బిపిన్ రావత్ హెలికాప్టర్‌పై 'సైబర్ అటాక్' జరిగిందా?
posted on Dec 17, 2021 @ 3:42PM
యుద్ద విమానాలు .. హెలికాప్టర్లను హ్యాక్ చేయవచ్చునా.. ? హైక్ చేయడం సాద్యమేనా.. ? భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఇటువంటి అనుమానాలు.. వినిపిస్తున్నాయి. అయితే అదేమంత కష్టం కాదని, అమెరికా ప్రయోగాత్మకంగా అట్లాంటికా ఎయిర్ పోర్ట్’లో బోయింగ్ 757 విమానాన్ని, హ్యాక్ చేసి నిరూపించిందని నిపుణులు చెపుతున్నారు.
విషయంలోకి వెళితే...అదే బోయింగ్ 757 విమానంలో ప్రయాణించిన సైబర్ ఎక్స్పర్ట్స్ .., అట్లాంటికా ఎయిర్ పోర్ట్’లో విమానం దిగి ... రెండురోజులలో మళ్ళీ విమానం ముట్టుకోకుండానే.. విమానం కంట్రోల్ సిస్టం హ్యాక్ చేశారు. విమానాలాను ... హెలికాప్టర్లను హ్యాక్ చేయడం సాధ్యమే అని ప్రయోగాత్మకంగా నిరుపించారు. అయితే, అది జరిగిన సంవత్సరం తర్వాత, గానీ ఆ విషయం ప్రపంచానికి తెలియలేదు. చివరకు 2017 నవంబర్ 8 అమెరికా సైబర్ సెక్యూరిటీతో సంబంధమున్న హోమ్- ల్యాండ్ సెక్యూరిటీ అధికారి, తమ బృదం సభ్యులు ప్రయోగాత్మకంగా బోయింగ్ 757 ను ముట్టుకోకుండానే, హ్యాక్ చేశారని అధికారికంగా ప్రకటించారు... దాంతో ఒక్క సారిగా ప్రపంచం ఉలిక్కి పడింది.ఈ నేపధ్యంలోనే ఇప్పుడు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం విషయంలో అనుమానాలు, సందేహాలు వ్యక్త మవుతున్నాయి..
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలీకాఫ్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో కూప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన సతీమణి మధులికతో సహా మరో 11మంది మృతి చెందారు.ఈ దుర్ఘటన జరిగి, పది రోజులు పైగానే అవుతోంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సైతం మృతువుతో పోరాడి కన్ను మూశారు. ఇక ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి ఏమి జరిగింది, అనేది చెప్పే ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు.
అదలా ఉంటే, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే, బీజేపీ ఎంపీ సుభ్రమణ్య స్వామి ఓ చిన్న అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ ఎటాక్ కావచ్చేమో అన్న సందేహన్నివెలిబుచ్చారు. చైనా ఈ దుర్మార్గానికి వడికట్టిందేమో అన్న అనుమానం వెలిబుచ్చారు. భారత్ కు ప్రధమ శత్రువు చైనా అని తమ చూపుడు వేలును బీజింగ్ వైపు చూపిన రావత్’ లక్ష్యంగా చైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్త పరిచారు. అయితే, ఏదైనా ప్రభుత్వ దర్యాప్తులోనే తేలాలని సుభ్రమణ్య స్వామి చెప్పారు.
