ఏపీ నూతన సీఎస్ కే. విజయానంద్?!

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుతీరిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ గా కే. విజయానంద్ ను నియమితులయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ గత ప్రభుత్వంలో  ప్రధాన కార్యదర్శిగా  కొన్ని రోజులు అదనపు బాధ్యతలు నిర్వహించారు.ఈయన గతంలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ గా అలాగే ఏపీ ట్రాన్స్ కో, ఎపీ జెన్ కో సీఎండీగా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా కూడా బాధ్యతలు చేపట్టారు.   ఇక ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా  ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యే అవకాశాలున్నాయి.  ఈయన గత మూడేళ్లుగా సెలవుపై ఉన్నారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మార్పు కూడా ఉంటుందని అంటున్నారు. 

పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించడంతో జగన్ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇలాంటివి నాకు కొత్తకాదు.. పోరాటం కంటిన్యూ చేస్తాను అని నాలుగు ముక్కలు చెప్పి వెళ్ళిపోయినప్పటికీ, ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం లేనట్టు తెలుస్తోంది. తనకు ఎలాగూ జైలు జీవితం తప్పదు కాబట్టి, తాను రాజీనామా చేసి భారతిని పులివెందుల నుంచి గెలిపించుకోవాలని జగన్ భావించారని తెలుస్తోంది. అదేం దరిద్రమోగానీ, జగన్ అనుకున్నవేవీ అనుకున్నట్టు జరగడం లేదు. తాను రాజీనామా చేసి, భారతిని పులివెందుల నుంచి గెలిపించుకోవాలన్న ఆలోచనలో వుండగానే, భారతిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం వున్నట్టు సమాచారం అందడంతో జగన్ రాజీనామా ఆలోచన ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మొదట భారతిని వివేకా మర్డర్ కేసు నుంచి ఎలా బయట పడేయాలా అనే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. భారతి అరెస్టు అనే అంశం తర్వాత, జగన్‌ని వేధిస్తున్న మరో పాయింట్ ఏమిటంటే, తాను అరెస్టు అయిపోయి, భారతి అరెస్టు అయిపోయి, అవినాష్ రెడ్డి అరెస్టు అయిపోతే... ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరనే టెన్షన్‌లో జగన్ ఉన్నట్టు సమాచారం. గతంలో తాను జైలుకు వెళ్ళినప్పుడు విజయమ్మ, షర్మిల పార్టీని కాపాడారు. ఇప్పుడు ఆ ఇద్దరూ పార్టీకి దూరమైపోయారు. ఇక పార్టీలో వున్నవారికి బాధ్యతలు ఇద్దామా అంటే, అందరూ తనమీద ఆధారపడిన పారసైట్సే తప్ప, తనకు ఉపయోగపడేవాళ్ళు ఎవరూ లేరు.. టైం బాగాలేక అరెస్టుల మీద అరెస్టులు జరిగి కీలకమైన వ్యక్తులందరూ జైల్లో వుంటే పార్టీని ఎలా కాపాడుకోవాలా అని జగన్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

పొన్నవోలు రాజీనామా

ఏపీలో వైసీపీ ఓటమితో  రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి  రాజీనామా చేశారు. గురువారం (జూన్ 6) ఆయన తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందజేశారు. అలాగే రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి కూడా రాజీనామా చేశారు.  రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తరువాత అమెరికా పర్యటనలో ఉన్న పొన్నవోలు అక్కడి వైసీపీ ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ, జగన్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్ సరళిని గమనించిన ఆయనకు జగన్ ఓటమి ఖాయమన్న సంగతి అప్పుడే అర్ధమైంది. జగన్ సర్కార్ పతనమై రాష్ట్రంలో తెలుగుదేశం అధికార పగ్గాలు అందుకోవడంతో ఆయన అనివార్యంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. 

సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 12న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అధి కారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈనెల 12న కొలువుదీరనుంది. జూన్‌ 9 న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందుగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పటికీ, అదే రోజున ప్రధాని మోడీ ప్రమాణస్వీకారో త్సవం ఉండటంతో బాబు ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా ప్రధాని మోడీ హాజరు కానున్నారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు అదే అమరావతికి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అమరావతి తోడ్పాటుపై ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వని ప్రధాని మోడీ దాదాపు పదేళ్ల తరువాత అమరావతి వేదికగా రాష్ట్రానికి స్పష్టమైన హామీలు ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో ప్రధానిగా మోడీ చాలా చాలా బలంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ మనుగడ అప్పట్లో   కూటమిలోని భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడి లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. చంద్రబాబు, తెలుగుదేశం మద్దతే ఇప్పుడు మోడీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని, విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన, నిర్దుష్టమైన హామీలు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ప్రపంచ నియంతల కోవలోకి జగన్!

ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని నియంతలా పాలించిన జగన్‌కి ప్రపంచ నియంతలందరికీ ఏ గతి పట్టిందో ఆ గతే పడుతోంది. నియంత జగన్ అధికారం పోయి ప్రజలకు సంకెళ్ళు తొలగిపోవడంతో యువకులు, మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు. జగన్‌కి సంబంధించిన వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ వైఎస్సార్ పేరు కనిపించినా తుడిచేస్తున్నారు. జగన్ ముఖం ఎక్కడ కనిపించినా ఛిద్రం చేసేస్తున్నారు. ఇలాంటి గత ప్రపంచంలో చాలామంది నియంతలకు పడింది. సద్దాం హుస్సేన్ కావచ్చు.. గడాఫీ కావచ్చు.. హిట్లర్ కావచ్చు.. ముసోలినీ కావచ్చు... ఇలా ఏ నియంత శకం ముగిసినా, అప్పటి వరకు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని బతికిన జనం బయటకి వచ్చారు. ఆయా నియంతలకు సంబంధించినవన్నీ ధ్వంసం చేసేశారు. ఇప్పుడు ఆ నియంతలకు పట్టిన గతి జగన్‌కీ పట్టింది. కాకపోతే, ఆ నియంతలందరూ శవాలు అయ్యాక జనంలో తిరుగుబాటు వచ్చింది.. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి.. జగన్ జీవచ్ఛవం అయ్యాక ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.. మిగతా అంతా సేమ్ టు సేమ్!

పిన్నెల్లి అరెస్టు?

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిలు గడువు గురువారం (జూన్ 6)తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసులపై ఏపీ హైకోర్టులో గురువారమే విచారణ జరుగుతుంది.  కాగా ఈ కేసుల్లో పిన్నెల్లికి బెయిలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈవీఎం ధ్వసం కేసులో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఏపీ హైకోర్టులో ఆయనకు ఈవీఎం ధ్వంసం కేసులో ఎటువంటి ఊరటా లభించే అవకాశం లేదని అంటున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా పిన్నెల్లి అరెస్టయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

వైఎస్ భారతి అరెస్టు?

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిని అరెస్టు చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకు ఎన్నికల సందర్భంగా మొన్నటి వరకు కామా పెట్టిన సీబీఐ మళ్ళీ దర్యాప్తు ప్రారంభించింది. వివేకా హత్య కేసులో భారతికి కూడా సంబంధాలు వున్నట్టు, హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి, హత్య జరిగిన తర్వాత వైఎస్ భారతితో ఫోన్లో మాట్లాడినట్టు ఆరోపణలు రావడంతో ఈ దిశగా విచారణ జరిపిన సీబీఐ వైఎస్ భారతిని అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ అంశం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

చంద్రబాబు, స్టాలిన్ భేటీ.. బీజేపీకి బీపీ!

మొన్నటి వరకు భారత రాజకీయాలలో ఒకే హీరో వుండేవాడు. ఆ హీరో నరేంద్ర మోడీ. ఇప్పుడు ఇద్దరు హీరోలున్నారు. వారిలో నరేంద్ర మోడీ మాత్రం లేరు. వారిలో ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు నితీష్ కుమార్. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడాలంటే వీరిద్దరి సహకారం తప్పనిసరి, వీరు ఇద్దరు చేజారిపోయినా, ఒక్కరు చేజారినా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం డౌటే. ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ హీరో వర్షిప్ ఆస్వాదిస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సమావేశం జరిగినప్పుడు.. చంద్రబాబు, నితీష్ మోడీకి భరోసా ఇచ్చారు. చక్కగా మూడోసారి ప్రధాని పీఠం మీద కూర్చోండి సార్ అని ఆశీర్వదించారు. దాంతో మోడీ ఈనెల 9న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీ నాయకత్వం కూడా చాలా హ్యాపీగా ఫీలైంది. ఇంతవరకు బాగానే వుందిగానీ, ఎన్డీయే సమావేశం తర్వాత చంద్రబాబు, నితీష్ కుమార్ తిరుగు ప్రయాణంలో వున్నప్పుడు జరిగిన సంఘటనలు బీజేపీలో వణుకు పుట్టించాయి. చంద్రబాబు నాయుడు విజయవాడ వెళ్ళడం కోసం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సమయానికి అక్కడ  అప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వున్నారు. దాంతో ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు, స్టాలిన్ భేటీ అయ్యారు. ఇద్దరు కొంతసేపు దేశంలో, ఇద్దరి రాష్ట్రాల్లో వున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రబాబు ఎన్డీయేలో బలమైన నేతగా వుండగా, స్టాలిన్ ఇండియా కూటమిలో బలమైన నేతగా వున్నారు. అదేవిధంగా, మరోవైపు నితీష్ కుమార్ కూడా ఎన్డీయే మీటింగ్ ముగిసిన తర్వాత తన రాష్ట్రానికి వెళ్ళడం కోసం విమానం ఎక్కారు. ఆ విమానంలో నితీష్ కుమార్ వెనుకే ఇండియా కూటమిలో భాగస్వామి అయిన తేజస్వి యాదవ్ వున్నారు. మరి.. ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు ఇద్దరి మధ్య  సంభాషణ జరగడం సహజమే కదా. పాట్నాలో విమానం దిగిపోయాక వీళ్ళిద్దరు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రబాబు, స్టాలిన్... అలాగే నితీష్, తేజస్వి యాదవ్ భేటీ అవడం కాకతాళీయమే అయినా, ఈ రెండు సంఘటనలు బీజేపీ నాయకత్వంలో వణుకు పుట్టించాయి. ఈ ఇద్దరు కీలక నేతలను తనవైపు లాక్కోవడం ద్వారా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా అనే సందేహాలు బీజేపీ వర్గాల్లో ఏర్పడ్డాయి. అయితే.. చంద్రబాబు, నితీష్ ఎన్డీయే సమావేశంలో బేషరతుగా మద్దతు ప్రకటించారు కాబట్టి, బీజేపీ నాయకత్వం వణుకు కొంచెం తగ్గింది. అయితే బీజేపీ నాయకుల మనసులో ఏదో ఒక మూలలో భయమైతే వుంది.

విపక్ష పాత్రకే జనసేనాని మొగ్గు?!

ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దగ్గని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్ధానాలలోనూ విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేబినెట్ కూర్పుపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో ఎన్డీయేలో రెండో  అతి పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశంకు కేంద్ర కేబినెట్ లో  ఐదారు మంత్రిపదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా కీలక మంత్రిత్వ శాఖలనే కోరాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ విషయం పక్కన పెడితే ఏపీలో చంద్రబాబు కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. బాబు కేబినెట్ లో రెండు బెర్త్ లు బీజేపీకి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే.. తొలి నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, చీల నివ్వను అంటూ చెప్పి.. దానిని దాదాపుగా సాధించిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కేబినెట్ లో కీలక పదవి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. కీలక మంత్రి పదవితో పాటు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  అయితే జనసేనాని మాత్రం రాష్ట్ర కేబినెట్ లో జనసేన చేరకుండా విపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందన్న భావనలో ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి.  ప్రభుత్వంలో భాగమై ఉండటం కంటే.. ఫ్రెండ్లీ అప్పోజిషన్ ద్వారా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునేలా అసెంబ్లీలో గళం విప్పడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  జనసేనాని తాను ఎమ్మెల్యేగా మాత్రమే పూర్తి జీతం తీసుకుంటానని చెప్పడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.   జనసేన ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ప్రభుత్వ లోపాలను ప్రశ్నించడం ద్వారా ప్రజలకు చేరువై రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా చెబుతున్నారు.  అలా కాకుండా కేబినెట్ లో చేరితే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. అలాగే ఇది మన ప్రభుత్వం.. అసాధారణ మెజారిటీ కారణంగా కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏ మాత్రం లేకుండా ఫ్రెండ్లీ ప్రతిపక్ష పాత్ర పోషించాలనీ, ఎన్నికల సందర్భంగా స్వయంగా తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునే అవకాశం ఉంటుందనీ జనసేనాని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రాష్ట్రంలో బలోపేతం కావడంతో పాటు.. వైసీపీకి రాష్ట్రంలో అవకాశం లేకుండా  చేయ వచ్చని జనసేనాని భావిస్తున్నట్లు సమాచారం. 

విశాఖలో వైఎస్సార్ వ్యూపాయింట్ కాదు అబ్దుల్ కలామ్ వ్యూపాయింట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో పరిణామాలు వేగంగా మారిపోత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. జగన్ సర్కార్ అడ్డగోలుగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రముఖుల పేర్లను మార్చివేసిన సంస్థలు, స్థలాల పేర్లను తెలుగుదేశం క్యాడర్ మార్చేస్తోంది. వాటికి పాతపేర్లనే ఉంచుతోంది. ముందుగా విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును  తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. డాక్టర్ వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించారు. వాటి స్థానంలో ఎన్టీఆర్ అనే అక్షరాలను తగిలించారు.  ఆ సందర్భంగా ఎన్టీ రామారావు, చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.   తాజాగా అలాంటి ఉదంతమే విశాఖపట్నంలోనూ సంభవించింది. వైజాగ్ బీచ్ రోడ్‌లో  నిర్మించిన వ్యూ పాయింట్ పేరును  మార్చివేశారు.  డాక్టర్ వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా  ఉండే  నేమ్ బోర్డ్‌లో ఉన్న డాక్టర్ వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించి.. వాటి స్థానంలో అబ్దుల్ కలాం పేరును అతికించారు. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదనీ, ధర్మాగ్రహ ప్రదర్శన మాత్రమేననీ తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. 

