హిందూపురం నుంచి బాలయ్య పోటీ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి 1994 ఎన్నికల్లో పోటీచేసి విజయం  సాధించారు. తండ్రి బాటలోనే బాలయ్య హిందూపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. బాలయ్య తమ స్వంత వూరిన గుడివాడ నుండి పోటీ చేయాలని అనుకున్నారు కానీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నిన్న బాలయ్యతో మంతనాలు జరిపారు. గత ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడివల్ల కొడాలి నాని (వెంకటేశ్వరరావు)కు టిక్కెట్ ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన రావి వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కొడాలి నాని ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించటంతో మళ్ళీ రావి వెంకటేశ్వరరావు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిన్న బాలయ్యతో కలిసిన పిదప బాలయ్య రావి వెంకటేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మెత్తబడ్డ రావి వెంకటేశ్వరరావు తాను తిరిగి పార్టీలో చేరే విషయంపై తన నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి త్వరలో తన నిర్ణయాన్ని తెలుపుతానని బాలయ్యకు మాట ఇచ్చినట్లు తెలిసింది. ఒకవేళ రావి వెంకటేశ్వరరావు గనుక పార్టీలో చేరితే గుడివాడ టిక్కెట్ ఆయనకు వదలాలి కాబట్టి బాలయ్య కు గుడివాడ నుండి కాక హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలు బలంగా వున్నాయి. 

దీక్ష విరమించనున్న బాబా రామ్ దేవ్

గత ఐదు రోజులుగా అవినీతికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న బాబా రామ్ దేవ్ నిన్న పార్లమెంట్ ఎదుట మౌన దీక్ష చేపట్టడానికి వెళ్ళిన బాబా రామ్ దేవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి అంబేద్కర్ స్టేడియంలో నిర్భందించారు. తాను ఈ రోజు ఉదయం 11.00 గంటలకు దీక్ష విరమిచ్చి అంబేద్కర్ స్టేడియాన్ని ఖాళీ చేస్తానని పోలీసులకు తెలియజేశారని సమాచారం. ఒకవేళ బాబా స్టేడియాన్ని ఖాళీ చయకపోతే పోలీసులు బలవంతంగానైనా ఖాళీ చేయించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు బాబా రామ్ దేవ్ ను ఆగస్టు 15 స్వాతంత్ర్యదినం రోజు కంటే ముందే స్టేడియాన్ని ఖాళీ చేయాలని కోరినట్లు తెలిసింది.

వాన్ పిక్ వ్యవహారంలో సిబీఐ చార్జిషీటు దాఖలు

వాన్ పిక్ వ్యవహారంలో సిబీఐ కొత్తగా మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా చేర్చింది. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా ముద్దాయిగా తేల్చింది. సిబీఐ ప్రధానంగా వాన్ పిక్ భూముల కేటాయింపుల విషయంలో నాంపల్లి కోర్టులో 14మందిని నిందుతులుగా, 177 పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది. ముద్దాయిలుగా 1-జగన్, 2-విజయసాయి రెడ్డి 3-నిమ్మగడ్డ ప్రసాద్, 4-మోపిదేవి వెంకటరమణ 5-ధర్మాన ప్రసాదరావు, 6-బ్రహ్మానంద రెడ్డి 7-మన్మోహన్ సింగ్ 8-శ్యామ్యూల్ 9- నిమ్మగడ్డ ప్రకాష్  10-వాన్ పిక్ ప్రాజెక్ట్ 11-జగన్ పబ్లికేషన్స్ 12-రఘురాం సిమెంట్స్, భారతి సిమెంట్స్ 13-కార్మెల్ ఏషియా 14-సిలికాన్ బిల్డర్స్ పై సెక్షన్ 120 బి, 409, 419, 420, 468, 471 మరియు ఐ.పి.సి.9 11 12 12 (2) 13 రెడ్ విత్ సెక్షన్ల కింద కేసు నమోదు.

దీక్ష ప్రారంభించిన విజయమ్మ

పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరులో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ప్రభుత్వమే భరించాలని దీక్షను చేపట్టారు. రైతులకు మద్దతుగా విజయవాడలో దీక్ష, చేనేత కార్మికులకు మద్దతుగా సిరిసిల్లలో ధర్నాలు నిర్వహించిన వై.ఎస్. విజయమ్మ ఈనాడు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కు మద్దతుగా ఏలూరులో దీక్ష ప్రారంభించారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి సంఘాలు లేవు కనుక విజయమ్మ విద్యార్థులను ఆకర్షించేందుకు దీక్షలు చేపట్టారని కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు.