పిన్నెల్లి అరెస్టు?

posted on: Jun 6, 2024 11:52AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిలు గడువు గురువారం (జూన్ 6)తో ముగుస్తున్న సంగతి తెలిసిందే.

ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసులపై ఏపీ హైకోర్టులో గురువారమే విచారణ జరుగుతుంది.  కాగా ఈ కేసుల్లో పిన్నెల్లికి బెయిలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈవీఎం ధ్వసం కేసులో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఏపీ హైకోర్టులో ఆయనకు ఈవీఎం ధ్వంసం కేసులో ఎటువంటి ఊరటా లభించే అవకాశం లేదని అంటున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా పిన్నెల్లి అరెస్టయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...