వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. దైవ భక్తి మెండుగా ఉన్న పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికలలో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాలలో  విజయం సాధించింది.  తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో 2 లోక్ సభ స్ధానాలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల నుంచీ విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలక శాఖల బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.   కాగా ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటించనున్నారు.  ఈ దీక్షలో పవన్ కల్యాణ్ కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. బుధవారం జూన్ 26 నుంచి పవన్ ఈ దీక్ష పాటించనున్నారు. గత ఏడాది జూన్ లో కూడా పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించిన సంగతి తెలిసిందే.  

సీబీఎన్ గుడ్ విల్ ఎఫెక్ట్..అమరావతికి తరలివస్తున్న సంస్థలు

రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే జనం  చంద్రబాబునే తలుచుకుంటారన్న దుగ్ధతో జగన్  తన ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్  కు సైతం గండి కొట్టి తన ఇష్టారాజ్యంగా ముందుకు సాగుదామని ప్రయత్నించారు.  మూడు రాజధానులంటూ పిల్లిమొగ్గలేశారు. అధికారులను గుప్పిట పెట్టుకుని రైతులకు అన్యాయం చేయాలని చూశారు. కానీ ఒక విజనరీ  మొదలు పెట్టిన పనిని ఆపేయడమంటే అంత తేలిక కాదనీ, అధికారం కోల్పోయిన తరువాత కానీ తెలుసుకో లేకపోయారు.  అసలు తన ఐదేళ్ల పాలనా కాలంలో జగన్ రాజధాని నిర్మాణం  జరిగితే.. తద్వారా రాష్ట్రప్రగతి, ఆదాయం ఏ స్థాయిలో ఉంటాయో కనీసం ఊహించను కూడా ఊహించలేకపోయారు.  ఇప్పుడు ఐదేళ్లు జగన్ సర్వవిధాలా భ్రష్టుపట్టించిన లేదు లేదు భ్రష్టుపట్టించానని భ్రమపడిన అమరావతి ఇప్పుడు అభివృద్ధికి ఆలంబనగా నిలుస్తోంది. జగన్ రాక్షస పాలనలో ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేయడానికి వెనకడుగు వేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, జాతీయ బ్యాంకులు, సేవాట్రస్తులు, స్టార్ హోటళ్లు, ప్రైవేటు సంస్థలు ఇప్పుడు అమరావతి కేంద్రంగా పని చేస్తామంటూ ముందుకు వస్తున్నాయి.  చంద్రబాబు తన హయాంలోనే  అంటే 2014-19 మధ్య కాలంలో పలు సంస్థలకు అంటే దాదాపు 60కి పైగా సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు చేశారు.  ఇప్పుడు నాడు భూమి కేటాయించిన సంస్థలతో చంద్రబాబు ఆదేశాల మేరకు సీఆర్డీయే అధికారులు సంప్రదింపులు మొదలెట్టారు.  ఆయా సంస్థల అధికారులను రాష్ట్రానికి రావలసిందిగా ఆహ్వానిస్తూనే, ఆయా సంస్థల కార్యకలాపాలు నిర్విఘ్నంగా ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు, అవాంతరాలు లేకుండా సాగించుకునే వాతావరణాన్ని  కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.   అభివృద్ధి దార్శనికుడిగా చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరు, గుడ్ విల్ కారణంగా నాడు భూ కేటాయింపులు పొందిన సంస్థలన్నీ అమరావతిలో తమ సంస్థల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తమకు కేటాయించిన భూములను చూసి ప్రతిపాదనలు తెలియజేస్తామని సానుకూలంగా స్పందిస్తున్నాయని అధికారవర్గగాల ద్వారా తెలిస్తోంది.   

భద్రత పేరిట ఇంత బరితెగింపా జగన్?

