ఆళ్లగడ్డలో మునిసిపాటిటీ తెలుగుదేశం వశం?

కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఇప్పుడు రాష్ట్రంలో ఉనికి మాత్రంగా కూడా మిగలకుండా పోయే సూచనలు గోచరిస్తున్నాయి. ఐదేళ్ల అరాచక, దుర్మార్గ, దౌర్జన్య పాలనపై కన్నెర్ర చేసిన ఏపీ జనం.. జగన్  ఓటుతో బుద్ధి చెప్పారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప ఆయన కేబినెట్ మంత్రులందరూ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. గత అసెంబ్లీలో 151 మంది సభ్యులన్న వైసీపీకి ఇప్పుడు కేవలం 11 అంటే 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారంటే జగన్ సర్కార్ పట్ల జనం ఏ స్థాయిలో తమ వ్యతిరేకతను తెలిపారో అర్ధం అవుతుంది. సరే ఆ ఓటమి అలా సంపూర్ణం అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ప్రారంభమయ్యాయి.  ఆళ్లగడ్డలో అయితే వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆళ్లగడ్డ మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సినర్లు  ముగ్గురు గురువారం ( జూన్ 20) పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరారు. వారితో పాటు పలువురు స్థానిక వైసీపీ నేతలు సైతం తెలుగుదేశం గూటికి చేరారు. ఇక శుక్రవారం (జూన్ 21) మరో నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. వీరు ఇప్పటికే తెలుగుదేశం నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరిని కూడా కలుపుకుంటే  27 మంది కౌన్సిలర్లు ఉన్న ఆళ్లగడ్డ మునిసిపాలిటీలలో తెలుగుదేశం సభ్యుల సంఖ్య 13 కు చేరుతుంది. అంటే మునిసిపాలిటీని కైవశం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి మరో ముగ్గురు కౌన్సిలర్లు అవసరం ఉంటుంది. కాగా  కౌన్సిల్‌లో ఎమ్మెల్యేకు, ఎంపీకి సభ్యత్వం ఉంటుంది. అంటే మునిసిపల్ చైర్మన్  పదవి దక్కించుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి మరొక్క కౌన్సిలర్ అవసరం.  ఆ కౌన్సిలర్‌ కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  దీంతో ఆళ్లగడ్డ మునిసిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరడానికి ఎంతో సమయం పట్టదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం?.. అసలు వస్తారా?

 అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) ప్రారంభం అయ్యాయి.  ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ సభకు వచ్చే అవకాశాలు లేవని ఆ పార్టీ వర్గాల ద్వారానేసభకు జగన్ వస్తారా? రారా? అనేది వేచి చూడాలి. ఎందుకంటే గత ఐదేళ్లుగా ఫ్రంట్ సీటులో కూర్చున్న జగన్  ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఎక్కడో వెనుక కూర్చోవలసి ఉంటుంది. గతంలోలా తన తరఫున సభలో గోల చేయడానికి, అనుచిత వ్యాఖ్యలతో ప్రత్యర్థులను నొప్పించడానికి మంది కూడా లేరు. దీంతో ఆయన సభకు హాజరయ్యే అవకాశాలు దాదాపు మృగ్యమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా   తెలుగుదేశం సభ్యలువెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు  అందరూ కూడా పసుపు చొక్కాలు ధరించి వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.  కాగా  దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. గత ప్రభుత్వం శాసన సభను కౌరవ సభగా మార్చేసిందని నిండు సభలో విమర్శలు గుప్పించి కన్నీటితో సభ నుంచి నిష్క్రమిస్తూ మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెట్టి గౌరవ సభగా చేస్తానని చంద్రబాబు శపథం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ శపథాన్ని నెరవేర్చుకుని చంద్రబాబు సభలో  ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టారు. అదే విధంగా పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బదులుగా జనసేన అధినేత తమ పార్టీ నుంచి పోటీ చేసిన 21 మందినీ గెలిపించుచని ఘనంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

కూలిన కుతుబ్ షాహీ కాలపు కోస్ మినార్!

కాపాడుకోవాలంటున్న ఈమని శివనాగిరెడ్డి  హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేటలో కుతుబ్ షాహీ కాలం (క్రీ. శా. 17వ శతాబ్ది) నాటి కోస్ మినార్  (అప్పటి మైలురాళ్లు) కూలిపోయి, ఆనవాళ్లు కోల్పోతున్నాయని పురావస్తు పరిశోధకుడు ప్లీజ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. స్థానిక రైతు చక్రం మల్లేష్ తో కలిసి మసీదు పక్కన ఉన్న కూలిన కోస్ మినార్ గుమటాన్ని శుక్రవారం నాడు పరిశీలించారు.  కుతుబ్ షాహీ చక్రవర్తులు గోల్కొండ నుంచి మచిలీపట్నం రహదారిపై ఈ కోస్ మినార్ లను నాటించారని రోడ్డు విస్తీర్ణ, రియల్ ఎస్టేట్ ప్రభావం వల్ల ఈ మినార్లు ఉనికిని కోల్పోయాయని, ఇప్పటికైనా కూలిన రెండు మినార్లను పునర్మించి, వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలని తూప్రాన్ పేట పంచాయితీకి, గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్తపతి భీమిరెడ్డి వెంకటరెడ్డి, బడే సాయి కిరణ్ రెడ్డి, ఈమని రాజ్యలక్ష్మి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.

తండ్రి అడుగుజాడల్లో... తప్పుల బాటలో!

ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు. ఆ కర్మ ఫలం అనుభవించే విషయంలో ఒక్కోసారి ఒకింత ఆలస్యం అవుతుందేమో కానీ అనుభవించడం మాత్రం పక్కా.  అందుకే పెద్ద‌లు  త‌ప్పు చేయొద్దు.. క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌ద్ద‌ని చెబుతుంటారు. అధికార మదంతో, అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి దెబ్బతిన్న ఇద్దరు నేతల గురించి ఇప్పుడు ప్రస్తావించుకుందాం. కాకతాళీయంగా అనాలో లేదో కానీ వారిద్దరూ కూడా తండ్రీ కొడుకులు, ఇద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా పని చేసిన వారే కావడం విశేషం. ఇద్దరూ కూడా తెలుగు వారే. తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదున్నరేళ్లు సీఎంగా పని చేస్తే, కొడుకు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు సీఎంగా వెలగబెట్టారు. ఇరువురూ కూడా తాము ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో రూల్ ఆఫ్ లాను పాటించలేదు. నిబంధనలను ఖాతరు చేయలేదు.  అధికార దర్పం, అహం తలకెక్కి హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు.  వాళ్లిద్దరూ ఎవరన్నది ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది కదా? ఆ తండ్రీ కొడుకుల పేర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మేలు సంగతి పక్కన పెడితే.. వారు   త‌ప్పులుమీద త‌ప్పులు చేశారు. ప్రభుత్వ సొమ్మును అప్పనంగా బొక్కేయాలని చూశారు. బొక్కేశారు.  వైఎస్ ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవించడానికి ముందే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన కుమారుడు జగన్ కు   ప్రజలు గద్దె దింపి చక్కటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ముందుగా తండ్రి ఏ విధంగా తిరుమలేశునికి పంగనామాలు పెట్టడానికి ప్రయత్నించారో చూద్దాం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆరున్నరేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. సీఎం హోదాలోనే ఆయ‌న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆయన  ఏకంగా క‌ళియుగ దైవం శ్రీ వేంకటేశ్వ‌ర‌స్వామికే పంగనామాలు పెట్టేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అదెలా అంటే ఇప్పుడు కొడుకు జగన్ సర్కార్ సొమ్ముతో  రుషికొండపై ప్యాలెస్ క‌ట్టిన‌ట్లుగా.. వైఎస్ అప్పట్లోనే ఇడుపులపాయలో ప్యాలెస్ కట్టాలని భావించారు. అయితే  ఆ ప్రాంతం శేషాచలం అటవీ ప్రాంతం పరిధిలోది కావడంతో చ‌ట్ట  ప్ర‌కారం అక్క‌డ ప్యాలెస్  నిర్మాణం సాధ్యం కాలేదు.  అయినా వైఎస్ శేషాచ‌లం అట‌వీ పరిధి నుండి తాను ప్యాలెస్ నిర్మించాల‌నుకున్న ప్రాంతాన్ని మినహాయించడానికి శతథా ప్రయత్నించారు.  ఇందు కోసం ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును తన వాళ్లతో నింపేశారు. తిరుమలలోనే ఎన్నికలు నిర్వహించేంత వరకూ కూడా వెళ్లారు. అటవీ చట్టానికి తూట్లు పొడవాలని వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్ర‌య‌త్నాల‌ు విఫలమయ్యాయి. అప్పట్లో ఇడుపులపాయ‌లో  ప్యాలస్  కట్టలేకపోయిన  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హరితా రిసార్ట్స్ హోట‌ల్  సాకుతో  టూరిజం  సొమ్ములతో  ఒక ఎత్తైన వాచ్ టవర్ నిర్మించుకున్నారు, అక్కడి నుండి చూస్తే.. తన ఇడుపులపాయ ఎస్టేట్ అంతా కనిపించేలా ఆ టవర్ నిర్మాణం అయ్యింది. ఆ టవర్ ప్రారంభానికి రెండు నెలల ముందే విధి వక్రించి హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. అలా వైఎస్ తన కల నెరవేరకుండానే కాలం చేశారు.   ఇక ఆయన కుమారుడు జగన్ నిర్వాకం చూద్దాం.. 2019లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఏపీ ప్ర‌జ‌లను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిపై, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి త‌నను ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో  అరాచ‌క పాల‌న సాగించారు. వైజాగ్ లోని రుషికొండకు గుండు కొట్టేసి ప్ర‌భుత్వ సొమ్ముతో ఏకంగా కళ్లు జిగేల్ మ‌నే భారీ భవంతులు క‌ట్టించుకున్నారు జ‌గ‌న్‌.. కానీ అందులో అడుగు కూడా పెట్టడానికి అవకాశం లేకుండా జనం ఆయనకు ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు.   జగన్ తన హయాంలో విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పురోగతికి మూలస్తంభాలైన రాజధాని అమ‌రావ‌తి, జీవనాడి  పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను నిలిపివేసి వాటిని నిర్వీర్యం చేయాలని చూశారు.  రుషికొండ‌కు గుండు కొట్టేసి.. ఆ ప్రాంతాన్ని ఎవరూ ప్రవేశించడానికి వీల్లేని నిషిద్ధ ప్రదేశంగా మార్చేసి ప్రభుత్వ ధనంతో  రాజభవనం లాంటి ప్యాలస్ కట్టేసుకున్నారు.  ప్ర‌భుత్వ డ‌బ్బుతో రుషికొండ‌పై పెద్ద‌పెద్ద భ‌వ‌నాలు నిర్మించుకున్న జ‌గ‌న్‌.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే వాటిలోనే  కాపురం పెట్టాల‌ని భావించారు.  సొంత బాబాయ్ హత్య నుంచి ప్రతి విషయం దేవుడికే  తెలుసు అంటూ చేతులు దులిపేసుకునే జగన్ కు ఇప్పుడు  రుషికొండలో  ఎంతో ముచ్చటపడి జనం సొమ్ముతో కట్టుకున్న ప్యాలస్ లో నివసించే యోగం లేకుండా పోవడానికి కారణం కూడా ఆ దేవుడికే తెలుసు అంటున్నారు.  ఆ దేవుడి సంగతి పక్కన పెడితే ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అద్వానంగా మార్చేసిన జగన్ ను జనం ఓటుతో  గద్దెదింపి సాగనంపారు.  అధికార మదంతో ఐదేళ్ల కాలంలో పాల్పడిన అవినీతి అక్ర‌మాలు, గత పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా  నిలిచిపోయిన అక్రమాస్తుల కేసు విచారణ, బాబాయ్ హత్య కేసు దర్యాప్తు అన్నీవేగంగా కదులుతాయి.   ఇప్పటి దాకా సీఎం హోదా సాకుగా చూపి కోర్టు మెట్లు ఎక్కకుండా పొందిన మినహాయింపు ఇకపై ఉండదు. మొత్తంమీద వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, నేడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల తీరును చూస్తే.. అధికారంలో ఉన్న‌ప్పుడు  ప్ర‌జ‌ల‌కు మేలుజ‌రిగేలా పాల‌న‌సాగించాలి. పంతాల‌కు పోయి త‌ప్పులుమీద త‌ప్పులు  తిప్పలు తప్పవనీ ఫలితం అనుభవించక తప్పదనీ స్పష్టమౌతుంది.

 దేశం గూటికి చలమలశెట్టి సునీల్ ? 

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు వరుసగా రాజీనామా చేస్తూ వస్తున్నారు. కొంతమంది టీడీపీ లో చేరుతుండగా..మరికొంతమంది కొద్దీ రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత చలమలశెట్టి సునీల్..త్వరలో టిడిపి లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని ఎదురుదెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవీ రామిరెడ్డి ఆ పార్టీకి నిన్న రాజీనామా చేస్తూ. వెళ్తూవెళ్తూ ఆదాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా, ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆయన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా, ఆయన పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు తెలిసింది. టీడీపీలో తనకున్న పరిచయాల ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు రాయబారం పంపినట్టు సమాచారం. కాగా, సునీల్ ఇప్పటికే పలు పార్టీలు మారినా ఎక్కడా ఆయనకు కలిసిరాలేదు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలు కాగా, తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

పోలవరంపై శ్వేత పత్రం.. మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ అవగాహనా రాహిత్యంతో  అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు పనులు పడకేసేలా చేసిందన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా గురువారం (జూన్ 20) న బాధ్యతలు చేపట్టిన మంత్రి నిమ్మల రామానాయుడు..  జగన్ సర్కార్ మొత్తంగా రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.  2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం రీఇంబర్సు మెంట్ కింద విడుదల చేసిన నిధులను జగన్ సర్కార్ వేరే అవసరాలకు మళ్ళించిందని  అన్నారు.సిఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం,అవినీతిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని హైదరాబాదు ఐఐఐటి నీతి ఆయోగ్ కు నివేదిక ఇచ్చిందని తెలిపారు. మరలా దానికి మరమ్మత్తులు చేయాలన్నా కనీసం 440 కోట్ల రూ.లు అవుతుందని ఒకవేళ కొత్తగా నిర్మించాలన్నా సుమారు 990 కోట్ల రూ.లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.దీనిపై సవివరంగా సమీక్షించి మరమ్మత్తులు చేయాలా లేక కొత్తగా నిర్మించాలా అనేదానిపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం లాకులు,షట్టర్లకు మరమ్మత్తులు చేయలేదని కనీసం వాటికి గ్రీజు కూడా పూయలేదని మంత్రి రామానాయుడు ఆరోపించారు.  రాష్ట్రంలోని రైతాంగానికి తక్షణ ఉప శమనం కలిగించేందుకు వీలుగా వివిధ ఏటిగట్లు పటిష్టీకరణ, షట్టర్లు,గేట్లు వంటివాటి మరమ్మత్తుల నిర్వహణ వాటి పటిష్టీకరణకు అధికారులకు ఆదేశాలిచ్చామని జలవనరుల శాఖమంత్రి రామానాయుడు చెప్పారు.కాలువలు, డ్రైన్లలో గుర్రపు డెక్కు,తూడు తొలగించేందుకు పనులు చేపట్టేందుకు అనుమతిస్తే   తొలి సంతకం చేశామని అన్నారు. 

అమరావతి మట్టికి చంద్రబాబు ప్రణామం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు. మొదట ప్రజావేదికను కూలగొట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ మట్టికి చంద్రబాబు ప్రణామం చేశారు. అనంతరం జగన్ ప్రభుత్వ పాలనలో అమరావతిలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించారు.  అనంతరం సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్యని కలిపితే వౌైసీపీకి వచ్చిన సీట్లతో సరిపోలుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో రైతులు పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఎవరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఉండాలనే ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని చేపట్టాం. పోలవరాన్ని సందర్శించి వచ్చిన తర్వాత చాలా బాధ కలిగింది. ప్రజావేదికను కూల్చి జగన్ పరిపాలనను ప్రారంభించారు. పవిత్ర జలాలు, మట్టి తీసుకొచ్చి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే మనల్ని కాపాడింది. పవిత్ర మట్టిని చూసిన తర్వాత అదే అనిపించింది. కొన్ని అల్లరి మూకలు ఇక్కడ ఏర్పాటు చేసిన నమూనాలను ధ్వంసం చేశాయి. అమరావతి రైతులు వాటిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. ఇక్కడ పైపులు, మట్టిని దొంగతనం చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐకానిక్ కట్టడాలన్నీ నిలిచిపోయాయి. ఇక అమరావతికి మంచిరోజులు వచ్చాయి. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునే రాజధాని నగరం ఇక్కడ రూపొందుతుంది’’ అన్నారు.

 సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ తెలుగు దేశం 

సంక్షేమం అంటే తెలుగు దేశం. తెలుగు దేశం అంటే సంక్షేమం. 1983లో అధికారంలో వచ్చిన తెలుగు దేశం పార్టీ వృద్దుల సంక్షేమం కోసం ఇచ్చిన పించన్లు నవ్యాంధ్ర ప్రదేశ్ లో కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి వృద్దులకు పింఛన్లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది మాత్రం తెలుగుదేశం హాయంలో మాత్రమే. తెలుగు దేశం పార్టీ  స్థాపించిన  తొమ్మిది నెల ల్లో నే  అంటే 1983లో టిడిపి అధికారంలో వచ్చింది. స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 1983 వరకు  కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంది. ఈ సమయంలో వృద్దులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు.  ఎన్టీఆర్ సినీ జీవితాన్ని పక్కన పెట్టి ఎమ్జీఆర్ స్పూర్తితో ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంలో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 80 వ దశకంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పురుడు పోసుకుంది. అప్పటి వరకు ప్రతీ ఇంట్లో వయసు మళ్లిన ముసలివారి ఆలనాపాలనా ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వారిలో ఆత్మాభి మానం , ఆత్మ విశ్వాసం నింపింది మాత్రం తెలుగు దేశం పార్టీ మాత్రమే. ఎన్టీ ఆర్ అధికారంలో రాగానే ప్రతీ నెలా 75  రూపాయలు వృద్దులకు అందే విధంగా జాగ్రత్త పడ్డారు. 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కూడా వయసు పై బడ్డ వారికి ఠంచనుగా  పెన్షన్లు అందేవి. ఆ తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వృద్దులను పట్టించుకోలేదు. వృద్దులను నిర్లక్ష్యం చేయడం వల్లే   కాంగ్రెస్ అధికారంలో లేకుండా పోయిందని  చెప్పవచ్చు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖరెడ్డి వృద్దాప్య పింఛన్లను 200 రూపాయలకు పెంచారు. 2009లో రెండోసారి అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి దురదృష్ట వశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ హాయంలో రెండు వందల రూపాయలు ఉన్న వృద్దాప్య పించన్లు నవ్యాంధ్ర ప్రదేశ్ లో 1000 కి పెరిగింది. నవ్యాంధ్ర ప్రదేశ్ లో రెండోసారి తెలుగు దేశం పార్టీ అధికారంలో వచ్చింది. అప్పటి వరకు ఉన్న పించన్ వెయ్యి అలాగే కొనసాగిందిఉ.  ఆతర్వాత అధికారంలో వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వృద్దాప్య పించన్లు 3000 కి పెంచింది. వృద్దుల పేరు చెప్పి కొన్ని సంఘ విద్రోహశక్తులు పించన్లు అందుకున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువై చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు . బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పించన్లను ఏకంగా నాలుగు వేల రూపాయలకు పెంచారు. ఉమ్మడి రాష్ట్రం మొదలు నవ్యాంధ్ర ప్రదేశ్ వరకు తెలుగు దేశం పార్టీ వృద్దుల సంక్షమమే ధ్యేయంగా పని చేసిందని చెప్పొచ్చు. 

