారులకు క‌రోనా సోక‌డంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా పడ్డాయి. వ‌చ్చే 90 రోజుల్లో ప్యూర్టోరికోలోనే మిస్ వరల్డ్ పోటీలు నిర్వ‌హిస్తామ‌ని నిర్వాహ‌కులు ప్రకటించారు.  

ఎమ్మెల్సీ ఎగ్గొట్టి నామినేటెడ్ పోస్టులు.. కేసీఆర్ ప‌ద‌వుల పందేరంపై విమ‌ర్శ‌లు..

కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ అంద‌రికీ తెలిసిందే. నోటికొచ్చిన‌న్ని హామీలు ఇచ్చేస్తారు. ఆ త‌ర్వాత నాలుక క‌రుచుకుంటారు. అంద‌రినీ పార్టీలో క‌లిపేసుకుంటారు. ఉన్న‌వారు పార్టీని వీడి వెళ్లిపోకుండా ఊరిస్తుంటారు. కారును ఓవ‌ర్‌లోడ్ చేసేస్తుంటారు. ఇక ప‌ద‌వులు ఇవ్వాల్సిన స‌మ‌యంలో చేతులెత్తేస్తారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అలానే జ‌రిగింది. ఎప్ప‌టి నుంచో ఎమ్మెల్సీ ప‌ద‌వితో ఊరించిన చాలామందికి ఎప్ప‌టిలానే హ్యాండిచ్చేశారు. కొత్త‌గా కారెక్కిన కౌశిక్‌రెడ్డి, ఎల్‌.ర‌మ‌ణ‌, వెంక‌ట్రామిరెడ్డి లాంటి వారిని పెద్ద‌ల స‌భ‌కు పంపించారు. కొత్త వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెడితే.. మ‌రి పాత వారి సంగ‌తేంటి? ఎప్ప‌టి నుంచో కారు డిక్కీలో ప‌డుండి.. డ‌క్కామొక్కీలు తింటున్న త‌మ ప‌రిస్థితి ఏంటంటూ.. తిర‌గ‌బ‌డుతున్నారు.  మ‌రోవైపు, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేదు. వ‌రుస ఓట‌ములు ఓవైపు.. ప్ర‌జా వ్య‌తిరేక‌త మ‌రోవైపు. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌, బండి-ఈట‌ల కాంబినేష‌న్‌లో బీజేపీ.. కారుకు పంక్చ‌ర్లు పెట్ట‌డానికి రెడీగా ఉన్నాయి. ఉ అంటే ఊ అన‌డానికి సిద్ధంగా ఉన్నారు. ప‌ద‌వి ఇస్తే ఓకే.. లేదంటే.. త‌మ దారి తాము చూసుకునేందుకు చాలా మంది టీఆర్ఎస్ నేత‌లు ప‌క్క‌చూపులు చూస్తున్నారు. ఈ సంఖ్య భారీగా ఉండ‌టంతో కేసీఆర్‌లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు. అందుకే, హ‌డావుడిగా ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేశారు. అంద‌రికీ కాకున్నా.. కొంద‌రికి అడ్జ‌స్ట్ చేశారు. అయితే, తాజా ప‌ద‌వుల‌పైనా ఎవ‌రికీ సంతృప్తి లేద‌ని అంటున్నారు. ఇంత‌కీ కేసీఆర్‌ ఎవ‌రెవ‌రికీ ఏయే నామినేటెడ్ పోస్టులు క‌ట్ట‌బెట్టారంటే.... తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఎంపిక చేశారు. పాపం.. ఆకుల ల‌లిత‌. ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూశారు. కూతురు క‌విత కోసం ల‌లిత‌ను బ‌లిప‌శువు చేశారు కేసీఆర్‌. ఆ త‌ప్పిదాన్ని స‌రి చేసేందుకు ఇప్పుడు ఇలా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎక్క‌డ‌.. ఈ ప‌ద‌వి ఎక్క‌డా? అందుకే ఆకుల ల‌లిత తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గజ్జెల నగేశ్‌, స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఛైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ జూలూరి గౌరీశంకర్‌, షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను కేసీఆర్‌ నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.   ఇటీవలే మూడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌గా, టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా విభాగం నేత మన్నె క్రిశాంక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) ఛైర్మన్‌గా నియ‌మించారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితాలో ప్ర‌ముఖంగా పేరు వినిపించిన‌.. ధూంధాం కళాకారుడు, గాయకుడు వేద సాయిచంద్ (సాయిచందర్‌)ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా మరికొన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. అయినా, అసంతృత్తి జ్వాల ఇంకా ర‌గులుతూనే ఉంది.    

తిరుపతి మహాసభపై పోలీసుల ఆంక్షలు.. ముట్ట‌డితో క‌ట్ట‌డి..

హైకోర్టు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. స‌భ పెట్టుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఎలాంటి ఆంక్ష‌లు వ‌ద్దంది. అయితేనేం.. పోలీసులు వింటేగా. పై నుంచి బాగా ప్రెజ‌ర్ వ‌స్తుండ‌టంతో.. ఖాకీలు త‌మ‌దైన స్టైల్‌లో స‌భ‌ను డీలా ప‌రిచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. స‌భ‌కు అన‌ధికారికంగా ఆంక్ష‌లు విధిస్తున్నారు.  తిరుప‌తి మ‌హా సభకు ప్రజలు భారీ ఎత్తున త‌ర‌లిరాకుండా ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తోంద‌ని  రైతులు ఆరోపిస్తున్నారు. ప్ర‌ధానంగా.. టీడీపీ నేతలే టార్గెట్‌గా పోలీసు ఆంక్షలు కొన‌సాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, రైతులు తిరుపతికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై రైతు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   తిరుపతి సభకు సంఘీభావం తెలిపేందుకు కడప జిల్లా నుంచి  టీడీపీ నేతలు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహ‌నాలు ముందుకు సాగ‌కుండా నిలువ‌రించారు. ప‌లు జిల్లాల్లో టీడీపీ నేత‌ల‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.    

నియంత 2.0... అరెస్టుల‌పై ఆగ్ర‌హం..

ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బ్రిటీష్ నియంత పాలన 2.0లా జగన్ రెడ్డి పాలన ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.   రైతుల పాదయాత్ర విజయవంతం కావటంతో వైసీపీ నేతలు కడుపుమంటతో బాధపడుతున్నారని అన్నారు. అందుకే అమరావతి రైతుల మహాసభకు కోర్టు అనుమతిచ్చినా.. ప్రజలు సభకు వెళ్లకుండా వైసీపీ ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్నారని అచ్చెన్న త‌ప్పుబ‌ట్టారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో పోలవరంలో ఏ పనులు చేశారో, పోలవరం నిర్వాసితులకు ఏం న్యాయం చేశారో మంత్రి, ముఖ్యమంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు.  ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ఆంక్షలతో అడ్డుకోవటం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రతిపక్షంలో నోటికొచ్చినట్టు హామిలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. 

మిస్ ఇండియాకు క‌రోనా.. మిస్ వ‌రల్డ్ వాయిదా..

'హర్నాజ్ కౌర్ సంధూ' ఇటీవ‌లే మిస్ యూనివ‌ర్స్‌గా ఎంపికై భార‌త‌దేశ ఖ్యాతిని ప్ర‌పంచ వేదిక‌పై రెప‌రెప‌లాడించారు. అంతా ఆ సంబ‌రాల్లో మునిగిపోయి ఉండ‌గానే.. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈసారి మిస్ యూనివ‌ర్స్‌తో పాటు మిస్ వ‌ర‌ల్డ్ కూడా మ‌న‌దే అవుతుంద‌ని అంతా ఆకాంక్షించారు. కానీ, అంత‌లోనే క‌రోనా దాడి చేసింది. మిస్ వ‌ర‌ల్డ్‌కు పోటీ ప‌డుతున్న మిస్ ఇండియా 2020 'మాన‌స వార‌ణాసి'కి కొవిడ్‌-19 పాజిటివ్ అని తేలడం క‌ల‌క‌లం రేపింది. ఇండియాకి చెందిన మానస వారణాసితో సహా పలువురు పోటీదారులకు క‌రోనా సోక‌డంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా పడ్డాయి.  డిసెంబర్ 16న ప్యూర్టోరికోలో మిస్ వ‌ర‌ల్డ్‌ ఫినాలే జరగాల్సి ఉండ‌గా.. కరోనా కారణంగా ముగింపు పోటీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యం, భద్రత కార‌ణాల‌తో ఈవెంట్‌ను వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. వ‌చ్చే 90 రోజుల్లో ప్యూర్టోరికోలోనే మిస్ వరల్డ్ పోటీలు నిర్వ‌హిస్తామ‌ని ప్రకటించారు. మిస్ వరల్డ్ 2021 పోటీదారులతో సహా 17 మంది సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో మిస్ ఇండియా 'మానస వారణాసి' కూడా ఉన్నారు. 23 ఏళ్ల మానస వారణాసి 70వ ప్రపంచ సుందరి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం.. మాన‌స ప్యూర్టోరికోలో ఐసోలేష‌న్‌లో ఉన్నారు. 

పుష్ప షో ర‌ద్దు.. హిందూపురంలో బాక్సులు బ‌ద్ద‌లు..

అస‌లే పుష్ప. మోస్ట్ అవేటెడ్ మూవీ. బ‌న్నీ మాస్ అప్పీల్ చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. థియేట‌ర్ల‌లో మెగా సంద‌డి. క‌టౌట్లు, దండ‌లు, పాలాభిషేకాలు, కేరింత‌లు.. అంతా కేక‌. ర‌చ్చ రంభోలా. అలాంటిది.. స‌డెన్‌గా షో లేదంటే..? ఎట్టా ఉంటాది? అస‌లే హిందూపురమాయె. ఇంకెట్టా ఉంటాదో తెలుసుగా. అట్టానే జ‌రిగింది. ఫ్యాన్స్ త‌గ్గేదే లే అన్నారు. థియేట‌ర్‌ బాక్సులు బ‌ద్ద‌ల‌య్యాయి. పుష్ఫ అంటే ఫ్ల‌వ‌ర్ అనుకున్నార్రా.. ప‌వ‌ర్ అంటూ ఫ్యాన్స్ త‌మ ప‌వ‌ర్ చూపించారు.    హిందూపురంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పుష్ప సినిమా బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్  పడిగాపులు కాశారు. బెనిఫిట్ షో రద్దైనట్టు థియేటర్ యాజమాన్యం చెప్ప‌డంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల అద్ధాలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అల్లు అర్జున్ అభిమానులపై లాఠీ చార్జ్ చేసి..పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

చింత‌మ‌నేని వ‌ర్సెస్ పోలీస్‌.. ఏలూరులో హైటెన్ష‌న్‌..

పోలీసుల‌కు అత్యంత ఫేవ‌రేట్ లీడ‌ర్‌. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పేరు వినిపిస్తే చాలు.. ట‌క్కున వాలిపోతారు. అడ్డుకుంటారు. కేసులు పెడ‌తారు. అరెస్ట్ చేస్తారు. చింత‌మ‌నేనిపై ఎన్ని కేసులు పెడితే అంత క్రెడిట్ అన్న‌ట్టు యాక్ష‌న్ చేస్తుంటారు. పోలీస్ ప‌వ‌ర్ అంతా ప్ర‌భాక‌ర్‌పైనే చూపిస్తుంటారు. ఇప్ప‌టికే చింత‌మ‌నేనిని ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఖాకీలు.. శుక్రవారం మ‌రోసారి ఆయ‌నపై పోలీస్ యాక్ష‌న్ చేప‌ట్టారు. క‌ట్‌చేస్తే.. ఎప్ప‌టిలానే ఏలూరులో మ‌రోసారి ఉద్రిక్త‌త నెల‌కొంది. టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.  ఏలూరు సమీపంలోని దుగ్గిరాల దెందులూరులో ఇంటి నుంచి బయటకు వస్తున్న చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. తాను పోలవరం వెళ్ల‌డం లేదని.. పెళ్ళికి వెళ్తున్నానని మాజీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది మ‌రింత ముదిరింది. తీవ్ర వాదోప‌వాదాల తరువాత చింతమనేనిని పోలీసులు వదిలిపెట్టారు. అయితే, అస‌లే పోలీసులు క‌దా. అందులోనూ వాళ్ల‌కు ఫేవ‌రేట్ నాయ‌కుడాయె. అందుకే, ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న‌ చింత‌మ‌నేనిని పోలీసులు అనుస‌రిస్తున్నారు. ఎలాగంటే.. ఓ ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ ఇచ్చిన లెక్క‌న‌. అంటే, మ‌నోడు మాజీ అయినా.. తాజాలానే పోలీస్ బందోబ‌స్తుతో ఏలూరులో తిరుగుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. 

మరో 4 ఒమిక్రాన్ కేసులు.. డేంజర్ జోన్ లో తెలంగాణ

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణలో పంజా విసురుతోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తెలంగాణ వైద్య వర్గాల సమాచారం ప్రకారం కెన్యా నుంచి వచ్చిన ముగ్గురితో పాటు మరో వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. బుధవారం మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో.. వాళ్లను టిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి డీఎస్!

బీజేపీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్‌ ఎంపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఢిల్లీలో సోనియాగాంధీలో ఆయన సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైంది. దీనిపై ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అధిష్ఠానం పిలుపుమేరకు భట్టి కూడా ఢిల్లీ వెళుతున్నారు.  టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 1989 నుంచి 2015 జులై వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘంగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు అనుభవించారు. పీసీసీ చీఫ్ రెండు సార్లు పనిచేశారు. డీఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్న రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగానూ వ్యవహరించారు డీఎస్. 2009 ఎన్నికల్లో డీఎస్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు.  ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అవకాశం ఇచ్చింది. గత కొన్నేండ్లుగా  డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ తో ఆయనకు విభేదాలు వచ్చాయి. పీసీసీ చీఫ్ గా నియామకం అయిన కొన్ని రోజులపై రేవంత్ రెడ్డి డీఎస్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అప్పుడే డీఎస్ తిరిగి సొంత గూటికి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉండటంతో  పాటు కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఆయన తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో డీఎస్ అర్వింద్ కు మద్దతుగా బీజేపీలో చేరుతారని అంతా భావించారు. కాని ఆయన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశం కావడంతో కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. డీఎస్ కాంగ్రెస్ లో చేరితే బీజేపీ ఎంపీ అర్వింద్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెబుతున్నారు. అర్వింద్ సోదరుడు సంజయ్ కుడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు తన తమ్ముడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

అమరావతి సభకు సర్వం సిద్దం.. తేలని పీఆర్సీ.. డీఎస్ రిటర్న్.. టాప్ న్యూస్@8PM

అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.  --- అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా గురువారం మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత యాత్ర చేపట్టారు. వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ నుంచి.. తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.  ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని.. ఏపీ రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేస్తూ సునీత పాదయాత్ర సాగింది. --------- సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని జగన్‌ కోరారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జగన్‌ ప్రతిపాదనలపై సానుకూలంగా ఫ్లిప్‌కార్ట్‌ స్పందించింది. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు సుముఖత వ్యక్తం చేసింది.  -------- ఏపీలో నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను చెల్లించకుండా వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్ పక్కదారి పట్టించారని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. ప్రజల డబ్బుతో జగనన్న గోరు ముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలా పెడతారని ప్రశ్నించారు.  జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో కోట్ల రూపాయల ప్రజల డబ్బును పక్కదారి పట్టించారని మండిపడ్డారు -------- పీఆర్సీ పూర్తి నివేదిక ఉద్యోగులకు ఇవ్వాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు  డిమాండ్ చేశారు. గురువారం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను పట్టించుకోలేదన్నారు. అధికారులను కమిటీ వేసి నచ్చినట్టు నివేదిక ఇచ్చారని చెప్పారు. 14.39 పిట్‌మెంట్‌కు ఉద్యోగులు వ్యతిరేకమన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు --------- ఏపీ ఇరిగేషన్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డిపోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. తొలుత హిల్‌వ్యూ ప్రాంతం నుంచి స్పిల్వే, స్పిల్‌ చానల్‌, ఆప్రోచ్‌ చానల్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, డయాఫ్రంవాల్‌, గ్యాప్‌ 1, గ్యాప్‌ 2, గ్యాప్‌ 3 ప్రాంతాలను, స్పిల్‌వే, రేడియల్‌ గేట్లు, ఫిష్‌ ల్యాడర్‌, పవర్‌ హౌజ్‌, స్పిల్వేలో ఆప్రోచ్‌ చానల్‌, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలో హెడ్‌ రెగ్యులేటర్‌, ఫేజ్‌ 4, ఫేజ్‌ 5 లలో జంటగుహల నిర్మాణం పనులు పరిశీలించారు. ---- రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. డీఎస్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపారు.  దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. దీనిపైఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.  ---- స్థానిక సంస్థలను, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న సీఎం కేసీఆర్‌ సర్కార్‌పై రాజకీయాలకు అతీతంగా సర్పంచ్‌లంతా తిరగబడాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే చూశామని, సర్కార్‌ తీరుతో సర్పంచ్‌ల ఆత్మహత్యలను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -- బీజేపీ నేత ‘మెట్రో’ శ్రీధరన్ రాజకీయాల నుంచి వైదొలగారు. ఆయన స్వస్థలం మలప్పురంలో మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. తన వయసు తొంభయ్యేళ్ళని చాలా మందికి తెలియదన్నారు. తన వయసుకు సంబంధించి తాను అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నానని చెప్పారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తాను చెప్పానంటే, దాని అర్థం రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు కాదన్నారు.  -------- కర్ణాటకలో మత మార్పిడి నిషేధ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను న్యాయశాఖ సన్నద్ధం చేసింది. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావిలో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించాలని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ తీరని వారిని, మహిళలు, మానసిక వైకల్యం ఉన్నవారిని బలవంతంగా మతమార్పిడి చేస్తే 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు.  ----