మోడీ కేబినెట్ లో తెలుగుదేశంకు దక్కే బెర్తులెన్ని? శాఖలేమిటి?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం.. జాతీయ రాజకీయాలలో ఒక్క సారిగా చంద్రబాబు ప్రాధాన్యతను పెంచేసింది. 16 మంది ఎంపీలతో తెలుగుదేశం ఎన్డీయే కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మరో వైపు బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు లభించకపోవడంతో కేంద్రంలో  బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ఏర్పడాలన్నా, ఏర్పడినా సుస్థిరంగా కొనసాగాలన్నా భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి. దీంతో ఎన్డీయేలో బీజేపీ తరువాత అత్యథిక స్థానాలున్న తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు, ఆ ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకంగా మారారు.  దీంతో కేంద్ర కేబినెట్ లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని బెర్తులు ఉంటాయి. అలాగే ఏ మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది అన్న విషయంపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.   గతంలో ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షం అయినా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. విభజన సమస్యల పరిష్కారం కోసం అడిగితే ఎగతాళి చేశారు.  ముఖ్యమంత్రి హోదాలో అప్పాయిట్ మెంట్ అడిగినా ఇవ్వలేదు.  ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబే కింగ్ మేకర్ అయ్యారు.   ఏపీ ఎన్నికలలో ఘన విజయం తరువాత ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబుకు అఘండ స్వాగతం లభించింది. నాడు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టిన మోడీ ఇప్పుడు స్వయంగా ఆయనను ఆహ్వానించి పక్కన కూర్చోపెట్టుకున్నారు. ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడిచేందుకు సహకరించమని విజ్ణప్తి చేశారు. చంద్రబాబుగారూ మాట్లాడండి అంటూ ఎన్డీయే సమావేశంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.   ఇక కేంద్ర కేబినెట్ లో తెలుగుదేశం కనీసం ఆరు బెర్తులు అడిగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఐటీ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవులను తెలుగుదేశం కోరే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకీ, ఆంధ్రప్రదేశ్ కు గోల్డెన్ డేస్ వచ్చినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కదల నివ్వం.. వదిలి పెట్టం!

జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయనతో అంటకాగి, ఆయన ఆదేశాల మేరకు విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు గురి చేసిన అధికారులు ఒక్కొక్కరుగా ఇప్పుడు జారుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేశం వదిలి వెళ్లిపోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటే.. రాష్ట్రం నుంచి రిలీవ్ అయ్యి సొంత రాష్ట్రాలకు జారుకోవడానికి మరి కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే రెడ్ బుక్ లో పేరు ఉన్న ఏ ఒక్కరినీ కదల నివ్వం, వదిలిపెట్లం అని తెలుగుదేశం శ్రేణులు నినదిస్తున్నాయి.  సీఐడీ చీఫ్ గా ఉంటూ తప్పుడు కేసులతో విపక్ష నేతలను నానా ఇబ్బందులకూ గురి చేసిన సీఐడీ చీఫ్ సంజయ్ దేశం వదిలి వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.  ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే సంజయ్ విదేశీ పర్యటన కోసం సీఎస్ సెలవు మంజూరు చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరి అనుమతితో సంజయ్ కు సెలవు మంజూరు చేశావంటూ సీఎస్ ను చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలలో ఘన విజయం సాధించిన తనను అభినందించడానికి వచ్చిన సీఎస్ జవహర్ రెడ్డిని నిలబెట్టి మరీ ఆయన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎస్ గా కాకుండా వైసీపీ కార్యకర్తగానే పని తీరు ఉందంటూ విమర్శించారు.  దీంతో సీఎస్ జవహర్ రెడ్డి సంజయ్ సెలవును రద్దు చేశారు.  ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  సంజయ్ జగన్ ఆదేశాల మేరకు, ఆయనకు అడుగులకు మడుగులొత్తుతూ పని చేశారన్న విమర్శలు ఉన్నాయి. మార్గదర్శి విషయంలో నూ,  చంద్రబాబుపై అక్రమ కేసుల విషయంలోనూ సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన ఓవరేక్షన్, జగన్ మెప్పు కోసం తన పరిధికి మించి వ్యవహరించిన తీరు, ఒక రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్ గా మీడియా సమావేశాలలో చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు వీటన్నిటికీ ఆయన ఫలితం అనుభవించి తీరాలని తెలుగుదేశం శ్రేణులు  అంటున్నాయి. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేసులు బనాయించి అరెస్టులు చేసి, ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతాం అన్నట్లుగా వీరి సంజయ్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది.  సంజయ్ మాదిరిగానే జగన్ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన అందరి లెక్కలూ తేల్చడానికి, వారి ఆగడాలకు సంబంధించిన అన్ని ఆధారాలతోనూ రెడ్ బుక్ రెడీగా ఉంది. దీంతో భయంతో వణుకుతున్న జగన్ తైనాతీ అధికారులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే  సర్దేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సాగనియ్యబోమని తెలుగుదేశం గట్టిగా చెబుతోంది.   తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభిని అక్రమంగా అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఓ ఎస్పీ విషయంలో పట్టాభి ఇప్పటికే గాంధీగిరి చేసి వచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పట్టాభి స్వయంగా ఆ ఎస్పీ ఇంటికి వెళ్లి, ఆయన అందుబాటులో లేకపోవడంతో  అభినందనలు తెలిపి, ఇంటి వద్ద పుష్పగుచ్ఛం ఇచ్చి వచ్చారు.  ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అడ్డగోలుగా వ్యవహరించి, అధికార విధులను విపక్ష నేతలు కార్యకర్తలను వేధించడానికే వినియోగించిన అధికారులెవరినీ వదిలిపెట్టబోమనీ, పాదయాత్ర సమయంలోనే తెలగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరిం చిన సంగతి తెలిసిందే. నిబంధనలుకు వ్యతిరేకంగా వ్యవహరించిన అందరిపైనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారి వివరాలన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ పాదయాత్ర సందర్భంగా చెప్పారు. ఇప్పుడు అటువంటి అధికారులంతా భయంతో వణుకుతున్నారు. డెప్యూటేషన్ పై వచ్చిన వారు రిలీవ్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో డెప్యూటేషన్ పై ఉన్న అధికారులెవరినీ రిలీవ్ చేయకుండా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా గవర్నర్ సీఐడీ ఆఫీస్ సీజ్ కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ప్పటికే చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలు విభాగాధిపతి ఆఫీసులు  లన్ని కూడా డాక్యుమెంట్ల భద్రపరచాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.  

ఇది ఆరంభమే.. తెలుగు యువత హెచ్చరిక!

ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఓట్ల రూపంలో.. నువ్వు ప్ర‌తిప‌క్షం హోదాకు కూడా ప‌నికిరావంటూ పాతాళానికి తొక్కేశారు. ఐదేళ్లు పాలించ‌మ‌ని అధికార‌మిచ్చిన ప్ర‌జ‌ల‌నే చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌రైన గుణ‌పాఠం చెప్పారు.  ప్ర‌జాగ్ర‌హంతో పార్టీ పరువు, స్వయంగా తన పరువు బజారున పడిన  త‌రువాత మీడియా ముందుకొచ్చిన జ‌గ‌న్ నేనేం పాపం చేశానంటూ క‌న్నీరు పెట్టుకున్న జగన్ పై సానుభూతి కలగలేదు సరికదా.. ఇంకా శాస్తి జరగాలన్న కసి వ్యక్తం అయ్యింది.   ఐదేళ్లు అభివృద్ధి లేదు, రాజ‌ధాని లేదు, ఉపాధి లేదు, క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేదు. పైగా ప్ర‌శ్నించిన వారిని జ‌గ‌న్ జైల్లో పెట్టించారు. అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుకే ప్ర‌జా వేదిక‌ను కూల్చేసిన జ‌గ‌న్.. అంత‌టితో ఆగ‌కుండా.. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు చక్కటి భోజనాన్ని అందించిన అన్న క్యాంటీన్ల విధానాన్ని ర‌ద్దుచేసి పేద‌ల క‌డుపు కొట్టారు. జ‌గ‌న్ కుట్ర‌పూరితంగా అన్న‌ క్యాంటీన్ల‌ను తొల‌గించిన‌ప్ప‌టికీ.. టీడీపీ వీరాభిమానులు, ముఖ్యంగా కృష్ణా జిల్లా తెలుగుయువత సారథి దండమూడి చౌదరిలాంటి వారు సొంత ఖ‌ర్చుల‌తో అన్న క్యాంటీన్ల‌ను న‌డిపిస్తూ వ‌చ్చారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో కొన‌సాగించిన అరాచ‌క పాల‌న‌ను అంత‌మొందించేందుకు అనేక మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు ఎదురొడ్డి పోరాటం సాగించారు. వారిలో ఒక‌రు దండ‌మూడి చౌద‌రి. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార‌ద‌ర్పంతో హ‌డావుడి చేసి, పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ముఖంచాటేసే వ్యక్తిత్వం కాదు ఆయనది. పార్టీ అధికారం కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ పెట్టే ఒత్తిళ్లను అధిగమించి, అక్రమ కేసులకు వెరవక పార్టీ కోసం, ప్రజల కోసం, పనిచేసిన   నేత‌ల్లో దండ‌మూడి చౌద‌రి ఒక‌రు. ఐదేళ్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురొడ్డి పోరాటం వారిలో దండ‌మూడి చౌద‌రి ముందు వ‌రుస‌లో ఉంటారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ యూరివ‌ర్శిటీ పేరును జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్ ఆర్‌ హెల్త్ యూనివర్శిటీగా మార్చేశారు. ఆప్పట్లోనే ఈ పేరు మార్పుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అయితే అధికారం చేతిలో ఉండటంతో ఆ ఆగ్రహాన్నీ లెక్క చేయలేదు. యూనివర్సిటీ పేరు మార్పుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలపై ఉక్కుపాదం మోపి జగన్ మొండిగా తన నిర్ణయాన్ని అమలు చేశారు. దీనిపై అప్పట్లోనే చంద్రబాబు తాను సీఎం కాగానే యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకా మారుస్తానని ప్రకటించారు. ఇప్పుడు  జగన్ సర్కార్ కుప్పకూలిన రోజే  దండ‌మూడి చౌద‌రి