దీక్ష ప్రారంభించిన విజయమ్మ
posted on Aug 13, 2012 @ 1:01PM
పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరులో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఫీజు రీ
ఎంబర్స్ మెంట్ ప్రభుత్వమే భరించాలని దీక్షను చేపట్టారు. రైతులకు మద్దతుగా విజయవాడలో దీక్ష, చేనేత కార్మికులకు మద్దతుగా సిరిసిల్లలో ధర్నాలు నిర్వహించిన వై.ఎస్. విజయమ్మ ఈనాడు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కు మద్దతుగా ఏలూరులో దీక్ష ప్రారంభించారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి సంఘాలు లేవు కనుక విజయమ్మ విద్యార్థులను ఆకర్షించేందుకు దీక్షలు చేపట్టారని కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు.