మళ్ళీ మొదటికొచ్చిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ సమస్య
posted on Aug 14, 2012 @ 9:52AM
ఇంజనీరింగ్ ఫీజును 35 వేలకు ప్రభుత్వం ఖరారు చేసింది. నిన్న జరిగిన సబ్ కమిటీ మీటింగ్ లో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు కూడా ఒప్పుకున్నాయి. కానీ ఇరవైనాలుగు గంటలు పూర్తికాక మునుపే రీ ఎంబర్స్ మెంట్ మళ్ళీ మొదటికొచ్చింది. ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలకు తమ అంగీకారాన్ని పత్రాలపై సంతకాలు చేసి ఎ.ఎఫ్.ఆర్.సి ముందు సమర్పించాలని కోరింది. యాజమాన్య కోటా, కన్వీనర్ కోటాను కూడా 35వేల రూపాయలుగా అందులో పేర్కొనడం, రెండేళ్ళ పాటు ఇదే విధంగా జరగాలని ఉండడంతో యాజమాన్యాలు ఇది చూసి ఇలాంటి నిబంధనలను తాము అంగీకరించమని తేల్చి చెప్పాయి.