అడ్డెడ్డే... జగన్ అసెంబ్లీకి రాడా.. ఇప్పుడెలా?

నిన్నటి ఎన్నికలలో జగన్‌కి ఏపీ జనం ‘పక్కనుండు’ అని డిసైడ్ చేశారు.. అందుకే ‘పదకొండు’ సీట్లతో సరిపెట్టారు. తొక్కలే.. ఈ సీట్లతో అసెంబ్లీకి వెళ్ళేదేంటి అనుకున్నారో.. అసెంబ్లీకి వెళ్ళడానికి మొహం చెల్లట్లేదోగానీ, మొత్తానికి జగన్ అసెంబ్లీకి వెళ్ళకూడదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.. అడ్డెడ్డే... జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విషయాలు మిస్సవుతారు కదా.. ఆ మిస్సయ్యే విషయాలు ఏంటంటే... 1. తన సీట్లో కూర్చుని వెకిలి నవ్వులు నవ్వడం. 2. అప్పుడప్పుడు గురకపెట్టి నిద్రపోవడం. 3. మంచీ మర్యాద లేకుండా చంద్రబాబు మీద ఎగరడం. ఏకవచనంతో మాట్లాడ్డం. కించపరిచేలా మాట్లాడ్డం. ఆగ్రహంగా ఊగిపోతూ అరవడం. 4. మేం ఇంతమంది వున్నారు.. మీరు అంతమంది వున్నారు. ఒక్కసారి మేం తలుచుకుంటే ఏమవుతుందో చూసుకోండి అనడం. 5. నీ చూపు చూసి భయపడిపోం అని అనడం. 6. సొంత పార్టీ ఎమ్మెల్యేలు పొగుడుతుంటే మురిసిపోవడం. 7. టీడీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అణిచేయడం. 8. పార్టీ ఎమ్మెల్యేలను ఉసిగొల్సడం. మహిళల మీద దారుణమైన వ్యాఖ్యలు చేయించడం.

క్రౌడ్ ఫండింగ్ తో ప్రజా సమస్యల పరిష్కారం!

ఆంధ్రప్రదేశ్ లో అరాచక సర్కార్ కుప్పకూలింది. తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలతో ముందుగు సాగుతున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత వరకూ వాటిని అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.  ఇక ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో నియోజకవర్గంలో తిష్ట వేసి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.  నరసాపురం ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం రఘురామకృష్ణం రాజు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తిన పాపానికి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి సేవలందించే విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.   గతంలో నారాచంద్రబాబునాయుడు ప్రజాభాగస్వామ్యంతో సమస్యలు పరిష్కారం అయ్యేలా జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేశారు. ఆ కార్యక్రమం ద్వారా గ్రామాలలో రోడ్లు, పూడికతీత వంటి ఎన్నో పనులు విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ప్రజలు 30శాతం నిధులు భరిస్తే మిగిలినది ప్రభుత్వం ఇచ్చి పనులను వేగవంతంగా పూర్తి చేయడమే జన్మభూమి కార్యక్రమం. ఇప్పుడు తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి రఘురామకృష్ణం రాజు క్రౌడ్ ఫండింగ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే గ్రామాలలో ప్రజాసమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిధులను క్రౌడ్ ఫండింగ్ ద్వారా అంటే నిధుల సమీకరణ ద్వారా సేకరిస్తారు. అలా వచ్చిన నిధులతో పనులు పూర్తి చేస్తారు. ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారం అవసరంలేని పనులను ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధులతో పూర్తి చేస్తారు. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తన వంతుగా ముందుగా ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.  ఇప్పటి వరకూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం రైజ్ చేసిన ఫండ్ కోటి రూపాయల వరకూ చేరిందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అవలంబిస్తే రాష్ట్రంలో సమస్యలు చాలా వరకూ పరిష్కారం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

చెత్తవాగుడు మొదలెట్టిన కొడాలి నాని!

ఈ కొడాలి నానికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు.. ఎన్నికలలో ఇతను, ఇతని పార్టీ తుక్కుతుక్కుగా ఓడిపోవడంతో కొద్దిరోజులు మూలన కూర్చున్న ఈ గుట్కా ఎడిక్ట్ లారీ క్లీనర్ మళ్ళీ తన చెత్త వాగుడు మొదలుపెట్టాడు. గురువారం నాడు జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన నాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చెత్తవాగుడు వాగాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యం కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారట, ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే ఈ వీరుడు, ఇంట్లోంచి బయటకి కూడా రాని తన పార్టీ అధ్యక్షుడితో కలసి నిలదీస్తాడట. ఇతను మాట్లాడినంతసేపూ ఏకవచనమే తప్ప బహువచనమే లేదు. అదే తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పేరును ప్రస్తావించినప్పుడు మాత్రం ‘గారు’ వచ్చి చేరింది.. రుషికొండ ప్యాలెస్ మీద జగన్ జనం కోసం ప్యాలెస్ కడితే తెలుగుదేశం ఎదవలు అది జగన్ ఇల్లు అని ప్రచారం చేస్తున్నారని నోరు పారేసుకున్నాడు. అధికారం కోల్పోయినా తాను మారనని, తాను ఇలాగే వుంటానని, ఎవరూ ఏమీ పీకలేరు అని కూడా ఈ గుట్కా ఎడిక్ట్ వాగాడు.

భువనమ్మకు బాబు గ్రీటింగ్స్!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు నందమూరి తారక రామారావు కుమార్తె.. మాస్ అంటే ఇదేనంటూ నిర్వచనాన్నిచ్చిన నందమూరి బాలకృష్ణ సోదరి, నాలుగుసార్లు ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఆంధ్రప్రదేశ్ యువతరానికి ప్రతినిధిగా నిలిచిన నారా లోకేష్ మాతృమూర్తి నారా భువనేశ్వరి పుట్టిరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన శుభాకాంక్షల సందేశం ఇచ్చారు. దానిలో ‘‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వందశాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహరిస్తూ... చీకటి రోజుల్లోనూ నా అభిరుచిని అనుసరించారు’’ పేర్కొన్నారు.

వైసీపీ పిల్ల కాలువ!.. గమ్యం కాంగ్రెసేనా?

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఒక పిల్ల కాలువలా మారిపోయింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలూ, జగన్ తో సహా ఎవరూ కూడా తమ పార్టీ ఓటమిపై సమీక్షలు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ మాటే ఎత్తడం లేదు. ఎంత సేపూ పాచిపోయిన ఈవీఎంల టాంపరింగ్, జనం తమ పార్టీకి ఓటు వేయకుండా తప్పు చేశారు. కళ్లు మూసి తెరిచేలోపు ఐదేళ్లూ గడిచిపోతాయి. అంటూ తమను తాము మభ్యపెట్టుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు.  అయితే వారు అంతో ఇంతో  మాత్రంగా మిగిలిన పార్టీ క్యాడర్, నేతలూ జారిపోయే ప్రమాదం కళ్లముందే ఉన్నా గుర్తించడం లేదు. ఔను వైసీపీ ఉనికిమాత్రంగా కూడా మిగలని పరిస్థితి త్వరలోనే ఏర్పడబోతున్నది. వైసీపీ ఉనికిని కబళించేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.  రాష్ట్రంలో కొన్ని నెలల ముందు వరకూ కాంగ్రెస్ గురించి మాట్లాడేవారు లేరు. అసలా పార్టీ ఒకటి రాష్ట్ర రాజకీయాలలో ఉందని గుర్తించిన వారు కూడా లేరు. కానీ ఎప్పుడైతే ఇటీవలి ఎన్నికలకు నెలల ముందు కాంగ్రెస్ ఏపీ బాధ్యతలు షర్మిల చేపట్టారో అప్పటి నుంచీ సీన్ మారిపోయింది. సమయాభావం వల్ల ఆమె ప్రచార శైలి, జగన్ పై దూకుడుగా చేసిన విమర్శల ప్రభావం ఎన్నికలపై పెద్దగా కనబడలేదు కానీ, ఆమె ఇదే దూకుడు ప్రదర్శిస్తే వైసీపీ కనుమరుగు కావడం ఖాయం. ఈ ఎన్నికల ఫలితాలలోనే కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయన్న విషయం లీలా మాత్రంగానైనా కనిపించింది. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీ ఘెర పరాజయం వెనుక ఉన్నది కాంగ్రెస్సేనని వైసీపీ వర్గీయులు కూడా అంగీకరిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ వైసీపీ ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చింది. షర్మిలకు కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు ఇంకా ముందుగానే అప్పగించి ఉన్నట్లైతే.. వైసీపీకి ఆ పదకొండు స్థానాలూ కూడా దక్కి ఉండేవి కాదన్న విశ్లేషణలు వైసీపీనుంచే వస్తున్నాయి.  సరే ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కొన్ని రోజులు మౌనంగా ఉన్న షర్మిల.. మళ్లీ జగన్ పైనా, వైసీపీపైనా విమర్శలతో విరుచుకుపడ్డారు. ఫలితాల అనంతరం ఆమె తొలిసారిగా బుధవారం (జూన్ 19) మీడియా ముందుకు వచ్చారు.  పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే నంటూ వైసీపీని తుడిచిపెట్టేయడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పారు. పరిశీలకులు గత కొన్ని రోజులుగా చేస్తున్న విశ్లేషణలు కూడా ఇలాగే ఉన్నాయి. జగన్ పార్టీ నుంచి వలసలు జోరందుకోవడం ఖాయమని అంటున్నారు. సాదారణంగా ఓడిపోయిన పార్టీ నుంచి జంప్ కొట్టే వారెవరైనా అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఐదేళ్లుగా జగన్ విధ్వంస పాలనకు వంత పాడుతూ, జగన్ భజన చేసి ఊరుకోకుండా విపక్ష నేతలపై ఇష్టారీతిన నోరు పారేసుకోవడంతో అధికార కూటమిలోని పార్టీలలో చేరే అవకాశం లేకుండా పోయిన వైసీపీ నేతలకు తమకు రాజకీయ భవిష్యత్ ఉండాలంటూ జగన్ కు దూరం జరగడమే కాకుండా మరో పార్టీ అండ కూడా కావాలని భావిస్తున్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ పార్టీయే డెస్టినేషన్ గా మారింది. జాతీయ పార్టీ కావడం, తాజా సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి బలంగా పుంజుకోవడంతో వైసీపీ నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ బ్రాండ్ కూడా బలంగా పడింది. రోజుల వ్యవధిలోనే వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యే అవకాశాలున్నయని పరిశీలకులు చెబుతున్నారు.  పిల్లకాలువలన్నీ సముద్రంలోనే కలుస్తాయన్న షర్మిల వ్యాఖ్యలు కూడా దానినే సూచిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీని తుడిచి పెట్టేయడమే లక్ష్యంగా షర్మిల మాటలు, చేతలు అడుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఓటమి షాక్ లో ఉన్న జగన్ దాని నంచి తేరుకునే లోగానే వైసీపీ ఖాళీ అయిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

‘సైబరాబాద్ మొక్క’ హర్టయింది ఇందుకే...

తెలుగుదేశంలో వున్నప్పుడు చంద్రబాబు కీర్తన చేసిన ‘సైబరాబాద్ మొక్క’ విడదల రజిని, ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ భజన చేశారు. ఎమ్మెల్యే పదవితోపాటు మంత్రి పదవి కూడా పొందారు. జగన్ మెప్పు పొందడం కోసం ఏ నోటితో అయితే చంద్రబాబుని కీర్తించారో.. అదే నోటితో చంద్రబాబుని అనరాని మాటలు అన్నారు. రాజకీయ ఊసరవెల్లి తనానికి నిఖార్సయిన నిదర్శనంగా తెలుగు ప్రజల దృష్టిలో నిలిచారు. ఈ సైబరాబాద్ మొక్క విడదల రజిని మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టి, ఈ ఎన్నికలలో గుంటూరు వెస్ట్ స్థానం నుంచి పోటీ చేశారు. గుంటూరు వెస్ట్ ఓటర్లు ఈమె వేస్ట్ అని డిసైడ్ చేసి ఓడించారు. అప్పట్లో జగన్‌కి అంత చెక్క భజన చేసిన రజిని ఇప్పుడు పార్టీ మారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జగన్ పార్టీ ఇక కోలుకునే అవకాశం ఎంతమాత్రం లేదు కాబట్టి, మునిగిపోయే ఈ పడవలో ప్రయాణం చేయడం కంటే, సేఫ్‌గా తప్పించుకునే ప్లాన్‌లో విడదల రజిని వున్నారు. ఈమె పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకోవడానికి ప్రధాన కారణం రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవడం కంటే, జగన్ కాంపౌండ్లో తనకు జరిగిన అవమానమే అని తెలుస్తోంది. జగన్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, ఎన్నికలలో ఓడిపోయిన తన పార్టీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీ ఆఫీసుకి పిలిపించారు. అక్కడకి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతోపాటు విడదల రజిని కూడా వెళ్ళారు. ఇక్కడ ఓడిపోయిన మిగతావారితోపాటు విడదల రజినికి కూడా ఘోర అవమానం జరిగింది. జగన్‌తో భేటీ సమయంలో జగన్ రాజాలాగా కుర్చీలో కూర్చుని వుంటే, ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆయన ముందు కూర్చున్నారు. విడదల రజనితోపాటు చాలామంది జగన్ ముందు చేతులు కట్టుకుని నిల్చున్నారు. అందరితోపాటు చేతులు కట్టుకుని జగన్ ముందు నిల్చున్న విడదల రజిని ఫొటో బయటకి వచ్చింది. అక్కడ తనకు జగన్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఆమెలో ఆవేదన పెంచినట్టు తెలుస్తోంది. జగన్ పిలిచిన వాళ్ళే మీటింగ్‌కి వస్తారు.. పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టడానికి పెద్ద హాల్, బోలెడన్ని కుర్చీలు కూడా వున్నాయి. ఎంతమంది వస్తారో జగన్‌కి తెలుసు కాబట్టి ఈ మీటింగ్ ఏదో వాటిలో పెట్టకుండా, ఒక ఇరుకు గదిలో పెట్టి, అందర్ని నిల్చోబెట్టే జగన్ మాట్లాడి పంపించేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్ళ మీద వున్న గౌరవం ఎలా వుంటుందో.. ఓడిన వాళ్ళ మీద గౌరవం ఎలా వుంటుందో జగన్ ఈ మీటింగ్‌లో చెప్పకనే చెప్పారు. అప్పటి వరకు మంత్రులుగా  బిల్డప్పుగా వున్నవారు... ఒక్కసారిగా చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఎంత అవమానంగా వుంటుందో ఊహించండి.. విడుదల రజిని అలా అవమానంగా ఫీలయ్యారు. ఊసరవెల్లిలాగా మాట మార్చినందుకు జనం విడదల రజినిని ‘సైబరాబాద్ మొక్క’ అని ఎగతాళిగా మాట్లాడతారుగానీ, ఆమె స్థాయి ఆమెకు వుంది. ఆర్థికంగా ఆమె చాలా స్ట్రాంగ్‌గా వుంది.. అలాంటి వ్యక్తి జగన్ ముందు కూర్చునే అవకాశం కూడా లేకుండా, చేతులు కట్టుకుని నిల్చోవాల్సి రావడం ఆమెను చాలా బాధించినట్టు సమావేశం. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా, తాను అలా చేతులు కట్టుకుని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా నిల్చున్న ఫొటోలు బయటకి రావడం కూడా ఆమెను బాగా హర్ట్ చేసినట్టు సమాచారం. వంక లేనమ్మకి డొంక దొరికినట్టు... జగన్ పార్టీ నుంచి తప్పించుకోవడానికి ఇదొక సాకులా దొరికింది. ఆమె కుటుంబం కూడా ఇంత అవమానించిన ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఇప్పుడు విడదల రజిని పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. అంటే, మన ‘సైబరాబాద్ మొక్క’ త్వరలో మరో పార్టీ అధ్యక్షుడికి భజన చేయడం చూసే అవకాశం తెలుగు ప్రజలకు లభించబోతోందన్నమాట!

బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  దాడులు మరోసారి కలకలం రేపాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేసిన ఈడీ.. తాజాగా మరోసారి సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు మరో 8 చోట్ల ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.   ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు.ఇద్దరు సోదరులు మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. సోదాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవ‌ల మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు ఈడీ దాడులు జ‌ర‌గ‌డంతో ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా!?..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్నారా? అందు కోసం ఆయన దారులు వెతుక్కుంటున్నారా? అసెంబ్లీకి ముఖం చాటేసి... తాను ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన తప్పిదాలను ఎత్తి చూసి  సంధించే ప్రశ్నాస్థ్రాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది.   అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి శాసనసభాపక్ష నేతను ఎన్ను కోవలసి ఉంటుంది. కానీ ఫలితాలు వెలువడి ఇన్ని రోజులైనా జగన్ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించలేదు. సభ్యుల చేత లాంఛనంగా తానే శాసనసభాపక్ష నేతను అన్న ఏకగ్రీవ తీర్మాం చేయించలేదు. పైగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటున్నారు. అంటే దీని   ఈ శుక్రవారం (ఈ నెల 21) నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశాలు దాదాపు మృగ్యమే అని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తరువాత జరిగే తొలి అసెంబ్లీ సెషన్ లో కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారం, దాని కంటే ముందు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది.  కనీసం అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా జగన్ సభకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.  ఎవరూ తరువాతెప్పుడో ఎవరూ లేకుండా స్పీకర్ ఛాంబర్ లో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తరువాత  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  సమావేశాలకు ముఖం చాటేసిన విధంగానే జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారని అంటున్నారు.  కాగా అధికారంలో ఉండగా ప్రత్యర్థులకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరించడంలో కేసీఆర్, జగన్ లకు సారూప్యత ఉందనీ, అదే విధంగా ఎన్నికల తరువాత ఓటమిని అంగీకరించకుండా తమకు ఓటు వేయకుండా జనం తప్పు చేశారన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన తీరులో కూడా ఇరువురి వైఖరీ ఒకేలా ఉందనీ పరిశీలకులు పోల్చి చూపుతున్నారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు విషయంలో కూడా జగన్ కేసీఆర్ లాగే ముఖం చాటేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు.  

ముద్రగడ.. ఇక పద్మనాభ రెడ్డి!

ముద్రగడ పద్మనాభం అనే పేరు ఇప్పుడు అధికారికంగా  ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను ఇక నుంచి ఎవరైనా సరే పద్మనాభ రెడ్డి అనే పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిచే ప్రశక్తే లేదనీ, ఒక వేళ ఆయన గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. సరే ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాదు.. ఏపీ ఉపముఖ్యమంత్రి కూడా అయ్యారు.  ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ముద్రగత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో ముద్రగడ పద్మనాభం కాదు ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయారు.  ముద్రగడ ఓ దశలో పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. కాపు ఉద్యమనేతగా, సుదీర్ఘకాలం  ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా  ముద్రగడ ఉన్నారు. ఆయన  క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో కూడా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు.   చివరకు తన పెద్దరికాన్ని తానే దిగజార్చుకుని కువిమర్శలతో కాపు సామాజికవర్గంలో పలుచన అయ్యారు. ఇప్పుడు తన సామాజికవర్గానికి దూరమయ్యారు.