తిరుపతి మహాసభపై పోలీసుల ఆంక్షలు.. ముట్టడితో కట్టడి..
posted on Dec 17, 2021 @ 10:54AM
హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. సభ పెట్టుకోవచ్చని చెప్పింది. ఎలాంటి ఆంక్షలు వద్దంది. అయితేనేం.. పోలీసులు వింటేగా. పై నుంచి బాగా ప్రెజర్ వస్తుండటంతో.. ఖాకీలు తమదైన స్టైల్‌లో సభను డీలా పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. సభకు అనధికారికంగా ఆంక్షలు విధిస్తున్నారు.
తిరుపతి మహా సభకు ప్రజలు భారీ ఎత్తున తరలిరాకుండా ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా.. టీడీపీ నేతలే టార్గెట్‌గా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, రైతులు తిరుపతికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రైతు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి సభకు సంఘీభావం తెలిపేందుకు కడప జిల్లా నుంచి టీడీపీ నేతలు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలు ముందుకు సాగకుండా నిలువరించారు. పలు జిల్లాల్లో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.