సమస్యల పరిష్కారం.. సమూల ప్రక్షాళన .. లోకేష్ అప్పుడే మొదలెట్టేశారు!
యువనేత లోకేష్... రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే కార్యాచరణ మొదలెట్టేశారు. రాష్ట్ర ప్రజల ప్రజాదర్బార్ తో ఓవైపు నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ , విద్యార్థి సంఘాలు, తల్లి దండ్రులతో భేటీ అవ్వడానికి సమాయత్తమౌతున్నారు. విద్యావ్యవస్థలో పాతుకుపోయి ఉన్న సమస్యల పరిష్కారం కోసం నడుంబిగించేందుకు రెడీ అయిపోయారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విలువలతో కూడి విద్యనందించడం తప్ప సంబంధం లేని పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కష్కారం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ చేయడం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిది దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. అదే విధంగా ఐటీ మంత్రిగా కూడా ఆయన రాష్ట్రంలో ఐటీకి గత వైభవం తీసుకువచ్చేందుకు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
2017-19 నడుమ కేవలం రెండేళ్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేష్ పనిచేసిన లోకేష్ ఆయాశాఖల్లో గతంలో ఎవరూ చేయనంద అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రెండున్నరేళ్లలో 25వేల కి.మీ.ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా యువనేత లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా సాధించారు. గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది. 2018 సెప్టెంబర్ లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాష్ట్ర మానవవనరులు, ఐటి,ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారధ్యంలో ఆయారంగాలు అనూహ్య వేగంతో పురోగతి సాధిస్తాయనడంలో సందేహం లేదు.