ఆధ్వ‌ర్యంలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరును తొల‌గించి ఎన్టీఆర్ పేరును పెట్టేశారు. దండ‌మూడి చౌద‌రి వైసీపీ హ‌యాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని లెక్క‌చేయ‌కుండా విద్యార్థి స‌మ‌స్య‌ల‌పై, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం సాగించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం హ‌యాంలో ఆయనపై 16 కేసులు న‌మోద‌య్యాయి. దండ‌మూరి చౌద‌రి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనది పెన‌మలూరు నియోజ‌క‌వ‌ర్గం. 2009 నుంచి టీడీపీలో కొన‌సాగుతున్నారు.  పార్టీలో త‌న ప్ర‌యాణం ప్రారంభ‌మైన నాటి నుంచి పార్టీ కోసం ప్రాణంపెట్టి ప‌నిచేశారు. పార్టీ ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్పుడు విద్యార్థి నేతగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. అంతేకాదు.. పేద‌వారికి అండ‌గా నిల‌వ‌డంలోనూ దండ‌మూడి చౌద‌రి ముందు వ‌రుస‌లో ఉంటారు. పేద ప్ర‌జ‌లకోసం త‌న‌వంతుగా పార్టీ ఆధ్వ‌ర్యంలో సొంత ఖ‌ర్చుల‌తో సేవా కార్య‌క్ర‌మాల‌నుసైతం నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. సీఎం జ‌గ‌న్ త‌న అరాచ‌క పాల‌న‌లో భాగంగా అన్న క్యాంటీన్లు మూసివేసిన‌ప్పుడు రాష్ట్రంలోనే తెలుగు యువత ఆధ్వర్యంలో తొలి అన్న క్యాంటిన్‌ను ఉయ్యూరులో ఏర్పాటు చేశారు దండ‌మూడి చౌద‌రి. కరోనా సమయంలో సతీసమేతంగా ప‌లు గ్రామాల్లో నిత్యావసరాలు, కూరగాయలు  అందజేశారు. పేదల‌కు ట్రై సైకిల్స్‌, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు, టిఫిన్‌ బండ్లు, పేద విద్యార్థుల కు బస్‌పాస్‌లు స్కాలర్‌షిప్పులు అందించారు. త‌న సొంత ఖ‌ర్చుల‌తో నిర్వ‌హించిన అన్న క్యాంటీన్ ద్వారా నిత్యం 300 మందికి భోజ‌నాన్ని అందించారు. ఇందుకోసం ప్ర‌తీరోజూ రూ. 15 వేల నుంచి రూ. 20వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తూ వ‌చ్చారు. 2024లో చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం కావాల‌ని కోరుకుంటూ త‌న స‌తీమ‌ణితో క‌లిసి మోకాళ్ల‌పై న‌డుస్తూ దండ‌మూడి చౌద‌రి తిరుమ‌ల కొండ ఎక్కారు. ఆయ‌న కోరుకున్న‌ట్లుగానే కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోరావ‌డంతో చంద్ర‌బాబు సీఎం కాబోతున్నారు.  సరే అవన్నీ పక్కన పెడితే.. జగన్ అరాచకాలన్నిటినీ సరి చేస్తామని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలనన్నిటినీ మారుస్తామని తెలుగుయువత గట్టిగా చెబుతోంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉదంతం ఆరంభం మాత్రమేననీ, ముందు ముందు ముందు సినిమా ఇంకా గొప్పగా ఉంటుందని తెలుగుయువత చెబుతున్నది.  హెల్త్ వర్సిటీ పేరులో వైఎస్ఆర్ అక్షరాలను తొలగించి అప్పటికప్పుడు ఎన్టీఆర్ పేరును అమర్చడంలో దండమూడి సహా తెలుగుయువత ధర్మాగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలాంటి ధర్మాగ్రహాలు చాలా చాలా ఉంటాయని తెలుగుయువత హెచ్చరిస్తోంది.  

అతి వాగుడు బంద్@జీవీఎల్, వీర్రాజు!

2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆయన్ని దారుణంగా విసిగించి, ఊపిరి ఆడకుండా చేసి, అడుగు ముందుకు వేయనీయకుండా చేసింది ఎవరో తెలుసా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు... స్వపక్షంలో వున్న బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు. ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన రెండ్రోజులకోసారి వంతుల వారీగా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వుండేవారు. ఆ విమర్శించడం కూడా చాలా ఘాటు పదజాలంతో, ముఖాల్లో వీళ్ళ తాతల ఆస్తి చంద్రబాబు దోచేసుకున్నారన్నంత ద్వేషం నింపేసుకుని మాట్లాడేవాళ్ళు. జగన్ గానీ, జగన్ బ్యాచ్ గానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే చంద్రబాబు వాళ్ళని ఒక ఆట ఆడుకునేవారు. కానీ, సుందోపసుందుల మాదిరిగా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత మరొకరు రెచ్చిపోతుంటే ఏమీ అనలేకపోయేవారు. వీళ్ళని విమర్శిస్తే, ఆ విషయాన్ని వీళ్ళు బీజేపీ కేంద్ర నాయకత్వానికి వేరే రకంగా ట్రాన్స్.ఫర్ చేసి చెబితే, చివరికి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందేమోనని చంద్రబాబు ఓర్పు వహించేవారు. చంద్రబాబు ఓర్పు వీళ్ళిద్దర్నీ మరింత రెచ్చగొట్టేది.. దాంతో వాళ్ళ కడుపులో వున్న విషాన్ని ప్రభుత్వం మీద కక్కుతూ వుండేవారు. వీళ్ళిద్దరి విషయంలో ఓర్పు వహించినా బీజేపీ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించింది. పోలవరాన్ని, అమరావతిని, ఇతర విభజన హామీలని విస్మరించింది. మొత్తమ్మీద 2014లో ఏర్పడిన బంధం తెగిపోయింది. 2019లో ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితిలో ఓట్లు చీలిపోయి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎక్కువ నష్టం చేసింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ, జనసేనతో స్నేహం కుదిరింది. ఈ కూటమికి మంచి విజయం లభించింది. కాకపోతే 2014 పరిస్థితి ఇప్పుడు లేదు.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని చెప్పాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వుండాలంటే చంద్రబాబు మద్దతు ఇచ్చి తీరాల్సిన స్థితి ఏర్పడింది. చంద్రబాబుతో మోడీ స్నేహంగా వుండాల్సిందే. చంద్రబాబును పల్లెత్తు మాట అనకుండా, ఆయన రాష్ట్రం కోసం చేసే డిమాండ్లను అర్థం చేసుకోవాల్సిందే. అన్నిటికంటే ముఖ్యంగా జీవీఎల్  నరసింహారావు, సోము వీర్రాజు లాంటి వాగుడుకాయలు అడ్డదిడ్డంగా వాగకుండా నోరు మూసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ వున్నది పాత చంద్రబాబు నాయుడు కాదు.. కేంద్ర ప్రభుత్వం ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టే  చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు అడ్డమైన విమర్శలు చేసి చంద్రబాబు సహనానికి పరీక్ష పెడితే అది వాళ్ళకే నష్టం. అసలింకా క్లియర్‌గా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వాగుడుకాయలిద్దరినీ మాట్లాడే అధికారం నుంచి తప్పిస్తే అందరికీ మంచింది. రాష్ట్రం బాగుపడుతుంది.. దేశం బాగుంటుంది.

కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్

పెమ్మసాని చంద్రశేఖర్.. రెండేళ్ల కిందటి వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఆయన పేరు మార్మోగిపోతోంది. గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన పెమ్మసారి చంద్రశేఖర్ తన వైఖరితో, ప్రజలతో మమేకమయ్యే తీరుతో, తన నైపుణ్యాలతో, అన్ని సమస్యలపై, వాటి పరిష్కారంపై ఉన్న స్పష్టమైన అవగాహనతో అందరి వాడుగా, అందరి గౌరవాన్ని పొందిన వ్యక్తిగా మారిపోయారు.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అఖండ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అంతే కాకుండా,  కేంద్రంలో కూడా తెలుగుదేశం కీలక పాత్ర పోషించనుంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరనున్న నేపథ్యంలో బీజేపీ తరువాత కూటమిలో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం నిస్సందేహంగా కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది.  దీంతో కేంద్ర కేబినెట్ లో స్థానం లభించేదెవరికి? అన్న చర్చ మొదలైంది. కేంద్రంలో మంత్రి పదవులను దక్కించుకునే వారిలో పెమ్మసారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు తనతో పాటు పెమ్మసానిని కూడా వెంటబెట్టుకు వెళ్లారు. దీంతో ఎన్డీయే సర్కార్ తో  పెమ్మసానికి మినిస్ట్రీ బెర్త్ కన్ ఫర్మ్ అయ్యిందన్న చర్చ జరుగా సాగుతోంది. 

