ఇది ఆరంభమే.. తెలుగు యువత హెచ్చరిక!
posted on Jun 5, 2024 @ 6:44PM
ఏపీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఓట్ల రూపంలో.. నువ్వు ప్రతిపక్షం హోదాకు కూడా పనికిరావంటూ పాతాళానికి తొక్కేశారు. ఐదేళ్లు పాలించమని అధికారమిచ్చిన ప్రజలనే చిత్రహింసలకు గురిచేసిన జగన్ మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పారు. ప్రజాగ్రహంతో పార్టీ పరువు, స్వయంగా తన పరువు బజారున పడిన తరువాత మీడియా ముందుకొచ్చిన జగన్ నేనేం పాపం చేశానంటూ కన్నీరు పెట్టుకున్న జగన్ పై సానుభూతి కలగలేదు సరికదా.. ఇంకా శాస్తి జరగాలన్న కసి వ్యక్తం అయ్యింది. ఐదేళ్లు అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఉపాధి లేదు, కనీస సౌకర్యాలు కల్పించలేదు. పైగా ప్రశ్నించిన వారిని జగన్ జైల్లో పెట్టించారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుకే ప్రజా వేదికను కూల్చేసిన జగన్.. అంతటితో ఆగకుండా.. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు చక్కటి భోజనాన్ని అందించిన అన్న క్యాంటీన్ల విధానాన్ని రద్దుచేసి పేదల కడుపు కొట్టారు. జగన్ కుట్రపూరితంగా అన్న క్యాంటీన్లను తొలగించినప్పటికీ.. టీడీపీ వీరాభిమానులు, ముఖ్యంగా కృష్ణా జిల్లా తెలుగుయువత సారథి దండమూడి చౌదరిలాంటి వారు సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లను నడిపిస్తూ వచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో కొనసాగించిన అరాచక పాలనను అంతమొందించేందుకు అనేక మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు ఎదురొడ్డి పోరాటం సాగించారు. వారిలో ఒకరు దండమూడి చౌదరి. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారదర్పంతో హడావుడి చేసి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖంచాటేసే వ్యక్తిత్వం కాదు ఆయనది. పార్టీ అధికారం కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ పెట్టే ఒత్తిళ్లను అధిగమించి, అక్రమ కేసులకు వెరవక పార్టీ కోసం, ప్రజల కోసం, పనిచేసిన నేతల్లో దండమూడి చౌదరి ఒకరు. ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఎదురొడ్డి పోరాటం వారిలో దండమూడి చౌదరి ముందు వరుసలో ఉంటారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ యూరివర్శిటీ పేరును జగన్ మోహన్ రెడ్డి వైఎస్ ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చేశారు. ఆప్పట్లోనే ఈ పేరు మార్పుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అయితే అధికారం చేతిలో ఉండటంతో ఆ ఆగ్రహాన్నీ లెక్క చేయలేదు. యూనివర్సిటీ పేరు మార్పుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలపై ఉక్కుపాదం మోపి జగన్ మొండిగా తన నిర్ణయాన్ని అమలు చేశారు. దీనిపై అప్పట్లోనే చంద్రబాబు తాను సీఎం కాగానే యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకా మారుస్తానని ప్రకటించారు. ఇప్పుడు జగన్ సర్కార్ కుప్పకూలిన రోజే దండమూడి చౌదరి ఆధ్వర్యంలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరును పెట్టేశారు. దండమూడి చౌదరి వైసీపీ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని లెక్కచేయకుండా విద్యార్థి సమస్యలపై, ప్రజా సమస్యలపై పోరాటం సాగించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయనపై 16 కేసులు నమోదయ్యాయి. దండమూరి చౌదరి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనది పెనమలూరు నియోజకవర్గం.
2009 నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. పార్టీలో తన ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి పార్టీ కోసం ప్రాణంపెట్టి పనిచేశారు. పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు విద్యార్థి నేతగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. అంతేకాదు.. పేదవారికి అండగా నిలవడంలోనూ దండమూడి చౌదరి ముందు వరుసలో ఉంటారు. పేద ప్రజలకోసం తనవంతుగా పార్టీ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలనుసైతం నిర్వహిస్తూ వచ్చారు. సీఎం జగన్ తన అరాచక పాలనలో భాగంగా అన్న క్యాంటీన్లు మూసివేసినప్పుడు రాష్ట్రంలోనే తెలుగు యువత ఆధ్వర్యంలో తొలి అన్న క్యాంటిన్‌ను ఉయ్యూరులో ఏర్పాటు చేశారు దండమూడి చౌదరి. కరోనా సమయంలో సతీసమేతంగా పలు గ్రామాల్లో నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు. పేదలకు ట్రై సైకిల్స్, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, పేద విద్యార్థుల కు బస్‌పాస్‌లు స్కాలర్‌షిప్పులు అందించారు.
తన సొంత ఖర్చులతో నిర్వహించిన అన్న క్యాంటీన్ ద్వారా నిత్యం 300 మందికి భోజనాన్ని అందించారు. ఇందుకోసం ప్రతీరోజూ రూ. 15 వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు చేస్తూ వచ్చారు. 2024లో చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ తన సతీమణితో కలిసి మోకాళ్లపై నడుస్తూ దండమూడి చౌదరి తిరుమల కొండ ఎక్కారు. ఆయన కోరుకున్నట్లుగానే కూటమి భారీ మెజార్టీతో అధికారంలోరావడంతో చంద్రబాబు సీఎం కాబోతున్నారు.
సరే అవన్నీ పక్కన పెడితే.. జగన్ అరాచకాలన్నిటినీ సరి చేస్తామని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలనన్నిటినీ మారుస్తామని తెలుగుయువత గట్టిగా చెబుతోంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉదంతం ఆరంభం మాత్రమేననీ, ముందు ముందు ముందు సినిమా ఇంకా గొప్పగా ఉంటుందని తెలుగుయువత చెబుతున్నది. హెల్త్ వర్సిటీ పేరులో వైఎస్ఆర్ అక్షరాలను తొలగించి అప్పటికప్పుడు ఎన్టీఆర్ పేరును అమర్చడంలో దండమూడి సహా తెలుగుయువత ధర్మాగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలాంటి ధర్మాగ్రహాలు చాలా చాలా ఉంటాయని తెలుగుయువత హెచ్చరిస్తోంది.