జగన్ ఒక ఉన్మాది. జగన్ ఒక విపరీత మనస్కుడు. ఆయనది ప్రత్యర్థులను శత్రువులుగా భావిస్తారు. అహంభావి అని ఇంత కాలం ప్రత్యర్థులు విమర్శలు చేస్తే జనం ఏమిటో అనుకున్నారు.  జగన్ అధికారం కోల్పోయిన తరువాత వెలుగులోకి వస్తున్న అంశాలను చూసి జగన్ పై ఇంత కాలం వచ్చిన విమర్శలు అసలు విమర్శలే కావనీ ఆయన విపరీత మనస్తత్వాన్నీ, వైపరీత్యం అన్నదగ్గ తీరును చెప్పడానికి నిఘంటువులో పదాలు చాలవు, కొత్త పదాలను వెతుక్కోవలసిందేనని అంటున్నారు. జ‌గ‌న్‌.. ప్రపంచంలో అందరికంటే తానే గొప్ప అని ఫీల్ అవుతున్నారా? ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి కంటే తనకే ఎక్కువ భద్రత అవసరమని భావిస్తున్నారా? తన గొప్పతనాన్ని చాటుకునేందుకు  క‌ళ్లు చెదిరే ప్యాలెస్‌లు నిర్మించుకున్నారా? తన గోప్పతనాన్ని, ఎదుగుదలను ఓర్వలేక తనను అంతమెందించడమే లక్ష్యంగా ప్రత్యర్థులు, శత్రువులు పొంచి ఉన్నారని అనుకుంటున్నారా? అంటే ఆయన తన కోసం తాను నియమించుకున్న ప్రైవేట్ సెక్యూరిటీని చూస్తే ఔననే అనాల్సి వస్తోంది.  రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానమంత్రికి మించిన భ‌ద్ర‌త‌.. దేశంలో ఎవ‌రికీలేని స్థాయిలో సెక్యూరిటీని జగన్ త‌న ప్యాలెస్‌ల వ‌ద్ద నియ‌మించుకున్న జగన్ తీరును బరితెగింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఉగ్ర‌వాదుల నుంచి ఎప్పుడు ఎలా ఎటు నుంచి ముప్పుఉంటుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో జీవ‌నం సాగించే పెద్ద‌పెద్ద దేశాధినేత‌ల‌కు సైతం లేనంత‌గా జ‌గ‌న్ త‌న ప్యాలెస్‌ల వ‌ద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.   జ‌గ‌న్ ప్యాలెస్‌ల వ‌ద్ద భ‌ద్ర‌తా సిబ్బంది లెక్క‌లు చూస్తుంటే జనం నోరెళ్ల‌బెడుతున్నారు. జ‌గ‌న్ మితిమీరిన భ‌ద్ర‌త‌పై ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు అందాయి. సీఎంగా ఉన్న‌ప్పుడు ఎక్క‌డాలేని విధంగా భారీ భ‌ద్ర‌త క‌ల్పించుకున్నార‌ని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకున్న జ‌గ‌న్‌  సెక్యూరిటీ మాన్యువ‌ల్ ఉల్లంఘించి త‌న ఇంటి ప‌రిస‌రాల్లోకి ఎవ‌రూ రాకుండా భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. దీనికి తోడు ప్యాలెస్‌ల వ‌ద్ద డ్రోన్లు ద్వారా భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించేలా ఏర్పాట్లు సైతం చేసుకున్నాడు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ఫ‌లాలు అందిస్తూ, వారి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తూ, వారి మెరుగైన జీవ‌నంకోసం పాల‌న సాగించాల్సిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ప్ర‌జా పాల‌న‌ను మ‌రిచి ఐదేళ్ల కాలంలో త‌న భ‌ద్ర‌త‌కే ప్రాధాన్య‌త‌నిచ్చారని తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైయస్ జగన్‌కు కళ్లు చెదిరే ప్యాలెస్‌లున్నాయి. వాటి వద్ద వందలాది మందితో భద్రతా వలయం  ఏర్పాటు చేసుకున్నారు. అలాగే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో దేశంలో మారే ఇతర ముఖ్యమంత్రికి లేని స్థాయిలో వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సైతం ఆయన నియమించుకున్నారు. దేశం, రాష్ట్రంలో ఉన్నప్పుడే కాదు.. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు సైతం తనకు భద్రత కల్పించేలా సీఎం జగన్ అసాధారణ రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో త‌న‌కున్న ప్యాలెస్‌ల వ‌ద్ద 986 మందితో నిరంత‌ర భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసుకున్నారు. తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ద్ద స్పెష‌ల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి 379 మంది, ఇత‌ర విభాగాల నుంచి 439 మంది, అలైడ్ విధుల‌కోసం 116 మంది క‌లిపి 934మందితో భ‌ద్ర‌త ఏర్పాటు చేసుకోగా.. హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ ప్యాలెస్ వ‌ద్ద తొమ్మిది మంది, ఇడుపుల‌పాయం ప్యాలెస్ వ‌ద్ద 33 మంది, పులివెందుల నివాసం వ‌ద్ద 10మందితో పోలీసుల భ‌ద్ర‌త‌ను జ‌గ‌న్ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు.. క‌నీవినీ ఎర‌గ‌ని స్థాయిలో తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టుప‌క్క‌ల 48చోట్ల చెక్‌పోస్టులు, ఔట్ పోస్టులు, పోలీస్ పికెట్లు, బారికేడ్లతోపాటు 439 మందితో భ‌ద్ర‌త ఏర్పాటు చేసుకోవ‌డం అంటే.. జ‌గ‌న్ త‌న‌ను తాను ఏ స్థాయిలో ఊహించుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఏకంగా 15 కంపెనీల‌కు, రెండు బెటాలియ‌న్ల‌కు స‌రితూగే సిబ్బందితో  జ‌గ‌న్ భ‌ద్ర‌త ఏర్పాటు చేసుకోవ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నది.  తాడేప‌ల్లిలోని ప్యాలెస్ వ‌ద్ద జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియ‌మించుకున్న భ‌ద్ర‌త‌ను చూసి ఏపీ ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉగ్ర‌వాదుల నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న‌వారికి కూడా ఈ స్థాయిలో భ‌ద్ర‌త ఉండ‌ద‌ని.. జ‌గ‌న్‌కు ఏమైనా మాఫియా డాన్ ల‌తో విబేధాలున్నాయా అనే అనుమానాల‌ను కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. తాడేప‌ల్లి ప్యాలెస్ భ‌వ‌నానికి జ‌గ‌న్ ఏర్పాటు చేసుకున్న ర‌క్ష‌ణ వ‌లయం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్యాలెస్ లో 30 అడుగుల ఐర‌న్ వాల్ ను జ‌గ‌న్ ఏర్పాటు చేసుకున్నారు. ప్యాలస్‌కు ఇద్దరు డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ నిర్వ‌హించేలా జ‌గ‌న్ చర్యలు తీసుకున్నారు. అయితే, జ‌గ‌న్ భ‌ద్ర‌త అంశంపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఆరా తీస్తోంది. ఇదిలాఉంటే.. జ‌గ‌న్‌కు ఇంత భ‌ద్ర‌త ఎందుకు అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ర‌క్ష‌ణ క‌వ‌చంలోనే ఉంటూ వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి సుదీర్ఘ‌కాలం తిరిగారు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తాడేప‌ల్లి ప్యాలెస్ కే జ‌గ‌న్ ప‌రిమిత‌మ‌య్యాడు.  గ‌త ఐదేళ్లూ అధికారంలోఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏదైనా ప్రైవేట్‌, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు అధికారులు ఆయ‌న ప‌ర్య‌టించే ర‌హ‌దారులకు ఇరువైపులా ప‌ర‌దాలు క‌ట్టేవారు. అధికారంలో ఉండికూడా ప్ర‌జ‌ల్లోకి జ‌గ‌న్ ఎందుకు ధైర్యంగా రాలేక‌పోతున్నారన్న విమ‌ర్శ‌లు  గ‌తంలో వెల్లువెత్తాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎవ‌రి నుంచి ప్ర‌మాదం ఉంది.. రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రికి సైతం లేని స్థాయిలో జ‌గ‌న్ భ‌ద్ర‌త‌ను ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింది?  అసలు ప్ర‌జ‌ల్లోకి రావాలంటే జ‌గ‌న్ కు ఎందుకంత భ‌యం.. ఏ నిబంధ‌న‌లతో జ‌గ‌న్ ఆ స్థాయిలో భ‌ద్ర‌తా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు అనే అంశాల‌పై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవెక్కడి మెంటల్ కేసులురా నాయనా!

వైసీపీ నాయకుడు జగన్‌కి అసలే ఏదో తెలియని తిక్కలాంటిదేదో వుంది. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్టు ఈసారి ఎలక్షన్లలో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయి, అధికారం పోగొట్టుకోవడంతో ఆయన ఇంకా మెంటలెక్కిపోయి వున్నారు. అసలేం జరిగిందో.. ఏం జరగబోతోందో... తాను ఏం చేయాలో అర్థంగాక ఆయన బ్రెయిన్లో చిప్ కొట్టేసి తంటాలు పడుతున్నారు. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనకుండా, తాడేపల్లి ప్యాలెస్‌లో రెస్టు తీసుకోకుండా పులివెందుల పారిపోయారు. పులివెందులలో ఉండటానికి కూడా మనస్కరించలేదేమో.. తన పర్మినెంట్ అడ్రస్ అయిన బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం రెస్టు తీసుకుని, బుర్ర మామూలుగా అయ్యాక మళ్ళీ ఏపీలోకి ఎంటరై ఇరగదీయాలన్నది ఆయన ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో ఆయన బుర్ర వేడెక్కి వుంటే, దీన్ని అర్థం చేసుకోకుండా, ఆయన అభిమానులని చెప్పుకునేవారు బెంగళూరు ప్యాలెస్ దగ్గర రచ్చచేశారు.  జగన్ బెంగళూరు ప్యాలెస్‌కి వచ్చారని తెలుసుకున్న చాలామంది కుర్రకారు ప్యాలెస్ దగ్గరకి జగనన్న జిందాబాద్ అని నినాదాలు చేస్తూ వెళ్ళారు. ప్యాలెస్‌ లోపలకి వెళ్ళి జగనన్నని ఓదార్చాలని అనుకున్నారు. కానీ, ప్యాలెస్ సెక్యూరిటీ వాళ్ళు మాత్రం, గేటు లోపలకి ఎవర్నీ రానివ్వం.. పక్కకెళ్ళి ఆడుకోండి అనేశారు. మొన్నటి వరకూ జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకే ప్యాలెస్ లోపలకి వెళ్ళే సీన్ లేదు.. వీళ్ళెవరో పనీపాటా లేని ఫ్యాన్స్ వచ్చి ప్యాలెస్ లోపలకి వెళ్తామంటే ఎలా? అయినా ప్రపంచం మొత్తాన్ని ఓదార్చే పెద్దమనిషిని వీళ్ళు ఓదార్చాలని అనుకోవడం ఏమిటి మెంటల్ కాకపోతే? తమని ప్యాలెస్ లోపలకి వెళ్ళనివ్వకపోవడంతో సదరు మెంటల్ ఫ్యాన్స్.కి మెంటల్ మరికాస్త ముదిరింది. మమ్మల్ని లోపలకి వెళ్ళనివ్వాల్సిందే అని గేటు దగ్గర చేరి గోలగోల చేశారు. మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్తారా... పోలీసులని పిలిచి, తన్ని తరిమించాలా అని సెక్యూరిటీ వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో వాళ్ళకి కోపం పెరిగిపోయింది.. అప్పటి వరకు ‘జగన్ జిందాబాద్’ అని అరిచినవాళ్ళు ‘సైకో జగన్’, ‘జగన్ డౌన్ డౌన్’ అని అరవడం మొదలుపెట్టారు. అలా కాసేపు అరిచీ అరిచీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 

‘రాజకీయ అనాథ’ శివాజీ!

అదేంటోగానీ, నటుడు శివాజీ రాజకీయంగా అలుపెరుగని పోరాటం చేస్తూ వుంటారు... ఏ విషయం మీద అయినా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతూ వుంటారు... మనకెందుకొచ్చిన గొడవ అని తప్పుకుని పోకుండా ఎదిరించి నిలబడతారు... చాలామంది రాజకీయ నాయకులకంటే చాలా తెగింపు వున్న నాయకుడిగా కనిపిస్తారు... కానీ, ఆయన ‘రాజకీయ అనాథ’గానే మిగిలిపోయారు. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న శివాజీ, తాను నటుడిగా బిజీగా వున్న సమయంలో కూడా రాజకీయంగా తనకున్న అవగాహనని పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో చాలామంది నటీనటులు ‘సినిమా వాళ్ళకి రాజకీయాలకి సంబంధం లేదు’ అని లౌక్యంగాతప్పించుకున్నప్పటికీ, శివాజీ మాత్రం రాష్ట్ర విభజన జరగడానికి విల్లేదంటూ నినదించారు. తన గళాన్ని బలంగా వినిపించారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. అప్పటి టీఆర్ఎస్‌కి చెందిన కొందరు అతివాదులు శివాజీని వ్యక్తిగతంగా కూడా దూషించారు. అయినప్పటికీ శివాజీ వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత శివాజీ నవ్యాంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకుడిగా కొంత కాలం చురుకుగా పనిచేశారు. అయితే, అప్పటికే బీజేపీలో ముదిరిపోయి వున్న సోము వీర్రాజుకి, శివాజీకి ఎక్కడో చెడింది. శివాజీ తనను దాటుకుని వెళ్ళే అవకాశం వుందని సోము వీర్రాజు భావించారో ఏమోగానీ, ఆయన శివాజీని పార్టీలో ఎంతమాత్రం ఎదగనివ్వలేదు. ఒక సందర్భంలో అయితే ‘శివాజీ మా పార్టీలోనే లేడు’ అని చెప్పారు. అప్పటి వరకు రాజకీయంగా కనీసం ‘బీజేపీ’ ముద్ర అయినా వున్న శివాజీ ఒక్కసారిగా ఒంటరి అయిపోయారు. శివాజీ ఆలోచనా విధానాలు తెలుగుదేశం పార్టీ తరహాలోనే వుంటాయి. అయినా సరే ఆయన తెలుగుదేశం పార్టీకి చేరువ కాలేదు. అడపాదడపా తెలుగుదేశం పార్టీ మీద కూడా విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని విమర్శించారు కాబట్టి, వైసీపీకి చేరువ అయ్యారా అంటే, అదీ లేదు. వైసీపీ అంటే తనకు పడనట్టే వున్నారు. రాజకీయంగా అవగాహన, వాయిస్ వున్నప్పటికీ ఆయన ఏ పార్టీకి చేరువ కాకుండా ‘రాజకీయ అనాథ’గా మిగిలారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి, జగన్ అధికారంలోకి వచ్చి, మూడు రాజధానుల ముష్టి సిద్ధాంతం బయటకి వచ్చిన తర్వాత శివాజీ ఆ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ విధానాల మీద తన వ్యతిరేకతను వ్యక్తం చేయడం వల్ల అప్పటి వరకూ తటస్తంగా కనిపించిన శివాజీ ఒక్కసారిగా వైసీపీ వర్గాలకు టార్గెట్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా పిశాచాలు శివాజీ మీద విరుచుకుపడ్డాయి. సరే, వైసీపీకి వ్యతిరేకంగా వున్నారు కదా, టీడీపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా అని ఆయన టీడీపీకి చేరువ కాలేదు. చాలా సందర్భాల్లో టీడీపీకి బాహాటంగా తనమద్దతు ప్రకటించారు. అయినప్పటికీ ఆయన టీడీపీకి బయటి వ్యక్తిలాగానే వున్నారు. ఎన్నికలు జరిగే సమయంలోనూ, ఎన్నికలకు, ఫలితాలకు మధ్యకాలంలోనూ ఆయన టీడీపీయే గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనూ ఆయన ఆనందోత్సాహాలతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ఏపీలోని ఒక పౌరుడి హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారే తప్ప.. తెలుగుదేశం నాయకుడి హోదాలో కాదు. శివాజీ ఏ రాజకీయ పార్టీకి  కావాలనే చేరువ కావడం లేదా.. లేదా ఆయనని ఏ పార్టీ చేరువ కానివ్వడం లేదా? ఇది విత్తుముందా.. చెట్టుముందా లాంటి సంక్లిష్టమైన ప్రశ్న. తెలుగుదేశం పార్టీలో నిరంతరం ఎవరో ఒకరు చేరుతూనే వుంటారు. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వుండే శివాజీని తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆహ్వానించలేదు? తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల నమ్మకం వున్న శివాజీ ‘రాజకీయ అనాథ’లా మిగలకుండా, ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? తెలుగుదేశం పార్టీలో చేరి, ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకుని, విజయం సాధించే అవకాశం వున్నప్పటికీ ఆయన ఆ దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? ఒకవేళ చేసినా వర్కవుట్ కాలేదా? తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థల మీద విరుచుకుపడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కూడా అమరావతి మీద తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేశారు.  అయితే ఇది కూడా ఒంటరి శివాజీగానే.. మరి రాబోయే కాలంలో కూడా శివాజీ ఇలా ‘రాజకీయ అనాథ’గానే వుంటారో, ఏదైనా పార్టీ చేతిని, అండని అంది పుచ్చుకుంటారో!?

