Read more!

English | Telugu

బీచ్ లో దివి సొగసుల సునామి!

నాకు బీచ్ ని చూపిస్తావా.. లేదు నిన్నే బీచ్ కి చూపిస్తానని ' ఊహలు గుసగుసలాడే' మూవీలో రాశికన్నాతో నాగశౌర్య అంటాడు. ఇక అదే ఇన్ స్ట్రాగ్రామ్ లో గత వారం రోజుల నుండి ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక అదే ట్రెండింగ్ ని దివి వాద్య ఫాలో అవుతుంది. తాజాగా ఈ భామ బీచ్ కి వెళ్లి జలకాలాడింది. అక్కడ దిగిన ఫోటోలని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అవి కాస్త ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.

దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.  అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. దివి వాద్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది.  'భోలా శంకర్' మూవీలో నటించింది ఈ సొట్ట బుగ్గల సుందరి. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో  హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. 

ఇప్పుడు తాజాగా బీచ్ దగ్గర అందాలు ఆరబోస్తూ కొన్ని ఫోటోలని అప్లోడ్ చేసింది. అటు అలలు.. ఇటు అందాలు అంటు కొందరు నెటిజన్లు కామెంట్లు చేయగా మరికొందరు నెటిజన్లు.. నీ అందంతో చంపేస్తావా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తను పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది. ‌తను నటించిన 'లంబసింగి' సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక జయాపజయాలు పక్కనపెడితే ఈమె నటన కంటే ఆమె అందాల ఆరబోతకి ఫ్యామ్ బేస్ గట్టిగానే ఉన్నారు.