వరిపై తుస్.. తెరపైకి కంటోన్మెంట్! కేటీఆర్ డైవర్ట్ గేమ్.. 

కేంద్ర ప్రభుత్వంపై కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది టీఆర్ఎస్. వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. రెండు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది టీఆర్ఎస్. అయితే వరి విషయంలో గులాబీ పార్టీ ఆరోపణలను లైట్ తీసుకుంది మోడీ సర్కార్. కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టింది. సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని, రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వరి విషయంలో కేసీఆర్ తీరును ఎండగట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.  వరి కొనుగోళ్లపై రచ్చ సాగుతుండగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. రోడ్ల మూసివేతపై కిషన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ  కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో చట్టవిరుద్ధంగా రోడ్లను మూసివేసి లక్షలాది మందిని ఇబ్బందులకు గురిచేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. లోకల్‌ మిలటరీ అథారిటీస్‌ (ఎల్‌ఎంఏ) నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారులకు సంబంధించిన జాబితాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పంపించారు.  లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ రహదారులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు కేటీఆర్.   ఇదిగో జాబితా.. ఆయా రోడ్లను తక్షణమే తెరిచేలా లోకల్‌ మిలటరీ అథారిటీస్‌కు ఆదేశాలిస్తూ లక్షలాది మంది స్థానికులకు ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తున్నాం అంటూ కిషన్ రెడ్డికి  ట్వీట్ చేశారు.అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. మీ మంత్రికి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన లేనట్లుంది.. కంటోన్మెంట్‌లో మొత్తం 21 రోడ్లు మూసేస్తే, మీ మంత్రి కేవలం రెండే మూసేసినట్లు చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  ఓవైపు వరి విషయంలో మోడీ సర్కార్ తో వార్ సాగుతుండగానే.. కేంద్రం పరిధిలోని కంటోన్మెంట్ సమస్యలను కేటీఆర్ బయటికి తీయడం చర్చగా మారింది. నిజానికి కేటీఆర్ చెబుతున్న కంటోన్మెంట్ రోడ్ల సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి. రోడ్లను కొన్ని సార్లు ఓపెన్ చేయడం... కొన్ని సార్లు క్లోజ్ చేయడం జరుగుతోంది. అయినా ఆ సమస్యను కేటీఆర్ కొత్తగా బయటికి తీయడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. వరి విషయంలో కేంద్రాన్ని ఇరికించాలని చూసిన వర్కవుట్ కాకపోవడంతో.. కేటీఆర్ ఇలా నరుక్కొచ్చారని అంటున్నారు. కంటోన్మెంట్ సమస్య ద్వారా ప్రజల దృష్టిలో మోడీ సర్కార్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. వరి విషయంలో కేంద్రమంత్రి గోయెల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో డిఫెన్స్ లో పడిన గులాబీ లీడర్లు.. ఆ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కమలం నేతలు చెబుతున్నారు.  

హోదా కాదు ప్యాకేజీనేనట.. ఇకనైనా జగనన్న పోరాడేనా? 

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే మా లక్ష్యం.. మాకు అధికారం ఇస్తే కేంద్రంతో పోరాడి.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం... ఇచ్చిన మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదం. ప్రతి ఎన్నికల సభలోనే ఆయన చెప్పింది ఇదే. కాని ఆయనకు అధికారం వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఏపీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. వచ్చే అవకాశాలు కూడా కన్పించడం లేదు. అయినా జగన్ రెడ్డిలో మాత్రం ఉలుకూ పలుకూ లేదూ.  ప్రత్యేక హోదా అనే అంశం ఆయనకు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ లోనూ వైసీపీ ఎంపీలు సైలెంటుగానే ఉంటున్నారు. జగన్ ఆదేశాలతోనే వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా గురించి అడగటం లేదని భావిస్తున్నారు.  తాజాగా ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చింది మోడీ సర్కార్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నీతి అయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని చెప్పారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని తెలిపారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి తాజా ప్రకటనతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. కేంద్ర తన నిర్ణయాన్ని చెప్పింది కాబ్టటి ఇకనైనా జగన్ రెడ్డి పోరాటం చేస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే గత రెండున్నర ఏళ్లుగా ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం మాట్లాడని జగన్... ఇకపై కూడా మాట్లాడతారనే నమ్మకం లేదంటున్నారు ఏపీ జనాలు. ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటనలు చేస్తుండటం తప్ప జగన్ రెడ్డి చేస్తున్నదేమి లేదంటున్నారు. తన కేసుల కోసం ప్రత్యేక హోదాను జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టారని కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ రెడ్డి కూడా ఏమి మాట్లాడకపోతుండటంతో అదే నిజమేననే అభిప్రాయం వస్తోంది. ఇకనైనా జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడకపోతే.. కేసుల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపణలు నిజమననే జనాలు విశ్వసించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

కేసీఆర్ అవినీతిపై అమిత్‌షా ఆదేశాలు.. గులాబీబాస్‌కు గండ‌మేనా?

కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్ప‌డుతున్నాడు.. ఆ లెక్క‌ల‌న్నీ మా ద‌గ్గ‌ర ఉన్నాయి.. ఆ ఆధారాల‌న్నీ సేక‌రించాం.. త్వ‌ర‌లోనే కేసీఆర్ జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పదే పదే చేస్తున్న హెచ్చ‌రిక ఇది. బియ్యం కుంభ‌కోణం వెనుక పెద్ద దందానే ఉంది.. ఆ గుట్టు అంతా బ‌య‌ట‌కు లాగుతాం.. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇస్తున్న వార్నింగ్ ఇది. కొంత‌కాలంగా తెలంగాణ‌ బీజేపీ నేత‌ల నుంచి త‌రుచూ వినిపిస్తున్న మాట‌లివి. తాజాగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ బ‌డా నేత అమిత్‌షా సైతం పార్టీ కేడ‌ర్‌కు ఇదే ఆదేశాలు ఇచ్చారు. "కేసీఆర్‌ అవినీతిని ప్రజలకు వివరంగా చెప్పండి.. టీఆర్ఎస్ నేత‌ల‌ బియ్యం కుంభకోణం, ఇతర అవినీతిని వెలికితీయండి.. ముఖ్య‌మంత్రి అవినీతిపై విచారణకు డిమాండ్ చేయండి.." అంటూ అమిత్‌షా అంత‌టివారే రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా.. ప‌క్కా ఆధారాల‌తోనే ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. అంటే.. కేసీఆర్‌పై వ‌స్తున్న‌ వేల కోట్ల అవినీతి ఆరోప‌ణ‌లు నిజ‌మేనా?  బీజేపీ నేత‌ల ద‌గ్గ‌ర ప‌క్కా ఆధారాలు ఉన్నాయా?  త్వ‌ర‌లోనే కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ కేసులు త‌ప్ప‌వా? క‌మ‌ల‌నాథులు అంటున్న‌ట్టు.. కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనా? అంటూ అప్పుడే చ‌ర్చ మొద‌లైపోయింది.  తాజాగా, పార్ల‌మెంట్‌లోని అమిత్‌షా ఛాంబ‌ర్‌లో తెలంగాణ బీజేపీ ముఖ్య‌నేత‌ల‌తో కీల‌క స‌మావేశం జ‌రిగింది. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో పాటు ఈట‌ల రాజేంద‌ర్‌, డీకే అరుణ‌, ఎంపీ అర్వింద్‌, మాజీ ఎంపీలు గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు, జితేంద‌ర్‌రెడ్డి త‌దిత‌ర బ‌డా నేత‌లు భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌కు కేంద్ర‌మంత్రి పీయూష్ గ‌య‌ల్ కూడా వ‌చ్చారు. అంతా హేమాహేమీలే. అందులోనూ అమిత్‌షాతో స్పెష‌ల్ మీటింగ్‌. అంటే, కీల‌క ప‌రిణామాల‌కి వ్యూహ‌ర‌చ‌న కోస‌మే అంటున్నారు. పైకి వ‌రి కొనుగోలు అంశం, టీఆర్ఎస్‌కు కౌంట‌ర్ల‌పై చ‌ర్చ జ‌రిగినా.. కేసీఆర్ అవినీతి, బియ్యం కొనుగోళ్ల కుంభ‌కోణంపై కీల‌క మంతనాలు జ‌రిగాయ‌ని తెలుస్తోంది. ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు క‌ర్నాట‌క నుంచి త‌క్కువ ధ‌ర‌కు బియ్యం తీసుకొచ్చి.. తెలంగాణ కోటాలో ఎఫ్‌సీఐకి అధిక ధ‌ర‌కు అమ్ముతున్నార‌ని.. ఈ బియ్యం దందా కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతోంద‌ని బీజేపీ పెద్ద‌ల‌కు ఎంపీ అర్వింద్ వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఆ మీటింగ్ త‌ర్వాత బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో అమిత్‌షా ప్ర‌త్యేకంగా పావు గంట పాటు స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. ఆ ఇంట‌ర్న‌ల్ మీటింగ్‌లో కేసీఆర్ కుటుంబం కరెప్ష‌న్ గురించి బండి సంజ‌య్.. అమిత్‌షాకు వివ‌రించార‌ని స‌మాచారం. ఇన్నాళ్లూ కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై చూసీచూడ‌న‌ట్టు ఉండ‌గా.. ఇటీవ‌ల ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి బీజేపీపై, కేంద్రంపై దాడి పెర‌గ‌డంతో.. ఇక ఉపేక్షించాల్సిన అవ‌స‌రం లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే టీఆర్ఎస్ నేత‌ల బియ్యం దందాపై ఎంపీ అర్వింద్ ఆధారాలు రెడీ చేశారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబం క‌రెప్ష‌న్‌పై బండి సంజ‌య్ దృష్టి సారించారు. ప‌క్కా ఎవిడెన్స్‌తో కేసీఆర్‌పై కేసుల ఉచ్చు బిగించేలా.. ఢిల్లీ స్థాయిలో క‌మ‌ల‌నాథులు గ్రౌండ్‌వ‌ర్క్ ప్రిపేర్ చేస్తున్నారని అంటున్నారు. తాజా, అమిత్‌షా మీటింగ్‌తో ఆ మేర‌కు రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు ప‌క్కా ఆదేశాలు వ‌చ్చాయ‌ని.. త్వ‌ర‌లోనే కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా కీల‌క ప‌రిణామాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. అయితే, బీజేపీ నేత‌లు నిజంగానే కేసీఆర్‌కు ఉచ్చు బిగిస్తారా? లేక‌, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప‌దే ప‌దే డిమాండ్‌ చేస్తున్న‌ట్టు.. ఆ ఆధారాలు బ‌య‌ట‌పెట్టి.. ముఖ్య‌మంత్రిపై కేసులు పెట్టి.. కేసీఆర్‌ను జైల్లో పెడ‌తారా? లేదంటే.. స్వ‌యంగా కేసీఆరే స‌వాల్ చేసిన‌ట్టు ఆయ‌న‌పై సీబీఐ, ఈడీ దాడులు చేసే సాహ‌సం కేంద్రం చేస్తుందా? ప‌రిస్థితులు చూస్తుంటే ముందుముందు తెలంగాణ రాజ‌కీయం అగ్నిగోళంగా మండేట్టు ఉందంటున్నారు విశ్లేష‌కులు.

ఎంపీకి కొవిడ్.. పార్లమెంట్ లో కలకలం

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఓ ఎంపీకి కొవిడ్ సోకడం కలకలం రేపుతోంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ ఓ ఎంపీ కరోనా బారినపడ్డారు. సోమవారం వరకు లోక్‌సభకు హాజరైన తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు  బీఎస్పీ ఎంపీ కున్వార్‌ డానిష్‌ అలీ వెల్లడించారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్నప్పటికీ వైరస్‌ సోకిందని ట్వీట్‌ చేశారు. తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని భావిస్తున్నట్టు ఎంపీ డానిష్‌ అలీ చెప్పారు. తన ట్వీట్‌ను లోక్‌సభ స్పీకర్‌, లోక్‌సభ సెక్రటేరియట్‌కు ట్యాగ్‌ చేశారు.    బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీకి కొవిడ్ నిర్దారణ కావడంతో పార్లమెంట్ లో అలజడి రేగింది. వైరస్ సోకిన ఎంపీ లోక్ సభలో అందరిని కలిశారని చెబుతున్నారు. సభ లోపల, బయట కూడా సహచర ఎంపీలతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని తెలుస్తోంది. దీంతో బీఎస్పీ ఎంపీని కలిసిన నేతలంతా వణికిపోతున్నారు. కొవిడ్ టెస్టు కోసం పరుగులు పెడుతున్నారు.

జ‌గ‌నన్న‌కు బ‌ర్త్‌డే విషెష్ చెప్ప‌ని త‌ల్లిచెల్లి.. కంప్లీట్‌గా తెగ‌దెంపులేనా?

