హిందూపురం నుంచి బాలయ్య పోటీ
posted on Aug 14, 2012 @ 9:33AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి 1994 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. తండ్రి బాటలోనే బాలయ్య హిందూపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. బాలయ్య తమ స్వంత వూరిన గుడివాడ నుండి పోటీ చేయాలని అనుకున్నారు కానీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నిన్న బాలయ్యతో మంతనాలు జరిపారు. గత ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడివల్ల కొడాలి నాని (వెంకటేశ్వరరావు)కు టిక్కెట్ ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన రావి వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కొడాలి నాని ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించటంతో మళ్ళీ రావి వెంకటేశ్వరరావు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిన్న బాలయ్యతో కలిసిన పిదప బాలయ్య రావి వెంకటేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మెత్తబడ్డ రావి వెంకటేశ్వరరావు తాను తిరిగి పార్టీలో చేరే విషయంపై తన నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి త్వరలో తన నిర్ణయాన్ని తెలుపుతానని బాలయ్యకు మాట ఇచ్చినట్లు తెలిసింది. ఒకవేళ రావి వెంకటేశ్వరరావు గనుక పార్టీలో చేరితే గుడివాడ టిక్కెట్ ఆయనకు వదలాలి కాబట్టి బాలయ్య కు గుడివాడ నుండి కాక హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలు బలంగా వున్నాయి.