రాజీనామా దిశగా ధర్మాన
posted on Aug 14, 2012 @ 10:28AM
సిబీఐ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన నాలుగవ ఛార్జిషీటులో ఎ5 ముద్దాయిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రస్తుతం న్యూ ఢిల్లీలో వున్నారు. నేడు ధర్మాన ప్రసాదరావు రక్షణమంత్రి పల్లంరాజు తో భేటీ అయ్యారు. చర్చలు ముగిసిన తరువాత ధర్మాన రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ను కూడా భేటీ కానున్నారు. ధర్మాన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ధర్మాన మధ్యాహ్నం 3.30 నిముషాలకు హైదరాబాద్ చేరుకొని నేరుగా ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను అందజేయనున్నట్లు తెలిసింది.