ఏపీ వ్యాప్తంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. జిల్లాల్లో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు, కేకుల‌తో హంగామా చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. బ‌ర్త్‌డే గ్రాండ్‌గానే జ‌రుగుతోంది. ఇంత‌కీ, అస‌లైన వాళ్లు జ‌గ‌న్‌కు విషెష్ చెప్పారా? చెప్పాల్సిన వాళ్లు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారా? అంటూ ఏపీ ప్ర‌జ‌లు ఇంట్రెస్టింగ్‌గా న్యూస్ సెర్చ్ చేస్తున్నారు. నెటిజ‌న్ల క్యూరియాసిటీ చంద్ర‌బాబు విషెష్ చెప్పారా? లేదా? అని కాదు.. జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి ష‌ర్మిల.. శుభాకాంక్షాలు చెప్పారా లేదా అని ఆరా తీస్తున్నారు. వాళ్లిద్ద‌రూ జ‌గ‌న‌న్న‌కు విషెష్ చెప్ప‌లేద‌ని తెలిసి వైసీపీ ఫ్యాన్స్ ఉసూరు మంటున్నారు.  అవును, జ‌గ‌న్‌కు ఇది హ్యాపీ బ‌ర్త్‌డే కాక‌పోవ‌చ్చు. క‌న్న‌త‌ల్లి.. తోడ‌బుట్టిన చెల్లి.. తోడుగా లేన‌ప్పుడు అది వేడుక ఎలా అవుతుంది? కొడుకు పుట్టిన‌రోజు నాడు కూడా త‌ల్లి విజ‌య‌మ్మ తాడేప‌ల్లి ప్యాలెస్‌కు రాలేదంటే.. ఆ క‌న్న‌త‌ల్లి ఎంత క‌డుపుమంట‌తో ఉండి ఉంటుంది? జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణం.. ష‌ర్మిల గుండెల్లో గుచ్చుకొని.. ఆమె విల‌విల్లాడి.. పుట్టింటిని వ‌దిలి.. మెట్టింటికి షిఫ్ట్ అయిపోయిన సోద‌రి ష‌ర్మిల సైతం.. జ‌గ‌న‌న్న‌కు బ‌ర్త్‌డే విషెష్ చెప్ప‌క‌పోవ‌డం దారుణం. ఆమె ఎంతగా హ‌ర్ట్ అయి ఉంటే.. చెల్లిని ఎంత‌గా బాధ‌పెట్టి ఉంటే.. పుట్టిన‌రోజు నాడు కూడా పట్టింపులు, పంతానికి పోయింటారో ఊహించుకోవ‌చ్చు. బ‌ద్ద శ‌త్రువు చంద్ర‌బాబులాంటి వారే హ్యాపీ బ‌ర్త్‌డే జ‌గ‌న్ అంటూ విషెష్ చెప్ప‌గా.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌మ్మ‌లు.. జ‌గ‌న్‌కు క‌నీసం మాట వ‌రుస‌కైనా శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి చూస్తే.. ఆ త‌ల్లీకూతుళ్లు జ‌గ‌న్‌పై ఎంత అసంతృప్తి, అస‌హ‌నం, ఆవేద‌న‌తో ఉన్నారో అర్థం అవుతోందని అంటున్నారు.  వైఎస్‌ కుటుంబంలో కుంపట్లు కొత్త‌కాక‌పోయినా.. లేటెస్ట్‌గా జ‌గ‌న్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అవ‌న్నీ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. గ‌తంలో వైఎస్సార్ జ‌యంతి, వ‌ర్థంతిల నాడు కూడా.. వైఎస్సార్ స‌మాధి సాక్షిగా.. ఇలానే జ‌రిగింద‌ని గుర్తు చేస్తున్నారు. తండ్రి స‌మాధే వైఎస్సార్ ఫ్యామిలీ వార్‌కు వేదికైంది. ఆ త‌ర్వాత ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల మాట్లాడుతూ.. త‌మ మ‌ధ్య అంత‌గా పెద్ద గొడ‌వ‌లేమీ లేవ‌ని.. ఉన్న‌వ‌న్నీ చిన్న‌చిన్న ఇష్యూలేన‌ని.. కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయంటూ కాస్త సాఫ్ట్ కార్న‌ర్‌గానే ఆన్స‌ర్ ఇచ్చారు. కానీ, అవ‌న్నీ ఉట్టి మాట‌లేన‌ని.. జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు బాగా చెడింద‌ని బ‌ర్త్‌డేతో తేలిపోయింది. జ‌గ‌న్ నిజ స్వ‌రూపం బాగా తెలిసిన‌.. మొద‌టినుంచీ ద‌గ్గ‌రుండి చూసిన‌.. త‌ల్లిచెల్లిలే జ‌గ‌న్‌ను రిజెక్ట్ చేశారంటే.. మ‌నోడి నైజం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఏపీ ప్ర‌జ‌లు సైతం ఇప్పుడిప్పుడే జ‌గ‌న్ ఆగ‌డాల‌పై ఓ అంచ‌నాకు, క్లారిటీకి వ‌స్తున్నారు. మ‌రో రెండున్న‌రేళ్లు భ‌రించడం క‌ష్ట‌మంటున్నారు.   

జగన్ పుట్టినరోజున వైసీపీ అరాచకం! దళితుడిపై పెట్రోల్ పోసి నిప్పు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. జగన్ పుట్టినరోజు వేడుకలంటూ పలు ప్రాంతాల్లో హంగామా చేశారు వైసీపీ కార్యకర్తలు. పలు చోట్ల ఓవరాక్షన్ కూడా చేశారు. గుంటూరు నగరంలో  అయితే వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు.  జగన్ పుట్టినరోజే హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గం పత్తిపాడు మండలపరిధిలోని బోయపాలెం జాతీయ రహదారిపై వైసీపీ నేతలు వీరంగం వేశారు. పోలీసులు తమను ఏం చేయలేరనే ధైర్యంతోనే ఏమో రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు వైసీపీ కార్యకర్తలు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు.పెదనందిపాడు మండలం, కొప్పర్రుకు చెందిన వెంకటనారాయణ పెద్దకుర్రపాడు అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  వైసీపీ శ్రేణులు మద్యం మత్తులో చంద్రబాబును దూషించడంతో అక్కడే ఉన్న వెంకటనారాయణ వారిని అడ్డుకున్నాడు. జగన్ వచ్చిన తర్వాతే మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని, చంద్రబాబు ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడితనం లేదని అన్నాడు. మాకే ఎదురు సమాధానం చెబుతావా? అంటూ వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టే యత్నం చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాధితుడు దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈ ఘటనపై టీడీపీతోపాటు అన్ని వర్గాలకు చెందిన దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఆర్య‌వైశ్యులంటే వైసీపీకి ఎందుకంత‌ మంట‌? జ‌గ‌న్‌పై గుప్తాల క‌న్నెర్ర‌..

రెండు ఘ‌ట‌న‌లు. నెల రోజుల గ్యాప్‌లోనే వ‌రుస అవ‌మానాలు. ఓ వ‌ర్గం మొత్తానికి దారుణ అవ‌మానం. ఆర్య‌వైశ్యులంటే జ‌గ‌న్‌కు ఎందుకంత చుల‌క‌న‌? గుప్తాలంటే వైసీసీ వారికి ఎందుకంత గుర్రు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. రాజకీయ కురువృద్దుడు, పార్టీలకు అతీతంగా అంతా గౌరవించే మాజీ సీఎం రోశ‌య్య పార్థీవ దేహాన్ని సీఎం జ‌గ‌న్ క‌నీసం సంద‌ర్శించ‌క‌పోవ‌డంపై వైశ్యులంతా చాలా కోపంగా ఉన్నారు. ఆ ఆగ్ర‌హ‌జ్వాల‌ను మ‌రింత రాజేసేలా.. తాజాగా ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై సొంత‌పార్టీ నేత‌లే దాడి చేయ‌డం.. మోకాలిపై కూర్చొబెట్టి క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌డం.. ఆ దృశ్యాల‌న్నీ వీడియో రికార్డ్ చేసి వైర‌ల్ చేసి అవ‌మానించ‌డం.. ఇలా ఈ రెండు ఘ‌ట‌న‌ల‌తో ఆర్య‌వైశ్యులంతా అధికార పార్టీ తీరుపై ర‌గిలిపోతున్నారు.  రోశ‌య్య మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ తీరును త‌ప్పుబ‌డుతూ.. అప్పుడు ఓ వైసీపీ నేత చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. జ‌గ‌న్.. త‌మ జాతి గుండెల‌పై త‌న్నాడంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగునేల‌కు రోశ‌య్య చేసిన సేవ‌కు క‌నీస గుర్తింపు కూడా ఇవ్వ‌కుండా.. ఆయ‌న చ‌నిపోతే క‌నీసం చివ‌రిచూపు కూడా చూడ‌కుండా.. జ‌గ‌న్.. త‌మ జాతి ర‌త్నాన్ని అవ‌మానించార‌ని మండిప‌డ్డారు. తాజాగా, సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచ‌రుల దాడిపైనా వైశ్యులంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అనంత‌పురంలో ఆర్యవైశ్య సంఘం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆర్యవైశ్యులకు మంత్రి కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక, గుంటూరులో జ‌న‌సేన నేత నేరేళ్ల సురేశ్ మ‌రింత ఘాటుగా నిల‌దీశారు. వైశ్యుల‌పై దాడులు జ‌రుగుతుంటే.. పదవులు పొందిన ఆర్యవైశ్య నేతలు ఎందుకు పెదవి విప్పటం లేదని ప్రశ్నించారు.  ఇలా, ప్రాంతాలు, జిల్లాల‌కు అతీతంగా ఆర్య‌వైశ్యులంతా వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జ‌గ‌న్ అంత‌టివాడే రోశ‌య్య‌ను అవ‌మానించ‌డంతో.. మిగ‌తా నేత‌లూ జ‌గ‌న్ అడుగుజాడ‌ల్లోనే గుప్తాల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని మండిప‌డుతున్నారు. వైశ్యులు సౌమ్యులు కాబ‌ట్టే.. వ్యాపారంతో వాళ్ల ప‌నేదో వాళ్లు చూసుకుంటారు.. ఎదురుదాడి చేయ‌ర‌నే ధీమాతోనే.. ఆ వ‌ర్గం టార్గెట్‌గా ఇలా చేస్తున్నారంటూ త‌ప్పుబ‌డుతున్నారు. రోశ‌య్య చ‌నిపోతే జ‌గ‌న్‌ వెళ్ల‌క‌పోవ‌డ‌మే ఓ త‌ప్ప అయితే.. టార్గెట్ చేసి, వెంటాడి మ‌రీ సుబ్బారావు గుప్తాపై దాడి చేయ‌డం.. త‌మ జాతిపై చేసిన దాడిగానే ప‌రిగ‌ణిస్తున్నారు ఆర్య‌వైశ్యులు. అందుకే, ఆ వ‌ర్గ‌మంతా ఇప్పుడు జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఏక‌మ‌వుతోంది. రోశ‌య్య‌నే స‌రిగ్గా గౌర‌వించ‌లేని పార్టీ.. ఇక త‌మ‌కేమాత్రం ప్రాధాన్య‌త ఇవ్వ‌ద‌నే విష‌యం గుర్తించారు. అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఆర్య‌వైశ్యులంతా జ‌ట్టు క‌డుతున్నారు. త‌మ రాజ‌కీయ ఉనికిని బ‌లంగా చాటుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

రా రైస్‌ ఎంత ఇచ్చినా తీసుకుంటం.. కేసీఆర్ పై కేంద్రమంత్రి ఆగ్రహం

వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య వివాదం ముదురుతోంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుుకుంటామంటూ ఢిల్లీకి వెళ్లి కూర్చుంది తెలంగాణ మంత్రుల బృందం. సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా చావు డప్పు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కేసీఆర్ తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా కేసీఆర్ ఆరోపణలు, తెలంగాణ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కౌంటరిచ్చారు.  తెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు  సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు.  ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం  ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించలేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు.  గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్నారు పియూష్ గోయెల్. ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు .సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రా రైస్‌ ఎంత ఇచ్చినా  కేంద్రం తీసుకుంటుందని గతంలోనే స్పష్టం చేశామన్నారు. రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పీయూష్‌ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సిగ్గు లేని సీఎం.. తిట్లు మామూలుగా లేవుగా! 

సిగ్గు లేదు.. దద్దమ్మ... ఇంగితం లేదు.. రైతు ద్రోహి.. ఇవన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ  చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్, కేటీఆర్ ఇలాఖాల్లో రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటని అన్నారు.  రైతు ఆవేదన యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు షర్మిల. గంభీరావు పేటలో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు కనీసం ఇంగిత జ్ఞానం లేదని మండిపడ్డారు.  రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అధికారం అనుభవిస్తే సరిపోదని బుద్ధి, సిగ్గు ఉండాలన్నారు.  సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని, రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రే కారణమని షర్మిల ఆరోపించారు. వరి వద్దని చెప్పే అధికారం సీఎంకు లేదన్నారు. మద్దతు ధర ఉన్న పంటలనే రైతు పండిస్తారని, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దన్నారు. కేసీఆర్ సీఎంగా పనికి రారని, చావు డప్పు కేసీఆర్‌కు, ఆయన ప్రభుత్వానికి కొట్టాలన్నారు. ఇవి ఆత్మహత్యలు కావని, కేసీఆర్ చేసిన హత్యలని వైఎస్ షర్మిల అన్నారు. మీ సత్తాలేని పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని... ఇంగితం ఉంటే రైతులను ఆదుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేని, మంత్రిని, కాబోయే సీఎంనని చెప్పుకోవడానికి సిగ్గుండాలని వైఎస్ షర్మిల అన్నారు. బోర్లు వేసుకున్న రైతులకు దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని షర్మిల చెప్పారు. పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. రైతుబంధు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి... విత్తనాలు, సబ్సిడీలు, యంత్రలక్ష్మి, నష్టపరిహారాలను బంద్ పెట్టారని అన్నారు. మరణించిన రైతు కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం ఇదని షర్మిల విమర్శించారు. పరిపాలన చేతకాక గల్లీల్లో దర్నాలు, ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని షర్మిల విమర్శించారు. 

తులసి రెడ్డికి పీసీసీ పగ్గాలు?

ఆంధ్రప్రదేశ్  పీసీసీ అధ్యక్షుని మార్పుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఆ దిశగా కసరత్తు ప్రారంభించిందా? అందుకేనా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ విజయవాడ చేరుకుంది? రేపో మాపో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు శైలజా నాథ్ స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ రావదం,ఖాయేమేనా?అంటే అవుననే అంటున్నారు పార్టీ ఇన్సైడర్స్.  నిజానికి, రాష్ట్ర విభజన నాటి నుంచి నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉండీ లేనట్లుగానే ఉంది. వరసగా 2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు.  నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఇంతవకు కాంగ్రెస్ పార్టీ కాలు పెట్టలేదు. రెండు ఎన్నికలలోనూ హస్తం పార్టీకి రెండు శాతం కంటే తక్కువగానే ఓట్లు పోలయ్యాయి. అయినా గతవైభవ చిహ్నంగా పార్టీ మనుగడసాగిస్తూనే వుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పరిస్థితులు అనుకులించక పోయినా, ఐదారేళ్ళు చురుగ్గానే పనిచేశారు. రఘువీరా రెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత,మరో మాజీ మంత్రి  శైలజానాథ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుని ముందుకు సాగడంలో ఆయన అంతగా విజయం సాదించలేక  పోయారు. మరో వంక ఆయన వ్యవహర సరళికి సంబంధించి పార్టీ అధిష్టానానికి గత కొంత కాలంగా ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలోనే పార్టీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది.  పీసీసీ అధ్యక్షుని మార్పు విషయం చర్చించేందుకే విజయవాడ చేరుకున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ రెండు రోజుల పాటు విజయవాడలో బస చేయనున్నారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశం అవుతారు. రేపు (బుధవారం) పీసీసీ సమావేశంలో పాల్గొంటారు. అలాగే, బుధవారం మరోమారు  పార్టీ ముఖ్య నాయకులతో ఉమెన్ చాందీ సమావేశం అవుతారని, ఈ మొత్తం ఎక్సర్సైజ్, కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక  కోసమే అని పార్టీ వర్గాల సమాచారం. ఆగష్టులో  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేసమైనప్పుడే  పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని వార్తలొచ్చాయి. అప్పట్లో రాజ్య సభ మాజీ సభ్యుడు  కేవీపీ రామ చంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా కేంద్ర మాజీమంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, ఎంపీలు కేవీపీ, హర్ష కుమార్, చింతా మోహన్ మరికొందరు  నాయకులు  రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, పల్లంరాజు, పేర్లు పీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.  అయితే  ఇప్పుడు  పీసీసీ రేసులో మరో రెండు మూడు పేర్లు షికారు చేస్తున్నా, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్    ఎన్. తులసి రెడ్డివైపే రాహుల్ గాంధీ మొగ్గుచుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ గాంధీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైన నేపధ్యంలో పార్టీ పునర్జీవనానికి ఇదే సరైన సమయమని ఉమెన్ చాందీ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన రాహుల్  గాంధీకి ఒక నివేదికను కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే తులసి రెడ్డి ఎంపిక నిర్ణయం జరిగిందని, ఇక ప్రకటన మాత్రమే మిగిలుందని అంటున్నారు.

జ‌గ‌న్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌.. పేద‌ల‌కు ఉచితంగా ఇసుక డిమాండ్‌..

ఏపీలో సీఎం జ‌గ‌న్‌ బ‌ర్త్‌డే వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రుగుతున్నాయి. అక్క‌డ‌క్క‌డా వైసీపీలో కుమ్ములాట‌లూ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఫ్లెక్సీలు చింపుకోవ‌డం.. స‌వాళ్లు చేసుకోవ‌డం.. పార్టీ నేత‌ను కొట్టి మ‌ళ్లీ కేక్ తినిపించ‌డం.. ఇవ‌న్నీ జ‌గ‌న్ పుట్టిన‌రోజు స్పెష‌ల్స్‌. వైసీపీ నేత‌లే కాదు.. టీడీపీ వారు సైతం త‌మ‌దైన స్టైల్‌లో జ‌గ‌న్‌రెడ్డికి బ‌ర్త్‌డే విషెష్ చెబుతున్నారు. ఆ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర కోరిక‌లూ కోరుతున్నారు.  తాజాగా, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "జ‌గ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. నాదొక చిన్న కోరిక‌. పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఇసుక‌ను జ‌న్మ‌దిన కానుక‌గా జ‌గ‌న్ ఉచితం చేయాలి." అని సోమిరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  ట‌న్ను ఇసుక రూ.475 గా నిర్ణ‌యించామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు రూ.900కి అమ్మ‌డ‌మేంటి అని సోమిరెడ్డి నిల‌దీశారు. ఇసుక త‌వ్వ‌కాల్లో నెల‌కు రూ.600 కోట్ల అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. జేపీ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ ద్వారా జ‌రిగే ఇసుక త‌వ్వ‌కాలు, స‌ర‌ఫ‌రాపై స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా సేక‌రించిన వివ‌రాలు ప‌రిశీలిస్తే.. ఇసుక త‌వ్వ‌కాల్లో దాగున్న వంద‌ల కోట్ల అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని తెలిపారు.  

సీఎం పేరుతో భూకబ్జాలు.. పందేలకు రెడీ.. ఒమిక్రాన్ డబుల్ సెంచరీ.. టాప్ న్యూస్@1PM

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని అన్నారు. సీఎం, మంత్రులు, ఎంపీల పేర్లతో  బెదిరించడం, కబ్జాలకు పాల్పడడం రివాజుగా మారిందని ఆరోపించారు. బాధితులు వేధింపులకు భయపడకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపించాలని, బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ---- ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎడ్లు, గుర్రం, కోడిపందేలు నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని లేఖలో ఆయన కోరారు. సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో గుర్రం, కోడి పందేలు, ఎడ్లు బరువు లాగే పోటీలు తదితర కార్యక్రమాలను ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందని చెప్పారు. ---- కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ లేఖ రాశారు. కొత్త రకం తెగుళ్ల ముప్పుతో రైతులు కుంగిపోతున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పుడు మ‌రో క‌ష్టం వ‌చ్చింద‌ని, వారిని ఆదుకోవాల‌ని కోరారు. పంట నష్టం అంచనా వేసి తక్షణమే పరిహారం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని  కేంద్రమంత్రిని కోరామని  గ‌ల్లా జ‌య‌దేవ్ ట్వీట్ చేశారు.  ------ ఒంగోలులో సొంత పార్టీ నేతపై వైసీపీ నేతలు దాడికి దిగడం సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో ట్విస్ట్ జరిగింది. సొంత పార్టీ నేతలతో దెబ్బలు తిన్న వైసీపీ నేత సుబ్బారావు గుప్తా.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిశాడు. మంత్రితో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు.   -------- పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సీఎం టూరులో వైసీపీ నేతలు సొంత డబ్బా ప్లకార్డులను ప్రదర్శిస్తూ హల్‌చల్ చేశారు. సభా ప్రాంగణం గేటు వద్ద మహిళలకు జై జగన్.. హ్యాపీ బర్త్ డే అని ఉన్న ప్లకార్డులను పార్టీ నాయకులు అందజేశారు. పార్టీ నేతల వైఖరిపై మహిళలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నేతలు హడావుడి చేయడం ఏంటని మండిపడ్డారు.  -------- మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గు చేటని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. టీఆర్‌ఎస్ కు కనీసం ఇంగిత జ్ఞానం లేదని, రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు.  ------- తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సారంగపూర్ జెడ్పీటీసీ పి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారని, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు పత్రాలు సమర్పించారన్నారు. ------- తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చాడు. ఇంటికి చేరుకున్న అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను, ఆయనతో కాంటాక్ట్ లోకి వచ్చిన మరో ఏడుగురిని క్వారంటైన్ చేశారు.  --- భారతదేశంలో ఇప్పటివరకు 200 మంది రోగులు ఒమైక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఒమైక్రాన్ వేరియెంట్ సోకిన వారిలో 77 మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.మహారాష్ట్ర, ఢిల్లీలలో 54 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదవగా, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి. ----  జమ్మూ-కశ్మీరు శాసన సభ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో కొత్తగా ఆరు నియోజకవర్గాలను, కశ్మీరు ప్రాంతంలో కొత్తగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించడంతో పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. ---  

బుస‌లు కొట్టిన‌ పాము.. ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఇంట్లో క‌ల‌క‌లం..

శ్రీకాకుళంలోని ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు ఇల్లు అది. న‌గ‌రంలోని 89 ఫీట్స్ రోడ్డులో ఉంటుంది ఆయ‌న నివాసం. ఈ ఉద‌యం ఆ ఇంట్లో ఉన్న‌ట్టుండి క‌ల‌క‌లం. ఇంట్లోని వారంతా ఒక్క‌సారిగా హ‌డ‌ల్‌. పెద్ద పెద్ద అరుపుల‌తో అంతా ప‌రుగులు పెట్టారు. ఇంట్లో వారంద‌రినీ అప్ర‌మ‌త్తం చేశారు. అందుకు కార‌ణం.. బుస‌లు కొట్టే పాము.  పాము అంటే అల్లాట‌ప్పా పాము కాదు. అత్యంత విష‌పూరిత‌మైన ర‌క్త‌పింజ‌ర అది. కాటేస్తే ఖ‌తం. అలాంటి పాము ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు ఇంట్లో చొర‌బ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. పాము బుస‌లు కొట్ట‌డం చూసి ఇంట్లో వాళ్లంతా భ‌య‌ప‌డిపోయారు. ఆ పాము ఎటు పోతుందో..? ఎక్క‌డ న‌క్కుతుందో..? ఏం ప్ర‌మాదం జ‌రుగుతుందో..? అని అంతా వణికిపోయారు.  కాసేప‌టికి తేరుకుని.. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. హెల్ప్‌ లైన్‌ నిర్వాహకులు ఎంపీ ఇంటికి చేరుకొని పామును చాకచక్యంగా ప‌ట్టుకోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  ఆ త‌ర్వాత ఆ పామును సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో వ‌దిలిపెట్టారు. 

కొందరినే టార్గెట్ చేశారా? ఒక్క ఆధారం లేకుండానే కేసులా..! 

ఏపీ సీఐడీ తీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంలో అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. సంస్థకు ఎండీగా ఉన్న వ్యక్తిని కాదని డైరక్టర్ ఉన్న వ్యక్తిని ఏ-1గా పెట్టడం పైనా విమర్శలు వస్తున్నాయి. నిర్ణయాలు తీసుకుని, డబ్బులు రిలీజ్ చేసిన వారిని పట్టించుకోకుండా సలహాలు ఇచ్చిన వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గంటా సుబ్బారావు  నిధులు దుర్వినియోగం చేశారని ఏదైనా ఆధారాలు ఉన్నాయా ? అన్న హైకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సీఐడీ దగ్గర సమాధానం లేకపోయింది. దీంతో స్కిల్ డెలవప్‌మెంట్ స్కాంలో ఏ-1గా చూపించిన గంటా సుబ్బారావుకు హైకోర్టు షరతుల బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ విచారణకు హాజరు కావాలంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.  స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ స్కాం జరిగిందని సీఐడీ కేసులు పెట్టింది. ఘంటా సుబ్బారావుతోపాటు మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణతో సహా పలువుర్ని నిందితులుగా చేర్చారు. అయితే నిధులు విడుదల చేసింది అప్పటి ఎండీ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి అని అలాగే నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు సీఎంవోలో కీలకంగా ఉన్న షంషేర్ సింగ్ రావత్, అజయ్ జైన్‌లు అని వారిని కాకుండా కేవలం సలహాలకు మాత్రమే పరిమితయ్యేవారిపై కేసులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కీలకమైన వ్యక్తుల్ని వదిలేసి కొంతమందిని మాత్రమే కేసులో నిందితులుగా పేర్కొనడం పట్ల సుబ్బారావు తరపు న్యాయవాది ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమందిని కావాలని కేసులో ఇరికించారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.  హైకోర్టులో విచారణ సందర్భంగా నిధులు విడుదల చేసినవారిపై కేసులు పెట్టకపోవడంపై ప్రశ్నలు రావడంతో సీఐడీ రూట్ మార్చింది. మరో ఇద్దరు మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.సీఆర్‌పీసీ 160 కింద మాజీ ఎండీ-సీఈవో ప్రేమచంద్రారెడ్డికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌కు నోటీసులిచ్చిం ది. కార్పొరేషన్‌ ఏర్పాటు నుంచి రూ.371 కోట్ల విడుదల వరకూ జరిగిన వ్యవహారాలకు సంబంధించి 40 ప్రశ్నలు సంధించి ప్రేమ్‌చంద్రారెడ్డిని వివరణ అడిగింది. ‘అప్పట్లో ఏం జరిగింది.? నాటి సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందా.? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తెలుసా..? ప్రతిపాదనలు ఎవరిచ్చా రు..? ఎక్కడి నుంచి ఫైలు వచ్చింది.. డబ్బుల విడుదలకు ముందు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా.? న్యాయశాఖ అనుమతించిందా..? మంత్రివర్గ తీర్మానం అమలు చేశారా.? నిబంధనలన్నీ పాటించారా.? పాటించని వాటి గురించి మీరు ప్రస్తావించారా..’ అని తదితర ప్రశ్నలు అడిగారు. ఈ నెల 17నే ప్రేమ్‌చంద్రారెడ్డికి నోటీసులిచ్చిన సీఐడీ అధికారులు.. సోమవారం పీవీ రమేశ్‌కు ఇచ్చేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. అయితే ఇంటి మరమ్మతుల కారణంగా ఆయన వేరే ఇంటికి మారడంతో సీఐడీ బృందం వాటిని కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

