చెత్తవాగుడు మొదలెట్టిన కొడాలి నాని!
posted on Jun 20, 2024 @ 1:52PM
ఈ కొడాలి నానికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు.. ఎన్నికలలో ఇతను, ఇతని పార్టీ తుక్కుతుక్కుగా ఓడిపోవడంతో కొద్దిరోజులు మూలన కూర్చున్న ఈ గుట్కా ఎడిక్ట్ లారీ క్లీనర్ మళ్ళీ తన చెత్త వాగుడు మొదలుపెట్టాడు. గురువారం నాడు జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన నాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చెత్తవాగుడు వాగాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యం కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారట, ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే ఈ వీరుడు, ఇంట్లోంచి బయటకి కూడా రాని తన పార్టీ అధ్యక్షుడితో కలసి నిలదీస్తాడట. ఇతను మాట్లాడినంతసేపూ ఏకవచనమే తప్ప బహువచనమే లేదు. అదే తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పేరును ప్రస్తావించినప్పుడు మాత్రం ‘గారు’ వచ్చి చేరింది.. రుషికొండ ప్యాలెస్ మీద జగన్ జనం కోసం ప్యాలెస్ కడితే తెలుగుదేశం ఎదవలు అది జగన్ ఇల్లు అని ప్రచారం చేస్తున్నారని నోరు పారేసుకున్నాడు. అధికారం కోల్పోయినా తాను మారనని, తాను ఇలాగే వుంటానని, ఎవరూ ఏమీ పీకలేరు అని కూడా ఈ గుట్కా ఎడిక్ట్ వాగాడు.