ధర్మాన విస్మయం
posted on Aug 13, 2012 @ 4:21PM
నాంపల్లి కోర్టులో వాన్ పిక్ భూ కేటాయింపుల్లో నిందుతుడిగా తన పేరును చేర్చటంపై మంత్రి ధర్మాన విస్మయం వ్యక్తం చేశారు. సిబీఐ కథనాల ప్రకారం అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన కూడా ఈ కేసులో నిందుతుడిగా సిబీఐ పేర్కొంది. మొత్తం 14 మందిని నిందుతులుగా చార్జిషీట్ దాఖలు చేసింది. ధర్మాన 5వ నిందుతుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. ఈ విషయం తనకు ఇంతవరకు తెలియదని అప్పటి నిర్ణయాలు మంత్రివర్గ నిర్ణయాలే తప్ప తన స్వంత నిర్ణయాలు లేవని ఆయన అన్నారు.