కదల నివ్వం.. వదిలి పెట్టం!
posted on Jun 6, 2024 9:09AM
జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయనతో అంటకాగి, ఆయన ఆదేశాల మేరకు విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు గురి చేసిన అధికారులు ఒక్కొక్కరుగా ఇప్పుడు జారుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేశం వదిలి వెళ్లిపోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటే.. రాష్ట్రం నుంచి రిలీవ్ అయ్యి సొంత రాష్ట్రాలకు జారుకోవడానికి మరి కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే రెడ్ బుక్ లో పేరు ఉన్న ఏ ఒక్కరినీ కదల నివ్వం, వదిలిపెట్లం అని తెలుగుదేశం శ్రేణులు నినదిస్తున్నాయి.
సీఐడీ చీఫ్ గా ఉంటూ తప్పుడు కేసులతో విపక్ష నేతలను నానా ఇబ్బందులకూ గురి చేసిన సీఐడీ చీఫ్ సంజయ్ దేశం వదిలి వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే సంజయ్ విదేశీ పర్యటన కోసం సీఎస్ సెలవు మంజూరు చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరి అనుమతితో సంజయ్ కు సెలవు మంజూరు చేశావంటూ సీఎస్ ను చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలలో ఘన విజయం సాధించిన తనను అభినందించడానికి వచ్చిన సీఎస్ జవహర్ రెడ్డిని నిలబెట్టి మరీ ఆయన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎస్ గా కాకుండా వైసీపీ కార్యకర్తగానే పని తీరు ఉందంటూ విమర్శించారు. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి సంజయ్ సెలవును రద్దు చేశారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సంజయ్ జగన్ ఆదేశాల మేరకు, ఆయనకు అడుగులకు మడుగులొత్తుతూ పని చేశారన్న విమర్శలు ఉన్నాయి. మార్గదర్శి విషయంలో నూ, చంద్రబాబుపై అక్రమ కేసుల విషయంలోనూ సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన ఓవరేక్షన్, జగన్ మెప్పు కోసం తన పరిధికి మించి వ్యవహరించిన తీరు, ఒక రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్ గా మీడియా సమావేశాలలో చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు వీటన్నిటికీ ఆయన ఫలితం అనుభవించి తీరాలని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేసులు బనాయించి అరెస్టులు చేసి, ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతాం అన్నట్లుగా వీరి సంజయ్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది.
సంజయ్ మాదిరిగానే జగన్ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన అందరి లెక్కలూ తేల్చడానికి, వారి ఆగడాలకు సంబంధించిన అన్ని ఆధారాలతోనూ రెడ్ బుక్ రెడీగా ఉంది. దీంతో భయంతో వణుకుతున్న జగన్ తైనాతీ అధికారులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే సర్దేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సాగనియ్యబోమని తెలుగుదేశం గట్టిగా చెబుతోంది.
తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభిని అక్రమంగా అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఓ ఎస్పీ విషయంలో పట్టాభి ఇప్పటికే గాంధీగిరి చేసి వచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పట్టాభి స్వయంగా ఆ ఎస్పీ ఇంటికి వెళ్లి, ఆయన అందుబాటులో లేకపోవడంతో అభినందనలు తెలిపి, ఇంటి వద్ద పుష్పగుచ్ఛం ఇచ్చి వచ్చారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అడ్డగోలుగా వ్యవహరించి, అధికార విధులను విపక్ష నేతలు కార్యకర్తలను వేధించడానికే వినియోగించిన అధికారులెవరినీ వదిలిపెట్టబోమనీ, పాదయాత్ర సమయంలోనే తెలగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరిం చిన సంగతి తెలిసిందే.
నిబంధనలుకు వ్యతిరేకంగా వ్యవహరించిన అందరిపైనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారి వివరాలన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ పాదయాత్ర సందర్భంగా చెప్పారు. ఇప్పుడు అటువంటి అధికారులంతా భయంతో వణుకుతున్నారు. డెప్యూటేషన్ పై వచ్చిన వారు రిలీవ్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో డెప్యూటేషన్ పై ఉన్న అధికారులెవరినీ రిలీవ్ చేయకుండా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా గవర్నర్ సీఐడీ ఆఫీస్ సీజ్ కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ప్పటికే చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలు విభాగాధిపతి ఆఫీసులు లన్ని కూడా డాక్యుమెంట్ల భద్రపరచాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.