మాజీ మంత్రి శంకర్ రావు ప్రధానికి అభినందనలు
posted on Aug 13, 2012 @ 2:07PM
రాహుల్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటానన్న ప్రధానికి మాజీ మంత్రి శంకర రావు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య విభేదాలు అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది అన్నారు. సోనియా గాంధీ వీరిద్దరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలి. వీరి విభేదాలను సోనియా గాంధీనే పరిష్కరించాలి సూచించారు.