జవహర్‌రెడ్డిని ఒక్క దులుపు దులిపిన చంద్రబాబు!
posted on Jun 5, 2024 @ 4:00PM
జగన్ అధికారంలో వుండగా భక్తిశ్రద్ధలతో ఆయన బూట్లు నాకుతూ, చంద్రబాబు పట్ల ఎంతో అమర్యాదగా ప్రవర్తించిన చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి చంద్రబాబు అధికారంలోకి రాగానే మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. జవహర్ రెడ్డి కూడా వాళ్ళలో ఒకరు. జవహర్ రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ పుష్పగుచ్ఛం ఇస్తే, దాన్ని సీరియస్‌గా అందుకున్న చంద్రబాబు, సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్‌కి ఎవర్నడిగి లీవ్ ఇచ్చావని జవహర్‌రెడ్డిని ప్రశ్నించారని, ఆయన నీళ్ళు నమిలారని సమాచారం. ఎన్డీయే కూటమి మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళి రేపు వస్తాను.. అప్పుడు మీతో మాట్లాడతానని జవహర్ రెడ్డితో చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జవహర్ రెడ్డికి భారీ క్లాస్ పీకే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జవహర్ రెడ్డిని సస్సెండ్ చేసి, నీ మీద, నీ కొడుకు మీద వచ్చిన భూకబ్జా ఆరోపణల సంగతి ముందు తేల్చు.. ఆ తర్వాత నీ సస్పెన్షన్ ఆర్డర్ రద్దు గురించి ఆలోచిద్దాం అనే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. జవహర్ రెడ్డి ప్రస్తుతం సర్వీసు చివర్లో వున్నారు. జూన్ నెలాఖరుకు ఆయన రిటైర్ అవబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు కనుక జవహర్ రెడ్డి సస్సెండ్ అయితే, సీఎస్ పదవిలో రిటైర్ అయ్యే అవకాశం కోల్పోతారు. ఏబీ వెంకటేశ్వరరావుకు ఐదేళ్లపాటు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించింది జగన్‌తోపాటు జవహర్ రెడ్డి కూడా. కోర్టు ఆదేశాలతో రిటైర్మెంట్ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. జవహర్ రెడ్డి కనుక సస్పెండ్ అయితే మాత్రం, ఆయన సర్వీసులో అదొక మచ్చగా మిగిలిపోవడం ఖాయం.