ఏపీ నూతన సీఎస్ కే. విజయానంద్?!
posted on Jun 6, 2024 @ 12:44PM
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుతీరిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ గా కే. విజయానంద్ ను నియమితులయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా కొన్ని రోజులు అదనపు బాధ్యతలు నిర్వహించారు.ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ గా అలాగే ఏపీ ట్రాన్స్ కో, ఎపీ జెన్ కో సీఎండీగా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా కూడా బాధ్యతలు చేపట్టారు.
ఇక ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈయన గత మూడేళ్లుగా సెలవుపై ఉన్నారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మార్పు కూడా ఉంటుందని అంటున్నారు.