ఇక ఆ తర్వాత,, తైవాన్ ఆర్మీ జనరల్ షెన్-ఇ-మింగ్ ఆయనతో పాటు మరో 12 మంది అతి ముఖ్యమైన తైవాన్ ఆర్మీ అధికారులు ప్రయాణిస్తున్న అత్యంత అధినాతనమైన బ్లాక్ హాక్ హెలికాప్టర్ కుడా 2020 జనవరి 2 ఇదే పరిస్థితులలో తైపీ సమీపంలోని కొండల్లో కూలి, హెలికాప్టర్’లో ప్రయాణిస్తున్న 12 మంది మరణించిన విషయం వెలుగులోకి రావడంతో, బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం చుట్టూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అదలా ఉంటే, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, యుద్దవిమానాలు, హెలికాప్టర్లను ముట్టుకోకుండానే మట్టి కరిపించ వచ్చని అంటున్నారు. సైబర్ వార్ ఫేర్ .. సైబర్ యుద్ద తంత్రంలో శత్రు దేశ వ్యూహాత్మక యంత్రాంగాన్ని టార్గెట్ చేయవచ్చని అంటున్నారు. అలాగే, అమెరికాలో 2012 -2017 మధ్య కాలంలో అభివృద్ధి చేసిన వెపన్ సిస్టం, ఆయుధ విహంగాలు, సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని, 2018లో అమెరికా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఆఫీస్ నివేదిక స్పష్టం చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికాలోనే కాదు, మన దేశంలోనూ అనేక ప్రభుత్వ సంస్థలకు శిక్షణ ఇచ్చిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ముకేష్ చౌదరి, బిపిన్ రావథ్ ప్రయాణం చేసిన హెలికాప్టర్’లోని చోపర్ ని డిజిటల్’ గాగ హాక్ చేయడం సాధ్యమే అంటున్నారు.. సైబర్ వార్ ఫేర్’లో ఇలాంటి దాడులు చేయడం అసాధ్యం కాదని, రేడియో సిగ్నల్స్’ లేదా కమాండ్స్ ‘ను జామ్ చేయడం, సైబర్ పద్దతుల్లో పైలట్’కు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా.. హెలికాప్టర్’ను ముట్టుకోకుండానే, దూరం నుంచే పడగొట్ట వచ్చని అన్నారు.
అదే విధంగా నెదర్ల్యాండ్స్’లో పనిచేస్తున్న మరో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వికాస సింగ్, ‘సీడీఎస్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ఫై సైబర్ దాడి జరిగి ఉంటుందనే అనుమనాలు ఉన్నాయని అన్నారు. డిఫెన్సు మిషనరీలో ఆధునిక సాఫ్ట్ వేర్ ఉన్నా, సైబర్ దాడుల నుంచి సంపూర్ణ రక్షణ ఉన్నట్లు కాదని చెప్పారు. సైబర్ దాడులు భౌతికంగానే కాదు రిమోట్ సాయంతో చేసే అవకాశం ఉందని వికాస్ సింగ్ వివరించారు. ఇరాన్ అణు స్థావరాల పై ఇజ్రాయల్ సైబర్ దాడులు చేసింది. అది మనం చూశాం. ఇలాంటి దాడులు జరిగినా బాధిత దేశాలు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవు .. అయినా చెప్పుకోనంత మాత్రాన సైబర్ దాడులు జగలేదని కాదని అయన వివరించారు.
న్యూ యార్క్ సిటీ కాలేజీ, సైబర్ ఎక్స్పర్ట్ సౌరభ్ సచిదేవ్, 2017 అమెరికా ఏజెన్సీతమ సొంత కమర్షియల్ ప్లేన్ బోయింగ్ 757 ను హ్యాక్ చేసిందని చెప్పారు. ఆ తర్వాతనే అమెరికా యుద్ధ విమానాల నుంచి హెలికాప్టర్ల వరకు ఏదైనా సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందనే హెచ్చరికతో పాటుగా, గైడ్లైన్స్ ను కూడా జాఈ చేసింది.
ఈ నేపధ్యంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 14 మంది సైనిక యోధులు ప్రాణాలను బలి తీసుకున్న హెలికాప్టర్ ప్రమాదం .. సైబర్ దాడి వలన జరిగిందా లేదా అనేది అంతలోనే తేలే విషయం కాదు .. ఎప్పటికీ తెలిసే విషయం కూడా కాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్ . సైబర్ దాడులకు, సైబర్ యుద్దాలకు కూడా సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది.