కూలిన కుతుబ్ షాహీ కాలపు కోస్ మినార్!
posted on Jun 21, 2024 9:28AM
కాపాడుకోవాలంటున్న ఈమని శివనాగిరెడ్డి
హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేటలో కుతుబ్ షాహీ కాలం (క్రీ. శా. 17వ శతాబ్ది) నాటి కోస్ మినార్ (అప్పటి మైలురాళ్లు) కూలిపోయి, ఆనవాళ్లు కోల్పోతున్నాయని పురావస్తు పరిశోధకుడు ప్లీజ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. స్థానిక రైతు చక్రం మల్లేష్ తో కలిసి మసీదు పక్కన ఉన్న కూలిన కోస్ మినార్ గుమటాన్ని శుక్రవారం నాడు పరిశీలించారు.
కుతుబ్ షాహీ చక్రవర్తులు గోల్కొండ నుంచి మచిలీపట్నం రహదారిపై ఈ కోస్ మినార్ లను నాటించారని రోడ్డు విస్తీర్ణ, రియల్ ఎస్టేట్ ప్రభావం వల్ల ఈ మినార్లు ఉనికిని కోల్పోయాయని, ఇప్పటికైనా కూలిన రెండు మినార్లను పునర్మించి, వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలని తూప్రాన్ పేట పంచాయితీకి, గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్తపతి భీమిరెడ్డి వెంకటరెడ్డి, బడే సాయి కిరణ్ రెడ్డి, ఈమని రాజ్యలక్ష్మి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.