సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం?.. అసలు వస్తారా?
posted on Jun 21, 2024 @ 9:42AM
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) ప్రారంభం అయ్యాయి. ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ సభకు వచ్చే అవకాశాలు లేవని ఆ పార్టీ వర్గాల ద్వారానేసభకు జగన్ వస్తారా? రారా? అనేది వేచి చూడాలి. ఎందుకంటే గత ఐదేళ్లుగా ఫ్రంట్ సీటులో కూర్చున్న జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఎక్కడో వెనుక కూర్చోవలసి ఉంటుంది. గతంలోలా తన తరఫున సభలో గోల చేయడానికి, అనుచిత వ్యాఖ్యలతో ప్రత్యర్థులను నొప్పించడానికి మంది కూడా లేరు. దీంతో ఆయన సభకు హాజరయ్యే అవకాశాలు దాదాపు మృగ్యమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇలా ఉండగా
తెలుగుదేశం సభ్యలువెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పసుపు చొక్కాలు ధరించి వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
కాగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. గత ప్రభుత్వం శాసన సభను కౌరవ సభగా మార్చేసిందని నిండు సభలో విమర్శలు గుప్పించి కన్నీటితో సభ నుంచి నిష్క్రమిస్తూ మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెట్టి గౌరవ సభగా చేస్తానని చంద్రబాబు శపథం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ శపథాన్ని నెరవేర్చుకుని చంద్రబాబు సభలో ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టారు. అదే విధంగా పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బదులుగా జనసేన అధినేత తమ పార్టీ నుంచి పోటీ చేసిన 21 మందినీ గెలిపించుచని ఘనంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.