ఇక జగన్ బస బెంగళూరు ప్యాలెస్‌లోనేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సొంత రాష్ట్రంలో ముఖం చెల్లని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆయనకు తాను ముచ్చట పడి నిర్మించుకున్న కోటల్లో అదే ప్యాలెస్ లలో నివాసం ఉండే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. అంతెందుకు ఆయనకు తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభలో క్షణం సేపు కూడా కూర్చోవడానికి సాహసించని జగన్ ఆ మరుసటి రోజు సభకు డుమ్మా కొట్టి పులివెందుల పర్యటనకు చెక్కేశారు. రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించిన ఆయన అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు కాకుండా బెంగళూరులో ఉన్న తన ఎలహంక ప్యాలెస్ కు వెళ్లారు. పరిశీలకులు, రాజకీయవర్గాలూ కూడా ఇక వచ్చే ఐదేళ్లూ ఆయన బస అక్కడే అంటూ విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ రెడ్డికి ఉన్న ప్యాలెస్ ల పిచ్చితో ఆయన ఎప్పుడో అంటే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బెంగళూరులో ఓ ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్నారు. దానిని ఎలా ఏర్పాటు చేసుకున్నారు? అన్నది పక్కన పెడితే గత పదేళ్ల కాలంలో ఆయన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిన దాఖలాలే లేవు. ఇక ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లలో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారు. చివరాఖరికి ఎన్నడూ సెక్రటేరియెట్ కు కూడా వెళ్లకుండా తన ప్యాలెస్ నుంచే పాలన సాగించారు. ఈ విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దె దిగిన తరువాతే బాహ్య ప్రపంచానికి తెలిసింది. అది పక్కన పెడితే... ఎంత సీఎం అయితే మాత్రం ఓ ఇల్లు.. ఓ రెండు కార్లూ సరిపోవా... సరే అదీ కాదనుకుంటే ఓ ప్యాలెస్, ఇంట్లో ఉన్న వారందరికీ ఒక్కో కారు.. అయితే జగన్ మోహన్ రెడ్డి తీరే వేరు. ఆయనకు నగరానికి వీలైతే ఊరికో ప్యాలెస్.. కట్టేసుకోవాలన్న కోరిక బలంగా ఉంది.  అందుకే ఆయన ఎక్కడికెడితే అక్కడ ఓ ప్యాలెస్ కట్టేసుకుంటున్నారు.   అది కూడా తన సొంత సొమ్ముతో సొంత జాగాలో కాదు. ప్రభుత్వ జాగాలో, ప్రజల సొమ్ముతో . ఆ బాగోతాలన్నీ ఆయన పదవీ చ్యుతుడైనత తరువాత వెలుగులోకి వస్తున్నాయి.  అయితే పాపం ఆయన రాత ఏమిటో కానీ ముచ్చటపడి కట్టుకున్న ప్యాలెస్ లలో ఆయన స్థిమితంగా గడిపింది లేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటంటే 500 కోట్లకు పైగా ప్రజా ధనంతో నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్  కనీసం అడుగుకూడా పెట్టలేని పరిస్థితి. పోనీ గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ లో ఉందామంటే.. పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లుగా ముఖ్యమంత్రిగా దర్పం, దర్జా వెలగబెట్టి, నిబంధనలనేవి ముఖ్యమంత్రికి ఉండవన్నట్లుగా ప్రహారీగోడకు 30 అడుగుల ఫెన్సింగ్ నిర్మించుకుని, ప్రధాన రహదారిని మూసేసి మరీ చెలాయించిన పెత్తనం ఇక సాగదు. అధికారం పోగానే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ రహదారిని వినియోగంలోనికి తీసుకువచ్చేసింది. సో తాడేపల్లి ప్యాలెస్ లో  స్థిమితంగా కూర్చోలేని పరిస్థితి. ఇక పోనీ సొంత ఇలాకా పులివెందులలో గడిపేద్దామా అంటే అక్కడ సొంత పార్టీ కార్యకర్తలే ఛీ కొడుతున్నారు. ఇక హైదరాబాద్ లోటస్ పాండ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సో నిరసనలకు దూరంగా ఆయన బెంగళూరు ప్యాలెస్ కు మకాం మార్చేయడానికే ఎక్కువ అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వైసీపీని రాష్ట్రంలో బలోపేతం చేయడం రాజకీయంగా నిలదొక్కుకోవడం సంగతి అంటారా? చెప్పేశారు. కళ్లుమూసి తెరిచేలోగా మన అధికారం పోయింది. అంటే ఐదేళ్లూ గడిచిపోయాయి. మరొక్కసారి కళ్లు మూసుకుంటే ఇట్టే మరో ఐదేళ్లు గడిచిపోతాయి. అప్పుడు ఎన్నికల ముందు జనంలోకి వచ్చి తిరిగితే చాలు మనకు అధికారం వచ్చేస్తుంది అంటూ జగన్ తన పార్టీ నేతలు, శ్రేణులకు ఇప్పటికే వివరించేశారు. అంటే ఐదేళ్ల పాటు జగన్ రాష్ట్రంలో చేసే రాజకీయ కార్యకలాపాలేమీ ఉండవనే అర్ధం. ఆ తరువాత వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ ఓ నాలుగు రోజులు జనంలో తిరిగితే చాలన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. సో ఇక ఇప్పుడు జగన్ ఓ ఐదేళ్ల పాటు బెంగళూరులోని తన ఎలహంక ప్యాలెస్‌లోనే గడిపేయడానికే ఎక్కువ  అవకాశాలున్నాయంటున్నారు.  

కేసీఆర్? హూ ఈజ్ కేసీఆర్?

ఒక టీవీ డాన్స్ ప్రోగ్రామ్‌లో ఓ డాన్సర్... ‘‘దుర్గారావ్? హు ఈజ్ దుర్గారావ్?’’ అన్నట్టుగా.. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ‘‘కేసీఆర్? హు ఈజ్ కేసీఆర్?’’ అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారణం యువతరం ఆత్మహత్యలు చేసుకోవడం అయినప్పటికీ, కేసీఆర్ ఆ ఘనతను తన అకౌంట్లో వేసుకోవడానికి ప్రతిసారీ ప్రయత్నిస్తూ వుంటారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని ఆయన చెప్పుకుంటూ వుంటారు. అయితే ఆయన చేసింది నిరాహారదీక్షే కాదని, ఫ్లూయిడ్స్ దీక్ష అని అందరికీ తెలిసిన విషయమే.. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని తెలంగాణ బిడ్డలే చెబుతూ వుంటారు. మరి అబద్ధాలు చెప్పారో, మభ్యపెట్టారో.. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. పది సంవత్సరాలపాటు తెలంగాణని కేసీఆర్ మహారాజులాగా ఏలారు. తెలంగాణకు ఏం చేశారో ఏమోగానీ, ఆయన కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ నాయకులు మాత్రం బాగా అభివృద్ధి  చెందారు.  పది సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారు. ఈసారి ఆయన పార్టీని దారుణంగా ఓడించారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన కేసీఆర్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇప్పటి వరకూ అనుసరించిన మహారాజుల ధోరణినే అనుసరిస్తున్నారు. ప్రస్తుతం వున్న వాతావరణాన్ని గమనిస్తే, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గానీ, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం గానీ కనిపించడం లేదు. ఎందుకంటే, బీజేపీ రాష్ట్రంలో రెండో స్థానంలోకి వచ్చేసింది. నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ తెచ్చింది మేమే అని డబ్బా కొట్టుకునే బీఆర్ఎస్ మాత్రం సున్నా ఫలితాలు సాధించింది.  కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ గానీ తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతని కోల్పోయారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు మానసికంగా దూరం అయిపోయింది. ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్ జారిపడి తుంటి విరగ్గొట్టుకున్నారు. ఆ ఘటనని తెలంగాణ ప్రజలు లైట్‌గా తీసుకున్నారు. కేసీఆర్ తుంటి నిజంగానే విరిగిందో లేదోగానీ, ఇదంతా ఒక డ్రామా అని తెలంగాణ ప్రజలు భావించారు. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు కేసీఆర్‌కి జలుబు చేస్తే, తెలంగాణలో ఒక వర్గం ప్రజలకి తుమ్ములు వచ్చేవి. అధికారం పోయిన తర్వాత ఆ వర్గం ప్రజలు కూడా కేసీఆర్‌ని పట్టించుకోలేదు. ఇక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మూడు నెలలకు పైగా తీహార్ జైల్లో వుంటే, పాపం అన్న ప్రజలే లేరు. అడపాదడపా కేటీఆరో, హరీష్ రావో తప్ప స్పందించినవారే లేరు. ప్రజా సంఘాల వారుగానీ, గతంలో కవితతో కలసి బతుకమ్మ ఆడిన మహిళా సంఘాలవారుగానీ పాపం అన్న పాపాన పోలేదు. పార్లమెంట్ ఎన్నికలలో అయినా బీఆర్ఎస్ కోలుకుని వుంటే పరిస్థితి వేరుగా వుండేది. కానీ బీఆర్ఎన్‌ని ప్రజలు మరచిపోయారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బస్సు యాత్ర చేసి హడావిడి చేసినా, రైతుల కోసం పోరాటం అంటూ సందడి చేసినా జనం పట్టించుకోలేదు. ఇదంతా కేసీఆర్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న హడావిడే అని గ్రహించినట్టున్నారు. అందుకే  సున్నా సీట్లతో సత్కారం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ గానీ, ఆయన కుటుంబం గానీ ప్రజా సమస్యల గురించి స్పందించిన దాఖలాలే లేవు. కేసీఆర్ అయితే ఎప్పటిలాగానే తన ఫామ్ హౌస్‌లో రెస్టు తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి పార్టీని గానీ, ఇలాంటి నాయకులను గానీ, తెలంగాణ ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? కేసీఆర్ గానీ, కేసీఆర్ కుటుంబ నాయకులు గానీ ఇదే ధోరణిలో కొనసాగితే కేసీఆర్‌ని కూడా జనం మరచిపోతారు అనడం ఎలాంటి సందేహం అవసరం లేదు. 

జులై 8 కోసం జగన్ ఎదురుచూపులు!

2029లో మళ్ళీ అధికారం వస్తుందని జగన్ నిరీక్షణ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే ప్రారంభమైంది. ఈ ఐదేళ్ళు నిద్రపోయాం... ఇంకో ఐదేళ్ళు నిద్రపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అని జగన్ తన పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పారు. ఈ ఐదేళ్ళూ ఆయన తనకు జీవితంలో దక్కని అధికారం కోసం ఎదురుచూస్తూనే వుంటారు... అది వేరే విషయం! దీనితోపాటు జగన్ ఎదురు చూస్తున్న అంశం మరొకటి వుంది.. అది... జులై 8వ తేదీ ఎప్పుడు వస్తుందా... అని! జులై 8.. ఏమిటీ తేదీకి వున్న ప్రత్యేకత? ఆ రోజున జగన్‌ కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం వుందా? లేదా ఆ రోజున జగన్‌ని అరెస్టు చేసే అవకాశం ఏమైనా వుందా? ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటనే ఆలోచన అందరిలో కలగటం సహజం.. ఆ రో్జుకు వున్న ప్రత్యేకత ఏమిటంటే... అది జగన్ తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఆ రోజున వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మొత్తం ఇడుపులపాయలో వున్న ఆయన సమాధి దగ్గరకి వెళ్తారు. ఆయనకు నివాళులు అర్పిస్తారు. జగన్ ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నది తన తండ్రికి నివాళులు అర్పించడానికి అనుకోవద్దని మనవి.. జగన్ ఎదురు చూస్తున్నది ఆ రోజన తన చెల్లెలు షర్మిలతో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆకాంక్షతో. ఈసారి ఎన్నికలలో జగన్ ఓడిపోవడంలో షర్మిల కూడా తనవంతు పాత్రని పోషించారు. ‘హు కిల్డ్ బాబాయ్’ అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. కడప స్థానం నుంచి తాను గెలవలేకపోయిన్పటికీ, జగన్‌ ఓటమిలో ఆమె తన విజయాన్ని చూసుకున్నారు. ఆ రోజుల్లో జగన్ కోసం ఎంతో శ్రమించిన షర్మిలకి, జగన్‌కి మధ్య విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణాలు ఒకటి ఆస్తి.. రెండు భారతి అనే విషయం బహిరంగ రహస్యమే. షర్మిలతో విభేదాలను పెంచి పెద్ద చేసుకోవడం వల్ల జగనే ఎక్కువ నష్టపోయారు. సొంత తల్లి, చెల్లి జగన్‌ని వ్యతిరేకిస్తున్నారన్న పాయింట్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఇది కూడా జగన్ అధికారాన్ని కోల్పోవడానికి తనవంతు సహకారాన్ని అందించింది. అంతే కాకుండా, కుటుంబంలో పూల్చలేనంతగా అగాథం పెరిగిపోయింది. దాంతో ఇంట ఓడి, రచ్చ ఓడిన పరిస్థితిలో జగన్ పడిపోయారు.  షర్మిలతో విభేదాలు పెంచుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని అధికారం కోల్పోయిన తర్వాత గానీ జగన్ అర్థం చేసుకోలేకపోయారు. జగన్ వదిలిన బాణం పేరుతో జనంలోకి వెళ్ళి పార్టీకి ఉపయోగపడిన షర్మిల ఇప్పుడు జగన్‌కే బాణంలా గుచ్చుకుంది. దాంతో తన చెల్లెలి పవరేంటో తెలుసుకున్న జగన్ ఇప్పుడు ఆమెతో శత్రుత్వం లేకుండా చూసుకోవాలని భావించారు. తామిద్దరి మధ్య సఖ్యత నెలకొల్పే బాధ్యతను తమ తల్లి విజయమ్మకి అప్పగించారు. అయితే జగన్‌తో సఖ్యంగా వుండటానికి షర్మిల నో చెప్పారు. నేను వైసీపీలోకి రావడం కాదు.. జగనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసుకొమ్మను అని నిర్మొహమాటంగా చెప్పేశారు. దాంతో విజయమ్మ రాయబారం అసంపూర్ణంగా మిగిలింది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వున్నారు. జులై 8వ తేదీన తాను అనుకున్నది సాధించగలనన్న నమ్మకంతో ఆయన వున్నారు. జులై 8వ తేదీన వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి దగ్గర కుటుంబం అంతా కలిసే సందర్భం కుదురుతుంది. ఈ సందర్భాన్ని షర్మిలకు, తనకు మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించుకోవడానికి మలచుకువడానికి జగన్ ఆలోచిస్తున్నారు. ఆ సందర్భంలో షర్మిలకు, తనకు మధ్య వున్న ఆస్తి వివాదాలు, షర్మిలకు - భారతికి మధ్య వున్న వదిన -  ఆడబిడ్డల గొడవలను పరిష్కరించడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా తన తల్లి విజయమ్మను మోటివేట్ చేస్తున్నట్టు సమాచారం. ఆరోజు జరిగే సమావేశం తర్వాత ఈ అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ‘‘ఒక కొమ్మకు పూచిన పువ్వులం.. అనురాగం మనదేలే.. ఒక గూటికి చెందిన గువ్వలం.. మమకారం మనదేలే’’ అని పాటలు పాడుకుంటారో లేదో వేచి చూడాలి.

అమరావతికి కేంద్ర ప్రభుత్వ సంస్థల క్యూ!

గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పెట్టబడిదారులు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేవారు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. ఉన్న పరిశ్రమలే తట్టాబుట్టా సద్దుకుని ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్ధితి. ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు ఒక పీడకలలా కనిపించేది. ఇదంతా గతం. గత ఐదేళ్లుగా జగన్ రాక్షస పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా తరలివచ్చే పరిస్థితి నెలకొంది.  అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఏపీలో కానీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనై ప్రొగ్రెస్ అనేది కనిపించింది అనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్ గా రూపుదాల్చిందంటే అందుకు కారణం నారా చంద్రబాబునాయుడు. విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 వరకూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ప్రపంచం దృష్టిని ఆకర్షించిందంటే అందుకూ చంద్రబాబే కారణం. చంద్రబాబు తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు వేసిన అభివృద్ధి పునాదులపై రాష్ట్ర ప్రగతిని పరుగెలెత్తించాల్సింది పోయి, అహంభావంతో, చంద్రబాబుకు పేరొస్తుందన్న దుగ్ధతో ఆ పునాదులను కూల్చివేయడానికి ప్రయత్నించారు. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అడుగంటిపోయింది. పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడే పరిస్థితి నెలకొంది. ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనలకు అవకాశమే లేని పరిస్థితి నెలకొంది.  గత ఐదేళ్ల చీకటి రాజ్యానికి తెరపడగానే తూర్పున సూర్యుడు ఉదయించినంత సహజంగా  సన్ రైజ్ స్టేట్ అయిన ఏపీకి పెట్టుబడులు తరలి వచ్చే సరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు వారాలయ్యిందో లేదో రాష్ట్రంలో ప్రొగ్రస్ పరుగులెత్తుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ చీకటిలో మగ్గిపోయిన అమరావతి వెలుగులీనుతోంది. పోలవరం పనులు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. ఇక ఐదేళ్ల కిందట అంటే జగన్ సర్కార్ కొలువుదీరడానికి ముందు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ తరువాత జగన్ నిర్వాకంతో ఏపీ వైపు చూడడమే మానేశాయి. ఆ సంస్థలన్నీ ఇప్పుడు ఏపీకి క్యూ కడుతున్నాయి. అలా క్యూకడుతున్న వాటిలో  కాగ్, ఆర్బీఐ, ఎస్ బీఐ, ఎఫ్ సీఐ,  సీపీడబ్ల్యుడి, ఇండియన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్, నిఫ్ట్, నిడ్ వంటివి ఉన్నాయి. ఈ సంస్థలన్నిటికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఆ కేటాయింపుల ఊసెత్తలేదు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామంటూ ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కనీసం సంప్రదింపులు కూడా చేయలేదు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కొలువుదీరగానే  వాటితో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే సీఆర్డీయే అధికారులు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతికి తరలిరావడానికి ఉత్సాహం చూపుతున్నాయి.  నాబార్డ్, యూనియన్ బ్యాంక్, కెనరాబ్యాండ్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, ఎస్ బీఐ, హెచ్ పీసీఎల్ వంటి సంస్థలు అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.  

అదిరిందమ్మా అమ్రపాలీ...!

ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి ఆరేళ్ల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్.గా వున్నప్పుడు అప్పుడు అధికారం చెలాయిస్తున్న కేటీఆర్ ఆమె మీద అధికారం చెలాయించారు. అమ్రపాలి సమర్థురాలైన అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కేటీఆర్ తన అధికారం చూపించడం కోసం ఆమె మీద ఫైర్ అయ్యారు. పైగా అమ్రపాలి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కూడా ఆమె అభద్రతాభావంలో పడిపోయారు. తన మీద ఫైర్ అవుతున్న కేటీఆర్‌కి నమస్కారం పెట్టి బతిమాలుకున్న ధోరణిలో మాట్లాడారు. అప్పటికీ ఇగో చల్లారని కేటీఆర్ ఆమెతో చాలా బిల్డప్పుగా మాట్లాడారు. పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని హెచ్చరించారు. ఆ తర్వాత అమ్రపాలి ఈ దరిద్రులతో తనకెందుకని కేంద్ర సర్వీసుకి వెళ్ళిపోయారు. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే పోస్టింగ్ పొందారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవడంతో ఆమె మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు అమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అమ్రపాలి శకం ప్రారంభం కానుంది. ఆరోజు ఆమెను అవమానించిన కేటీఆర్ అధికారం కోల్పోయి, తన పార్టీనే కాపాడుకోలేని పరిస్థితిలో పడిపోయారు. ఏదైనా అవసరం వుంటే, అమ్రపాలి దగ్గరకే వెళ్ళి గౌరవంగా మాట్లాడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. కర్మ ఎవరినీ ఊరికే వదిలిపెట్టదు అంటే ఇదే!

పార్టీని చంపేసింది జగనే.. వైసీపీలో మొదలైన పోస్టుమార్టం!

ప్రత్యర్థి పార్టీలు సైతం పార్టీలు సైతం జాలిపడేంత ఘోర ఓటమి పాలైన వైసీపీ.. ఇప్పుడు తమ ఓటమికి కారణాలపై పోస్టు మార్టం మొదలు పెట్టింది. అయితే ఈ పని చేస్తున్నది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ కాదు. ఇంత కాలం అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం జగన్ మాటే శిలాశాసనం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలు, మాజీ మంత్రులు. అది కూడా జగన్ మీద ఈగ వాలకుండా పార్టీలోని కొందరిని టార్గెట్ చేసి చేస్తున్న ఈ పోస్టు మార్టం వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖలో  అక్రమంగా నిర్మితమైన వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించడంపై స్పందించారు. అయితే ఆయన స్పందన పార్టీ కార్యాలయ నిర్మాణం అక్రమమని అంగీకరిస్తూనే.. కూల్చివేతకు పాల్పడి మేం చేసిన తప్పు మీరు చేయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి.  ప్రజావేదిక నుంచి తమ పార్టీ చేసిన విధ్వంసం కారణంగానే ఘోరంగా ఓటమి పాలయ్యామని అంగీకరించేసినట్లుగా  వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయి.  ఇక అదే పార్టీకి చెందిన మరో నేత కాసు మహేష్ రెడ్డి అయితే.. ప్రత్యర్థి నేతలపై అనుచిత భాషా ప్రయోగం వల్లే వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుందని మీడియా ముందు అంగీకరించేశారు. అలాగే నారా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం కూడా పార్టీ పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటని ఒప్పేసుకున్నారు.  చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు కారణంగా జనాగ్రహం జగన్ సర్కార్ పతనాన్ని శాశించిందని కాసు మహేష్ రెడ్డి సోదాహరణంగా  వివరణ ఇచ్చారు. బేంగళూరులో ఐటీ ప్రొఫెషనల్ ఒకరు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ ఒంటి పూట భోజనమే చేస్తానని శపథం చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే వరకూ నల్ల చొక్కాలే ధరించిన సంగతి చెప్పారు.  అంతే కాదు రాజకీయాలతో సంబంధం లేని  కుటుంబాలు కూడా వైసీపీ ఓటమి కోరుకుంటూ మొక్కుకున్న సంగతిని చెబుతూ.. జగన్ ప్రభుత్వం గద్దెదిగిన తరువాత తిరుమలకు వెళ్లి   తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్న కుటుంబాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ వైసీపీ నాయకుడు కాసు మహేష్ రెడ్డి మీడియా ముందు చెప్పిన సత్యాలు. అనుచిత వ్యాఖ్యలు అంటూ  కొడాలి నాని వంటి ఒకరిద్దరి పేర్లతో ఆయన విమర్శలు చేశారు కానీ.. వాస్తవంగా ఆయన ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలన్నీ జగన్ కు ఎక్కుపెట్టినవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనుచిత భాష వాడుతున్న నేతలను కంట్రోల్ చేయడమటుంచి.. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన విమర్శలూ కూడా నాని తదితరుల భాషా పాండిత్యానికి ఏమీ తక్కువకాదని వివరిస్తున్నారు.  

వైసీపీ అక్రమ ప్యాలెస్‌లలో ప్రభుత్వ ఆస్పత్రులు?

