English | Telugu

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవ్వరైనా బాలయ్య ముందు పనికిరారు!

ఆలీతో సరదాగా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి రాధా వచ్చింది. ఈ ప్రోమోలో కొన్ని హైలైట్ మాటలు రాధా ఎం చెప్పారో చూద్దాం. "మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి..మీ జోలికి ఎవరైనా వస్తే అంతేనేమో" అని ఆలీ అనేసరికి "ఎస్.. కసక్.. మడతపెట్టేస్తా" అని చెప్పారు రాధా. "రియల్ లైఫ్ లో మనలో కూడా ఒక దొంగ ఉన్నాడట కదా" అనేసరికి "ఇంటర్వ్యూకి ముందు మీరేమన్నా సిబిఐని పెడతారా ఏమిటి" అని అడిగారు . "మీకు ఒక డ్రీం బాయ్ ఉన్నాడని ఆయనతో నటించాలని అనుకునేవారట" "అబ్బాయిలు కూడా ఇంత అందంగా, ఫెయిర్ గా, యాపిల్ ల్లా ఉంటారా అని అనిపించింది" "సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవ్వరు వచ్చినా మన బాలయ్య ముందు ఎవ్వరూ పనికిరారు" అని చెప్పారు రాధా.

ఎక్కువ చేయకు రష్మీ...వెంటనే మార్చడానికి బాయ్ ఫ్రెండ్ కాదు బల్బు!

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో కొన్ని ఎపిసోడ్స్ నుంచి జడ్జ్ గా ఖుష్భు కనిపించడం లేదు. కానీ ఈ వారం ఎపిసోడ్ లో ఖుష్బూ కనిపించింది. ఇక స్కిట్స్ విషయానికి వస్తే ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాయి. ఇమ్ము- వర్ష స్కిట్ కొంచెం నవ్వు తెప్పించేదిగా ఉంది. ఐతే వర్షాను తెగ అవమానించాడు ఇమ్ము. "రాత్రి ఎక్కడికెళ్ళావ్ లేచి చూస్తే పక్కలో లేవు" అని ఇమ్ము అడిగేసరికి "వాష్ రూమ్ కి వెళ్ళా" అని చెప్పింది "నువ్వు అబద్దాలు చెప్తావని నీ చేతికి స్మార్ట్ వాచ్ పెట్టాను. ఇది నువ్వు ఎన్ని అడుగులు వేశావో చెప్తుంది..వాష్ రూమ్ కి వెళ్లి రావడానికి 10 అడుగులే కదా మిగతా అడుగుల పరిస్థితి ఏమిటి ఎక్కడికి వెళ్ళావ్" అని అడిగాడు. "వాష్ రూమ్ కి వెళ్లే గ్యాప్ లో నేనేం చేస్తాను" అని వర్ష పాపం ఏదో చెప్పబోయింది.

Guppedantha Manasu : అనుపమని కత్తితో పొడిచిన రౌడి.. మను తన కొడుకే అని తెలిసిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1028 లో... ఇన్ని రోజులు మీరు మాకు సపోర్ట్ గా ఉన్నారు.. గొప్పవారు అనుకున్నా కానీ ఇలాంటివి చేస్తారని అనుకోలేదని వసుధార అంటుంది. కనీసం మీరైనా నేను చెప్పింది వినండని వసుధారతో మను అంటాడు. మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు మీరు వెళ్లిపోండి అని వసుధార అనగానే మను వెళ్ళిపోతాడు. సారీ అమ్మ అని అనుపమ అనగానే.. మీరెందుకు సారీ చెప్తున్నారని వసుధార అంటుంది. అంటే నువ్వు తన గురించి చెప్పినప్పుడు మేమ్ నమ్మలేదు కదా అని అనుపమ అంటుంది.