సిఎం పై మండిపడ్డ తెలంగాణా ఎంపి వివేక్
posted on Aug 13, 2012 @ 5:05PM
సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ఎంపీగా వ్యవహరిస్తున్నారని తెలంగాణా ఎంపి వివేక్ ఆరోపించారు. కేంద్రమంత్రి జైపాల్ పై కుట్రమోపేందుకు కిరణ్ కుట్ర పన్నుతున్నారని గతంలోనే మేము చెప్పాం. రాజకీయ లభ్దికోసమే కిరణ్ కేంద్రమంత్రి జైపాల్ పై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణా ఎంపీలు కేంద్రమంత్రి జైపాల్ కు వ్యతిరేకంగా వ్యవహరించాలని కుట్ర జరుగుతుంది. నెదునూరు, శంకర్ పల్లి ప్రాజెక్టులపై మంత్రి జైపాల్ పాత్ర ఉండదు. ప్రైవేట్ ప్రాజెక్టుల ప్రయోజనాలకోసమే సిఎం ఈ విధంగా కుట్ర పన్నుతున్నారు.