విశాఖలో వైఎస్సార్ వ్యూపాయింట్ కాదు అబ్దుల్ కలామ్ వ్యూపాయింట్!
posted on Jun 6, 2024 @ 9:55AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో పరిణామాలు వేగంగా మారిపోత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. జగన్ సర్కార్ అడ్డగోలుగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రముఖుల పేర్లను మార్చివేసిన సంస్థలు, స్థలాల పేర్లను తెలుగుదేశం క్యాడర్ మార్చేస్తోంది.
వాటికి పాతపేర్లనే ఉంచుతోంది. ముందుగా విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. డాక్టర్ వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించారు. వాటి స్థానంలో ఎన్టీఆర్ అనే అక్షరాలను తగిలించారు. ఆ సందర్భంగా ఎన్టీ రామారావు, చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. తాజాగా అలాంటి ఉదంతమే విశాఖపట్నంలోనూ సంభవించింది.
వైజాగ్ బీచ్ రోడ్‌లో నిర్మించిన వ్యూ పాయింట్ పేరును మార్చివేశారు. డాక్టర్ వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా ఉండే నేమ్ బోర్డ్‌లో ఉన్న డాక్టర్ వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించి.. వాటి స్థానంలో అబ్దుల్ కలాం పేరును అతికించారు. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదనీ, ధర్మాగ్రహ ప్రదర్శన మాత్రమేననీ తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి.