ఏలూరు సమీపంలో త్రివేండ్రం ఎక్స్ ప్రెస్ భోగీల్లో మంటలు
posted on Aug 13, 2012 @ 3:43PM
జులై 30న గుంటూరు సమీపంలో న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు భోగీల్లో మంటలు చెలరేగి సుమారు 28 మంది మరణించారు. నేడు ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాల వంతెన సమీపంలో త్రివేండ్రం ఎక్స్ ప్రెస్ రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీనిపై వెంటనే రైల్వే సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన సిబ్బంది. ఎలాంటి ప్రాణ నష్టం లేదని తెలిపిన అధికారులు. తమ్మిలేరు కాలువలోకి దూకిన వందమంది ప్రయాణీకులు, పదిమందికి తీవ్ర గాయాలు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టిన రైల్వేశాఖ. కొనసాగుతున్న సహాయక చర్యలు