కడపలోనూ కూటమిదే హవా!

కడప జిల్లాలోనూ దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు జమ్మలమడుగు లో  బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ముందంజ. ఐదో రౌండ్ ముగిసేసరికి 1908 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మైదుకూరులో   టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఆరు రౌండ్లు ముగిసే సరికి 8,178 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి మాధవీ రెడ్డి 8 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి 6014 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అదే విధంగా ప్రొద్దుటూరులో ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి తెలుగుదేశం అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డి 10వేల 200 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఇక కమలాపురంలో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి తెలుగుదేశం అభ్యర్థి పుత్త చైతన్యరెడ్డి 3, 561 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.   పులివెందులలో మాత్రం వైసీపీ అభ్యర్థి జగన్ నాలుగు రౌండ్లు ముగిసే సరికి 12, 621 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు.  అలాగే బద్వేలులో కూడా నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ 6వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.  

ఎపి అసెంబ్లీ ఫలితాల్లో బోణి కొట్టిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి 

ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి విజయం అందుకున్నారు. 61 వేల 500 వోట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్ సిపి అభ్యర్థిపై గెలుపొందారు.  తెలుగుదేశం పార్టీ ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా ఎదిగిన నేతలెందరో. ఈ కోవకే చెందిన రాజకీయ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 2024 ఎన్నికల బరిలో దిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి విజయం అందుకుని వార్తల్లో వ్యక్తి అయ్యారు.  బాల్యం, కుటుంబ నేపథ్యం గోరంట్ల బుచ్చయ్య చౌదరీ.. 1945 మార్చి 15న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్లలోని నర్సాయిపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోరంట్ల వీరయ్య చౌదరి తల్లి అనసూయమ్మ.  వారిది సంపన్న రైతు కుటుంబం. వారి తండ్రి వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహించే వారు. బుచ్చయ్య చౌదరి గారికి ముగ్గురు తమ్ముళ్ళు.  ఇక బుచ్చయ్య చౌదరి  విద్యాభ్యాసం వస్తే..  ఆయన బాపట్లలోనే ఎస్ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆ తరువాత రాజమండ్రిలోని వీరశలింగం విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసినా ఆయన ఉద్యోగాలు చేయకుండా వ్యాపారం మొదలుపెట్టారు. ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే..  ఇంటర్ చదువుతున్న రోజుల్లో తనతో పాటుగా చదువుకున్న ఝాన్సీ లక్ష్మీ గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెను కంప్యూటర్ సైన్స్ లో పూర్తి చేశారు ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు.  రాజకీయ ప్రవేశం గోరంట్ల బుచ్చయ్య చౌదరిది కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుల కుటుంబం.ఆయన చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు.  తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ గారిపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన బుచ్చయ్య చౌదరి అనతికాలంలోనే గోదావరి జిల్లాలో పార్టీ కన్వీనర్ గా ఎన్నికయ్యారు.  పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు. ఈ క్రమంలో 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజమండ్రి అసెంబ్లీ టికెట్ ను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. ఇలా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తరువాతి కాలంలో ఎన్టీఆర్ కి పార్టీలో అత్యంత నమ్మకస్తుడుగా మారాడు బుచ్చయ్య చౌదరి. అయితే ఆయనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకున్న వ్యక్తిగతంగా పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించారు. ఇక 1985 ఎన్నికల్లో కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు బుచ్చయ్య చౌదరి. ఈ తరుణంలో ఆయనను ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా అధికార పార్టీ ప్రతినిధిగా, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో పలు కీలకమైన కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఒకనొక సమయంలో ఎన్టీఆర్ పర్యటనలకు ఆయనే డిజైన్ చేసేవారు  ఇక 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయను ఎన్టీఆర్ నియమించారు. 1989 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు.1989, 1991 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి అమలాపురం కాకినాడ పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జిగా పని చేశారు. 1994లో మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరికి ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ సమయంలో ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో పార్టీలో సంక్షోభం వస్తే..  ఎన్టీఆర్ పక్షాన పోరాటం చేసి ఆయన మరణం వరకు ఆయనతోనే నడిచారు. 1996లో ఎన్టీఆర్ టిడిపి తరుపున రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలిగా ఉన్న లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో పార్టీ నుంచి వైదొలగి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  అయితే.. 1997లో చంద్రబాబు నాయుడు స్వయంగా బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన మళ్లీ పార్టీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 1999 లో నాలుగోసారి రాజమండ్రి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇంచార్జిగా వ్యవహరించారు. 2004 నుండి 2014 వరకు పార్టీ గడ్డుకాలంలో ఉన్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. చంద్రబాబుకు ప్రతి విషయంలో సహకారిగా ఉంటూ.. ఆయన మన్నలు అందుకున్నారు.       2014లో రాజమండ్రి రూరల్ టికెట్ కూడా ఎన్నో రాజకీయ చర్చలు సాగాయి.  బిజెపిలో పొత్తులో భాగంగా ఈ టికెట్ బిజెపికి ఇవ్వాలని భావించారు. చివరికి ఎన్నికలకు ముందు బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. ఈ ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి ఘనవిజయం సాధించారు. అయినా..  బుచ్చయ్య చౌదరికి మంత్రి వర్గ విస్తరణలో స్థానం కల్పించాలేదు.  దీంతో మనస్థాపన చెందిన రాష్ట్ర జిల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా తన నియోజకవర్గంగానికి పరిమితమయ్యారు.   ఇక 2019 ఎన్నికల్లో మరోసారి పార్టీ ఆయనకు టిక్కెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, టీడీపీ అధికారం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మంది వ్యక్తుల్లో బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. 2021 లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు బుచ్చయ్య చౌదరి. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడటంతో తన రాజీనామా విరమించుకున్నారు బుచ్చయ్య చౌదరి. 1983 టీడీపీలోనే కొనసాగుతున్న బుచ్చయ్య చౌదరి  9 సార్లు పోటీ చేస్తే 6 సార్లు విజయం సాధించారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిటి బ్యూరో సభ్యుడిగా కూడా సేవలందించారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి 2024 అసెంబ్లీ ఫలితాల్లో బోణి కొట్టారు.   

బాబా మజాకా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

నారా చంద్రబాబు నాయుడుకి రాజకీయ చాణక్యుడిగా పేరుంది. సంక్షోభ సమయంలోనే ఆయన మరింత చురుగ్గా పని చేస్తారంటారు. అది రాష్ట్రమైనా, పార్టీ అయినా.. కష్ట కాలంలో ఉంటే.. బాబు తన మాస్టర్ మైండ్ తో గట్టెక్కిస్తారు. ఆ విషయం తెలిసి కూడా కొందరు.. తమ మీద తమకున్న అతి విశ్వాసంతో బాబుని తక్కువ అంచనా వేస్తుంటారు. అలా తక్కువ అంచనా వేసే.. తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం 23 సీట్లకు పరిమితం కావడంతో.. ఇక చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ మనుగడే కష్టమని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావించారు. కానీ బాబు పట్టువదలని విక్రమార్కుడిగా 70 ఏళ్ళ వయసులోనూ.. తాను బలంగా నిలబడటమే కాకుండా, పార్టీని కూడా బలంగా నిలబెట్టారు. అది చాలదు అన్నట్టు.. బాబుని అక్రమ అరెస్ట్ చేసి.. జగన్ సర్కార్ తన గొయ్యి తానే తవ్వుకుంది. బాబు అరెస్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఏకమయ్యారు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారంతా ఏపీకి పయనమయ్యారు. మరోవైపు జనసేన, బీజేపీ కూడా టీడీపీకి మద్దతుగా నిలిచాయి. ఇంకేముంది.. కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఈరోజు వెలువడుతున్న ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో బాబుని తక్కువ అంచనా వేయడమే కాకుండా, ఆయనను అరెస్ట్ చేసి.. జగన్ తన పార్టీ మనుగడని ప్రశ్నార్థం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రభావం గట్టిగా పని చేసింది. బాబు అక్రమ అరెస్ట్ సమయంలో.. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ నిరసనలను అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ చులకన చేసింది. ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బాబు అరెస్ట్ తనకి చాలా ఆనందం కలిగించింది అన్నట్టుగా పరోక్షంగా ట్వీట్ చేశాడు. అది చాలదు అన్నట్టుగా "బాబు అరెస్ట్ తో తెలంగాణకి ఏం సంబంధం.. ఏపీకి వెళ్లి నిరసన చేసుకోండి" అని బీఆర్ఎస్ నేతలు నోరు జారారు. అదే బీఆర్ఎస్ పార్టీ కొంపముంచింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీ చాలాచోట్ల బలంగానే ఉంది. అలాగే, తెలంగాణ వ్యాప్తంగా బాబుకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఆ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. కానీ మళ్ళీ తామే అధికారంలోకి వస్తామన్న అతి విశ్వాసంతో మాటలు తూలారు. ఆ మాటలే వారిని అధికారానికి దూరమయ్యేలా చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ని ఓడించడమే లక్ష్యంగా.. బాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు పనిచేశారు. ఆ దెబ్బకి బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోవడమే కాకుండా.. ఇప్పుడు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అనేలా పరిస్థితి తయారైంది. ఇప్పుడు తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ.. ఖాతా కూడా తెరిచే పరిస్థితి కనిపించడంలేదు.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

లోక్​సభ ఎన్నికల ఫలితాల వేళ దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 124 పాయింట్ల నష్టంతో 75,166 వద్ద ఉంది. నిఫ్టీ.. 404 పాయింట్లు కోల్పోయి 22,859 వద్ద సెషన్​ని కొనసాగిస్తోంది. బ్యాంక్​ నిఫ్టీ.. 737 పాయింట్ల నష్టంతో 50,247 వద్ద ఉంది. మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని స్టాక్​ మార్కెట్​ నిపుణులు సూచించారు. బిగినర్లు.. ట్రేడింగ్​కి దూరంగా ఉండటం శ్రేయస్కరం అని అంటున్నారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ గెలుపు ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ తేల్చడంతో.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 2507 పాయింట్లు పెరిగి 76,469 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 733 పాయింట్లు వృద్ధి చెంది 23,264 వద్ద ముగిసింది. ఇక 1996 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 50,980 వద్దకు చేరింది.