ఒక్క ప్రకాశం జిల్లాలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో వైసీపీ నిర్మించిన, నిర్మాణంలో వున్న పార్టీ ఆఫీసులన్నీ అక్రమ నిర్మాణాలేనని తేలిపోయింది. ప్రకాశం జిల్లాలో పార్టీ ఆఫీసుకు నిర్మాణ పరమైన అనుమతులు అయితే వున్నాయిగానీ, ప్రభుత్వ భూమిని అక్రమ పద్ధతులలో పొందారన్న విమర్శలు వున్నాయి. మహారాజా ప్యాలెస్‌ల తరహాలో వున్న వైసీపీ ఆఫీసులను చూసి జనం నోళ్ళు తెరుస్తున్నారు. ఇంతకాలం వైసీపీ అధికారంలో వుంది కాబట్టి, ఇలా ఆఫీసుల నిర్మాణం ఈ స్థాయిలో జరుగుతున్న విషయం బయటకి పొక్కలేదు. ఇప్పుడు తాడేపల్లిలో నిర్మిస్తున్న కేంద్ర కార్యాలయాన్ని కూల్చేయడం, మొత్తం జిల్లాల్లో నిర్మించిన, నిర్మిస్తున్న  ఆయా కార్యాలయాల వివరాలు ఫొటోలతో సహా గుట్టు మొత్తం రట్టు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేగింది.  వైసీపీ నిర్మించిన ఈ ప్యాలెస్‌ల విషయంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎక్కువశాతం మంది నెటిజనులు తాడేపల్లి ప్యాలెస్ తరహాలోనే జిల్లాల్లోని ప్యాలెస్‌లను కూల్చేయాలని ఆవేశంగా అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం వీటిని కూల్చడం కాకుండా, ప్రభుత్వానికి ఉపయోగపడేలా మలచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్యాలెస్‌లలో ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

జగన్ ఘనత..అప్పుల్లో ఏపీ టాప్

ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ అధోగతి పాలు చేసేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టాప్ లో నిలిపారు. ఆయన మాత్రమే సాధించగలిగిన ఘనత ఇదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ జగన్ ఏపీని అగ్రస్థానంలో నిలిపింది అప్పుల్లో. ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రస్తుతం 14 లక్షల కోట్లపైనే ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ అప్పులకు వడ్డీయే రోజులు దాదాపు 300 కోట్ల రూపాయలు అంటే జగన్ ఆర్థిక విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంసద సృష్టి, అభివృద్ధి, పురోగతి అన్న మాటలకే అర్ధం తెలియని జగన్.. తన పాలనా కాలమంతా అప్పులు చేసి తన కోసం ప్యాలస్ లు నిర్మించుకోవడమే పాలనా భావించారు. అలాగే అరకొర సంక్షేమానికి, ఉద్యోగుల వేతనాలకు కూడా జగన్ అప్పుల మీదే ఆధారపడ్డారు. మద్యం ఆదాయాన్ని పాతికేళ్లకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. అడ్డగోలుగా నిబంధనలు ఉంటాయన్న విషయాన్నే విస్మరించి అప్పు చేయడమో గొప్ప అన్నట్లుగా ఎడా పెడా అప్పులు తెచ్చేశారు.   జగన్  ఏడాదిలో పదకొండు నెలలు అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపారంటే.. ఆయన ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అవగతమౌతుంది.  దాదాపు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించేశారు.  ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది. ఇందు కోసం రాష్ట్ర ఆదాయం, కేంద్ర గ్రాంట్లపై ఆధారపడుతుంది. అవి సరిపోనప్పుడు మాత్రమే అప్పులు చేస్తుంది. అయితే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి ఆదాయం వస్తుంది. అది చేసిన అప్పులు తీర్చడానికి, సంక్షేమ పథకాల అమలుకు వినియోగిస్తుంది. రాబడి ఆధారంగా మాత్రమే ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయడానికి సాహసిస్తుంది. అయితే జగన్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా అసలు ఆదాయం అనేదే లేకుండా చేసుకుని ప్రభుత్వ రోజు వారి కార్యకలాపాల నిర్వహణకు కూడా అప్పులపైనే ఆధారపడింది. తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి కూడా అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారంటే జగన్ సర్కార్ ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో అర్ధమౌతుంది.   

మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం (జూన్ 24) భేటీ అవుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ భేటీలో చర్చించే అంశాలేమిటి? తీసుకునే నిర్ణయాలేమిటి? ముఖ్యంగా జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడి, జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఆయన తొత్తులుగా పని చేసి ప్రత్యర్థులపై అక్రమ కేసులు, వేధింపులు, దాడులతో చెలరేగిపోయిన అధికారులపై చర్యలకు సంబంధించి చర్చ జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే విధంగా లోకోష్ రెడ్ బుక్ ఆధారంగా చర్యలకు ఉపక్రమించే అంశంపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. జగన్ హయాంలో భ్రష్టపట్టిపోయిన వివిధ శాఖల ప్రస్తుత పరిస్థితిపై శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాలపై చర్చించి వాటికి కేబినెట్ ఆమోదం తెలుపుతుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, అలాగే నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐదు అంశాలకూ కేబినెట్ తొలి భేటీలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటికి అనుగుణంగా బడ్జెట్  రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పోలవరం, అమరావతిలో పర్యటించారు.  ఇప్పుడు కేబినెట్ భేటీలో  పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని అంటున్నారు.  

నమ్మిన వారందర్నీ నట్టేట ముంచిన జగన్!

పాము తన పిల్లల్ని తానే తినేస్తుందంటారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ రెడ్డి మాత్రం అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించారు. ఆయన తన కోసం తన చేత, తానే నియమించుకున్న వాలంటీర్లను నడిరోడ్డుమీదకు లాగి చోద్యం చూస్తున్నారు. చట్ట బద్ధత, ఉద్యోగ భద్రత లేని వాలంటీర్ వ్యవస్థను సృష్ఠించి, అదే ప్రభుత్వోద్యోగమని నమ్మించి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఆ పోస్టులలో నియమించారు. అలా నియమించి గత ఐదేళ్లుగా అంటే తాను ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ పార్టీ ప్రచారం, పార్టీ పనులే వారి ఉద్యోగ ధర్మం, కర్తవ్యం అన్నట్లుగా వాడేసుకున్నారు. తీరా ఎన్నికల ముందు.. వాలంటీర్లు ఎన్నికల విధులలో ఉండేందుక వీల్లేదని ఎన్నికల సంఘం విస్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో.. వాటంటీర్లపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చి, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అప్పుడు మళ్లీ మీ ఉద్యోగాలు మీకిచ్చేస్తానంటూ నమ్మబలికి బలవంతంగా వారి చేత రాజీనామాలు చేసేశారు. జగన్ మాటలు విశ్వసించని కొందరు వాలంటీర్లు రాజీనామాకు ససేమిరా అన్నారు. అయితే జగన్ మాటలు నమ్మో, వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదరింపులను భయపడో రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఎనిమిది వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వారంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అంతేనా ఐదేళ్ల పాటు అరవ చాకిరీ చేయించుకుని ఇప్పుడు ఇలా నడిరోడ్డున వదిలేసిన జగన్ పై తిరగబడుతున్నారు. తమపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించిన వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. దీంతో జగన్ తప్పుకు ఆయనతో అంటకాగిన, ఆయన కోసం పని చేసిన వైసీపీ నేతలూ ఇక్కట్లలో ఇరుక్కున్నారు. తన కోసం జగన్ నియమించుకున్న వాలంటీర్లు, జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచీ ఆయన కోసమే పని చేసిన కార్యకర్తలు, నాయకులు ఇలా అందరూ కూడా ఇప్పుడు జగన్ తప్పిదాలకు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఇరుక్కున్నారు.  జగన్ స్వార్థం, అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్త విధానాల కారణంగా ఇపుడు మొత్తం వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జగన్ కు అడుగులకు మడుగులొత్తిన అధికారులు, ఆయన కోసం ప్రత్యర్థులపై దూషణలు, దాడులతో చెలరేగిపోయిన నేతలు, జీతం తక్కువ అయితేనేం ఉన్న ఊళ్లో పని  చేసుకోవడానికి ఉద్యోగం దొరికింది అదే  పదివేలు అనుకున్న కార్యకర్తలు ఇలా జగన్  తనను నమ్మిన, నమ్ముకున్న వారందరినీ నట్టేటముంచారు. 

