చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను 2007లో వివాదాస్పద రీతిలో ఆర్య సమాజంలో పెళ్ళి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతున్న భరద్వాజ పరిస్థితి విషమించడంతో బుధవారం మరణించినట్టు తెలుస్తోంది.  ఆ సందర్భంలో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్ళి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరికి ఒక కుమార్తె కలిగిన తర్వాత, వీరిద్దరూ విడిపోయారు. శ్రీజ మళ్ళీ మరొకరిని వివాహం చేసుకోగా, శిరీష్ భరద్వాజ్ కూడా మరో పెళ్ళి చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇలా ఆయన మరణించారు.

జగన్ కు రెడ్ల రెడ్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఉనికి మాత్రంగానైనా రాష్ట్రంలో మనగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  2019 ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించి ఘనంగా అధికారం చేపట్టిన వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ నిర్వాకం కారణంగా ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. తాజా ఎన్నికలలో ఆ పార్టీ ఏపీ అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితమైపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ షాక్ నుంచి జగన్ మోహన్ రెడ్డి ఇప్పట్లో తేరుకోవడం కష్టమేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.  అయితే జగన్ మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదనీ, నేర్చుకోవడానికి సిద్ధంగా లేడనీ చెప్పడానికి ఆయన తాజాగా ఈవీఎంల కారణంగానే వైసీపీ పరాజయం పాలైందంటూ చేసిన ట్వీట్ ను తార్కానంగా చూపుతున్నారు.   కాగా ఇంతటి ఘోర పరాజయానికి అసలైన కారణాలు ఏమిటన్నది ఆత్మపరిశీలన చేసుకుని తెలుసుకునే ఉద్దేశమే జగన్ కు లేనట్లు కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఏ వర్గమూ కూడా జగన్ పాలనలో సంతోషంగా లేదు. ఏ వర్గమూ జగన్ కు ఓటేయాలని భావించలేదు. ఐదేళ్లు పంటి బిగవున కప్పి పెట్టిన ఆగ్రహాన్ని ఓటు అనే ఆయుధంగా మార్చి జగన్ ను తిరిగిలేచే అవకాశం లేని దెబ్బ కొట్టారు.  అన్ని సామాజిక వర్గాలూ జగన్ ను తిరస్కరించాయనడానికి ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇట్టే అవగతమౌతుంది.   వైసీపీకి గట్టి దన్నుగా, బలంగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ సారి జగన్ ను  తిరస్కరించారని ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్ధమైపోతుంది. రాష్ట్రంలో  3.5 శాతంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే వైసీపీ అభ్యర్థులలో అత్యధికంగా ఉన్నారు.  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో రెడ్డి సమాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు జగన్ 49 స్థానాలు కేటాయించారు.  అంటే మొత్తం స్థానాలలో జగన్ 28 శాతం తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు.  సరే మొత్తం స్థానాలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన 36 స్థానాలను మినహాయిస్తే జగన్ రెడ్డి తాజా ఎన్నికలలో రెడ్డి సమాజిక వర్గానికి 35శాతానికి పైగా స్థానాలను కేటాయించారు. అదే రాయల సీమ విషయానికి వస్తు ఇది ఇంకా ఎక్కువ. సీమలోని మొత్తం 52 స్థానాలలో వైసీపీ అభ్యర్థులలో  33 స్థానాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే ఉన్నారు.  అంటే సీమలో మొత్తం స్థానాలలో 63.4 శాతం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే జగన్ రెడ్డి వైసీపీ టికెట్లు కేటాయించారు. అదే రాయలసీమ ప్రాంతంలోని 9 ఎస్సీ రిజర్వేషన్ సీట్లను మినహాయిస్తే ఈ శాతం 75కు పెరుగుతుంది. అలాగే జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు స్థానాలలో  సొంత సామాజికవర్గానికి చెందిన వారినే పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టారు.   ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులలో జగన్ రెడ్డితో సహా ఆరుగురు మాత్రమే విజయం సాధించారు.  జగన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గం రాష్ట్రంలోనే రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి జగన్ రెడ్డి విజయం సాధించినా.. గత ఎన్నికల కంటే మెజారిటీ తగ్గింది. ఇక రెడ్డి సామాజికవర్గ జనాభా అధికంగా ఉన్న రెండో నియోజకవర్గం అనపర్తి. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిపై బీజేపీ క్యాండిడేట్ విజయం సాధించారు.  ఈ ఉదాహరణలే చాలు రెడ్డి సామాజిక వర్గం వైసీపీని, జగన్ ను తిరస్కరించిందని చెప్పడానికి.   సరే వైసీపీ నుంచి విజయం సాధించిన రెడ్డి సామాజిక  వర్గ అభ్యర్థులలో జగన్ ను మినహాయించి మిగిలిన వారి విషయాన్ి వస్తే వారిలో ఎవరికీ కూడా  15 వేల ఓట్లకు మించి మెజారిటీ రాలేదు.  పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నేతగా గుర్తింపు పొందిన పుంగనూరు అభ్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం 6 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మరో ఇద్దరు రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులు రెండు వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.   ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ రెడ్డి తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెడ్డి సామాజిక వర్గంలో  ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

తెలంగాణలో తెలుగుదేశం.. పునర్వైభవం దిశగా అడుగులు?

ఆంధ్రప్రదేశ్ లో అమోఘ విజయం సాధించిన తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతం, పూర్వవైభవం సాధించడంపై దృష్టి సారించింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చాలా వరకూ తమ దారి తాము చూసుకున్నారు. పార్టీని వీడారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అందుకే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీలన్నీ తెలుగుదేశం వైపే చూస్తాయి. ఆ పార్టీ క్యాడర్ ఎటుమెగ్గు చూపితే అటే విజయం వరిస్తుందన్న నమ్మకం పార్టీలలో బలంగా ఉంది.  సమయంలోతెలంగాణలో పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టిసారించింది.  ఎవరు ఔనన్నా కాదన్నా  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు.. ఉంటారు. ఇది గత పదేళ్ల కాలంలో పలు సందర్భాలలో సందేహాలకు అతీతంగా రుజువైంది. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం యాక్టివ్ రాజకీయాలకు ఒకింత విరామం అయితే ఇచ్చింది కానీ ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో చెక్కు చెదరలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ తెలంగాణ జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు రాష్ట్రంలో పార్టీపై దృష్టి సారించిన చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నా తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయిస్తానని విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు  తెలంగాణలో స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు. సరే తెలంగాణలో  పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు. మరి అంకిత భావంతో పని చేసే నాయకుల సంగతి ఏమిటి? రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే అధ్యక్షుడు ఎవరు? అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు ముందుగా పార్టీ అధ్యక్షుని ఎంపికపై దృష్టి పెట్టారు. పెద్దగా క్రియాశీలంగా లేని పలువురు తామంటే తామంటూ ముందుకు వస్తున్నారు. కనీసం ఏడాదికోసాని ఎన్టీఆర్ భవన్ లో కాలుపెట్టని నేతలు సైతం తాము తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నామనీ, అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి తమకే దక్కాలంటూ సన్నాయి నొక్కులు మొదదలెట్టేశారు.  ఇలా పార్టీ పదవి కోసం అర్రులు చాస్తున్న వారిలో కార్యకర్తలలో పలుకుబడి ఉన్నవారెవరు అంటే కాగడా పెట్టి వెతకాల్సిన పరిస్థితి.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఈ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఖాళీ అయ్యింది. అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తరువాత నుంచి తెలుగుదేశం తెలంగాణ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది.  తెలంగాణలో ఎన్నికల బరిలో తెలుగుదేశం దిగకపోవడంతో పార్టీ అధ్యక్ష పదవి భర్తీ కోసం తొందరపడాల్సిన అవసరం పార్టీ హైకమాండ్ కు లేకుండా పోయింది. అయితే ఇప్పడు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తుండటంతో   ముందుగాతెలంగాణ అధ్యక్షుడి నియామకాన్ని సత్వరమే పూర్తి చేయాల్సి ఉంది.   అదలా ఉంచితే.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను  అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం గతంలో ఏవేవో కారణాలతో పార్టీ వీడి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కొన్ని అడుగులు కూడా పడినట్లు చెబుతున్నారు.  ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో తెలంగాణ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు.  తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించి, రాష్ట్రంలో తెలుగుదేశంకు పునర్వేభవం తీసుకువస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో  పార్టీ క్యాడర్ లో జోష్ పెరిగింది. అంతే కాదు.. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో ఇమడలేక ఉక్కపోతతో కొనసాగుతున్న నేతల చూపు ఇప్పుడు ఇటువైపు మళ్లింది.  ఇప్పటికే ఇటువంటి పలువురు నేతలు తెలుగుదేశం అధిష్టానంతో టచ్ లోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

రుషికొండ ప్యాలెస్‌లో జగన్‌ని పనోడిగా పెట్టాలి!

రుషికొండ స్వరూపాన్ని దెబ్బతీసి, ఆయిదారు వందల కోట్లు ఖర్చుపెట్టి జగన్ నిర్మించిన ప్యాలెస్, అందులోని సదుపాయాలు, వాటికి అయిన ఖర్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలు నోళ్ళు తెరిచేలా చేశాయి. ఈ ప్యాలెస్ బండారం ఎన్నికల ముందు బయటపడివుంటే, ఇప్పుడున్న 11 సీట్లు కూడా వచ్చేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ గుట్టు ఎప్పుడైతే రట్టయిందో, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా జరగడం లేదు. చాలా ట్రోలింగ్స్ నవ్వు తెప్పించే విధంగా వుంటే, మరికొన్ని ట్రోలింగ్స్ ఆలోచింపజేసేవిగా వున్నాయి.  వాటిలో ఒకటి... దాన్ని ట్రోలింగ్ అనాలో, సజెషన్ అనాలోగానీ.. ఇలా చేస్తే ఒక పనైపోతుంది కదా అనిపించేలా వుంది. అదేంటంటే, ఇంత ప్రజాధనం వృధా చేసినందుకు జగన్‌కి శిక్ష విధించాలి. ఆ శిక్ష ఏంటంటే, జగన్‌ని జీవితాంతం ఆ ప్యాలెస్‌లో పనోడిలా వుంచాలి. గార్డెనింగ్ దగ్గర్నుంచి టాయ్‌లెట్స్ క్లీన్ చేసే వరకూ అన్ని పనులూ జగన్ చేతే చేయించాలి. 16 లక్షల ఖరీదైన టాయ్‌లెట్ కమోడ్స్, 30 లక్షల విలువైన బాత్‌టబ్‌లు క్లీన్ చేసే అవకాశం జగన్‌కే ఇవ్వాలి. తాను ఎంజాయ్ చేయాలనుకుని నిర్మించిన ప్యాలెస్‌లో తానే పనోడిగా పనిచేయడానికి మించిన శిక్ష జగన్‌కి మరొకటి వుండదు అనేది ఆ ట్రోలింగ్ సారాంశం. నిజానికి ఇది సాధ్యమయ్యేది కానప్పటికీ, జగన్‌ జనం దృష్టిలో అంత చులకన అయిపోయాడనేది ఇలాంటి ట్రోలింగ్ వల్ల అర్థమవుతూ వుంటుంది. ఐదేళ్ళ పదవీ కాలంలో జగన్ పోగొట్టుకున్న పరువు ఒక ఎత్తు అయితే, రుషికొండ ప్యాలెస్ ఉదంతం మరొక ఎత్తుగా నిలుస్తోంది. 

మంత్రి లోకేష్ మాట.. 3 రోజుల్లోనే అమలు బాట!

మాట ఇస్తే నెరవేరాల్సిందే... ఇది మంత్రి నారా లోకేష్ ఫాలో అవుతున్న పాలసీ. లోకేష్ ఇంకా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా సచివాలయంలోకి అడుగు పెట్టలేదు. అయినా ఆయన చేపట్టిన విద్యాశాఖలో యాక్షన్ ప్లాన్‌ని శరవేగంగా ప్రారంభించేశారు. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీఓ విడుదల చేశారు. తాను మాట ఇచ్చిన మూడు రోజుల్లోనే అమలు చేశారు. ఈనెల 15వ తేదీన ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని తెలుసుకున్నారు. పుస్తకాలు లేకుండా పిల్లలు ఎలా చదువుకుంటారని లోకేష్ ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు. ఈ విద్యాసంతవ్సరం నుంచి వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. దాంతో అధికారులు మూడురోజుల్లోనే జీవో నంబర్ 28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. గవర్నమెంట్ పనులు అంటేనే నత్త నడక నడుస్తాయన్న అభిప్రాయం అందర్లోనూ నెలకొన్న నేపథ్యంలో లోకేష్ ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అంబటి అతి తెలివి.. పోలవరంపై అవాకులు, చెవాకులు!

