సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ తెలుగు దేశం
posted on Jun 20, 2024 @ 2:33PM
సంక్షేమం అంటే తెలుగు దేశం. తెలుగు దేశం అంటే సంక్షేమం. 1983లో అధికారంలో వచ్చిన తెలుగు దేశం పార్టీ వృద్దుల సంక్షేమం కోసం ఇచ్చిన పించన్లు నవ్యాంధ్ర ప్రదేశ్ లో కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి వృద్దులకు పింఛన్లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది మాత్రం తెలుగుదేశం హాయంలో మాత్రమే. తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెల ల్లో నే అంటే 1983లో టిడిపి అధికారంలో వచ్చింది. స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 1983 వరకు కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంది. ఈ సమయంలో వృద్దులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని పక్కన పెట్టి ఎమ్జీఆర్ స్పూర్తితో ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంలో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 80 వ దశకంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పురుడు పోసుకుంది. అప్పటి వరకు ప్రతీ ఇంట్లో వయసు మళ్లిన ముసలివారి ఆలనాపాలనా ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వారిలో ఆత్మాభి మానం , ఆత్మ విశ్వాసం నింపింది మాత్రం తెలుగు దేశం పార్టీ మాత్రమే. ఎన్టీ ఆర్ అధికారంలో రాగానే ప్రతీ నెలా 75 రూపాయలు వృద్దులకు అందే విధంగా జాగ్రత్త పడ్డారు. 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కూడా వయసు పై బడ్డ వారికి ఠంచనుగా పెన్షన్లు అందేవి. ఆ తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వృద్దులను పట్టించుకోలేదు. వృద్దులను నిర్లక్ష్యం చేయడం వల్లే కాంగ్రెస్ అధికారంలో లేకుండా పోయిందని చెప్పవచ్చు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖరెడ్డి వృద్దాప్య పింఛన్లను 200 రూపాయలకు పెంచారు. 2009లో రెండోసారి అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి దురదృష్ట వశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ హాయంలో రెండు వందల రూపాయలు ఉన్న వృద్దాప్య పించన్లు నవ్యాంధ్ర ప్రదేశ్ లో 1000 కి పెరిగింది. నవ్యాంధ్ర ప్రదేశ్ లో రెండోసారి తెలుగు దేశం పార్టీ అధికారంలో వచ్చింది. అప్పటి వరకు ఉన్న పించన్ వెయ్యి అలాగే కొనసాగిందిఉ. ఆతర్వాత అధికారంలో వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వృద్దాప్య పించన్లు 3000 కి పెంచింది. వృద్దుల పేరు చెప్పి కొన్ని సంఘ విద్రోహశక్తులు పించన్లు అందుకున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువై చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు . బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పించన్లను ఏకంగా నాలుగు వేల రూపాయలకు పెంచారు. ఉమ్మడి రాష్ట్రం మొదలు నవ్యాంధ్ర ప్రదేశ్ వరకు తెలుగు దేశం పార్టీ వృద్దుల సంక్షమమే ధ్యేయంగా పని చేసిందని చెప్పొచ్చు.