బాబు కేబినెట్ కూర్పు కొలిక్కి! జనసేన చేరేనా?

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూరం ఫిక్సైంది. బుధవారం (మే12)న చంద్రబాబు  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. తన కేబినెట్  కూర్పుపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టేశారు.  ఢిల్లీలో ఎన్డీయేతో చర్చలు, కేంద్ర క్యాబినెట్‌పై కసరత్తులో ఓ వైపు క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ చంద్రబాబు  ఈనాడు అధినేత రామోజీరావు కు నివాళులర్పించి, ఆయన అంత్యక్రియలకు హాజరై పాడె కూడా మోశారు. ఇంతటి తీరిక లేని సమయంలోనూ చంద్రబాబు  తన క్యాబినెట్ కూర్పుపై కసరత్తు చేసినట్లు చెబుతున్నారు.    ఇప్పటికే తన కేబినెట్ లో ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు.. జనసేన కేబినెట్ లో చేరుతుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ కేబినెట్ లో చేరేందుకు జనసేన పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్ర కేబినెట్ లో చేరకుండా దూరంగా ఉంది. అదే విధంగా ఏపీలో కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలు లేవన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక ఆంగ్ల చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ప్రభుత్వంలో చేరే విషయంలో ఆసక్తి ఉందని జనసేనాని చెప్పినప్పటికీ, గత కొద్ది రోజులుగా జనసేనలో విస్తృతంగా జరుగుతున్నచర్చ మాత్రం జనసేన రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపుతోందని పించేలా ఉంది.  దీంతో ప్రభుత్వంలో చేరే విషయంపై జనసేనాని నుంచి క్లారిటీ వస్తే తప్ప ఆ పార్టీకి చంద్రబాబు కేబినెట్ లో ఎన్ని బెర్తులు దక్కుతాయి అన్న విషయంపై స్పష్టత రాదు.  ఇక బీజేపీకి చంద్రబాబు కేబినెట్ లో రెండు బెర్తులు దక్కడం ఖాయమని తెలుస్తోంది.  చంద్రబాబు కేబినెట్ లో ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురికి అవకాశం దక్కు అవకాశం ఉంది. జిల్లాకు ఒకటి చొప్పున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి చంద్రబాబు క్యాబినెట్ లో స్థానం లభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముగ్గురికి  చంద్రబాబు కేబినెట్ లో  స్థానం దక్కుతుందని చెబుతున్నారు. అదే విధంగా కృష్ణా , గుంటూరు జిల్లాల నుంచి ఇద్దరిద్దరు చొప్పున చంద్రబాబు కేబినెట్ లో ఉంటారని అంటున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లా నుంచి ఒకరికి, నెల్లూరు జిల్లా నుంచి ఒకరు లేక ఇద్దరు చిత్తూరు నుంచి ఒకరికి చంద్రబాబు తన కేబినెట్ లో చోటు కల్పిస్తారని చెబుతున్నారు. ఇక కడప జిల్లా నుంచి మాధవీరెడ్డికి బెర్త్ ఖాయమని చెబుతున్నారు. ఇక కర్నూలు జిల్లా నుంచి కూడా ఇద్దరికి చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జనసేన కూడా ప్రభుత్వంలో చేరే పరిస్థితి వస్తే మాత్రం తెలుగుదేశం మూడు బెర్తులను త్యాగం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.  ఇప్పటి వరకూ జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జగన్ మళ్లీ రాజకీయంగా తలెత్తకుండా చేయాలంటే, అలాగే జనసేన సొంతంగా రాష్ట్రంలో బలోపేతం కావాలంటే కేబినెట్ లో చేరకుండా ఉండటమే మేలని జనసేనాని భావిస్తున్నారు. ఇప్పుడో ఇహనో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

జగన్ కు అమ్మ విజయమ్మ ఓదార్పు

ఎన్నికలలో గతంలో ఎవరికీ దక్కనంత ఘోరమైన ఓటమి ఈ సారి జగన్ నాయకత్వంలోని వైసీపీకి దక్కింది. కనీసం ప్రతిపక్షహోదాకి కూడా నోచుకోని గొప్ప పరాజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడిన అనేక అంశాలలో ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కూడా ఒకటి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేని గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర సుదీర్ఘంగా సాగింది. మందీ మార్బలంతో ఆయన ఆ యాత్రను విడతల వారీగా ఏళ్ల తరబడి కొనసాగించారు. సరే అది పక్కన పెడితే.. 2014 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ కు సొంత పార్టీ నుంచే అండ కరవైంది. నిన్న మొన్నటి దాకా వంధిమాగధులుగా మెలిగిన కీలక మంత్రులు, నేతలు సైతం ఇప్పుడు ఓటమికి పూర్తి బాధ్యత జగన్ దే అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతూ, పార్టీ ఘోర పరాజయానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అంటూ నిందిస్తున్నారు.  ఈ తరుణంలో తల్లి విజయమ్మ జగన్ కోసం ఆయన ఇంటికి వచ్చి ఒకింత ఓదార్పు ఇచ్చారు. పోలింగ్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు తల్లి విజయమ్మ తన కుమార్తెకు మద్దతు పలుకుతూ అమెరికా నుంచి ఓ వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే. దీంతో కన్న తల్లి కూడా జగన్ కు మద్దతుగా నిలవడం లేదని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. తల్లి మనసు ఆగలేదు. ఆమె అమెరికా పర్యటన ముగించుకుని నేరుగా జగన్ నివాసానికి చేరుకున్నారు.  కుమార్తెను గెలిపించమని వీడియో సందేశం ద్వారా పోలింగ్ ముందు రోజు కడప ప్రజలకు పిలుపునిచ్చిన విజయమ్మ.. ఆ సందర్భంగా కుమారుడి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ఎన్నికల ముందు లండన్ వెళ్లిన విజయమ్మ, అక్కడ షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గర ఉన్నారు.   అయితే కుమారుడు ఘోరంగా పరాజయం పాలై ముఖ్యమంత్రి పదవి కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉండటంతో తల్లిమనసు తల్లడిల్లి అమెరికా నుంచి నేరుగా కుమారుడి వద్దకు వెళ్లి ఓదార్పునిచ్చారు. 

ఏడుగురు మాజీ సీఎంలు ఇప్పుడు కేంద్ర మంత్రులు

కేంద్రంలో ముచ్చటగా మూడో సారి నరేంద్రమోడీ ప్రభుత్వం కొలువుదీరింది. మోడీ కేబినెట్ లో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులలో ఏడుగురు మాజీ మంత్రులు ఉన్నారు. వారిలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. అలాగే హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ఉన్నారు.  అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఉణ్నారు. ఈ ఏడుగురు మాజీ సీఎంలలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే కాగా మిగిలిన ఇద్దరూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన వారు.  

పాకిస్థాన్ మరో ఓటమి.. ఆరుపరుగుల తేడాతో టీమ్ ఇండియా చేతిలో పరాజయం

ఐసీసీ మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్ పై విజయాల సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (జూన్ 9)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఐసీపీ టోర్నీలలో పాకిస్థాన్, టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ అంటే అదో మహాసంగ్రామంగా, రెండు దేశాల మధ్య యుద్ధంగా క్రికెట్ అభిమానులు భావిస్తారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ కు మించి భారత్ పాక్ మధ్య మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. అటువంటి మ్యాచ్ లో   టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి పాక్‍ను కుప్పకూల్చారు. స్వల్ప స్కోరును కాపాడి జట్టును గెలిపించారు. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‍లో టీమ్ ఇండియా గొప్పగా పోరాడి అద్భుత విజయం సాధించింది.   న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటి పాకిస్థాన్‍ను మట్టికరిపించారు.  భారత బ్యాటర్లు విఫలమై 119 స్కోరుకే టీమ్ ఇండియా చాపచుట్టేస్తే.. ఆ స్వల్ప స్కోరును పాకిస్థాన్ ఛేదించే అవకాశం ఇవ్వకుండా బౌలర్లు జట్టకు విజయాన్ని అందించారు.  ఓటమి తప్పదనుకున్న దశ నుంచి జట్టు గెలుపు సంబరాలు చేసుకునేలా చేశారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లతో సత్తా చాటాడు. 15వ ఓవర్, 19వ ఓవర్లో చెరో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‍ను మలుపుతిప్పాడు. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు  హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. మహమ్మద్ సిరాజ్ వికెట్ తీయకున్నా 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి రాణించాడు. భారత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసి పరాజయం పాలైంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (13)ను ఐదో ఓవర్లో ఔట్ చేసి భారత్‍కు బ్రేక్ ఇచ్చాడు బుమ్రా. అయితే, మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (31) నిలకడగా ఆడాడు. ఉస్మాన్ ఖాన్ (13)ను అక్షర్ పటేల్ పదో ఓవర్లో ఔట్ చేయగా.. ధాటిగా ఆడిన ఫకర్ జమాన్ (13)ను పాండ్యా పెవిలియన్‍కు పంపాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‍ను 15వ ఓవర్లో బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఐదు ఓవర్లలో గెలిచేందుకు పాకిస్థాన్ 37 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలో భారత బౌలర్లు మళ్లీ విజృభించారు. 16వ ఓవర్లో అక్షర్ పటేల్ రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో పాక్ ఒత్తిడిలో కూరుకుపోయింది. 17వ ఓవర్లో షాదాబ్ ఖాన్ (4)ను హార్దిక్ ఔట్ చేశాడు. జస్‍ప్రీత్ బుమ్రా 19వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఇఫ్తికార్ (5)ను ఔట్ చేశాడు. దీంతో పాక్ ఓటమి అంచులకు చేరింది. చివరి ఓవర్లో పాక్‍కు 18 పరుగులు అవసరమయ్యాయి. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో 11 పరుగులు రాగా.. 6 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. చివరి ఓవర్ తొలి బంతికి ఇమాద్ వసీం (15)ను అర్షదీప్ ఔట్ చేయగా.. నాలుగు, ఐదు బంతులకు ఫోర్లతో నసీమ్ షా (10 నాటౌట్) కాస్త టెన్షన్ పెట్టాడు. అయితే, చివరి బంతిని అర్షదీప్ కట్టడి చేశాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. అంతకు ముందు  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగుకు ఆలౌటైంది.  రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు (ఆరు ఫోర్లు) రాణించాడు.   అక్షర్ పటేల్ కూడా 18 బంతుల్లో 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. పంత్, అక్షర్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిరువురూ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.   విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3) త్వరగా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా (7) ఎక్కువ సేపు నిలువకపోగా.. రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు. చివర్లో అర్షదీప్ సింగ్ (9), మహమ్మద్ సిరాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ పేసర్లు నసీమ్ షా, హరీస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. మహమ్మద్ ఆమిర్ రెండు తీశాడు. షహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. ఆరంభంలో వాన వల్ల మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అయితే, పూర్తి ఆట సాధ్యమైంది.  ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‍పై భారత్ ఆధిపత్యం కొనసాగింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 8సార్లు తలపడగా.. భారత్ 7సార్లు విజయం సాధించింది.

కేంద్రమంత్రిగా పెమ్మసాని ప్రమాణం

కేంద్రమంత్రిగా గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన పెమ్మసానికి కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.  పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంసెట్‌లో 27వ ర్యాంక్ సాధించి, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి అమెరికా వెళ్ళిన ఆయన అక్కడ కూడా అత్యధిక మార్కులు సాధించారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేసిన ఆయన అతి తక్కువకాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్.కి హాజరయ్యే విద్యార్థుల లకోసం ‘యూ వరల్డ్’ పేరుతో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను స్థాపించి ఘన విజయం సాధించారు. తన సంస్థను వేల కోట్ల రూపాయల విలువైన సంస్థగా ఎదిగేలా చేశారు.  మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీతో అనుబంధం వున్న పెమ్మసాని చంద్రశేఖర్ 2014లోనే నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాల్సింది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. 2024 ఎన్నికలలో పెమ్మసాని గుంటూరు స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు.  పెమ్మసాని పుట్టిన ఊరు బుర్రిపాలెం. తల్లిదండ్రులు సువర్చల, పెమ్మసాని సాంబశివరావు, భార్య డాక్టర్ రత్నశ్రీ, కుమారుడు పెమ్మసాని అభినవ్, కుమార్తె పెమ్మసాని సహస్ర.

మూడోసారి ప్రధానిగా మోదీ మార్కు కేబినెట్

భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  మాజీ ప్రధాని నెహ్రూ వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఎవరికి ఏయే పదువులు ఇస్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఈ విషయంపై ఇప్పటికే ఎన్​డీఏ మిత్రపక్ష నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపి లిస్ట్ ఫైనలైజ్ చేశారు. . ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. మోదీతోపాటు పలువురు ఎంపీలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని విజయతీరాలకు చేర్చిన నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. దీంతో భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ఆదివారం సాయంత్రం అంగరంగా వైభవంగా జరిగిన పట్టాభిషేక వేడుకలో మోదీతోపాటు పలువురు నేతలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ హాజరయ్యారు. ఈసారి ఐదుగురు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8వేల మంది దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్‌ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ విచ్చేశారు.మోదీ ప్రమాణస్వీకారోత్సవ వేడుక వేళ దిల్లీవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. దిల్లీని రెండు రోజుల పాటు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్​ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈసారి ఐదుగురు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 8 వేల మంది దేశ, విదేశ ప్రముఖులతోపాటు సార్క్ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, సినీ నటుడు షారుక్ ఖాన్, రజనీకాంత్‌తోపాటు ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి, పలు పీఠాధిపతులు పాల్గొన్నారు.

అప్రూవర్‌గా మారతానంటూ ‘బూమ్ బూమ్’ వాసుదేవరెడ్డి రాయబారం!

అందరూ ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’ అంటూ వుంటారు గానీ... జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ్ స్కామ్‌కి మించిన లిక్కర్ స్కామ్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆర్థిక పరమైన స్కామ్ ఏమైనా జరిగితే జరిగి వుండవచ్చేమో.... ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆర్థిక స్కామ్ చేయడంతోపాటు... ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడారు. ఐదేళ్ళపాటు ‘జే బ్రాండ్ మద్యం’ పుణ్యమా అని ప్రజల గొంతుల్లోకి ప్రాణాంతక కెమికల్స్.తో కూడిన విషం లాంటి మద్యం ప్రవహించింది. ‘ప్రభుత్వ పెద్ద’తో సాహా ఈ స్కామ్‌లో వున్న పెద్దలందరి ఇళ్ళలోకి డబ్బు భారీగా ప్రవహించింది. మద్యం తాగిన ప్రజల ఇళ్ళలో చావుడప్పులు మోగితే, మద్యం అమ్మిన పెద్దల ఇళ్ళలో డబ్బు నిల్వలు పెరిగాయి. ఈ ఐదేళ్ళలో మద్యం అమ్మకాల ద్వారా 1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని జగన్ ప్రభుత్వం విక్రయించింది. దీనిలో అందరి వాటాలు పోను... ఒక్క ప్రభుత్వ పెద్దకి వచ్చిన వాటా 5 వేల కోట్లు అని లెక్కలు తేలుస్తున్నాయి. ప్రభుత్వం ఐదేళ్ళలో నిర్వహించింది 1.24 లక్షల కోట్ల మద్యం వ్యాపారమే అయినప్పటికీ, విషం లాంటి ఆ మద్యం తాగడం వల్ల ప్రజలు ఆస్పత్రుల పాలై వైద్యానికి చేసిన ఖర్చు, ప్రజలు పని చేయలేకపోవడం వల్ల జరిగిన ఉత్పాదకత నష్టం మొత్తం కలసి 3 లక్షల కోట్లు దాటింది. అంటే, జరిగిన మద్యం వ్యాపారం విలువ కంటే, రెండింతల నష్టం ప్రజలకు జరిగిందన్నమాట. ‘మద్య నిషేధం’ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, జనం జీవితంలో మద్యాన్ని ఒక విషాదంలా మారేలా చేసింది.  ఇదంతా ఇలా వుంటే, మద్యం వ్యాపారం మీద వస్తున్న ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. అలా అప్పుగా తెచ్చిన 14 వేల కోట్లు ఎటుపోయాయో, ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. ఇలా అయిన వాళ్ళ కంపెనీల దగ్గర మద్యం కొనుగోళ్ళు, మద్యం నాణ్యతను ఎంతమాత్రం పట్టించుకోకపోవడం, అడ్డమైన ధరలకు మద్యాన్ని విక్రయించడం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్‌ని హామీగా పెట్టి 14 వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకురావడం... వీటన్నిటి వెనుక వున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే ఈసీ ఈ ఘనుడిని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించింది.  దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి 2008 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. ఈయనకు జగన్ పార్టీ నాయకులతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. జగన్ అధికారంలోకి రాగానే, రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని ఇతగాడిని డిప్యుటేషన్ మీద రప్పించి, ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఈయన జగన్ మీద ప్రేమ కురిపిస్తూ, జగన్ చెప్పినట్టు నడుస్తూ నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ, జగన్ అండ్ గ్యాంగ్‌కి మేలు జరిగేలా వ్యవహరిస్తూ వచ్చారు. స్వామికార్యం చూస్తూ, పనిలోపనిగా స్వకార్యం కూడా చూసుకున్నారు.  జగన్ ప్రభుత్వం హయాం ముగియగానే ఆంధ్రప్రదేశ్ సీఐడీ దృష్టి వాసుదేవరెడ్డి మీద పడింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో వున్న వాసుదేవరెడ్డికి చెందిన నివాసంలో శుక్రవారం (07-06-2024) నాడు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కళ్ళుతిరిగిపోయే స్థాయిలో వాస్తవాలు బయటకి వచ్చినట్టు తెలుస్తోంది. వాసుదేవరెడ్డితోపాటు ఈ భారీ లిక్కర్ స్కామ్‌తో సంబంధం వున్న వాళ్ళందరి గుట్టూ సీఐడి చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. ఐదేళ్ళపాటు జగన్‌తో అంటకాగి ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన పాపం తన పీకకు భారీ స్థాయిలో చుట్టుకుంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ‘‘నేను అప్రూవర్‌గా మారిపోతాను. జే బ్రాండ్ వెనుక జరిగిన అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు చెబుతాను. ఈ విషయంలో జగన్‌ నిర్వహించిన పాత్ర గురించి కూడా స్పష్టంగా చెబుతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’’ అని వాసుదేవరెడ్డి పలువురు తెలుగుదేశం నాయకుల దగ్గరకి తనకు సన్నిహితులైన కొంతమంది ప్రభుత్వ అధికారులతో రాయబారాలు పంపినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ నాయకులెవరూ వాసుదేవరెడ్డిని ఎంటర్‌టైన్ చేయడానికి విముఖత కనబరిచినట్టు తెలుస్తోంది. 

మలయాళ నటుడు సురేష్ గోపికి  కేబినెట్ లో బెర్త్ 

మళయాళ నటుడు సురేష్ గోపి అరుదైన రికార్డు దక్కించుకున్నారు.  కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించిన ప్రముఖ నటుడు సురేశ్ గోపి... మోదీ కేబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా మరో మైలురాయిని అందుకుంటున్నారు. త్రిస్సూర్ నుంచి 75వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 'త్రిస్సూర్‌ బీజేపీ అభ్యర్థికి కేంద్రమంత్రి పదవి... ఇది మోదీ హామీ' అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లారు. కేరళలో బీజేపీ గెలవడం ఇదే మొదటిసారి కాగా, గెలవగానే సురేశ్ గోపికి కేంద్రమంత్రి పదవి దక్కింది. సురేశ్ గోపి మలయాళ నటుడు. 250కి పైగా చిత్రాల్లో నటించారు. 2016 ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిస్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టనున్నారు.

ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా... ఎన్ డి ఎ నేతలకు నడ్డా నోరూరించే విందు 

ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఉలవచారు బిర్యానీ చిత్రంలో ఈ సాంగ్ గుర్తొచ్చే విధంగా ఉంది మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో నడ్డా విందు.  ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది.  ఢిల్లీలో అత్యధక ఊష్ణోగ్రతల రీత్యా  ఈ విందులో ఐదు రకాల ఫ్రూట్ జ్యూస్ లు, వివిధ ఫ్లేవర్లలో షేక్ లు, స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్, మూడు ఫ్లేవర్లలో రైతా అందించనున్నారు. అంతేకాదు, జోధ్ పురీ సబ్జి, పప్పు, దమ్ బిర్యానీ, ఐదు రకాల రొట్టెలు వడ్డించనున్నారు. రుచికరమైన పంజాబీ వంటకాల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు.  తృణధాన్యాలను (మిల్లెట్స్) ఇష్టపడే వారి కోసం బజ్రా కిచిడీ సిద్ధం చేస్తున్నారు. తీపి ఇష్టపడే వారి కోసం ఎనిమిది రకాల డిజర్ట్ లు, రసమలై, నాలుగు వెరైటీల్లో ఘేవర్... స్పెషల్ టీ, కాఫీ అందుబాటులో ఉంచుతున్నారు. వరసగా ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతోంది. సాయంత్రం 7.15 నిమిషాలకు ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు భారత ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, షీసెల్స్, మారిషన్ దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఇదిలా ఉంటే, ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత జేపీ నడ్డా కొత్తగా ఎన్నికైన ఎన్డీయే ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. డిన్నర్ మెనూలో నోరూరించే వంటకాలు ఉన్నాయి. వివిధ రకాల జ్యూస్‌లో పాటు స్టఫ్డ్ లీచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్‌తో సహా వేడిన రైతాను అందించనున్నారు.డిన్నర్‌లో జోధ్‌పురి సబ్జీ, దాల్, దమ్ బిర్యానీతో సహా ఐదు రకాల బ్రెడ్స్‌ని ఏర్పాటు చేశారు. పంజాబీ ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. మిల్లెట్లను ఇష్టపడే వారికి బజ్రా కిచిడీ, రసమలై మెనూలో ఉంది.

నరసాపురం బిజెపి ఎంపీ భూపతి రాజుకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు 

తాజాగా రాష్ట్రం నుంచి మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్‌లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి నరసాపురం బీజేపీ ఎంపీ  భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కిందని సమాచారం. జూన్ 9న (ఆదివారం)ఉదయం ప్రధాని నివాసంలో తేనీటి విందుకి శ్రీనివాస్ వర్మ హాజరైయ్యారు. ఢిల్లీలో నేడు  రాత్రి జరగబోయే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరందరినీ మోదీ తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస వర్మ కూడా ఆ విందుకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈయనకు కూడా మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కిందని స్పష్టం అవుతోంది. వైసీపీ ఆగడాలు, ఆకృత్యాలను గత కొన్నేళ్లుగా ఎండగడుతున్న నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి  నుంచి టిడిపి దక్కింది. ఈ ఎన్నికల్లో అతను టిడిపి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అక్కడ వైసీపీ అభ్యర్థి ఓటమికి ముఖ్య భూమిక వహించారు. కూటమిలో భాగంగా నరసాపురం సీటు బిజెపికి వెళ్లింది. నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినప్పటికీ వైసీపీ అధినేత జగన్ తో విభేధించడంతో రఘురామ కృష్ణ రాజు రెబల్ ఎంపీగా కొనసాగారు. తెలుగు దేశం పార్టీలో సభ్యత్వం  తీసుకోని కారణంగా అతను టిడిపిలో చేరలేకపోయారు. టిడిపి, జనసేన బిజెపి కూటమి ఏర్పడిన తర్వాతే అతను టిడిపిలో చేరి ఉండి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రఘు రామృష్ణ రాజు వైసీపీని ఎప్పటికప్పుడు ఎండగట్టడం కూటమిలో భాగంగా నరసాపురం బిజెపి కి దక్కినప్పటికీ టిడిపి, జనసేన శ్రేణులు శ్రీనివాసవర్మ ను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.  ఏపీ నుంచి మరో ఎంపీకి కేంద్రంలో మంత్రి పదవి ఖరారైంది. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర క్యాబినెట్ లో చోటు లభించింది.  ఈ నేపథ్యంలో, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎంపీగా గెలిచారు. ఇప్పుడాయనను కేంద్ర మంత్రి పదవి వరించింది.  శ్రీనివాసవర్మ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1991 నుంచి 1995 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1995 నుంచి 1997 వరకు భీమవరం టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 1999 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు.  1999 నుంచి 2001 వరకు నరసాపురం పార్లమెంటు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీనివాసవర్మ పనితీరుకు మెచ్చి ఆయనను 2001లో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.  2009లో భూపతి రాజు  శ్రీనివాసవర్మ బీజేపీ టికెట్ పై లోక్ సభకు పోటీ చేశారు. 2010 నుంచి 2018 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018 నుంచి 2020 వరకు బీజేపీ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక, 2020 నుంచి 2023 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున నరసాపురం నుంచి బరిలో దిగి ఎంపీగా విజయం సాధించారు. ఈ సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో రజనీకాంత్ 

వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. వారిలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు.  తెలుగు ప్రేక్షకులకు రజనీకాంత్ పేరు తెలియకుండా ఉండరు. సినిమాల సంగతి అటుంచితే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కూడా రజనీ కాంత్ పేరు గత మూడు దశాబ్దాలుగా  వినిపిస్తూనే ఉంది. ఎన్టీఆర్ అభిమాని అయిన రజనీకాంత్ తెలుగు దేశం పార్టీ పెట్టిన నాటి నుంచి వెన్నంటే ఉన్నారు. తెలుగు దేశం పార్టీ సంక్షోభ సమయంలో అండగా నిలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో నాదెళ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ కు బాసటగా నిలిచారు.  , రాజ్యాంగేతర శక్తి అయిన లక్ష్మి పార్వతి టిడిపిలో జోక్యం చేసుకోవడాన్ని రజనీకాంత్ పూర్తిగా ఎండగట్టారు. లక్ష్మి పార్వతికి దుష్ట శక్తి అనే బిరుదు ఇచ్చిన వ్యక్తి  కూడా రజనీకాంత్ కావడం గమనార్హం.  ఈ తరంలో  చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. తెలుగు దేశం పార్టీ ప్రత్యర్థులైన వైఎస్ ఆర్ సిపితో జత కట్టి లక్ష్మిపార్వతి నీచరాజకీయాలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. నిరుడు  ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్ పై  వైసీపీ నేతలు నోరు పారేసుకున్నారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే రజనీకాంత్ మీద  బాడీ షేమింగ్ చేసి పరువు పోగొట్టుకున్నారు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అభాసుపాలయ్యారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అయ్యింది. ఎపిలో కూటమి సునామీ మాదిరిగా దూసుకుపోవడంతో రజనీకాంత్ ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుకు శుభా కాంక్షలు తెలిపారు.   ఢిల్లీ చేరుకున్న రజనీకాంత్ ను మీడియాతో పలకరించింది. తాను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నానని వెల్లడించారు. ఇది చారిత్రాత్మక ఘట్టం అని రజనీకాంత్ అభివర్ణించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న నరేంద్ర మోదీ గారిని అభినందిస్తున్నానని తెలిపారు. 

ఇక ఏపీలో నిఖార్సయిన మద్యం!

ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రియులకు శుభవార్త. ఇకపై మీరు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ లాంటి దిక్కుమాలిన బ్రాండ్స్ తాగి పేగులు కాల్చుకోనక్కర్లేదు. ఈనెల 14 నుంచి నాణ్యమైన, నిఖార్సయిన మద్యాన్ని ఆస్వాదించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం వున్న మద్యం పాలసీని రద్దు చేపి కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న డిస్టలరీస్‌కి వున్న లైసెన్సులను రద్దు చేశారు. రాష్ట్రంలో వున్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టమ్ ద్వారా లైసెన్సులు ఇవ్వనున్నారు. ఇక కల్తీలేని మద్యాన్ని, పాత బ్రాండ్లను వినియోగదారులకు అందించాలని నిర్ణయించారు.  గతంలో బూమ్ బూమ్ లాంటి దిక్కుమాలిన బ్రాండ్లను ప్రజల చేత తాగించిన జగన్ ప్రభుత్వం మీద విచారణ కూడా జరగనుంది.

క్రీ.శ. 1125 నాటి జడ్చర్ల జైన శాసనాన్ని కాపాడుకోవాలి!

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి అఖిలభారత ప్రాచీన ఆలయ పునరుద్ధరణ ట్రస్ట్ చైర్మన్ ఆర్ కె జైన్ జడ్చర్ల పంచాయతీ కార్యాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీ. శ. 12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా .ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న క్రీ. శ. 1125వ సంవత్సరం జనవరి 21వ తేదీ నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి మూడో సోమేశ్వరుని కుమారుడు, కందూరు నాడు యువరాజైన, మూడో తైలపుడు పాలిస్తుండగా, మూల సంఘానికి చెందిన మేఘచంద్ర భట్టారకుడు వేయించిన జైన శాసనంలో గంగాపురంలోని పార్శ్వనాథ చైత్య అలయ ప్రస్తావన ఉందని, ప్రస్తుతం గంగాపురం వద్ద గల గొల్లత్తగుడి ఇటుక ఆలయమే జైన చైత్యాలమని, దాన్ని పునరుద్ధరించి, ఈ శాసనాన్ని అక్కడకు తరలించాలని అఖిలభారత ప్రాచీన ఆలయ జీర్ణోధ్ధరణ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్ కె జైన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో నున్న క్రీ.శ. 1162 నాటి కందూరు చోళ వంశానికి చెందిన రెండో ఉదయన చోడుడు, కోడూరు స్వయంభు సోమేశ్వరనాధుని నిత్య అర్చనలకు 5 గోకర్ణ సింగ రూకలను, గంగాపురం నుంచి వచ్చే ఆదాయాన్ని దానం చేసినట్లుగా ఉందని శివనాగిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ కో-ఛైర్మన్ ముఖేష్ కుమార్ జైన్, స్థానిక ఆలయ పూజారి, వారసత్వ ప్రేమికుడు అన్ష్ జైన్ పాల్గొన్నారు. ఆ శాసనం పై ఉన్న సున్నాన్ని తొలగించాలని శివనాగిరెడ్డి ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు 

భారతీయ చట్టాలు ప్రధానంగా ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని రూపుదిద్దారు. బ్రిటీషు కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. ఒకటి ఇండియన్ పినల్ కోడ్ రెండు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ , మూడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్యాధార చట్టం. సాక్ష్యం బట్టి నేరం రుజువు అవుతుంది. దేన్ని సాక్ష్యం తీసుకోవాలి అనే విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక  వ్యాఖ్యలు చేసింది.  సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగిపోతోంది.. డీప్ ఫేక్ ఫొటోలే అసలైన ఫొటోలుగా చలామణి అవుతున్న రోజుల్లో ఫొటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేవలం ఫొటోలు, వీడియోలు ఇస్తే సరిపోదు.. అవి నిజమైనవేననే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య, ఐదేళ్ల కూతురుకు కలిపి నెలనెలా రూ.75 వేలు భరణం కింద చెల్లించాలని భర్తను ఆదేశించింది. అయితే, తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి తాను ఎలాంటి మనోవర్తి చెల్లించాల్సిన అవసరంలేదని భర్త వాదించారు. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. భార్య వివాహేతర సంబంధానికి సాక్ష్యంగా ఫొటోలను కోర్టుకు సమర్పించాడు. ఈ కేసును జస్టిస్ రాజీవ్ షక్దర్, జస్టిస్ అమిత్ బన్సల్ ల ధర్మాసనం విచారించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త సమర్పించిన ఫొటోలు స్పష్టంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, డీప్ ఫేక్ ఫొటోల బెడద నేపథ్యంలో ఆ ఫొటోలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మరింత స్పష్టమైన ఫొటోలు, అవి నిజమైనవేననే ఆధారాలతో కోర్టుకు అందజేస్తే పరిశీలిస్తామని పేర్కొంది.

తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ మంత్రులు... పరిశీలనలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల పేర్లు

లోకసభ ఎన్నికల్లో కూటమి దూసుకు పోయింది. తెలంగాణలో ఏ పార్టీతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేసిన బిజెపికి ఎనిమిది సీట్లు దక్కాయి.  ఈ నెల 9 సాయంత్రం (ఆదివారం)ప్రదానిగా  మోదీ  ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా  ఇద్దరు ఎంపీలకు కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉంది.  లోక్‌సభ ఎన్నికలపై దుమ్ము రేపిన తరుణంలో తెలంగాణాలో కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవుల కోసం పోటీపడే వారిపై దృష్టి సారించింది. సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికైన జి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ , మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి మూడు లక్షల మెజారిటీతో గెలుపొందిన ఈటెల రాజేందర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్ వంటి అభ్యర్థులు బిజెపి  లెక్కల్లో ఉన్నారు. మోడీ మంత్రివర్గంలో కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు మరియు ఇప్పుడే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో దాని సంఖ్య రెట్టింపు అయి ఎనిమిదికి చేరుకుంది. సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం గట్టి పోటీదారుగా నిలిచారు. ఆయనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని లేదా మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ ఉన్నతాధికారులతో ఈటల ఇప్పటికే లాబీయింగ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్ చేయడం లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం అన్నారు. అనే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని పైకి చెబుతున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని చిత్తుగా ఓడించానని ఆమె ప్రచారం చేసుకుంటున్నారు.  సెంట్రల్ బెర్త్ కోసం పోటీ పడుతున్న వారిలో ఆమె కూడా ఒకరని పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.  ఒక నిర్దిష్ట రాష్ట్ర యూనిట్ 10 లేదా అంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలిస్తే, రెండు బెర్త్‌లు - ఒక కేబినెట్ ర్యాంక్ మరియు మరొకటి రాష్ట్ర మంత్రిగా - ఇవ్వబడుతుందని సీనియర్ నాయకులు  ఒకరు చెప్పారు. ఢిల్లీలో బీజేపీ అదృష్టానికి తెలంగాణ  రాష్ట్రం కీలకం. ఎందుకంటే బిజెపి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ను ఎదురీది విజయం సాధించాలంటే అంత మామూలు విషయం కాదు. పొత్తు లేకుండానే  బిజెపి  పనితీరు మెరుగుపర్చుకుంది.  ఆదివారం రెండు బెర్త్ లు ఇచ్చి మున్ముందు  మూడవ బెర్త్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని   పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర కేబినెట్‌లో తెలుగు ఎంపీలకు ఎన్ని బెర్త్‌లు లభిస్తాయనే దానిపై పార్టీ వర్గాలు  నిరాకరిస్తున్నాయి.  ‘‘చివరికి ఏమి జరుగుతుందో మాకు తెలియదు. కేబినెట్ బెర్త్‌లను బట్టి, రాష్ట్ర పార్టీ యూనిట్‌లో కూడా మార్పులు జరుగుతాయి. .కొందరు నాయకులు పార్టీలో జాతీయ స్థాయి నామినేషన్లు పొందవచ్చు.’’ అని అంటున్నారు. అసాధారణమైన సందర్భాల్లో తప్పితే  మొదటిసారిగా ఎంపీలుగా ఎన్నికైన వారికి అంత ప్రాధాన్యత నివ్వరు.  సాధారణంగా బీజేపీలో క్యాబినెట్ పదవికి ప్రాధాన్యత ఇవ్వరు. 2019లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన వెంటనే కిషన్‌రెడ్డిని మంత్రిగా నియమించారు. 1998-99 మధ్య వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తెలంగాణకు చెందిన తొలి బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అని చెప్పొచ్చు. వీరిరువురు మొదటసారి ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులయ్యారు.  తెలంగాణ బీజేపీ ఎంపీలలో ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేబినెట్ బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరువురికీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ చేసిన సేవల వల్లే రాష్ట్రంలో బిజెపి 8 స్థానాలను దక్కించుకుందని అధిష్టానం భావిస్తోంది.  ఇటీవలే వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయనే ఆసక్తికర చర్చ జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.కాగా మరికొన్ని గంటల్లోనే ‘మోదీ 3.0’ ప్రభుత్వం కొలువు తీరనుంది. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నరేంద్ర మోదీ పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో కేబినెట్ మంత్రి పదవులు దక్కించుకోనున్న ఎంపీలు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది

మోడీ కొత్త ప్రభుత్వంలో మంత్రులు వీళ్ళే!

నరేంద్ర మోడీ 3.0 గవర్నమెంట్‌లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే వారి లిస్టు ఇలా వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి మొత్తం 44 మంది మంత్రులు వుండబోతున్నారు. 1. అమిత్ షా, 2. మన్సుఖ్ మాండవియా, 3. అశ్విని వైష్ణవ్, 4. నిర్మలా సీతారామన్, 5. పీయూష్ గోయల్, 6. జితేంద్ర సింగ్, 7. శివరాజ్ సింగ్ చౌహాన్, 8. హర్దీప్ సింగ్ పూరి, 9. హెచ్‌డికె, 10. చిరాగ్ పాశ్వాన్, 11. నితిన్ గడ్కరీ, 12. రాజ్‌నాథ్ సింగ్, 13. జ్యోతిరాదిత్య సింధియా, 14. కిరన్ రిజిజు, 15. గిరిరాజ్ సింగ్, 16. జయంత్ చౌదరి, 17. అన్నామలై, 18. ఎంఎల్ ఖట్టర్, 19. సురేష్ గోపి, 20. జితన్ రామ్ మాంఝీ, 21. రామ్‌నాథ్ ఠాకూర్ (మాస్), 22. జి.కిషన్ రెడ్డి, 23. బండి సంజయ్, 24. అర్జున్ రామ్ మేఘ్వాల్, 25. ప్రహ్లాద్ జోషి, 26. చంద్రశేఖర్ చౌదరి, 27. డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని, 28. రామ్ మోహన్ నాయుడు కింజరాపు, 29. రవ్‌నీత్ సింగ్ బిట్టు, 30. జితిన్ ప్రసాద్, 31. పంకజ్ చౌదరి, 32. బిఎల్ వర్మ, 33. లాలన్ సింగ్, 34. సోనోవాల్, 35. అనుప్రియా పటేల్, 36. ప్రతాప్ రావ్ జాదవ్, 37. అన్నపూర్ణా దేవి, 38. రక్షా ఖడ్సే, 39. శోభా కరంద్లాజే, 40. కమల్జీత్ సెహ్రావత్, 41. రావు ఇందర్‌జీత్ సింగ్, 42. రామ్ దాస్ అథవాలే, 43. హర్ష్ మల్హోత్రా, 44. భూపతిరాజు శ్రీనివాసవర్మ.