యూపీ ఎన్నికలు యోగీకి కాదు మోడీకే సవాల్..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర వుతున్న కొద్ద్దీ రాజకీయం వేడెక్కుతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార కార్యక్రమాలను ఎన్నికల ప్రచారానికి వేదిక చేసుకుంటోంది. నిజానికి ఇప్పుడు కాదు, మూడు నెలల ముందు నుంచే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకదాని వెంట ఒకటిగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంబోత్సవాలు చేసుకుంటూ పోతున్నారు.  వివరాలలోకి వెళితే అక్టోబర్ 25  పూర్వాంచల్ ప్రాంతంలోని ఒకే రోజున తొమ్మిది వైద్యకళాశాలలు ప్రధాని ప్రారంభించారు. అందులో ఎనిమిది కళాశాలలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఒక్క జున్పూర్ వైద్య కళాశాలకు మాత్రమే రాష్ట్ర  ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ఈ ఆసుపత్రుల నిర్మాణానికి రూ.2,329 కోట్లు ఖర్చు చేశారు.ఈ తొమ్మిది వైద్య కళాశాలల జిల్లా అసుపత్రులకు అనుసంధానం చేయడం వలన ఆ ఆసుపత్రులలో 2509 అదనపు పడకల  సదుపాయం ఏర్పడింది. ఓ ఐదు వేల మంది వరకు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఉద్యోగాలు లభించాయి. అదే వారంలో ప్రదానమంత్రి మరో రూ .5,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సమాచారం. నవంబర్ 16 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 341కిమీ పూర్వాంచల్ ఎక్ష్ప్రెస్స్’వే ప్రారంభించారు. అందులో ఇండియన్ ఎయిర్ఫోర్సు విమానాలు దిగేందుకు 3.2 కిమీ ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,500 కోట్లు. వెనకబడిన పూర్వాంచల్ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ జీవధార అంటారు. ఇక డిసెంబర్ 14న ప్రధాని మోడీ, కాశీలో గంగా నది నుంచి కాశీ విశ్వనాథ దేవాలయం వరకు నిర్మించిన 500 మీటర్ల్ కారిడార్, 24 భవనాల భవన సముదాయం ప్రారంభించారు. ఇది మరో రూ. 339 కోట్ల భరీ ప్రాజెక్ట్ ... ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒక మెగా ఈవెంట్’ మలిచారు. మోడీ వీధుల్లో నడుస్తూ,జనంతో కలుస్తూ, పూజలు, హారతులు, గంగా స్తానాలతో మీడియా ఫోకస్’ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నారు. కాషాయ మెరుపులు మెరిపించారు.  ఇంతవరకు ఇంతే అయినా ఇక ముందు ఇంకెన్ని ప్రారంభోత్సవాలు ఇంకెన్ని తళుకు బెళుకులు చూపిస్తారో ఏమో కానీ, మెరీసేదంతా బంగారం కాదు, కేవలం తళుకు బెళుకుల ప్రారంభోత్సవలతోనే ఎన్నికల్లో విజయం సాధించడం అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదుఈ వరస ప్రారంభోత్సవాలు, ముఖ్యమంత్రి అధిత్యనాథ్ ప్రభుత్వ విజయాలు కాదు, వైఫల్యాలను కప్పిపెట్టే ప్రయత్నంగానే పరిశీలకులు భావిస్తున్నారు. అయితే కేవలం ఆర్థిక లెక్కలపైనే ఎన్నికల గెలుపు ఓటములు ఆధార పడవు. శక్తివంతమైన రాజకీయ సందేశాల ముందు ఆర్ధిక పద్దులు, అభివృద్ధి లెక్కలు నిలబడవు. ఈ విద్యలో మోడీ గురువులకే గురువు... చెప్పదలచుకున్న విషయాన్ని మాటతోనే  కాదు మౌనంగానూ చెప్పగల దిట్ట మోడీ. సో.. నిజంగానే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలిస్తే అది  ఆదిత్యనాథ్ ప్రభుత్వ విజయం కాదు, అలాగని మోడీ విజయము కాదు. నిజానికి మళ్ళీ మరో మారు బీజేపీ గెలిస్తే అది విపక్షాల ఓటమే కాని, బీజేపే విజయం కాదు.

లంచం ఇస్తే పని కచ్చితంగా అవుతుంది.. నోరు జారిన ఉన్నతాధికారి

ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిందే. లంచం ఇవ్వనిదే చిన్న  ఫైల్  కూడా కదలదని అంటారు. అందుకే ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్లేవారు అమ్యామ్యాలు ఇవ్వాలని సిద్ధమయ్యే వెళుతుంటారు. రెవిన్యూ, మున్సిపల్ విభాగాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. పోలీసుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. పోలీస్ స్టేషన్ లో లంచం ఇవ్వకుండా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదంటారు. లంచం ఇస్తే పోలీసులు కచ్చితంగా పని చేస్తారనే టాక్ కూడా ఉంది. ఈ విషయాన్నే తాజాగా ఓ ఉన్నతాధికారి ఓపెన్ గానే చెప్పేశారు. పోలీసులు లంచం తీసుకుంటే కచ్చితంగా పనిచేస్తారని చెప్పాడు సదరు ఉన్నతాధికారి. ఒక విధంగా పోలీసులు లంచం తీసుకుంటారని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఈ పోలీస్‌ అధికారి గెస్ట్‌గా వచ్చాడు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. “పోలీసులు డబ్బు తీసుకుంటే పని అయిపోతుంది” అని అన్నాడు. అతడు ఈ మాట మాట్లాడగానే అక్కడున్న జనాలందరు నవ్వారు.‘‘పోలీసుల కంటే మంచి డిపార్ట్‌మెంట్ లేదు.. పోలీసులు డబ్బులు తీసుకుంటే ఆ పని అయిపోతుంది.. వేరే డిపార్ట్‌మెంట్‌ వాళ్లు డబ్బులు తీసుకుంటారు.. కానీ పని జరగదు.. టీచర్లను చూడండి.. ఇంట్లో ఉంటూ నేర్పిస్తారు. మేము కరోనావైరస్ ఉన్నప్పటికీ అందరి కోసం పనిచేస్తున్నామని” మాట్లాడాడు. లంచం గురించి పోలీస్‌ అధికారి మాట్లాడిన ఈ మాటలు వివాదాస్పదంగా మారాయి. అతడి వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అతడిపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతడు మాట్లాడిన మాటలపై వివరణ ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్‌ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. 

saveandhrapradesh2022@gmail.com ..వైసీపీ బెదిరింపుల‌పై ఎంపీ సుజ‌నా అభ‌య‌హ‌స్తం

నోరెత్తితే దాడి. విమ‌ర్శిస్తే దాడి. ఆరోపణ‌లు చేస్తే అటాక్‌. ఏపీలో ఇప్పుడంతా రౌడీ రాజ్యం.. ఫ్యాక్ష‌న్ రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగం..అంటున్నారు. టీడీపీ నేత‌లే టార్గెట్‌గా రెండున్న‌రేళ్లుగా దాడులు జ‌రుగుతున్నాయి. అధికారం చేతిలో ఉంది క‌దానే బ‌లుపుతో.. ప్ర‌తిప‌క్షంతో పాటు ప్ర‌జ‌ల మీద కూడా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. విశాఖ‌లో డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను ఎంత దారుణంగా టార్గెట్ చేసి.. ఆయ‌న చావుకు కార‌ణ‌మ‌య్యారో అంద‌రికీ తెలిసిందే. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని సైతం వేధిస్తూ.. చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా, మ‌రో అడుగు ముందుకేసి.. వైసీపీ నాయ‌కుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన సొంత పార్టీ నేత‌ల‌పైనే దాడుల‌కు దిగారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాను కొట్టి.. మోకాళ్ల‌పై కూర్చోబెట్టిన ఘ‌ట‌న వైసీపీ లీడ‌ర్ల ఓవ‌రాక్ష‌న్‌కు నిద‌ర్శ‌నం. అటు, విశాఖ‌లో జ‌గ‌దీశ్వ‌రుడిపై దాడి ఘ‌ట‌న అధికార పార్టీ అరాచ‌కానికి ప‌రాకాష్ట అంటున్నారు.  వైసీపీ ఆగ‌డాలు అడ్డుకోవాలంటే ఎవ‌రో ఒక‌రు ముందుకు రావాల్సిందే. అలాంటి బాధితుల‌కు నేనున్నానంటూ అభ‌య‌హ‌స్తం అందిస్తున్నారు బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి. ఏపీలో సీఎం, మంత్రుల పేర్లతో బెదిరింపులు పెరిగాయని సుజనా మండిప‌డ్డారు. ఎంపీల పేర్లతో కబ్జాలకు పాల్పడటం కామ‌న్‌గా మారిందని ఆరోపించారు. తక్షణమే సీఎం జగన్‌ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.  వైసీపీ వేధింపులకు భయపడకుండా బాధితులు పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయాలని ఎంపీ సుజ‌నా చౌద‌రి సూచించారు. ఆ ఫిర్యాదు కాపీలు తనకు పంపాలని.. బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి భరోసా ఇచ్చారు. ఆ కాపీలను saveandhrapradesh2022@gmail.comకు పంపించాలంటూ ట్వీట్‌ చేశారు.   

అపార్ట్‌మెంట్ పైనుంచి న‌గ్న‌*గా కిందపడిన యువతి.. ఏం జ‌రిగిందంటే..

అది సంప‌న్నులు ఉండే పోష్ లొకాలిటీ. అందులో ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌. 7వ ఫ్లోర్‌లో కెమిక‌ల్ ఇంజినీర్ నితిన్ గుప్తాకు చెందిన‌ ఫ్లాట్‌. ఏడాది క్రితం కొవిడ్‌తో ఆయ‌న భార్య చ‌నిపోయింది. అప్ప‌టి నుంచీ ఫ్లాట్‌లో ఒంట‌రిగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఓ బెంగాలీ గ‌ర్ల్ అత‌నితో పాటు ఆ ఫ్లాట్‌కు వ‌చ్చి పోతోంది. క‌ట్ చేస్తే.. 7వ ఫ్లోర్ నుంచి ఆ బెంగాలీ భామ న‌గ్న‌*గా కింద‌ప‌డింది. అంతెత్తు నుంచి ప‌డటంతో తీవ్ర గాయాల‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాపాయం త‌ప్పింది. ఇంత‌కీ ఆ బెంగాలీ యువ‌తి ఎవ‌రు?  గ్రేట‌ర్ నోయిడాలోని అపార్ట్‌మెంట్‌కు ఎందుకు వ‌స్తోంది?  నితిన్ గుప్తాతో ఆమెకు ఏం సంబంధం? న‌గ్న*గా ఎందుకుంది? ఏడ‌వ అంత‌స్తు నుంచి ఎలా ప‌డింది?  ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డిందా? లేక‌.. నితిన్ గుప్తానే తోసేశాడా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అందులో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూస్తున్నాయి.  ఢిల్లీ స‌మీపంలోని గ్రేటర్‌ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌ 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన సంచ‌ల‌నంగా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆ యువతి.. తన ప్రియుడి కోసం గతంలో ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అనంతరం వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. గొడ‌వ‌ల‌తో వారు విడిపోయారు. ఆ తర్వాత ఆ యువతి ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలోనే గ్రేటర్‌ నోయిడాలోని ఓ ఎన్‌ఆర్‌ఐ సొసైటీకి చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ నితిన్‌ గుప్తాతో ఆమెకు  పరిచయమైంది.  తాజాగా, నితిన్‌ గుప్తా ఉండే అపార్ట్‌మెంట్ కింద ఆ యువతి నగ్నంగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నితిన్‌ గుప్తాను విచారించారు.  "కొవిడ్‌ కారణంగా.. నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఈ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి బాత్‌రూమ్‌కి వెళ్లింది. అనంతరం కింద పడిపోయింది." అని నితిన్ గుప్తా పోలీసులకు చెప్పాడు. 

వైసీపీ నేతలతో దెబ్బలు తిని.. మంత్రిని కలిసిన సుబ్బారావు

ఒంగోలులో సొంత పార్టీ నేతపై వైసీపీ నేతలు దాడికి దిగడం సంచలనంగా మారింది. వైసీపీ నేత సుబ్బారావును మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు సుభానీ కొడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.  అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో ట్విస్ట్ జరిగింది. సొంత పార్టీ నేతలతో దెబ్బలు తిన్న వైసీపీ నేత సుబ్బారావు గుప్తా.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిశాడు. మంత్రితో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు.  ఒంగోలులోని ఓ లాడ్జీలో తలదాచుకున్న సుబ్బారావును పట్టుకుని చితకబాదాడు మంత్రి అనుచరుడు సుభానీ. ఈ ఘటన తర్వాత సోమవారం సాయంత్రం ఒంగోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి అంశాన్ని వివరించారు సుబ్బారావు.. అక్కడి నుంచి నేరుగా మరికొంతమంది వైసీపీ నేతలతో కలిసి విజయవాడ వెళ్లారు.  మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తనపై జరిగిన దాడి వివరాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. అనంతరం సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి మంత్రి, సుబ్బారావు గుప్తా పరస్పరం తినిపించుకున్నారు. ఈ వివాదం సమసిపోవాలని ఇరువర్గాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. తానెప్పుడూ బాలినేని, వైసీపీ విధేయుడినేనని.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రమే వ్యాఖ్యలు చేసినట్లు మంత్రిని కలిసిన తర్వాత సుబ్బారావు తెలిపారు.  ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు సొంతపార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలో వస్తే కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.   సుబ్బారావు  చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు రేపాయి. ఇది జీర్ణించుకోలేని వైసీపీ నేతలు సుబ్బారావుపై దాడికి ప్ర.త్నించారు. ఇది గమనించిన సుబ్బారావు ప్రాణభయంతో అదృశ్యమయ్యారు. సుబ్బారావు కోసం వెతుకుతున్న దుండగులు ఆదివారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న 15 మంది లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటి వద్దలేరు.  ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇంటి బయట ఉన్న ఆయన ద్విచక్రవాహనాన్ని తగలబెట్టారు. అంతటితో వదలకుండా ఓ లాడ్జ్‌లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ దాడి చేశారు వైసీపీ నేతలు. దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ సుబ్బారావుకు వార్నింగ్ ఇచ్చాడు మంత్రి బాలినేని అనుచరుడు సుభాన.  గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించారు.   జగనన్నకు కోట్లలో బర్త్ డే గిఫ్ట్స్.. రిటర్న్ గిఫ్ట్ కోసమేనా..? మ‌ద్యం ధ‌ర‌ల‌పై మాట త‌ప్పి, మడ‌మ తిప్పింది అందుకేనా?