చంద్రబాబు మావయ్యకి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ 

డబ్బూ, అధికారం  ఇవి రెండు ఒకటే. ఇవి ఉన్నప్పుడు  బంధాలు గుర్తొస్తాయి. మనుషులుగా కనబడతారు.  ఏపీలో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేస్తూ... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా, అందులో టీడీపీ వాటానే 135 స్థానాలు. 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 9 చోట్ల ఓడిపోయింది. దాదాపు చాలామంది టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయాలు అందుకున్నారు. అదే సమయంలో 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ గెలుచుకుంది. అటు, జనసేన, బీజేపీ కూడా దుమ్మురేపాయి. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు... బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నాయి.  ఈ చిరస్మరణీయ విజయాలపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.  "ప్రియమైన చంద్రబాబు మామయ్యకి... ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్ కు నా శుభాకాంక్షలు" అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు.మరో ట్వీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా ఎన్టీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

ప్లేటు ఫిరాయించిన చేగొండి!

మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. కాపులకు అన్యాయం చేశారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించి, పవన్ ఓటమి ఖాయం అంటూ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ చేసిన ఆయన ఇప్పుడు ఒఖ్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. తెలుగుదుశంతో పొత్తులో భాగంగా ఇన్ని జనసేన ఇన్ని సీట్లు తీసుకోవాలి, అన్ని సీట్లు తీసుకోవాలి, అస్సలు తగ్గొద్దు అంటూ లేఖాస్త్రాలు సంధించిన చేగొండి హరిరామ జోగయ్య, తీరా జనసేనకు 21 స్థానాలలో పోటీకి అంగీకరించడంతో హరిరామజోగయ్య పవన్ కల్యాణ్ పై తీవర విమర్శలు గుప్పించారు. కాపుల ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పాదాల దగ్గర పెట్టేశారంటూ లేఖాస్త్రం కూడా సంధించారు. కూటమి ఓటమి ఖాయం, జనసేన ఓటమి తప్పదు అంటూ శాపనార్ధాలు కూడా పెట్టారు. అయితే తెలుగుదేశం కూటమి ఘన విజయంతో ఆయన ఒక్కసారిగా మాట మార్చేశారు. పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.  వైసీపీ ఓటమికి జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు కారణం అన్న చేగొడి హరిరామ జోగయ్య, తెలుగుదేశం కూటమి విజయానికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణమంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఎన్నికల పోటీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కల్యాణే అంటూ ఆకాశానికెత్తేశారు. కేవలం పవన్ కల్యాణ్ వల్లే తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించిందంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.     ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకున్నంత మాత్రాన గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శల పాపం కడిగేసుకోవడం అంత తేలిక కాదని పవన్ అభిమానులు అంటున్నారు. గతంలో చేగొండి తన లేఖలతో  కాపు పెద్దగా, సీనియర్ రాజకీయనాయకుడిగా చేగొండికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుకున్నారనీ, ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకుని పవన్ కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించినంత మాత్రాన పోయిన గౌరవం తిరిగిరాదని అంటున్నారు.   

జవహర్‌రెడ్డిని ఒక్క దులుపు దులిపిన చంద్రబాబు!

జగన్ అధికారంలో వుండగా భక్తిశ్రద్ధలతో ఆయన బూట్లు నాకుతూ, చంద్రబాబు పట్ల ఎంతో అమర్యాదగా ప్రవర్తించిన చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి చంద్రబాబు అధికారంలోకి రాగానే మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. జవహర్ రెడ్డి కూడా వాళ్ళలో ఒకరు. జవహర్ రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ పుష్పగుచ్ఛం ఇస్తే, దాన్ని సీరియస్‌గా అందుకున్న చంద్రబాబు, సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్‌కి ఎవర్నడిగి లీవ్ ఇచ్చావని జవహర్‌రెడ్డిని ప్రశ్నించారని, ఆయన నీళ్ళు నమిలారని సమాచారం. ఎన్డీయే కూటమి మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళి రేపు వస్తాను.. అప్పుడు మీతో మాట్లాడతానని జవహర్ రెడ్డితో చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జవహర్ రెడ్డికి భారీ క్లాస్ పీకే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జవహర్ రెడ్డిని సస్సెండ్ చేసి, నీ మీద, నీ  కొడుకు మీద వచ్చిన భూకబ్జా ఆరోపణల సంగతి ముందు తేల్చు.. ఆ తర్వాత నీ సస్పెన్షన్ ఆర్డర్ రద్దు గురించి ఆలోచిద్దాం అనే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. జవహర్ రెడ్డి ప్రస్తుతం సర్వీసు చివర్లో వున్నారు. జూన్ నెలాఖరుకు ఆయన రిటైర్ అవబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు కనుక జవహర్ రెడ్డి సస్సెండ్ అయితే, సీఎస్ పదవిలో రిటైర్ అయ్యే అవకాశం కోల్పోతారు. ఏబీ వెంకటేశ్వరరావుకు ఐదేళ్లపాటు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించింది జగన్‌తోపాటు జవహర్ రెడ్డి కూడా. కోర్టు ఆదేశాలతో రిటైర్మెంట్ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. జవహర్ రెడ్డి కనుక సస్పెండ్ అయితే మాత్రం, ఆయన సర్వీసులో అదొక మచ్చగా మిగిలిపోవడం ఖాయం.