రాజీనామా యోచనలో ధర్మాన
posted on Aug 14, 2012 8:13AM
వాన్ పిక్ భూ కేటాయింపుల్లో నిన్న సిబీఐ 14 మందిపై నాంపల్లి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావును A-5వ ముద్దాయిగా ఛార్జిషీటులో పేర్కొంది. ధర్మాన ప్రసాదరావు వాన్ పిక్ కు భూములు కేటాయించినప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే భూకేటాయింపులు జరిగాయని సిబీఐ విచారణలో తేలింది. దీంతో మంత్రి ధర్మాన ఈరోజు ముఖ్యమంత్రి, గవర్నర్ లను కలిసి తన రాజీనామా లేఖను సర్పించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.