ప్రపంచ నియంతల కోవలోకి జగన్!
posted on Jun 6, 2024 @ 11:57AM
ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని నియంతలా పాలించిన జగన్‌కి ప్రపంచ నియంతలందరికీ ఏ గతి పట్టిందో ఆ గతే పడుతోంది. నియంత జగన్ అధికారం పోయి ప్రజలకు సంకెళ్ళు తొలగిపోవడంతో యువకులు, మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు. జగన్‌కి సంబంధించిన వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ వైఎస్సార్ పేరు కనిపించినా తుడిచేస్తున్నారు. జగన్ ముఖం ఎక్కడ కనిపించినా ఛిద్రం చేసేస్తున్నారు. ఇలాంటి గత ప్రపంచంలో చాలామంది నియంతలకు పడింది. సద్దాం హుస్సేన్ కావచ్చు.. గడాఫీ కావచ్చు.. హిట్లర్ కావచ్చు.. ముసోలినీ కావచ్చు... ఇలా ఏ నియంత శకం ముగిసినా, అప్పటి వరకు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని బతికిన జనం బయటకి వచ్చారు. ఆయా నియంతలకు సంబంధించినవన్నీ ధ్వంసం చేసేశారు. ఇప్పుడు ఆ నియంతలకు పట్టిన గతి జగన్‌కీ పట్టింది. కాకపోతే, ఆ నియంతలందరూ శవాలు అయ్యాక జనంలో తిరుగుబాటు వచ్చింది.. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి.. జగన్ జీవచ్ఛవం అయ్యాక ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.. మిగతా అంతా సేమ్ టు సేమ్!