పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా?
posted on Jun 6, 2024 @ 12:41PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించడంతో జగన్ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇలాంటివి నాకు కొత్తకాదు.. పోరాటం కంటిన్యూ చేస్తాను అని నాలుగు ముక్కలు చెప్పి వెళ్ళిపోయినప్పటికీ, ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం లేనట్టు తెలుస్తోంది. తనకు ఎలాగూ జైలు జీవితం తప్పదు కాబట్టి, తాను రాజీనామా చేసి భారతిని పులివెందుల నుంచి గెలిపించుకోవాలని జగన్ భావించారని తెలుస్తోంది. అదేం దరిద్రమోగానీ, జగన్ అనుకున్నవేవీ అనుకున్నట్టు జరగడం లేదు. తాను రాజీనామా చేసి, భారతిని పులివెందుల నుంచి గెలిపించుకోవాలన్న ఆలోచనలో వుండగానే, భారతిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం వున్నట్టు సమాచారం అందడంతో జగన్ రాజీనామా ఆలోచన ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మొదట భారతిని వివేకా మర్డర్ కేసు నుంచి ఎలా బయట పడేయాలా అనే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది.
భారతి అరెస్టు అనే అంశం తర్వాత, జగన్‌ని వేధిస్తున్న మరో పాయింట్ ఏమిటంటే, తాను అరెస్టు అయిపోయి, భారతి అరెస్టు అయిపోయి, అవినాష్ రెడ్డి అరెస్టు అయిపోతే... ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరనే టెన్షన్‌లో జగన్ ఉన్నట్టు సమాచారం. గతంలో తాను జైలుకు వెళ్ళినప్పుడు విజయమ్మ, షర్మిల పార్టీని కాపాడారు. ఇప్పుడు ఆ ఇద్దరూ పార్టీకి దూరమైపోయారు. ఇక పార్టీలో వున్నవారికి బాధ్యతలు ఇద్దామా అంటే, అందరూ తనమీద ఆధారపడిన పారసైట్సే తప్ప, తనకు ఉపయోగపడేవాళ్ళు ఎవరూ లేరు.. టైం బాగాలేక అరెస్టుల మీద అరెస్టులు జరిగి కీలకమైన వ్యక్తులందరూ జైల్లో వుంటే పార్టీని ఎలా కాపాడుకోవాలా అని జగన్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.