ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత
ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సామల సదాశివ మాస్టర్ (89) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఈరోజు ఉదయం తన నివాసంలో మరణించారు. ఈ ఏడాది జూన్ 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ‘కళారత్న పురస్కారం’ (హంస అవార్డు) ప్రదానం చేసింది. ఆదిలాబాదు జిల్లా, దహేగావ్ మండలం తెలుగు పల్లెలో1928, మే 11 న జన్మించిన సదాశివకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ మరియు మరాఠీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఉర్దూ పత్రిక సియాసత్ లో ఆయన వ్యాసాలు అనేక ఏళ్ళుగా ప్రచురించబడ్డాయి.