జనం సొమ్ముతో జల్సాలు.. కోటలు కట్టిన జగన్ ఉన్మాదం!

పెద్దపెద్ద ప్యాలెస్ లు అంటే మనకు ఒక్కసారిగా గుర్తుకొచ్చేది రాజుల కాలమే. రాజుల కాలంలో వారు పరిపాలించే రాజ్యాలలో పెద్దపెద్ద ప్యాలెస్ లు నిర్మించుకుని, వాటిలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని.. శత్రు దుర్భేద్యంగా  తీర్చిదిద్దుకునేవారు. రాజుల ప్యాలెస్ లకు సంబంధించిన కథనాలు అనేక పుస్తకాల్లో చదివే ఉంటారు. కానీ, ఇప్పుడు పుస్తకాల్లో చదవాల్సిన పనిలేదు.. చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు.. ప్రజాధనంతో సిగ్గూఎగ్గూ లేకుండా రాజుల కాలంలో నిర్మించిన ప్యాలెస్ లను తలదన్నేలా ఏపీలో నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు చేపట్టింది ఎవరో కాదు.. ప్యాలెస్ ల పిచ్చోడు! అదేనండీ బాబూ.. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యర్థులు అతన్ని ముద్దుగా సైకోఅని కూడా  పిలుచుకుంటుంటారు. ఎందుకంటే అతను చేసే పనులన్నీ సైకో తరహా ఆలోచనలను పోలి ఉంటాయి. ఇప్పుడు ఆయన ప్యాలెస్ ల పిచ్చి ఉన్మాదాన్నిమించిపోయిందని బయటపడుతున్నది. ఆయన తనను తాను ఓ రాజుగా ఊహించుకుంటుంటారు. ఐదేళ్ల కాలంలో నేను రాజును.. ఏపీ ప్రజలంతా నా బానిసలు అన్న మాదిరిగా  జగన్ పాలన సాగించారు. రాజుల కాలంలో ప్రశ్నించిన వారికి ఎలాంటి దండనలు వేస్తారో.. ఇంచుమించు అదే తరహా దండనలు గత ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారు.  జగన్ మోహన్ రెడ్డికి బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లి ప్రాంతాల్లోనే పెద్దపెద్ద ప్యాలెస్ లను తలపించేలా ఇళ్లు ఉన్నాయని ఏపీ ప్రజలకు తెలుసు. కానీ, జగన్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆయన ఏపీలో వెలగబెట్టిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు, రాజధాని అమరావతి  నిర్మాణానికి, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని చెబుతూనే.. రుషికొండపై దేశ ప్రజల కళ్లు చెదిరే స్థాయిలో 500 కోట్లు వెచ్చించి అత్యంత విలాసవంతమైన భవనాల్ని నిర్మించాడు. అందుకు వినియోగించిన సొమ్మంతా ప్రజలదే. తమ సొంత విలాసాల కోసం ప్రజలపై పన్నులు మోపి పీడించిన చందంగానే జగన్ తన విలాసవంతమైన భవనాల నిర్మాణం కోసం ప్రజల నడ్డి విరిచి, ముక్కు పిండి మరీ ధరల పెంపు, చెత్త పన్ను అంటూ వసూలు చేశారు. ప్రజా సొమ్ముకు జవాబుదారీగా ఉండి.. ప్రజలకు మేలు చేసేందుకు  వినియోగించాల్సిన సొమ్మును జగన్ మోహన్ రెడ్డి.. తనను తాను రాజుగా ఊహించుకొని రుషికొండపై పెద్దపెద్ద భవనాలు నిర్మించుకున్నాడు. అందులో నివాసం ఉండేందుకు విదేశాల నుంచి ఫర్నీచర్ ను తెప్పించి ఆ భవనాల్లో అమర్చాడు. కానీ, అధికారం కాల్పోవడంతో ఇప్పుడు దానిని ప్రజా ప్యాలెస్ అంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అవి చాలదన్నట్లుగా ప్రతీ జిల్లాలో  మైసూరు రాజమహల్ ని తలదన్నేలా పార్టీ కార్యాలయాల పేరిట నిర్మాణాలు చేపట్టారు.   ఆ నిర్మాణాలుకూడా ప్రభుత్వ భూముల్లో, అనుమతులు లేకుండా చేస్తున్నవి కావడం గమనార్హం.  చేతిలో అధికారం ఉందని.. ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు. 33ఏళ్లు లీజు ముసుగులో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భములకు టెండర్ పెట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డు, జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కేటాయించుకొని, అందులో మైసూరు రాజమహల్ ని తలదన్నేలా భవనాల నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో రూ. కోట్ల విలువైన భూములను ఏడాదికి ఎకరానికి రూ. వెయ్యి చొప్పున లీజుకు తీసుకొని అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా.. వాటి విలువ దాదాపు ఏడు వందల కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే అనుమతులు తీసుకొని భవనం కట్టారు. అమలాపురం పక్కనే ఉన్న జనుపల్లె, పాడేరుల్లో కోర్టు కేసుల వల్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. మిగతా 23 చోట్లా అనుమతులు లేకుండానే వైసీపీ పార్టీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే  తాడేపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ఇటీవల అధికారులు కూల్చేశారు. వాటి తరహాలోనే అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మించిన వైసీపీ కార్యాలయాలు కూల్చేయాలని, ఒకవేళ కార్యాలయం నిర్మాణం అయ్యి ఉంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి అప్పనంగా కొట్టేయాలని చూసిన ప్రభుత్వ భూములు, అందులోని నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్ అంటూ ప్రశ్నించారు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. మరో వైపు జగన్ ఐదేళ్ల కాలంలో దోచుకున్న ప్రజాసొమ్మును కక్కించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

రామతీర్థం లో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం లోని శ్రీ మోక్ష రామలింగేశ్వరాలయం లో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధ ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలన్న అవగాహన కార్యక్రమం లో భాగంగా ఆయన ఆదివారం నాడు రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్థచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు. శిల్ప శైలిని బట్టి ఈ బౌద్ధ చిహ్నం ఇక్ష్వాకుల కాలం నాటిదని వేంగి చాళుక్యుల కాలంలో ఆ స్తంభాన్ని బ్రహ్మ సూత్రాలను చెక్కి శివలింగంగా మార్చి మానవత్వంలో బిగించారని, భిన్నం కావడం వల్ల ఆలయం వెనుక పడేసారని శివనాగిరెడ్డి అన్నారు మరో రెండు శివలింగాలు క్రీస్తు శకం 16వ శతాబ్ది నాటి నిలువెత్తు వీరభద్ర విగ్రహం కూడా నిరాదరణకు గురి అయిందని ఈ విగ్రహాలపై స్థానికులకు ఆలయ పూజారులకు అవగాహన కల్పించి వీటిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ శిల్పి ఏలూరి శేష బ్రహ్మం, పరిశోధకుడు పి మహేష్, వారసత్వ ప్రేమికులు ఆర్ దశరధ రామిరెడ్డి, కే పూర్ణచంద్ర పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు