అడ్డెడ్డే... జగన్ అసెంబ్లీకి రాడా.. ఇప్పుడెలా?
posted on Jun 20, 2024 @ 2:11PM
నిన్నటి ఎన్నికలలో జగన్‌కి ఏపీ జనం ‘పక్కనుండు’ అని డిసైడ్ చేశారు.. అందుకే ‘పదకొండు’ సీట్లతో సరిపెట్టారు. తొక్కలే.. ఈ సీట్లతో అసెంబ్లీకి వెళ్ళేదేంటి అనుకున్నారో.. అసెంబ్లీకి వెళ్ళడానికి మొహం చెల్లట్లేదోగానీ, మొత్తానికి జగన్ అసెంబ్లీకి వెళ్ళకూడదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.. అడ్డెడ్డే... జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విషయాలు మిస్సవుతారు కదా.. ఆ మిస్సయ్యే విషయాలు ఏంటంటే...
1. తన సీట్లో కూర్చుని వెకిలి నవ్వులు నవ్వడం.
2. అప్పుడప్పుడు గురకపెట్టి నిద్రపోవడం.
3. మంచీ మర్యాద లేకుండా చంద్రబాబు మీద ఎగరడం. ఏకవచనంతో మాట్లాడ్డం. కించపరిచేలా మాట్లాడ్డం. ఆగ్రహంగా ఊగిపోతూ అరవడం.
4. మేం ఇంతమంది వున్నారు.. మీరు అంతమంది వున్నారు. ఒక్కసారి మేం తలుచుకుంటే ఏమవుతుందో చూసుకోండి అనడం.
5. నీ చూపు చూసి భయపడిపోం అని అనడం.
6. సొంత పార్టీ ఎమ్మెల్యేలు పొగుడుతుంటే మురిసిపోవడం.
7. టీడీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అణిచేయడం.
8. పార్టీ ఎమ్మెల్యేలను ఉసిగొల్సడం. మహిళల మీద దారుణమైన వ్యాఖ్యలు చేయించడం.