సినిమాల్లో క‌మెడియ‌న్లు చేసే కామెడీ సీన్లు చూస్తే క‌డుపుబ్బా న‌వ్వొస్తుంది.  ఇంటిల్లిపాదీ కూర్చొని హాయిగా న‌వ్వుకుంటుంటాం.  అయితే, 2019లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సినిమాల్లో క‌మెడియ‌న్ల‌కు గిరాకీ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే, గ‌త ఐదేళ్లలో జగన్, ఆయన మంత్రులు చేసిన కామెడీని ప్ర‌జ‌లు తెగ ఎంజాయ్ చేశారు. ప్ర‌జ‌లకు మెరుగైన పాల‌న అందించండ‌ని అధికారం అప్ప‌గిస్తే, జగన్ కేబినెట్ లోని  మంత్రులు డ్యాన్సులు చేస్తూ, సామెత‌లు చెబుతూ, పాట‌లు పాడుతూ ప్ర‌జ‌ల‌ను ఎంట‌ర్‌టైన్ చేశారు. సోష‌ల్ మీడియా ఓపెన్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి జ‌గ‌న్ క్యాబినెట్‌లోని మంత్రుల డ్యాన్సులే ద‌ర్శ‌న‌మివ్వ‌డం గ‌త ఐదేళ్ల కాలంలో స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది.  దీంతో 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైసీపీని ఓటు ద్వారా దాదాపు తుడిచి పెట్టేశారు. ప్ర‌జ‌లు గ‌ట్టిగుణ‌పాఠం చెప్పినా వైసీపీ నేత‌ల బుద్ది మార‌డం లేదు. ఇంకా కామెడీలు చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత చుల‌క‌న‌వుతున్నారు. ఒక‌రు ఈవీఎంల వ‌ల్ల‌నే మేం ఓడిపోయామ‌ని చెబుతుంటే.. మ‌రొక‌రు పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబే నాశ‌నం చేశారంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. వీరి అతితెలివిని చూసిన ఏపీ ప్ర‌జ‌లు.. వీళ్ల‌కు 11 సీట్లు ఇచ్చి త‌ప్పుచేశామంటూ తలలు బాదుకునే పరిస్థితికి వచ్చారు.   వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో అంబ‌టి రాంబాబు ఒక‌రు. ఆయన తెలివితేట‌ల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకంగా నీటిపారుద‌ల శాఖనే క‌ట్ట‌బెట్టారు. కోతికి కొబ్బ‌రిచిప్పలా   అంబ‌టికి నీటిపారుదల శాఖ దొరికింది.  జ‌గ‌న్ క్యాబినెట్ లోనే అంత‌కు ముందు ఈ శాఖ‌ను అనిల్ కుమార్‌ యాద‌వ్ చూశారు. పోల‌వ‌రం ప్రాజెక్టును 2021 డిసెంబ‌ర్ నాటిక‌ల్లా పూర్తిచేస్తామ‌ని అసెంబ్లీలో స‌వాల్ చేశారు. సీఎం హోదాలో జ‌గ‌న్  సైతం 2021 చివ‌రి నాటికి పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌న్నారు. ఆ త‌రువాత ఏడాదికేడాది పోల‌వ‌రం పూర్తిచేస్తామ‌న్న తేదీలు మారుతూ వ‌చ్చాయి. ఇక.. అనిల్ కుమార్ యాదవ్ తరువాత నీటిపారుద‌ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబ‌టి రాంబాబు కోత‌లు  కోట‌లు దాటిపోయాయి.. చివ‌రికి పోల‌వ‌రం ప్రాజెక్టులో ఇసుమంతైనా ప‌నులు జ‌ర‌గ‌లేదు సరికదా.. జ‌రిగిన నిర్మాణాలకు సైతం ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక పోయారు. మొత్తంగా చెప్పాలంటే వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల కాలంలో పోల‌వరం ప్రాజెక్టును పూర్తిగా విస్మ‌రించింది. ప్ర‌స్తుతం  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం, సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారం రోజుల్లోనే పోల‌వ‌రం బాట ప‌ట్టారు. గ‌తంలోలా   సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చేశారు. ఇందులో భాగంగా గ‌త సోమ‌వారం పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన చంద్ర‌బాబు.. వైసీపీ హ‌యాంలో ప్రాజెక్టుకు జ‌రిగిన న‌ష్టాన్నిచూసి తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు.  గ‌తంలోతెలుగుదేశం హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు 72శాతం పూర్త‌య్యాయి. వైసీపీ హ‌యాంలో ప‌నులు కొన‌సాగించ‌డం మానేసి.. నిధుల‌ను సైతం ప‌క్క‌దారి ప‌ట్టించారు. సోమ‌వారం పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌కు వెళ్లిన సీఎం చంద్ర‌బాబు నాయుడు.. వైసీపీ ఐదేళ్ల కాలంలో పోల‌వ‌రంలో ఏయే ప‌నులు చేప‌ట్టారంటూ అధికారుల‌ను ప్ర‌శ్నించారు.. వారి నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. అస‌లు ప‌నులు నిర్వ‌హిస్తే క‌దా.. స‌మాధానం రావ‌డానికి. జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం పూర్తిగా ప‌డ‌కేసింద‌నే విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు  ప‌నులు ముందుకు సాగ‌లేద‌ని, తెలుగుదేశం హ‌యాంలో జ‌రిగిన నిర్మాణాల‌కు సైతం ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత రోజు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు.  అధికారం కోల్పోయినా బుద్ధి మార‌లేద‌న్న‌ట్లుగా.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని తాను ఎప్పుడో చెప్పాననీ,  ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్పారంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేశాడు. దాని కోసం పోలవరం పోవాలా అన్నట్లుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు చాలా టఫ్ సబ్జెక్ట్ అని అది ఎవరికీ అర్థం కాదని,  ఎందుకంటే తనకూ అర్థం కాలేదని అంబ‌టి రాంబాబు అస‌లు విష‌యం చెప్పేశాడు.  అంబటి రాంబాబు అంటేనే.. ఓ కామెడీ పీస్ అని ఏపీ ప్ర‌జ‌లు భావిస్తుంటారు. గ‌త ఐదేళ్ల కాలంలో అంబ‌టి ప్ర‌వ‌ర్త‌న చూసి ఏపీలో న‌వ్వుకోని వ్య‌క్తి ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. డాన్సులు,  అడ్డగోలు మాటలతో ఆయన తెగ వైరల్ అయ్యారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు  తనకేమీ అర్ధంకాలేద‌ని చెప్పుకొని మ‌రోసారి ప్ర‌జ‌ల ముందు పెద్ద జోకర్ గా తనను తాను నిలబెట్టుకున్నారు. కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్‌తో ఆడుకున్నారని మాత్రం ఆయన ఇంకా గుర్తించడం లేదు. అంబ‌టి వ్యాఖ్య‌ల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్ధంకాని ప్ర‌శ్నఒక‌టి ఉంది. అదేంటంటే.. దాదాపు రెండేళ్ల‌కుపైగా నీటిపారుద‌ల శాఖ మంత్రిగా అంబ‌టి ప‌ని చేశారు.  అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం గురించి త‌న‌కు అర్థంకాలేద‌ని చెప్ప‌డంతో ఆయన తెలివి ఏపాటిదో.. అత‌నికి నీటిపారుద‌ల శాఖ అప్ప‌గించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలివి ఏపాటిదో ఇప్పుడు అర్ధ‌మ‌వుతుంద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

  కెసీఆర్ కు న్యాయ వ్యవస్థ అంటే లెక్కే లేదు .... అందుకే జస్టిస్ నరసింహారెడ్డిపై ఫైర్ 

రాజులు పోయారు రాచరికాలు పోయాయి. కానీ బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్  ఇంకా రాజరిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాడు.  కెసీఆర్ హాయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తే రాజరిక వాసనలున్న కెసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక్కడితో ఆగలేదు విచారణ కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్. నరసింహారెడ్డికి ఓ లేఖ రాసి తన అక్కసును వెళ్లగక్కారు. జస్టిస్ నర్సింహారెడ్డికి ఏం తెలియదు పొమ్మన్నాడు.  విద్యుత్ కొనుగోళ్లపై  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖపై పవర్ కమిషన్ చీఫ్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. పవర్ కమిషన్‌కు కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపై విచారణ మొదలుపెట్టిన జస్టిస్ నరసింహా రెడ్డి కెసీఆర్ రాసిన  లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించారు  లీగల్ అంశాలను సైతం లీగల్ టీమ్ పరిశీలించాలని పవర్ కమిషన్ చీప్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఇచ్చిన వివరణలో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. జూన్ 15 వ తేదీలోపు కెసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని గడువు విధించారు. అయితే సమయం సరిపోదని కెసీఆర్ కమిషన్ కు మరో లేఖ రాశారు. జూన్ 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలి అని  కెసీఆర్ కోరినప్పటికీ పవర్ కమిషన్ చీఫ్  జస్టిస్ నరసింహారెడ్డి గడువు పొడగించడం లేదు.  కెసీఆర్ జూన్ 15 వ తేదీలోపు కమిషన్ ఎదుట హాజరు అవుతారని తెలుస్తోంది.  ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నాలుగు మూలస్థంభాల్లో జ్యుడిషియరీ ఒక మూల స్థంభం. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కెసీఆర్ కు జ్యుడిషియరీ మీద పెద్దగా గౌరవం లేదు. రెండు దశాబ్దాల నుండి కోర్టు వివాదాల్లో జర్నలిస్టుల భూమి నలుగుతోంది. సుప్రీం తీర్పు తర్వాత ఈ భూముల అప్పగించకుండా  కెసీఆర్ ఒక నియంతలా వ్యవహరించాడు . బిఆర్ఎస్ హాయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి  రమణ  తుది తీర్పును కెసీఆర్ పూర్తిగా తొక్కిపెట్టాడు.  ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హాయంలో మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూమిని జవహార్  హౌజింగ్ సొసైటీ  కోర్టు వివాదాల కారణంగా  జర్నలిస్ట్ లకు అప్పగించలేకపోయింది. కెసీఆర్ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ఎండగట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇస్తూ సుప్రీం తుది తీర్పును అమలు చేస్తామని వాగ్దానం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే  వెనువెంటనే పార్లమెంటు ఎన్నికల  నేపథ్యంలో  కోర్టు తీర్పును అమలు చేయలేకపోయినట్లు రేవంత్ సర్కార్ చెబుతోంది. ఎన్నికల  కోడ్ ముగియడంతో రెండు దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న జర్నలిస్ట్ లకు మంచి రోజులు వచ్చాయని ఇటీవల  సొసైటీ డైరెక్టర్లుగా ఎంపికైన రమణారావ్, అశోక్ రెడ్డిలు తెలిపారు.  జవహార్ హౌజింగ్ సొసైటీకి  పదేళ్లుగా ఎన్నికలు జరగకుండా కెసీఆర్ ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ  సభ్యులైన రమణారావ్, అశో్క్ రెడ్డి టీం జెఎన్ జె తరపున పోరాడి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగడానికి దోహదపడ్డారు. 

రుషికొండని ‘ఖుషికొండ’ చేశారు కదరా!

ఒరేయ్ దరిద్రపు సచ్చినోళ్ళారా..  సముద్రం ఒడ్డున పచ్చగా చెట్లతో కళకళలాడే రుషికొండ గుండు కొట్టి సర్వనాశనం చేశారు. పేరులోనే ‘రుషి’ వున్న ఆ కొండ మీద విలాసవంతమైన భవనాలు నిర్మించి, దానిని ‘ఖుషికొండ’గా మార్చేశారు కదరా.. ఆ కొండ మీద అప్పట్లో ఏ రుషి తపస్సు చేశాడో.. అందుకే ఆ కొండకి ‘రుషికొండ’ అని పేరు వచ్చిందో.. అలాంటి కొండ మీద మసాజులు చేయించుకునే విలాసవంతమైన బిల్డింగ్ కట్టి ఆ కొండ పవిత్రతనే దెబ్బతీసేశారు. ఈ పాపం మీకు ఊరకే పోదురా. ఇప్పటికే మీరు సర్వనాశనం అయిపోయారు. ఇంకా దుంపనాశనం అయిపోతారు. మీ ముఖాల మీద పిచ్చుకలు రెట్టలెయ్య.. మీ ఇళ్ళలో గుడ్లగూబలు దూర.. ఇంత దరిద్రఫు ఫెలోస్ మీరెలా పుట్టిచచ్చార్రా? మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని అనుకుని మీ అయ్యగారి కోసం అంతంత బిల్డింగులు కట్టి ఏడిశారు.. మీ అమ్మగారి కోసం అన్నేసి సదుపాయాలు జనం సొమ్ముతో ఏర్పాటు చేశారు.. ఇప్పుడేమైందిరా?  బంగారం లాంటి కొండని నాశనం చేయొద్దురా మొర్రో అని ఎంతగా మొత్తుకున్నా మీరు విన్నారంట్రా.. పర్యావరణం పాడైపోతుంది దేవుడో అని బతిమాలుకుంటే పట్టించుకున్నారంట్రా.. కాసేపు టూరిజం బిల్డింగ్ అంటారు.. కాసేపు ముఖ్యమంత్రి ఇల్లంటారు.. ఇప్పుడేమో రాష్ట్రపతి, గవర్నర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు రెస్టు తీసుకోవడానికి కట్టించాం అని చెబుతున్నారు. ఈ చెప్పి చచ్చేదేదో మొదట్లోనే చెప్పొచ్చు కదా.. రోజుకోమాట చెప్పి జనాల చెవుల్లో పూలెందుకు పెట్టారు?  మొన్నటి దాకా ముఖ్యమంత్రి ఇల్లు అని చెప్పి, ఇప్పుడు అధికారం కోల్పోగానే రాష్ట్రపతి, గవర్నర్ అంటున్నారు. ఏ రాష్ట్రపతి మిమ్మల్ని అడిగార్రా ఒక్కో బాత్ టబ్ 30 లక్షలు పెట్టి కొనమని? ఏ గవర్నర్ అడిగార్రా ఒక్కో టాయ్‌లెట్ కమోడ్ 16 లక్షలు పెట్టి కొనమని? ఆ బిల్డింగేంటి.. ఆ ఖర్చేంటి.. ఆరొందల కోట్లు అన్యాయంగా రాళ్ళపాలు చేశారు కదరా అరమైండు సన్నాసి మొహాల్లారా...

చంద్రబాబు కేబినెట్ లోకి వంగవీటి రాధా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత తెలియంది కాదు. మరీ ముఖ్యంగా వంగవీటి రంగా హత్యానంతరం ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. 2014 ఎన్నికలలో కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఓటు వేసింది. అప్పట్లో జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి  జనసేన విడిగా పోటీ చేసింది. అలాగే తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు కూడా లేదు. జగన్ రెడ్డి ఒక్క చాన్స్ విజ్ణప్తి కారణంగా కాపు ఓట్లలో భారీగా చీలిక వచ్చింది. దీంతో జనసేన పార్టీ ఆ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.   ఇక 2024 ఎన్నికల సమయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపే కాపు సామాజి వర్గం మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారి పిలుపును కూడా లెక్క చేయలేదు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవడానికి జగన్ పాలనా వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. కాపు సామాజికవర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా  బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు. వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేరడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని కొడాలి నాని, వంశీ లాంటి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.   కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వంగా హత్యకు ముందు నుంచీ ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూటమి పక్షాన నిలిచేలా చేయడంలో వంగవీటి రాథా ఎంతో కృషి చేశారని తెలుగుధేశం అధినేత నారా చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు.  అందుకే తెలుగుదేశం కూటమి సర్కార్ లో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రబాబు తన కేబినెట్ లో 24 మందికి మాత్రమే స్థానం కల్పించి మరో స్థానాన్ని ఖాళీగా ఉంచడం వెనుక కారణం అదేనని అంటున్నారు.  ఆ స్థానాన్ని వంగవీటి రాథాతో భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఏపీలో  ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూలు విడుదల చేసింది. ఆ స్థానాలలో ఒక దాని నుంచి వంగవీటి రాధాను నిలబెట్టి గెలిపించుకుని కేబినెట్ లో స్థానం కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్ లో ఇప్పటికే  కాపుసామాజిక వర్గానికి చెందిన నలుగురికి చంద్రబాబు స్థానం కల్పించారు. అయితే వంగవీటి రాధా విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా, కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్ లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

నారా లోకేష్.. పార్టీలో క్యాడర్.. ప్రజల్లో లీడర్!

నారా లోకేష్. ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్. రాజకీయాలలో అడుగుపెట్టక ముందే.. ఆయనలోని నాయకత్వ లక్షణాలను వైసీపీ పసిగట్టేసింది. అందుకే లోకేష్ రాజకీయాలంటేనే విరక్తి చెందాలన్న ఉద్దేశంతో  ఆయనపై విమర్శల దాడి చేసింది.  బాడీ షేమింగ్ కు పాల్పడింది. లోకేష్ ఆహారపు అలవాట్లను గేలి చేసింది. పప్పు అంటూ అవహేళన చేసింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు లోకేష్ పరిపూర్ణమైన నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ది లీడర్.  ఆయన గురించి స్పష్టంగా చెప్పాలంటే.. తనను తాను నాయకుడిగా మలచుకున్న యవకుడు. విమర్శల ఉలి దెబ్బలకు శిల్పంగా మారిన నేత. రాజకీయ అడుగులు ప్రారంభించిన సమయంలో  లోకేష్ మాట్లాడిన ఒకటీ రెండు అమాయకపు మాటలతో ట్రోల్ చేసే వారికి  తనయువగళం పాదయాత్రలో చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు.   వేలకిలోమీటర్లు నడిచి, ప్రజలతో మమేకమై  వారి కష్టాలను తెలుసుని, సొంత పార్టీలో, కార్యకర్తల్లో అసంతృప్తిని దూరం చేసి భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  ప్రత్యర్ధుల విమర్శల దాడికి సమాధానం చెబుతూనే, లోకేష్ వారికి దిమ్మతిరిగేలా ప్రతి సవాళ్లు విసిరారు. పాదయాత్రలో భాగంగా  కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ , అలాగే టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ సవాళ్లు రాష్ట్ర యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ.. మిస్టర్ జ‌గ‌న్ రెడ్డీ.. నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా? అంటూ నేరుగా అప్పటి సీఎం జగన్ కు విసిరిన సవాల్ వైసీపీ నేతల నోళ్లు మూయించింది.  అంతెందుకు 2014--2019మధ్య కాలంలో ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారు. గణాంకాలతో సహా సోదాహరణంగా అపుడు మండలిలో లోకేష్ అనర్గల ప్రసంగానికి  సీనియర్లు అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు లోకేష్ భారీ విజయం సాధించాక మంగళగిరిలో తన స్థానాన్ని పదిలపరచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఏ ప్రజలు అయితే తనకు భారీ మెజార్టీ ఇచ్చారో వారి కోసం అహరహం శ్రమించి పనిచేయాలని లోకేష్ భావించి కార్యాచరణ మొదలెట్టేశారు.  మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే గాక అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారానికి అధికారుల ద్వారా చర్యలు చేపట్టడం ప్రజల్లో భరోసా కల్పిస్తోంది. అంతే కాదు సమస్యలు విన్న వించేందుకు వచ్చే ప్రజల కోసం ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా లోకేష భావిస్తున్నారు.   టీడీపీ యువ నాయ‌కుడు, విద్యాశాఖ‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌  గ్రాఫ్ ఈ నిర్ణయంతో పెరిగిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ప్రజలతో మమేకం కావడం ఆయ‌న‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చి పెడుతున్నది. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ప్ర‌జాద‌ర్బార్ ప్రారంభించారు. ప్ర‌స్తుతంత‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి  వ‌ర‌కే దీనిని ప‌రిమితం చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా కూడా.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించ‌నున్నారు. ఇప్పటికే అంటే లోకేష్ ప్రజాదర్బార్ ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే మంగ‌ళగిరి ప్రజలలో లోకేష్ కు సమస్య చెప్పుకుంటే అది పరిష్కారమైపోయినట్లునన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. తమ కష్టాలను తీర్చడానికి ఓ నాయకుడున్నాడన్న భరోసా వారిలో కనిపిస్తోంది.  దీంతో నియోజ‌క‌వ‌ర్గం  నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో జనం ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. లోకేష్ అక్కడే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.    

కవితను పరామర్శించిన  సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ 

ఓబులాపురం మైనింగ్ స్కాం నిందితురాలైన  బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి , మరో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇవ్వాళ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను క‌లిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్‌ అయ్యారు. ఆమె యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు తీహార్‌ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ వెళ్లారు. గతంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బాల్క సుమన్‌ కూడా కవితను కలిసిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా క‌విత‌తో ములాఖత్ అయిన విష‌యం తెలిసిందే.ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ క‌లిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్‌ అయ్యారు. ఆమె యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఓబుళాపురం గనుల కేటాయింపులో ప్రతిపాదనల ఫైల్‌ను వైఎస్ కేబినెట్ లో  సబిత మంత్రిగా  ఉన్నప్పుడు ఆమోదించారు. ఈ  కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. అందులోని ఇతర అంశాలతో తనకు సంబంధం లేదని  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఇప్పటికే హైకోర్టుకు నివేదించారు. ఓఎంసీ ఛార్జ్‌షీట్‌లో సబితా ఇంద్రారెడ్డిని మొదట సాక్షిగా చేర్చిన సంగతి తెలిసిందే.

జగన్ చీకటి శాపం.. చంద్రబాబు ఆశాదీపం!

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పాలన ఏపీకి చీకటి శాపంగా మారితే.. జగన్ ప్రభుత్వ పతనం తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఆశాదీపంగా మారారు. సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. పోలవరం, అమరావతి ఇలా రాష్ట్ర ఉజ్వలభవిష్యత్ కు దోహదం చేసే అన్నిటినీ జగన్ నాశనం చేస్తే ఇప్పుడు వాటిని మళ్లీ పట్టాలెక్కించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు చంద్రబాబు నడుంబిగించారు. సోమవారం పోలవరం సందర్శించిన సందర్భంగా చంద్రబాబు జగన్ రాష్ట్రానికి ఎలా శాపంగా మారారో వివరించారు.  సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టును  గత పభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు.  రూ.447 కోట్లతో మరమ్మతులు చేసినా బాగుపడుతుందనే గ్యారెంటీ లేదని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో  గత జగన్ సర్కార్ ఎంత నిష్పూచీగా,  నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చంద్రబాబు కళ్లకు కట్టినట్లు వివరించారు. మళ్లీ కొత్తగా డయాఫ్రేంవాల్ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం అంచనా వ్యయం ఈ ఐదేళ్లలో పెరిగింది. తెలుగుదేశం హయాంలో  72 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టు, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క అడుగు ముందుకు పడలేదు.  వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ ను తప్పించారు.  విభజన చట్టంలో జాతీయ హోదా ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రమే చేపడితో ఏళ్లూ, పూళ్లూ గడిచినా పూర్తయ్యే అవకాశం లేదని భావించిన చంద్రబాబు తాను 2014లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే కేంద్రం నిధులు ఇస్తే ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేస్తుందని గట్టిగా చెప్పి మోడీని ఒప్పించారు.   అయితే  ఆ తరువాత ప్రధాని మోడీ, చంద్రబాబు మధ్య ఏపీకి నిధులు, విభజన హామీల అమలు విషయంలో విభేదాలు తలోత్తడంతో పోలవరం ప్రాజెక్టుకు నిధులు విషయంలో మోడీ దాదాపు మెండి చేయి చూపారు.   దీంతో చంద్రబాబు  అప్పట్లో పోలవరం విషయంలో సాహసోపేత నిర్ణయం తీసుకు న్నారు. పోలవరం నిర్మాణ వ్యయాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే భరించి, ఆ తరువాత కేంద్రం నిధులు విడుదల చేసినప్పుడు తీసుకోవాలని భావించారు.  దీంతో ఆయన హయాంలో పోలవరం నిర్మాణ పనులు పరుగులు పెట్టిన రీతిలో జరిగాయి. అందుకే ప్రాజెక్టు దాదాపు 72శాతం పూర్తయ్యింది. 2019లో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. జగన్ సర్కార్ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రాన్ని నిధులు కోరలేదు. కేంద్రం కూడా ఇవ్వలేదు.  సరే రోగీ వైద్యుడూ కూడా చేతులెత్తేసిన చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని పడకేసేలా చేశారు. పనులు నిలిచిపోయాయి. అసలు జగన్ సర్కార్ అధికారం చేపట్టిన క్షణం నుంచీ  ఏపీలో అభివృద్ధి ఆనవాళ్లు చెరిపివేయడమే లక్ష్యంగా అడుగులు వేసింది.  రూ 2కోట్లతో  చంద్రబాబు నిర్మించిన   ప్రజావేదికను జగన్ అధికారంలోకి  వచ్చీ రావడంతోనే  కూల్చివేసారు. అమరావతిలో నిర్మించిన భవనాలను పట్టించుకోలేదు. వాటిని పాడుపెట్టేశారు.  ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో వాటికి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అలా కాకుండా జగన్ సర్కార్ ఆ భవనాలను అధికారుల నివాసాలకు కేటాయించి ఉంటే.. వారికి ఇచ్చే హెచ్ ఆర్ఎ మిగిలి ఉండేది.  ఇలా జగన్ తన హయాంలో చేసినవన్నీ దండగమారి పనులే.  ఒక ప్రభుత్వం తీసుకున్న  కొన్ని నిర్ణయాలు కొత్తగా  వచ్చిన ప్రభుత్వం గౌరవించడం సంప్రదాయం. జగన్ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కేశారు.  ఇక జగన్ చేసిన మరో నిర్వాకం, సకల నిబంధనలకూ తిలోదకాలిచ్చి, పర్యావరణ నియమాలకు చెల్లు చీటి పాడేసి విశాఖ పట్నం రుషికొండకు బోడి గుండు కొట్టేసి ఆ కొండపై అత్యంత విలాసవంతమైన హంగులతో  భవనాలు నిర్మించడం. ఒక్క మనిషి అదీ సీఎం కోసం ఇంతటి భవనం అవసరమా అంటున్నారు.రూ.500 కోట్లతో పాతిక వేల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించవచ్చని నిపుణులు  చెబుతున్నారు. ఈ భవనం టైల్స్ ఇటలీ నుంచి తెప్పించారని ఆరోపణలు ఉన్నాయి. బాత్ రూం లో టబ్ రూ.23లక్షలట.ఇవన్నీ విఐపీల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ రాజధానిగా చేయాలన్న సంకల్పంతో విఐపీలకోసం ఈ భవనాన్ని నిర్మించామని  చెబుతున్నారు. రాష్ట్రపతి,ప్రధాని,గవర్నర్ వంటి విఐపీల కోసం  నిర్మించామని చెబుతున్నారు. ప్రజాధనంతో ఇంతటి విలాసవంతమైన భవనం నిర్మించాల్సిన అవసరం ఉందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిర్మణాత్మకమైన ఖర్చులు కాకుండా ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టి, సంపద సృష్టి అనే మాటను మరచి జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచులకు చేర్చేశారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వాటి గురించి జగన్ సర్కార్ ఐదేళ్లలో పట్టించుకున్న పానాన పోలేదు. మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను జగన్ సర్కార్ విస్మరించింది.  తాగునీరు అందించడం కంటే మద్యం అమ్మకాలు పెంచుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది.  చెత్త మీద పన్ను వేసింది. కరెంట్  చార్జీలు 9 సార్లు పెంచింది.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం గద్దెదిగింది. జగన్ హయాంలో ఏపీలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదంతా  సరిదిద్ది, రాష్ట్ర ప్రగతి, పురోగతిపై చంద్రబాబు దృష్టి పెట్టారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన అడుగుల వేగం చూసి జనం ఇక రాష్ట్రానికి ఏం భయం లేదు అన్ని రంగాలలో పురోగమిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ హయాంలో జరిగిన విధ్వసానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విషయంలో కూడా చంద్రబాబు కఠినంగానే ఉండాలని, తప్పు చేసిన ఏ ఒక్కరూ శిక్ష పడకుండా తప్పించుకోవడానికి వీల్లేదని అంటున్నారు.   

ఏపీ అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్!

ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ని ప్రభుత్వం నియమించినట్టు తెలుస్తోంది. 2014-2019 మధ్యకాలంలో కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన మీద కక్షగట్టిన జగన్ ఆయన్ని అనేకరకాలుగా వేధించారు. అనేక కేసులు పెట్టారు. రాజధాని భూముల కేసులో దమ్మాలపాటిని జైలుకు పంపే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ దమ్మాలపాటి జగన్‌ని ఎదురొడ్డి నిలిచారు. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు, ఆయన తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.

అభద్రతా భావంలో జగన్ ....30 మంది ప్రయివేటు సెక్యురిటీ సిబ్బంది

అవగాహనా రాహిత్యం వల్ల మనిషి అభద్రతా భావానికి గురవుతుంటాడు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటాడు.  ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సమాజం పట్ల , జీవితం ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత ఆత్మ స్థైర్యం కలుగుతుంది. హేతుబద్దంగా ఆలోచించగలుగుతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎష్ జగన్ గత ఐదేళ్లు చేసిన అధికార దుర్వినియోగం వల్ల పదవీచ్యుతుడయ్యాడు. ఆయనకున్న సెక్యురిటీ తగ్గిపోవడంతో పూర్తి అభధ్రతలో పడ్డారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాల‌యానికి 30 మంది  ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది వచ్చేసింది.  ఏపీ మాజీ సీఎం జగన్‌ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియ‌మించుకున్న సెక్యురిటీ  సిబ్బంది సోమ‌వారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు. అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ పరంగా జగన్‌కు భద్రత కుదించే అవ‌కాశం ఉండ‌డంతో ఆయన ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.  ఇకపై జ‌గ‌న్ మాజీ సీఎంగా, సాధార‌ణ ఎమ్మెల్యేగా మాత్ర‌మే కొన‌సాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయ‌న భ‌ద్ర‌తలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముంద‌స్తుగా జ‌గ‌న్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. గ‌తంలో కూడా జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు, పాద‌యాత్ర స‌మ‌యంలో ప్రైవేటు భ‌ద్ర‌తా సిబ్బందిని భారీ మొత్తంలో నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే. కాగా, జ‌గ‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు, త‌న ఫ్యామిలీకి భ‌ద్ర‌త కోసం స్పెష‌ల్ సెక్యూరిటీ గ్రూపును ఏర్పాటు చేస్తూ ఒక ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. లండన్ లో ఉన్న తన కూతుళ్ల కోసమే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కొడుకుతో తనకు రక్షణ లేదని జగన్ తల్లి విజయమ్మ విదేశాల్లో ఉన్న మనవడు రాజారెడ్డి ఇంట్లో ఉంటోంది.  ఎపికి ఇప్పటివరకు పని చేసిన 17 ముఖ్యమంత్రులు ఒక ఎత్తయితే జగన్ మరో  ఎత్తుగా మారింది. పేదవాడిగా చెప్పుకునే జగన్ తరచూ లండన్ వెళ్లేవారు. ఆ సమయాల్లో జగన్ సెక్యురిటీ కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది.  

ఎంత మంచి కూతురో.. తండ్రినే లేపేసింది!

మదనపల్లిలో హరిత అనే అందమైన, తెలివైన అచ్చ తెలుగు అమ్మాయి వుంది. బీఎస్సీ, బీఈడీ చదివింది. హరితని చూడగానే ముసలోళ్ళకి ‘ఇలాంటి కూతురు నాక్కూడా వుంటే ఎంత బాగుండేదో’ అనిపిస్తుంది. కుర్రోళ్ళకి ‘ఇలాంటి భార్య నాకు వుంటే ఎంత బాగుంటుందో’ అనిపిస్తుంది. అలాంటి ముచ్చటైన హరితని అలా తీర్చిదిద్దింది ఎవరో కాదు.. ఆమె తల్లిదండ్రులు. వాళ్ళకి హరిత ఒక్కటే కూతురు. తల్లి ఈమధ్యే మరణించారు. తండ్రి దొరస్వామి గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీళ్ళకి చక్కటి సొంత ఇల్లు కూడా వుంది. ఈ మేటరంతా చదివినవాళ్ళకి ఏం అనిపిస్తుంది? ఈ బంగారు బొమ్మ హరితకి ఆమె తండ్రి దొరస్వామి మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలని, ఆమె పిల్లాపాపలతో కలకాలం హాయిగా జీవించాలని అనిపిస్తుంది కదూ. ఈ ఆకాంక్షకి అనుగుణంగానే హరితకి మంచి సంబంధం చూడాలని దొరస్వామి ప్రయత్నాలు ప్రారంభించారు. కూతురు పెళ్ళికోసం దాచిన డబ్బుని, ఆమె అకౌంట్లోనే వేశారు. తల్లి బంగారాన్ని కూడా హరితకే అప్పగించారు. హరితకు సరిపోయే సంబంధం కోసం ఆయన ఉద్యోగానికి లీవులు పెట్టుకుని, కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆ తండ్రి సంగతి అలా వుంటే, మన బంగారు తల్లి హరిత వ్యవహారం మరోలా వుంది. పాపం హరిత మనసు చాలా పెద్దది కావడంతో, ఆ మనసులో చాలా చోటు వుండటంతో రమేష్, సాయికృష్ణ, హరీష్‌రెడ్డి అనే ముగ్గురు కుర్రాళ్ళకి తన మనసులో చోటు ఇచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరితో ఆ ముగ్గురు కుర్రాళ్ళతో సన్నిహితంగా వుంటోంది. వాళ్ళకి తన మనసులో చోటు ఇవ్వడంతోపాటు, తన తండ్రి ఇచ్చిన డబ్బులో ఎనిమిది లక్షల రూపాయలని తన ఒక ప్రియుడు సాయికృష్ణకి ఇచ్చింది. తల్లి నగలని రమేష్‌కి ఇచ్చింది. రమేష్ ఆ నగలని ఎంచక్కా తాకట్టు పెట్టుకుని పదకొండున్న లక్షలు అప్పుగా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.  తన ముద్దుల కూతురు హరిత ముసుగులో వ్యవహారాలన్నీ తెలుసుకున్న తండ్రి దొరస్వామి ఆమెకి ఇక పెళ్ళి చేసేస్తే మంచిదని నిర్ణయించుకున్నాడు. దానికి హరిత నో చెప్పింది. ఇప్పటికే తన మనసులో ముగ్గురు వున్నారని, తన మనసులో పెళ్ళి పేరుతో మరొకరికి చోటు ఇవ్వలేనని కరాఖండీగా చెప్పేసింది. ఈ అంశం మీద తండ్రీ కూతుళ్ళ మధ్య నెల రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇక తండ్రితో ఇలా గొడవలు పడుతూ ఆయన్ని బాధపెట్టడం ఇష్టంలేని హరిత ఈనెల 13న ఒక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో తన చేతికి దొరికిన పచ్చడి బండ, చపాతీ కర్ర, తాళం కప్ప... ఇలాంటి హోమ్లీ వస్తువులతో తండ్రి నెత్తిమీద కొట్టి చంపేసింది. తన తండ్రి కాలుజారి పడిపోయి చనిపోయాడని చుట్టుపక్కలవాళ్ళకి చెప్పింది. పోలీసులకూ అదే చెప్పింది. అన్నీ కరెక్టుగా వుంటేనే పోలీసులు అనుమానంగా చూస్తారు. ఇలాంటి తేడా కేసుని అనుమానించరా? పోలీసులు అనుమానంతో చేసిన దర్యాప్తులో అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం అందాల హరిత రిమాండ్ ఖైదీగా జైల్లో వుంది.

విడదల రజినీ... జంప్ జిలానీ!

సైబరాబాద్ మొక్క విడదల రజినీ వైసీపీ నుంచి జంప్ జిలానీ అవబోతున్నారు. త్వరలో పార్టీ మారడానికి విడుదల రజినీ సన్నాహాలు చేసుకుంటున్నారు. అప్పట్లో తాను చంద్రబాబు సైబరాబాద్‌లో నాటిన మొక్కని అని స్టోరీలు చెప్పి, తెలుగుదేశం పార్టీలో అందలం ఎక్కిన విడదల రజినీ, ఆ తర్వాత జంప్ జిలానీ అయ్యి వైసీపీలో చేరారు. అక్కడ కూడా తన మార్కు భజన కార్యక్రమం చేపట్టి జగన్‌ అనుగ్రహాన్ని పొందారు. మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కూడా పొందారు. మొన్నటి ఎన్నికలలో వైసీపీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి ఈమె పోటీ చేస్తే, గుంటూరు వెస్టోళ్ళు నువ్వు మాకు వేస్టు అని ఓడించారు. ఇక వైసీపీలో వుంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని అర్థం చేసుకున్న ఈ సైబరాబాద్ మొక్క పార్టీ మారడానికి సిద్ధమైనట్టు సమాచారం. వైసీపీలో కీలక నాయకుల మాటలు నమ్మి తానెంతో మోసపోయానని ఆమె తన సహచరుల దగ్గర కన్నీరుమున్నీరు అయినట్టు తెలుస్తోంది. ఇదిగో సైబరాబాద్ మొక్కమ్మా.. నువ్వు పార్టీ మారితే మారుగానీ, ఈ ఏడుపు డ్రామాలు చేయకు.. నీ డ్రామాలు ఎవరూ నమ్మరు.