ఉద్రిక్తంగా మారిన రామ్ లీలా మైదానం
posted on Aug 13, 2012 @ 12:09PM
యోగా గురు బాబా రామ్ దేవ్ పార్లమెంట్ ఎదురుగా ధర్నా నిర్వహించాలని పిలిపునందుకుని భారీ ఎత్తున కార్యకర్తలు రామ్ లీలా మైదానానికి చేరుకున్నారు. నితిన్ గడ్కారీ సభాస్థలికి చేరుకొని నిరసనకు తమ మద్దతు తెలిపారు. అలాగే జేడీయూ అధినేత శరద్ యాదవ్, టిడిపి ఎంపీలు తమ మద్దతు ప్రకటించాయి. అయితే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ పరిసరాల్లో నిరసనలు తెలపడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. మైదానం చుట్టూ CISF, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు ఢిల్లీ పోలీసులు దిగ్భంధం చేశారు.